The land acquisition bill, The Prime Minister Narendra Modi on Sunday sought to reach
out to farmers with detailed clarifications on the contentious issue through his
`Mann Ki Baat' radio programme. He said that the opposition over its campaign against
the land acquisition bill to mislead the farmers.
మన భారత దేశం ముఖ్యముగా వ్యవసాయ దేశం . ఇప్పటికి 80% మంది వ్యవసాయం చేసుకుంటూ
జీవించుచున్నారు . ప్రస్తుతం వ్యవసాయం ఎలా ఉందంటే అంతా దైవా దీనమే . ముఖ్యముగా వర్షం పైనే
ఆధార పడి ఉన్నది . వర్షం పడితేనే భూమిలోనికి నీరు వస్తుంది , చెరువులు నిండుతాయి , ప్రాజెక్ట్ లు
నిండుతాయి , భూమిలోకి నీరు ఇంకి బోర్లలోకి నీళ్ళు వస్తాయి . అప్పుడే పంటలు బాగా పండుతాయి .
మనుషులు ,జంతువులకు త్రాగడానికి నీరు లభిస్తుంది . నదుల లో నీరు గల గల పారుతుంది .
ఎండాకాలం అయిపోగానే వర్షం ఎప్పుడు వస్తుందా అని రైతు నైరుతి ఋతు పవనాలగురించి ఎదురు చూస్తాడు
. జూన్ మొదటి వారం లో నైరుతి ఋతు పవనాలు మొదలై సెప్టెంబర్ చివరి వరకు కొనసాగుతాయి .
అంతా సవ్యముగా జరిగితే రైతుకు ఏ బాధ ఉండదు . కాని ఈ మధ్య నైరుతి ఋతు పవనాలు మొండికేస్తు
న్నాయి , సకాలములో ప్రారంభం కావడం లేదు . తొలకరి చినుకులు పడితే గాని విత్తనాలు వేయడానికి
లేదు. రైతు తొలకరి చినుకులు వచ్చే సమయానికి భూమిని దున్ని సేంద్రియ ఎరువులు వేసి రెడీ గా
పెడతాడు .
తొలకరి చినుకులు పడ్డాయంటే విత్తనాలు చల్లుతాడు , విత్తనాలు మొలకెత్తుతాయి , మధ్యలో వర్షం ఒకవేళ
ఆలస్యం అయ్యిందనుకోండి మొలకెత్తిన మొక్కలు ఎండకు మాడిపోతాయి , అప్పుడు రైతు పడిన శ్రమ అంత
యూ వ్యర్థమే కళ్ళల్లో నీరు తప్ప ఇంకేమి మిగులదు . కథ మళ్ళి మొదటికి వస్తుంది , చేసిన కష్టం వృథా ,
విత్తనాలు వృథా అప్పులు మిగులు తాయి. మళ్ళి కష్టపడి విత్తనాలు సంపాదించి వేశాడనుకోండి అంతా
దైవాధీనం . విత్తనాలు దొరకడం గగనమైతుంది, ధర ఎక్కువ పెట్టాలి . పంట పెద్దదైన కొద్ది కలుపు మొక్కలు
తీయాలి , ఎరువులు వేయాలి, రసాయనిక ఎరువులు దొరకాలంటే మహా గఘనమే ,అప్పులు చేసి మరీ
కొంటాడు . పంటను సుమారు ఆరు నెలలపాటు జంతువుల నుండి , క్రిమి కీటకాల నుండి ,ఎలుకల
నుండి పక్షుల నుండి కాపాడు కోవాలి , ఒక విధముగా చెప్పాలంటే రైతు , అతని కుటుంబం అంతా ఇంత
కాలం పంట పొలాల దగ్గర రాత్రిం బవాళ్ళు కాపలా కాయాలి . పంట ఇంత వరకు రావాలంటే సకాలం లో
వర్షం కురియాలి , చెరువులో నీళ్ళైనా ఉండాలి లేదా బోర్ వెల్ ద్వారా నీళ్ళైనా పెట్టాలి ,బోర్ వెల్ నుండి నీరు
తీయాలంటే కరెంటు ఉండాలి . ప్రస్తుతం కరెంటు కు కోతలు కోతలు ఉన్నాయి కదా రాత్రి పూటే కరెంట్
లభ్యమవుతుంది ! కావున రైతు రాత్రిళ్ళు కూడా పొలాల వద్దనే ఉంటూ నీటిని పారించాలి . చీకట్లో విష
క్రిమి కీట కాదుల నుండి ప్రాణాన్ని కాపాడుకోవాలి .
