అవార్డులు తిరిగివ్వడం
Date :26-11-2015
updated : 27-11-2015
29-11-2015
01-12-2015
01-12-2015
అవార్డులు ఎవరికీ ఇస్తారు ? అసాధారణ ప్రతిభ కనబర్చిన వారికి దాని వలన ప్రజలకు మేలు కలిగినప్పుడు , దేశానికి ఉపయోగ పడినప్పుడు , దేశాభివృద్దికి తోడ్పడినప్పుడు , 29-11-2015ప్రజోపయోగమైన పనులను నిస్వార్థముగా చేసినవారికి, ప్రజలకు అవసరమైన రంగాల్లో ఎనలేని కృషి చేసి దేశ ప్రతిష్ట పెంపొందించిన అసామాన్యులకు ప్రభుత్వం అవార్డులు ఇచ్చి సత్కరిస్తుంది .
ఆలా అవార్డులను ప్రభుత్వం చే పొందినవారిని మనం గౌరవిస్తాం. అలా అవార్డులు పొందినవారు చాలా సంతోషిస్తారు ,అది నిజమే ! అలాంటి వారికి ప్రభుత్వం ప్రత్యేక మర్యాదలు కూడా చేస్తుంది .
ఈ రోజు చూస్తున్నాం ఆనాడు అవార్డులు పొందినవారు అవార్డులను తిరిగి ప్రభుత్వానికి ఇవ్వడం చేస్తున్నారు . ఒకరిని చూసి మరొకరు అవార్డులను తిరిగి యిస్తున్నారు . ఎందుకు తిరిగి ఇస్తున్నారో చాలామందికి తెలియడం లేదు . వారికి ఈ అవార్డుల వలన ఏమైనా ఇబ్బందులు కలుగుతున్నాయా ? అది కూడా చెప్పడం లేదు .
అవార్డులు ఎప్పుడో తీసుకున్నారు , అప్పటి ప్రభుత్వం వీరికి వీరి పనులను,సామర్థ్యం ను బట్టి అవార్డులను ఇచ్చి వీరిని ప్రోత్సహించినది . ఈ అవార్డులవలన వీరు ఇంకా ఫేమస్ అయ్యారు, ఈ స్థితికి వచ్చారు .
ఇప్పుడు వీరు అవార్డులను తిరిగి ఈ ప్రభుత్వానికి ఎందుకు ఇస్తున్నారు ? అవార్డులను ఈ ప్రస్తుత ప్రభుత్వం ఇవ్వలేదు కదా ! మరి ఈ ప్రభుత్వానికి ఎందుకు తిరిగి ఇస్తున్నారు ? అవార్డులను తిరిగి ఇచ్చినవారు ఒకటే చెబుతున్నారు, ప్రస్తుతం " దేశం లో అసహనం పెరిగిందట " దానితో బాటు ఏదేదో మాట్లాడుతున్నారు . ఇంకొకరు అవార్డులు తిరిగి ఇవ్వడం తప్పుకాదట అని అంటాడు .
అసహనం అంటే ఏమిటి ? అసహనం ఎక్కడ పెరిగింది ? ఎందులో పెరిగింది ? స్వాతంత్ర్యం వచ్చి 68 ఏళ్ళు అయితే ఇప్పుడే అసహనం కన్పిస్తుందా ? ఎవరో ఒక్కరు చెబితే అందరు అదే మాట్లాడు తున్నారు . అంటే ఈ ప్రభుత్వం అంటే అసహనమా ? గత ప్రభుత్వం ఇచ్చిన అవార్డ్ ఈ ప్రభుత్వానికి ఇవ్వడమేమిటి ? ఆనాటి ప్రభుత్వం అవార్డులను అర్హులకు ఇవ్వలేదా , ఈ అవార్డులను వీరు తమవద్ద ఉంచు కోవడానికి అర్హులు కారా ?
ఈ-కామర్స్ సంస్థ స్నాప్‌డీల్‌కు అమీర్‌ఖాన్ ప్రచారకర్తగా ఉన్న విషయం తెలిసిందే. కాగా దేశంలో అసహనంపై అమీర్‌ఖాన్ చేసిన వ్యాఖ్యల పట్ల ఆగ్రహించిన జనం పెద్ద ఎత్తున స్నాప్‌డీల్ యాప్‌ను తమ తమ స్మార్ట్‌ఫోన్లలో నుంచి అన్‌ఇన్‌స్టాల్ చేసుకున్నారు. దాదాపుగా ఒకేసారి లక్ష మంది ఈ యాప్‌ను తమ డివైస్‌ల నుంచి తొలగించినట్టు తెలిసింది. దీంతో ఆ సంస్థ గందరగోళంలో పడి గగ్గోలు పెడుతోంది.
అయితే కేవలం స్నాప్‌డీలే కాకుండా అమీర్‌ఖాన్ ప్రచారకర్తగా వ్యవహరిస్తున్న ఇతర ఉత్పత్తుల కంపెనీలకు కూడా పెద్ద దెబ్బ తగిలే అవకాశం లేకపోలేదని పలువురు అభిప్రాయపడుతున్నారు.
అర్హత లేనివారు కూడా అవార్డులు ఆనాడు పొందారా అని కూడా సామాన్యులు ఆలోచిస్తున్నారు .
పొట్ట కూటికి ముఖానికి రంగులేసుకొని గంతులు వేసి కోట్ల రూపాయలను సంపాదించిన వారికి కూడా అవార్డులు ఇవ్వడమేనా ? ప్రజలగురించి గాని దేశం గురించి గాని ఏమైనా చేశారా అంటే అదీ లేదు . అది వారి పొట్ట కూటికి చేసుకుంటున్న పని . దేశం లో ప్రజలు బ్రతక డానికి పొట్ట కూటికి ఏవేవో పనులు చేస్తున్నారు , సరిపోకుంటే రాత్రిం బావళ్ళు కష్టపడుతున్నారు మరి వారు అవార్డులు అందుకుంటూ న్నారా ? మరి వారు నిత్య జీవితం లో మంచి పనులు చేసుకుంటున్నారు కదా !
మంచి పనులు దేశం గురించి గాని ప్రజల గురించి గాని చేసిన వాళ్ళందరూ అవార్డులు పొందలేరు కదా . ప్రపంచ ప్రసిద్ధి చెందిన కోహినూర్ వజ్రాన్ని కనుగొన్న వారికి అవార్డులు ఇవ్వాలి , అట్లాగే ప్రపంచం లో వండర్ అయిన తాజ్ మహల్ కట్టిన వారికి అవార్డులు యివ్వాలి . ఔరంగజేబు గోల్కొండ కోటపై దండెత్తి నపుడు 6 నెలలుగా కోటలోనికి ప్రవేశించకుండా కట్టుదిట్టమైన రక్షణ చేసిన సిపాయిలకు అవార్డులు ఇవ్వాలి కాని వారు ఇప్పుడు బ్రతికి లేరు కావున వారి మునిమనుమలు ఉంటే వారికి పొస్థుమస్ అవార్డులు ఇవ్వొచ్చు కదా ! వారు పొట్టకూటికి పని చేయలేదు దేశం కోసం పనిచేశారు .
అలాగే ప్రస్తుతం దేశ రక్షణలో చలి , మంచులలో కుటుంబానికి దూరం గా ఉంటూ రాత్రిం బవ ళ్ళు దేశాన్ని కాపాడుతున్న జవానులందరి ఎన్ని అవార్డులు ఇచ్చినా తక్కువే !
పెద్ద -పెద్ద కంపనీ లను పెట్టి కోట్ల రూపాయలను సంపాదిస్తున్నవారికి కూడా అవార్డులా ? వారు చేస్తున్నది కూడా వారి పొట్ట కూటికే ,వారి కుటుంబానికి తర - తరాలకు సరిపోయేది సంపాదించు కుంటున్నారు . వారు చేసేది దేశం కోసం కాదు ,ప్రజల గురించి కాదు .
ప్రాణాలు కాపాడే డాక్టర్ లకు , క్రొత్త - క్రొత్త వాటిని రాత్రిం బవాళ్ళు కష్టపడి భావి తరాలకు ఉపయోగపడే వాటిని కనుగొనే శాస్త్ర వేత్తలకు , దేశం కోసం జీవితాన్ని త్యాగం చేసే మహానుభావులకు అవార్డులు ఇవ్వడం లో న్యాయం ఉంది . కాని పొట్ట కూటికి పని చేసుకొనే వారికి అవార్డులు ఇవ్వడం చాలా దారుణం ! ఇలాంటి వారికి అవార్డులు ఇవ్వడం మానుకోవాలి .