రైతు ఇన్ని కష్టాలు పడుతూ పంటను ఈ స్థాయి వరకు తెచ్చిన తరువాత పూత ,కాయ దశకు చేరుకున్న
తరువాత ఆ కాయను పురుగులు తినకుండా పెస్టిసైడ్ వేయాలి , పక్షులు తినకుండా కాపాడుకోవాలి . పంట
కోతకు వచ్చే సమయంలో కొన్ని సార్లు అకాల వర్షాలు , వడగళ్ళు కురుస్తాయి , తుఫానులు ,వరదలు
కూడా వచ్చి మొత్తం పంట నేల పాలు వరద పాలు అవుతుంది. అప్పుడు రైతు గతి ఏమిటి ?
ప్రస్తుతం కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలే పోటి పడి తమ తమ ప్రాంతాలలో పెట్టుబడులు పెట్టమని ఇండస్ట్రి య లిస్టులను
బ్రతిమాలు తున్నాయి . ఒకరు సింగాపూర్ ఇంకొకరు జపాన్ , అమెరికా వెళ్లి అక్కడి బడా వ్యాపార వేత్తలు
businessman మరియు ఇండస్ట్రియ లిస్టులను industrialists బ్రతిమిలాడి పెట్టుబడులు తమ దగ్గర పెట్టమని
కోరుతున్నారు .
వారికి అతితక్కువ కు విద్యుత్తు , నీరు ఇస్తామని ఇన్ఫ్రా స్ట్రక్చర్ కల్పిస్తామని , రోడ్ లు వేస్తామని టాక్స్ హాలిడే
ఇస్తామని బ్రతిమి లాడి వాళ్ళను ఒప్పిస్తున్నారు . భూమి ని తక్కువ రేటుకు ఇస్తామని వాళ్లకు చెబుతున్నారు .
ఇంతకీ వాళ్ళు మనకు ఇస్తున్నది ఎమిటంటే గ్రూప్" డి " ఉద్యోగాలు మాత్రమే !
రైతు కూడా విత్తనాలు వేయడానికి , ఎరువులు వేయడానికి , కలుపు మొక్కలు తీయడానికి ,పంట ను కాపాడ
డానికి , పంటకు చీడ పురుగులు తగలకుండా మందులు చల్లడానికి , పంట తయారు అయిన తరువాత కోయడా
నికి , నూర్చడానికి పంటను ఇంటికి తీసుక పోవడానికి ఇలా ఎన్నో పనులను చేయడానికి ఎంతో మందికి ఉపాధి
కల్పిస్తున్నాడు . గిట్టుబాటు ధర కూడా ఒక్కోసారి లభించదు . పెట్టిన పెట్టుబడి కూడా రాని సందర్భాలు ఉంటాయి .
ఇంత కష్టపడి పండించిన ధాన్యం తో దేశ ప్రజల కడుపు నింపుతున్నాడు .
ఇండస్ట్రియ లిస్టులు industrialists కంపెనీలు పెట్టుటకు వందల ఎకరాల భూమి కావాలి . ప్రభుత్వం తన దగ్గర
ఉన్న భూమిని లీజుకు గాని తక్కువ ధరకు గాని ఇస్తుంది . ఒకవేళ ఇండస్ట్రియ లిస్టులు industrialists అడిగిన
దగ్గర భూమి లేకుంటే రైతుల దగ్గర భూమిని కొనుక్కుని వారికి ఇస్తుంది . రైతు తన భూమిని అమ్మడం ఆ రైతు
ఇష్టం . కాని ఆ రైతు తన భూమిని అమ్మలేదనుకోండి అప్పుడు ఆ రైతు భూమిని తీసుకోవడానికి 2013 లో
UPA ప్రభుత్వం " భూ సేకరణ బిల్లు " తెచ్చింది .
తరువాత 2014 లో UPA ప్రభుత్వం ఓడిపోయి NDA ప్రభుత్వం భారి మెజారిటీ తో అధికారం లోకి వచ్చింది .
2013 భూ సేకరణ బిల్లులో లొసుగులు ఉన్నాయని ఆ బిల్లు లో సవరణ ను ఆర్డినెన్సు ద్వారా తెచ్చింది . ఈ
సవరణ లో రైతుల అనుమతి కాదు సరికదా, వారిని సంప్రదించను కూడా సంప్రదించకుండా వారి భూమిని
లాగేసుకోవచ్చు.
2013 బిల్లులో రెండు కీలకమైన క్లాజులను పొందుపరిచారు.రైతులేకాక, వ్యవసాయ కార్మికుల వంటి
ఇతర వ్యవసా యాధారిత వర్గాల ప్రయోజనాలకు, పర్యావరణకు రక్షణగా మొదటిది, ప్రైవేట్ ప్రాజెక్టు కోసం
భూమిని సేకరిస్తున్నప్పుడు దానివల్ల ప్రభావితులయ్యే వర్గాల నుంచి 80 శాతం మేరకు, ప్రభుత్వ, ప్రైవేట్
భాగస్వామ్యంతో ఏర్పాటు చేసే ప్రాజెక్టు విషయంలో అయితే 70 శాతం మేరకు అనుమతి పొందవలసి
ఉంటుంది. రెండవది, భూ సేకరణ సామాజికంగా ఎటువంటి ప్రభావం చూపుతుందో మదింపు చేయవలసి
ఉంటుంది. ఈ ప్రభుత్వం సవరించిన బిల్లులో ఈ రెండు క్లాజులను ఒక్క కలంపోటుతో తొలగించివేసింది
ఈ బిల్లు సవరణ లో రైతులకు అనుకూలంగా లేదని ఈ బిల్లుకు వ్యతిరేకంగా 14 ప్రతిపక్షాలు సంఘటితమై
ప్రభుత్వానికి వ్యతిరేకించాయి. లోక్‌సభలో మందబలంతో బిల్లు నెగ్గించుకున్న ప్రభుత్వం, రాజ్యసభలో ఏటికి
ఎదురీదుతూ కళ్లు తేలేస్తోంది. ఆ కలవరపాటు, ఆందోళన ప్రభుత్వంలో, మరీ ముఖ్యంగా ప్రధానిలో కొట్టొచ్చి
నట్టు కనిపిస్తూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో మోడీ 'మన్ కీ బాత్' (మనసులో మాట) కార్యక్రమంలో నేరుగా
రైతులను ఉద్దేశించి చేసిన ప్రసంగం చూస్తె తెలుస్తుంది .
పేదలు గానే ఉండాలా ! అన్నారు . పేదలు గానే ఉండాలని ఎవ్వరు కోరుకోరు. 2013 చట్టం లో ఉన్న పరి
హారం నిబంధనలే క్రొత్త బిల్లు లోను ఉన్నాయని స్పష్టం చేశారు . ప్రభుత్వ ప్రాజెక్ట్ లకు , ప్రభుత్వ - ప్రైవేటు
ప్రాజెక్ట్ లకు మాత్రమే " రైతుల ఆమోదం అక్కర్లేదు " అన్నారు . బీద రైతుల భూమిని వారికి ఆమోదం
లేకున్నా ఈ చట్ట సవరణ వలన తీసికోవచ్చు! అంటే 2013 చట్టం లో ఈ నిబంధన లేదు .