అమీర్‌ఖాన్‌పై దేశద్రోహం కేసు నమోదు
అవార్డులు ఎప్పుడో తీసుకున్నారు , అప్పటి ప్రభుత్వం వీరికి వీరి పనులను,సామర్థ్యం ను బట్టి అవార్డులను ఇచ్చి వీరిని ప్రోత్సహించినది . ఈ అవార్డులవలన వీరు ఇంకా ఫేమస్ అయ్యారు, ఈ స్థితికి వచ్చారు .
ఇప్పుడు వీరు అవార్డులను తిరిగి ఈ ప్రభుత్వానికి ఎందుకు ఇస్తున్నారు ? అవార్డులను ఈ ప్రస్తుత ప్రభుత్వం ఇవ్వలేదు కదా ! మరి ఈ ప్రభుత్వానికి ఎందుకు తిరిగి ఇస్తున్నారు ? అవార్డులను తిరిగి ఇచ్చినవారు ఒకటే చెబుతున్నారు, ప్రస్తుతం " దేశం లో అసహనం పెరిగిందట " దానితో బాటు ఏదేదో మాట్లాడుతున్నారు . ఇంకొకరు అవార్డులు తిరిగి ఇవ్వడం తప్పుకాదట అని అంటాడు .
అసహనం అంటే ఏమిటి ? అసహనం ఎక్కడ పెరిగింది ? ఎందులో పెరిగింది ? స్వాతంత్ర్యం వచ్చి 68 ఏళ్ళు అయితే ఇప్పుడే అసహనం కన్పిస్తుందా ? ఎవరో ఒక్కరు చెబితే అందరు అదే మాట్లాడు తున్నారు . అంటే ఈ ప్రభుత్వం అంటే అసహనమా ? గత ప్రభుత్వం ఇచ్చిన అవార్డ్ ఈ ప్రభుత్వానికి ఇవ్వడమేమిటి ? ఆనాటి ప్రభుత్వం అవార్డులను అర్హులకు ఇవ్వలేదా , ఈ అవార్డులను వీరు తమవద్ద ఉంచు కోవడానికి అర్హులు కారా ?
నేను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నా: అమీర్‌ఖాన్
Published: Wed,November 25, 2015 04:45 PM
హైదరాబాద్: దేశంలో మత అసహనం పెరిగిపోతోందంటూ ప్రముఖ బాలీవుడ్ నటుడు అమీర్‌ఖాన్ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. అమీర్ వ్యాఖ్యలపై చాలా మంది ప్రముఖులు ఘాటుగానే స్పందించారు. అయితే ఈ కామెంట్లపై అమీర్‌ఖాన్ స్పందించారు. తాను భారతీయుడిగా పుట్టినందుకు గర్విస్తున్నానని అన్నారు. తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని స్పష్టం చేశారు. తన ఇంటర్వ్యూను పూర్తిగా చూడని వారే తనను వ్యతిరేకిస్తున్నారని వివరించారు. దేశంను వదిలి వెళ్లాలనే ఆలోచనకు తనకు లేదన్నారు. తనకున్న దేశభక్తికి ఎవరి కితాబు అవసరంలేదని తెలిపారు.
అవార్డులు వాపస్ చేయడం ఏదో సరదా గా కన్పిస్తుందా ? అవార్డులు వాపస్ చేస్తున్నారంటే వాటి విలువను ప్రశ్నిస్తున్నారా అని అందరికి అనుమానం కలుగుతుంది . మరి కొందరైతే ఈ దేశం వదలి పెట్టాలను కుంటున్నట్లు వార్తలు కూడా వచ్చాయి. ముఖానికి రంగులు వేసికొని కోతి గంతులు వేసే వారు పోతే ఏమిటి ? ఉంటే ఏమిటి ? ఇక ఆడవారు అయితే రంగులు వేసికొని అర్ధ నగ్న బట్టలు వేసికొని ఆడుతుంటే సిగ్గులేదా ? వీళ్ళను సమాజం నుండి బహిష్కరించాలి . వీరికి అంత అసహనం ఏం వచ్చింది ? అసహనం కల్గితే సహించుకొనే నిగ్రహం వీరికి లేదా ? అవార్డులు వాపస్ చేయడం తో సరిపెట్టుకుంటారా ? అసహనాన్ని వ్యక్తం చేయడానికి వేరే మార్గాలు వీరికి తెలియదవా ? లేక ఎవరైనా వెనుక ఉండి చేయిస్తున్నారా అని సామాన్య ప్రజలకు సందేహం కలుగుతుంది కదా ! అవార్డులు పొందని సామాన్య ప్రజలకు అసహనం కలిగితే వారు వాపస్ చేయడానికి అవార్డులు లేవుకదా , మరి వారేం చేయాలి ?
'అమీర్' వ్యాఖ్యలతో 'స్నాప్‌డీల్' గగ్గోలు...
'దేశంలో మత అసహనం పెరిగిపోతుందం'టూ ప్రముఖ బాలీవుడ్ నటుడు అమీర్‌ఖాన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశ వ్యాప్తంగా పెద్ద దుమారాన్నే రేపుతున్న విషయం విదితమే. అనేక మంది ప్రముఖులు అమీర్‌ఖాన్ వ్యాఖ్యల పట్ల చాలా ఘాటుగానే స్పందించారు. అయితే తాజాగా ఇప్పుడు జనం ఆయనకే కాదు, ఆయన ప్రచారకర్తగా వ్యవహరిస్తున్న ఓ ఈ-కామర్స్ సైట్‌కు కూడా షాకిస్తున్నారు.ఈ-కామర్స్ సంస్థ స్నాప్‌డీల్‌కు అమీర్‌ఖాన్ ప్రచారకర్తగా ఉన్న విషయం తెలిసిందే. కాగా దేశంలో అసహనంపై అమీర్‌ఖాన్ చేసిన వ్యాఖ్యల పట్ల ఆగ్రహించిన జనం పెద్ద ఎత్తున స్నాప్‌డీల్ యాప్‌ను తమ తమ స్మార్ట్‌ఫోన్లలో నుంచి అన్‌ఇన్‌స్టాల్ చేసుకున్నారు. దాదాపుగా ఒకేసారి లక్ష మంది ఈ యాప్‌ను తమ డివైస్‌ల నుంచి తొలగించినట్టు తెలిసింది. దీంతో ఆ సంస్థ గందరగోళంలో పడి గగ్గోలు పెడుతోంది.
అయితే కేవలం స్నాప్‌డీలే కాకుండా అమీర్‌ఖాన్ ప్రచారకర్తగా వ్యవహరిస్తున్న ఇతర ఉత్పత్తుల కంపెనీలకు కూడా పెద్ద దెబ్బ తగిలే అవకాశం లేకపోలేదని పలువురు అభిప్రాయపడుతున్నారు.
అర్హత లేనివారు కూడా అవార్డులు ఆనాడు పొందారా అని కూడా సామాన్యులు ఆలోచిస్తున్నారు .
పొట్ట కూటికి ముఖానికి రంగులేసుకొని గంతులు వేసి కోట్ల రూపాయలను సంపాదించిన వారికి కూడా అవార్డులు ఇవ్వడమేనా ? ప్రజలగురించి గాని దేశం గురించి గాని ఏమైనా చేశారా అంటే అదీ లేదు . అది వారి పొట్ట కూటికి చేసుకుంటున్న పని . దేశం లో ప్రజలు బ్రతక డానికి పొట్ట కూటికి ఏవేవో పనులు చేస్తున్నారు , సరిపోకుంటే రాత్రిం బావళ్ళు కష్టపడుతున్నారు మరి వారు అవార్డులు అందుకుంటూ న్నారా ? మరి వారు నిత్య జీవితం లో మంచి పనులు చేసుకుంటున్నారు కదా !