సామాన్య రైతులకు ఉండేదే 4-5 ఎకరాల భూమి . అదే అతని జీవనాధారం . అతని భూమి తీసికొని
నాల్గింతల పరిహారం చెల్లిస్తా మంటున్నారు . అభివృద్ధి కొరకు సేకరించిన భూమిలో 20% భూ యజమానికి
వెళ్ళు తుందని , ఆ కుటుంబములో ఒకరికి ఉద్యోగం వస్తుందని చెప్పారు . 20% భూమి యజమానికి
ఎలా వెళ్ళుతుంది , మొత్తం భూమి తీసికున్న తరువాత ? ఒకరికి ఉద్యోగం వస్తుందని , నాల్గింతల పరిహారం
వస్తుందని పేద రైతు, తర తరాలకు జీవనం కల్పించే భూమి , రోజు ఒక బంగారు గుడ్డు పెట్టే బాతుని
ఒక్క రోజులోనే కోసి వేస్తే ఎన్ని గ్రుడ్లు దాని కడపు లో ఉంటాయి ? లాగ భూమిని వదలు కొంటాడా ?
ఒకేసారి పెద్ద మొత్తం డబ్బు ఇచ్చి రాత్రికి రాత్రే ధనవంతుడిని చేయాలనా ! అందుకే పేదలు గానే ఉండాలా !
అని అంటున్నారు .
2013 చట్టం లో ఒక ప్రధాన లోపం ఉందని అన్నారు అదేమిటంటే గరిష్టముగా భూమి అవసరమైన రైల్వే లు
జాతీయ రహదారులు గనుల వంటి 13 ప్రభుత్వ కార్య కలాపాలను ఈ చట్టం పరిధిలో చేర్చలేదు అన్నారు .
ఆ చట్టం చేసేటప్పుడు మీ పార్టి లేదా ? అప్పుడేం చేశారు . ఆ 2013 చట్టం లో ఈ ఒక్క లోపాన్ని ఇప్పుడు
సవరించ వచ్చు కదా ? అప్పుడు ప్రతి పక్షాలు అన్ని కళ్ళు మూసికొని ఈ సవరణ కు ఒప్పుకొనే వారు .
కాని 14 ప్రతి పక్షాలు ఏకమై వ్యతిరేకిస్తున్నాయి అంటే ఈ సవరణ లో ఏదో లోపం వారికి కన్పిస్తుంది . వారేదో
తప్పుడు ప్రచారం చేస్తున్నారని చెప్పారు .
కార్పోరేట్లకు లబ్ది చేకూర్చేందుకే ఈ చట్టమన్న ఆరోపణలను తిరస్కరించామన్నారు, అయితే ఈ సవరణ వల్ల
రైతు కు ఏం లాభం అవుతుంది, కేవలం ఒకేసారి పెద్ద మొత్తం అంటే నాల్గు రెట్లు , వారిచ్చేది ప్రభుత్వ ధర
అంటే అది మార్కెట్ ధర లో సగం మాత్రమే ఉంటుంది మరియు ఒక ఉద్యోగం ఇస్తారట .
నిజం గా రైతుకు మేలు చేయాలంటే భూమి కొద్దిగా ఉన్న రైతులకు లేదా భూమి లేని వారికి కనీసం 5
ఎకరాల భూమి ఇవ్వండి . వ్యవసాయ పనిముట్లు ఇప్పించండి. భూమి దున్నడానికి ఎద్దులు కొనడానికి
తక్కువ వడ్డీకి రుణాలు ఇప్పించండి . బోరు బావులకు ఉచిత కరెంటు కల్పించండి . మంచి విత్తనాలు అతి
తక్కువ ధరకు సరఫరా చేయండి . ఎరువులు తక్కువ ధరకు సరఫరా చేయండి. గిట్టుబాటు ధర ఇప్పించండి
ధర నిర్ణ ఇంచడం రైతు చేతిలో ఉండదు . ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్ట పోయిన రైతులను ఆదుకోండి .
పంటకు తప్పనిసరి భీమా చేయించండి . రైతుకు తన పంటకు ఇంత డబ్బు వస్తుందని భరోసా లేదు .
ధాన్యం నిలువ చేయడానికి గిడ్డంగులు కట్టించండి . ఇవే కాకుండా కాకుండా కోసిన పంటలు వర్షానికి
తడవ కుండా షెడ్డులు కూడా కట్టించాలి . రైతులు సంవత్సర మంతా ఎంతో కష్ట పడి పంటలను పండిస్తారు . తీర
పంటలు చేతికి అందే సమయం లో అకాల వర్షాల వల్ల పంట కు నష్టం ప్రతి సంవత్సరం ఎక్కడో ఒక చోట
జరుగుతుంది , సంవత్సర కష్టం , పెట్టిన పెట్టుబడి రాక సామాన్య రైతుల జీవితాలు గాలిలో దీపం లాగ మారుతు
న్నాయి . పంట చేతికి అందిన తరువాత కూడా దాచి పెట్టడానికి స్తలం లేక అకాల వర్షం ,వరదల వలన రైతు నష్ట
పోతున్నాడు . విత్తనం వేసిన దగ్గరనుండి పంట పండి చేతికి వచ్చేవరకు నమ్మకం లేదు . ప్రభుత్వం ప్రతి సంవత్సరం
వ్యవసాయం మీద వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతుంది . ఈ మధ్య ప్రభుత్వం ప్రత్తి కొనుగోలు చేసి ఓపెన్ గా
పెడితే అకాల వర్షం వలన కోట్ల రూపాయలు నష్టం జరిగింది .
అందుకే ప్రభుత్వం ఒక పక్కా ప్రణాళిక ద్వారా లేదా వ్యవసాయ దారులంత కలసి తమ తమ గ్రామాలలో పంట చేల
దగ్గర అక్కడక్కడ పెద్ద పెద్ద షెడ్లు కట్టుకుంటే పంట కోసిన తరువాత ఈ షెడ్ లలో దాచుకొని అకాల వర్షం నుండి
పండిన పంటను కాపాడుకొన వచ్చు . దీనికి ప్రభుత్వం ముందుకు వచ్చి ఈ షెడ్ లను ప్రతి గ్రామం లో నిర్మిస్తే
బాగుంటుంది . లేదా తక్కువ వడ్డీ తో రైతులకు ఋణం ఇచ్చి సంవత్సరానికి కొంత చొప్పున వసూలు చేసి కొన్నా
బాగుంటుంది , రైతుల ఆత్మ హత్యలను నివారించ వచ్చు. అప్పుడే రైతు లకు మేలు జరుగు తుంది .
ఇక్కడ తెలంగాణా లో మన ముఖ్యమంత్రి గారు పేదలకు 3 ఎకరాల భూమి పంచుతున్నారు .
ప్రస్తుతం కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలే పోటి పడి తమ తమ ప్రాంతాలలో పెట్టుబడులు పెట్టమని ఇండస్ట్రి య లిస్టులను
బ్రతిమాలు తున్నాయి . ఒకరు సింగాపూర్ ఇంకొకరు జపాన్ , అమెరికా వెళ్లి అక్కడి బడా వ్యాపార వేత్తలు
businessman మరియు ఇండస్ట్రియ లిస్టులను industrialists బ్రతిమిలాడి పెట్టుబడులు తమ దగ్గర పెట్టమని
కోరుతున్నారు .