మంచి పనులు దేశం గురించి గాని ప్రజల గురించి గాని చేసిన వాళ్ళందరూ అవార్డులు పొందలేరు కదా . ప్రపంచ ప్రసిద్ధి చెందిన కోహినూర్ వజ్రాన్ని కనుగొన్న వారికి అవార్డులు ఇవ్వాలి , అట్లాగే ప్రపంచం లో వండర్ అయిన తాజ్ మహల్ కట్టిన వారికి అవార్డులు యివ్వాలి . ఔరంగజేబు గోల్కొండ కోటపై దండెత్తి నపుడు 6 నెలలుగా కోటలోనికి ప్రవేశించకుండా కట్టుదిట్టమైన రక్షణ చేసిన సిపాయిలకు అవార్డులు ఇవ్వాలి కాని వారు ఇప్పుడు బ్రతికి లేరు కావున వారి మునిమనుమలు ఉంటే వారికి పొస్థుమస్ అవార్డులు ఇవ్వొచ్చు కదా ! వారు పొట్టకూటికి పని చేయలేదు దేశం కోసం పనిచేశారు .
అలాగే ప్రస్తుతం దేశ రక్షణలో చలి , మంచులలో కుటుంబానికి దూరం గా ఉంటూ రాత్రిం బవ ళ్ళు దేశాన్ని కాపాడుతున్న జవానులందరి ఎన్ని అవార్డులు ఇచ్చినా తక్కువే !
పెద్ద -పెద్ద కంపనీ లను పెట్టి కోట్ల రూపాయలను సంపాదిస్తున్నవారికి కూడా అవార్డులా ? వారు చేస్తున్నది కూడా వారి పొట్ట కూటికే ,వారి కుటుంబానికి తర - తరాలకు సరిపోయేది సంపాదించు కుంటున్నారు . వారు చేసేది దేశం కోసం కాదు ,ప్రజల గురించి కాదు .
ప్రాణాలు కాపాడే డాక్టర్ లకు , క్రొత్త - క్రొత్త వాటిని రాత్రిం బవాళ్ళు కష్టపడి భావి తరాలకు ఉపయోగపడే వాటిని కనుగొనే శాస్త్ర వేత్తలకు , దేశం కోసం జీవితాన్ని త్యాగం చేసే మహానుభావులకు అవార్డులు ఇవ్వడం లో న్యాయం ఉంది . కాని పొట్ట కూటికి పని చేసుకొనే వారికి అవార్డులు ఇవ్వడం చాలా దారుణం ! ఇలాంటి వారికి అవార్డులు ఇవ్వడం మానుకోవాలి .
అమీర్‌ఖాన్‌పై దేశద్రోహం కేసు నమోదు
హైదరాబాద్: దేశంలో నెలకొన్న అసహనం పెరిగిపోతుండటంపై తాను ఆందోళన చెందుతున్నానని, తమ కుటంబం దేశం విడిచి వెళ్లిపోవాలని ఉందని బాలీవుడ్ నటుడు అమీర్‌ఖాన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈమేరకు ఆయనపై దేశద్రోహం కేసు నమోదైంది. వచ్చే నెల 1న కాన్పూర్ సెషన్స్ కోర్టులో హాజరుకావాలని ఆయనకు తాఖీదులందాయి. దేశంలో ఆహారపు అలవాట్లు, సాంస్కృతిక అంశాలపై జరుగుతోన్న దాడుల నేపథ్యంలో తన భార్య కిరణ్‌రావు మనం దేశం విడిచి వెళ్లిపోదామని తనతో ప్రతిపాదన చేసిందని అమీర్ పేర్కొన్న విషయం తెలిసిందే. కాగా, ఇదే అసహనం అంశంపై రేపటి నుంచి జరుగపోయే పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో వాడీవేడీ చర్చ జరుగనున్నట్టు సమాచారం.
అవార్డులు తిరిగివ్వడం తప్పుకాదు : రెహ్మాన్
Published: Wed,November 25, 2015 11:26 AM
న్యూఢిల్లీ : సెలబ్రిటీల్లో అసహనం బయటపడుతోంది. దేశంలో అసహనం పెరిగిందన్న బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్ వ్యాఖ్యలకు మ్యూజిక్ మ్యాస్ట్రో ఏఆర్ రెహ్మాన్ మద్దతు పలికారు. అసహనం అంశంపై చర్చలు ఆందోళనకు దారితీస్తున్నాయని రెహ్మాన్ అన్నారు. అవార్డులు ప్రభుత్వానికి తిరిగి ఇవ్వడం కవితాత్మకమైన నిరసన అంటూ రెహ్మాన్ అన్నారు. ఓ ఇంగ్లీష్ ఛానల్‌తో తొలి సారి అసహనంపై మాట్లాడిన రెహ్మాన్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. నిరసనలు అహింసా ధోరణిలో సాగాలని ఆస్కార్ గ్రహీత అన్నారు. ఇది గాంధీ పుట్టిన దేశం...ఇక్కడ అహింసాత్మక నిరసనలకు స్థానం ఉందని రెమ్మాన్ తన మనసులో మాటన చెప్పారు. శాంతియుతంగా నిరసన చేపట్టడం తప్పుకాదన్నారు. మొహ్మద్: ద మెసేంజర్ ఆఫ్ గాఢ్ చిత్రానికి సంగీత సమకూర్చే విషయంలో రెహ్మాన్‌కు అడ్డంకులు ఎదురయ్యాయి. ఆ అంశాన్ని దృష్టిలో పెట్టుకుని రెహ్మాన్ ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది.
-అవార్డు వాపసీపై కవి అశోక్ వాజపేయి
న్యూఢిల్లీ, నవంబర్ 26: దేశంలో పెరుగుతున్న అసహనానికి వ్యతిరేకంగా తమ నిరసన అందరి దృష్టిలో పడేలా చేసేందుకే అవార్డులను వాపస్ చేశామని ప్రముఖ కవి అశోక్ వాజపేయి చెప్పారు. తమ నిరసన ప్రభావం చూపాలంటే నాటకీయం చేయక తప్పలేదని అన్నారు. పురస్కారాల వాపస్ కూడా అసంతృప్తిని వ్యక్తం చేయడంలో భాగమేనని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ సైతం పేర్కొన్నారని ఆయన గుర్తు చేశారు.
ప్రభుత్వం వీరికి ఏదో మంచి చేశారని అవార్డులు ఇచ్చి సత్కరిస్తే వీరు చేసే పని ఇదా ! డ్రామాలు ఆడుతారా ?
అవార్డులు తిరిగి ఇవ్వడం అంటే అవార్డులను అవమాన పరిచినట్లే ! దేశ ప్రతిష్ఠ ను దిగజార్చి నట్లే నని అందరు అనుకుంటున్నారు మరి మీరేమంటారు ?
yours
www.seaflowdiary.blogspot.com
వేర్పాటువాదులను అదుపుచేయాలి
-ప్రభుత్వానికి కుల్దీప్ నయ్యర్ సూచన
న్యూఢిల్లీ, నవంబర్ 26: దేశంలో గత ఆరేడు నెలలుగా అసహనం పెరిగిపోతున్నదని, వేర్పాటువాద శక్తులను అదుపుచేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ కుల్దీప్ నయ్యర్ పేర్కొన్నారు. గురువారంఆయన మీడియాతో మాట్లాడుతూ, తమ పార్టీలోని విభజన శక్తులు ఉపయోగిస్తున్న భాష ఆమోదనీయం కాదని ప్రధానమంత్రి స్పష్టం చేయాలని చెప్పారు. బీజేపీలోని పలువురు మాట్లాడుతున్న తీరు ప్రజల్లో భయాందోళనలు కలిగిస్తున్నదని అన్నారు.

అవార్డుల వాపసుతో అసహనంపై చర్చ
-రాష్ట్రపతి వ్యాఖ్యానించారన్న రచయితల ప్రతినిధులు
న్యూఢిల్లీ, నవంబర్ 26: రచయితలు, మేధావులు అవార్డులను వాపసు ఇవ్వడం అసహనంపై దేశవ్యాప్త చర్చకు దారితీసిందని రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ అన్నట్లు ఓ మేధావుల సంఘం తెలిపింది. దేశంలో చోటుచేసుకుంటున్న పరిస్థితులను చక్కదిద్దేందుకు రాష్ట్రపతి జోక్యం చేసుకోవాలని కోరుతూ కవి అశోక్ వాజపేయి, పెయింటర్ వివాన్ సుందరం, జర్నలిస్టు ఓం తన్విలతో కూడిన ముగ్గురు ప్రతినిధుల బృందం బుధవారం ప్రణబ్‌ను కలిసింది.