వారికి అతితక్కువ కు విద్యుత్తు , నీరు ఇస్తామని ఇన్ఫ్రా స్ట్రక్చర్ కల్పిస్తామని , రోడ్ లు వేస్తామని టాక్స్ హాలిడే
ఇస్తామని బ్రతిమి లాడి వాళ్ళను ఒప్పిస్తున్నారు . భూమి ని తక్కువ రేటుకు ఇస్తామని వాళ్లకు చెబుతున్నారు .
ఇంతకీ వాళ్ళు మనకు ఇస్తున్నది ఎమిటంటే గ్రూప్" డి " ఉద్యోగాలు మాత్రమే !
పెట్టుబడి దారులు ముందే ధనవంతులు వారికి బ్యాంకు లు కూడా వందల కోట్ల రూపాయలను అప్పుగా ఇస్తాయి . అన్ని సౌక
ర్యాలు ప్రభుత్వమే కల్పిస్తుంది కాబట్టి వాళ్లకు కష్టాలు తక్కువే . ఉద్యోగస్తుల ను కూడా తక్కువ వేతనకు నియమిం
చుకుంటారు . ఉద్యోగులు తమ ఉద్యోగం ఎప్పుడు ఊ డు తుందో నని భయపడుతూ ఎక్కువ పని గంటలు పని
చేస్తారు . పెట్టుబడి దారుల కు రా మెటీరియల్ కూడా సులువుగా తక్కువ ధరకు లభిస్తుంది . వాళ్ళు వస్తువులను
ఎంత ప్రోడక్ట్ చేయాలో ముందే నిర్ణయించు కుంటారు కావున ఎంత ఆదాయం వస్తుందో ఖచ్చితం గా ముందే తెలు
స్తుంది. వాళ్లకు టాక్స్ లో రాయితీ కూడా లభిస్తుంది . కావున రైతుకు లాభం ఉందా లేక పెట్టుబడి దారులకు లాభం
ఉందా !
ప్రభుత్వం తెచ్చిన ఆర్డినెన్సు ఏప్రిల్ 5 తో ముగుస్తుంది , అంతలోగా బిల్లు పాస్ కావాలి లేకుంటే మళ్లీ ఆర్డినెన్సు
తెస్తామని NDA ప్రభుత్వం చెబుతుంది .
Mar 28 2015 : The Times of India (Hyderabad)
Land bill: Modi govt to reissue ordinance
|
New Delhi:
TIMES NEWS NETWORK
|
The Ordinance Was To Lapse On April 5
In the face of trenchant opposition to the land bill in Rajya Sabha where it lacks numbers
, the government on Friday decided to prorogue the upper House and re-promulgate
the land ordinance, which lapses on April 5.“The Cabinet Committee on Parliamentary
Affair met on Friday and has decided to recommend prorogation of Rajya Sabha with
immediate effect,“ parliamentary affairs minister M Venkaiah Naidu told reporters after the
CCPA meet.However, the ordinance will have to be introduced as a fresh one since it
will have to include the nine new clauses that have been added to it while passing the
bill in Lok Sabha during the first half of the budget session.Those who attended the
meeting at the residence of home minister Rajnath Singh, who chairs the CCPA,
included foreign minister Sushma Swaraj and minister of state for parliamentary affairs
Mukhtar Abbsas Naqvi besides Naidu. Sources said finance minister Arun Jaitley, who
could not attend the meeting, was taken on board. Parliament is currently on a month-
ong recess. For issuing an ordinance when Parliament is in session, at least one of the
Houses has to be prorogued.Congress, however, slammed the move with the party
spokesperson attacking the government for seeking to bulldoze the land ordinance.