న్యూఢిల్లీ, నవంబర్ 26: రచయితలు, మేధావులు అవార్డులను వాపసు ఇవ్వడం అసహనంపై దేశవ్యాప్త చర్చకు దారితీసిందని రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ అన్నట్లు ఓ మేధావుల సంఘం తెలిపింది. దేశంలో చోటుచేసుకుంటున్న పరిస్థితులను చక్కదిద్దేందుకు రాష్ట్రపతి జోక్యం చేసుకోవాలని కోరుతూ కవి అశోక్ వాజపేయి, పెయింటర్ వివాన్ సుందరం, జర్నలిస్టు ఓం తన్విలతో కూడిన ముగ్గురు ప్రతినిధుల బృందం బుధవారం ప్రణబ్‌ను కలిసింది.
-అవార్డు వాపసీపై కవి అశోక్ వాజపేయి
న్యూఢిల్లీ, నవంబర్ 26: దేశంలో పెరుగుతున్న అసహనానికి వ్యతిరేకంగా తమ నిరసన అందరి దృష్టిలో పడేలా చేసేందుకే అవార్డులను వాపస్ చేశామని ప్రముఖ కవి అశోక్ వాజపేయి చెప్పారు. తమ నిరసన ప్రభావం చూపాలంటే నాటకీయం చేయక తప్పలేదని అన్నారు. పురస్కారాల వాపస్ కూడా అసంతృప్తిని వ్యక్తం చేయడంలో భాగమేనని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ సైతం పేర్కొన్నారని ఆయన గుర్తు చేశారు.
అసహనం వీధుల్లో లేదు : రాష్ట్రపతి
గుజరాత్ : రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ అసహనంపై మరోసారి స్పందించారు. సబర్మతి
ఆశ్రమంలో జరిగిన ఓ కార్యక్రమంలో ప్రణబ్ మాట్లాడారు. అసహనం వీధుల్లో లేదు..
మన ఆలోచనల్లోనే ఉందని పేర్కొన్నారు. శాంతి, చర్చకు ఉన్న శక్తిని
మరిచిపోవద్దు అని తెలిపారు. అందరం ఒక్కటేనన్న ఆలోచన ఉంటే మనసు
పరిశుద్ధమవుతుందన్నారు. ఇక అసహనంపై లోక్‌సభలో అధికార, విపక్ష సభ్యులకు మధ్య
తీవ్ర వాగ్వాదం జరుగుతున్న విషయం విదితమే.
40 మంది అవార్డులు వాపసిచ్చారు..
దేశంలో జరిగిన కొన్ని అవాంఛనీయమైన ఘటనలకు నిరసనగా 39 మంది రచయితలు, ఒక
కళాకారుడు అవార్డులు వాపస్ ఇచ్చారని, ఈ విషయంలో పునరాలోచించాలని సాహిత్య
అకాడమీ వారిని కోరిందని ప్రభుత్వం తెలిపింది. సాహిత్య అకాడమీ ప్రత్యేక
కార్యనిర్వాహకవర్గ సమావేశం నిర్వహించి రచయితలు లేదా కళాకారులపై జరిగిన
దాడులను, హత్యను ఖండిస్తూ తీర్మానించిందని, ఆ ఘటనలకు నిరసనగా అవార్డులు
తిరిగి ఇచ్చిన వారిని మరోసారి ఆలోచించుకోవాలని విజ్ఞప్తి చేసిందని కేంద్ర
సాంస్కృతికశాఖ మంత్రి మహేశ్‌శర్మ లోక్‌సభలో ఒక ప్రశ్నకు ఇచ్చిన లిఖిత
పూర్వక సమాధానంలో తెలిపారు. c
449
అవార్డులు తిరిగి ఇవ్వడం అంటే అవార్డులను అవమాన పరిచినట్లే ! దేశ ప్రతిష్ఠ ను దిగజార్చి నట్లే నని అందరు అనుకుంటున్నారు మరి మీరేమంటారు ?
yours
www.seaflowdiary.blogspot.com