|
Mar 28 2015 : The Times of India (Hyderabad)
Cong chief Sonia accuses govt of peddling half-truths on land
bill
Congress chief Sonia Gandhi accused the Modi government of misrepresentation
on land acquisition bill, saying it was attempting to couch the dilution of pro-farmer
provisions by raising the bogey of national defence and development.Responding to
road transport minister Nitin Gadkari's letter in which he had challenged her to a public
debate, Sonia said, “I am amazed at (your) unabashed display of half-truths and
misrepresentations. I should not, of course, be surprised because this is typical of your
government when it runs out of logical and convincing arguments.“While rejecting the
proposal for a debate, the six-page response gave a clause-by-clause counter to
Gadkari's missive which had claimed that opponents of NDA's land law were anti-far
mer.Gadkari has been named by PM Narendra Modi as the firefighter for the stalemated
bill.“It is regrettable that anyone championing the voice of distressed farmers and needy
farm labourers is being branded 'anti-national' by a myopic Modi government bend
ing over backwards to favour select industrialists,“ she said.Sonia said the key difference
between Congress and BJP was their understanding of farmers' distress arising out of
acquisition sans safeguards, adding the clause for consent and social impact assessmen
t were aimed to insulate farmers from whimsical acquisitions.“It is now being widely
recognised that your government is blatantly anti-farmer and anti-poor, compromising
the rights of the weaker sections of society to benefit a handful of private parties,“
she said. “Your government's position on defence, irrigation and electrification issues is
a blatant attempt to divert attention from your anti-farmer amendments,“ she said.
Countering the claim that NDA had changed UPA's land law in the interest of develop
ment, she added, “Being pro-farmer does not mean anti-growth.“
03-04-2015
ల్యాండ్ బిల్లుపై బీజేపీ ర్యాలీలు!
Updated : 4/3/2015 1:55:58 PM
Views : 255
NewDelhi
News : కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన భూసేకరణ బిల్లును ఆయా పార్టీలు
వ్యతిరేకిస్తున్న విషయం విదితమే. భూసేకరణ బిల్లుపై కాంగ్రెస్ తీవ్ర ఆగ్రహం
వ్యక్తం చేస్తుంది. బీజేపీ ప్రభుత్వం రైతు వ్యతిరేక ప్రభుత్వమని బహిరంగంగా
విమర్శిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో భూసేకరణ బిల్లుపై బీజేపీ
ర్యాలీలు నిర్వహించాలని నిర్ణయించింది. భూసేకరణ బిల్లు గురించి వివరంగా
ప్రజలకు వివరించి మద్దతు కూడగట్టాలని నిర్ణయించింది. ఈ క్రమంలోనే మే 6
నుంచి ర్యాలీలు నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. మొదటి ర్యాలీ జార్ఖండ్
రాజధాని రాంచీలో నిర్వహించే అవకాశం ఉంది.
భూసేకరణ ఆర్డినెన్స్‌పై రాష్ట్రపతి సంతకం
Updated : 4/3/2015 3:50:58 PM
NewDelhi
News : భూసేకరణపై మరో ఆర్డినెన్స్ కు రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ సంతకం
చేశారు. గతేడాది
డిసెంబర్‌లో జారీచేసిన వివాదాస్పద భూసేకరణ ఆర్డినెన్స్‌కు ఈ
నెల ఐదోతేదీతో కాలదోషం పట్టనుండ
టంతో మరోసారి ఆర్డినెన్స్‌ను జారీచేయాలని
కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో
నే ఇవాళ
రాష్ర్టపతి సంతకం చేశారు. ఆర్డినెన్స్ స్థానంలో తెచ్చిన భూసేకరణ చట్టసవరణ
బిల్లు రాజ్యసభ
ఆమోదం పొందకపోవటంతో ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షతన మంగళవారం
రాత్రి సమావేశమైన కేంద్ర క్యాబి
నెట్ ఈ నిర్ణయం తీసుకొంది.
ఆర్డినెన్స్
జారీచేయాల్సిందిగా రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీని కోరాలని తీర్మానించిన
విషయం తెలిసిందే. ప్రస్తుత
ఆర్డినెన్స్ కాలం ముగియనున్న ఐదోతేదీలోపే కొత్త
ఆర్డినెన్స్ జారీకి చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది.
ప్రభుత్వానికి
పూర్తి మెజారిటీ ఉన్న లోక్‌సభలో భూసేకరణ బిల్లు ఆమోదం పొందినప్పటికీ
ప్రతిపక్షాల
ఆధిపత్యం ఉన్న రాజ్యసభలో మాత్రం ఆమోదం లభించలేదు.
ఆర్డినెన్స్‌కు ఆరు నెలలలోపు పార్ల
మెంటు ఆమోదం లభించకపోతే దానికి కాలదోషం
పడుతుందన్న విషయం తెలిసిందే. పార్లమెంటు
బడ్జెట్ సమావేశాల మొదటి విడత
ముగిసి రాజ్యసభ వాయిదా పడటంతో బిల్లుకు ఐదోతేదీలోపు
ఆమోదం లభించే అవకాశాలు
లేకుండా పోయాయి. దీంతో కొత్తగా ఆర్డినెన్స్ తేవాలని మోదీ ప్రభుత్వం
నిర్ణయించింది.
తొమ్మిది సవరణలతో కొత్త ఆర్డినెన్స్
కొత్తగా
జారీచేయబోయే భూసేకరణ ఆర్డినెన్స్‌లో తొమ్మిది సవరణలు ఉంటాయని
అధికారవర్గాలు తెలిపాయి.
ప్రస్తుత బిల్లును లోక్‌సభ తొమ్మిది సవరణలతో
ఆమోదించింది. ఆ మేరకే కొత్త ఆర్డినెన్స్‌ను జారీచేస్తార
ని, కొత్త
ఆర్డినెన్స్ ప్రస్తుత బిల్లుకు భిన్నంగా ఉండబోదని ప్రభుత్వ వర్గాలు
వెల్లడించాయి. రాజ్యాంగం ప్రకారం
పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నప్పుడు
ఆర్డినెన్స్‌లు జారీచేయటానికి వీలులేదు.
ఉభయసభలో ఒక సభ ప్రొరోగ్
అయినా ఆర్డినెన్స్ జారీచేయవచ్చు. దీంతో గత శుక్రవారం పార్లమెంటరీ వ్యవహా
రాల
కేంద్ర క్యాబినెట్ కమిటీ రాజ్యసభను ప్రొరోగ్ చేయాల్సిందిగా రాష్ట్రపతిని
కోరింది. దాంతో ఆయన సభ
ను శనివారం ప్రొరోగ్ చేసిన విషయం విదితమే. అందువల్ల
కొత్త ఆర్డినెన్స్ జారీకి అడ్డుంకులు తొలగిపో
యాయి. కొత్త ఆర్డినెన్స్ జారీ
అయింది. తాజా ఆర్డినెన్స్ జారీచేస్తే మోదీ ప్రభుత్వం అధికారంలోకి
వచ్చిన
ప్పటి నుంచి జారీచేసి ఆర్డినెన్స్‌లో అది 11వది అవుతుంది. 2013లో
యూపీఏ ప్రభుత్వం తెచ్చిన భూసే
కరణ చట్టంలో సవరణ చేయటాన్ని కాంగ్రెస్ సహా
ప్రతిపక్షాలన్నీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.
చివరకు NDA మళ్ళి ఆర్డినెన్స్ తెచ్చింది .
|
అందుకే ప్రభుత్వం చేసేది మంచిదో లేక ప్రతిపక్షం చెప్పేది నిజమో
ప్రజలకు తెలియాలి . అందుకే ప్రజలకు కూడా తమ "మన్ కీ బాత్ "
చెప్పుకోవడానికి అవకాశం ఇవ్వాలి .
yours ,
www.seaflowdiary.blogspot.com