Tuesday, July 29, 2014

మనషి లాంటి మృగాలు

                                                                                                                             

                                                        మనషి లాంటి మృగాలు 
                                                                                 తేది : 29-07-2014 


మన దేశ రాజధాని డిల్లీ లో గత సంవత్సరం నిర్భయ పై జరిగిన అమానుషానికి దేశం మొత్తంలో ఒక సంచలనం జరిగినది . దేశ ప్రజలందరు దిగ్భ్రాంతి చెందారు . దేశ ప్రజలందరూ ముక్త కంట  ముతో ఖండించారు , ఒక ఉద్యమం చేపట్టారు . ఫలితముగా స్త్రీ ల పై జరిగే లైంగిక దాడు లను అరి కట్టడానికి "నిర్భయ చట్టం " చేయబడినది . ఐనా ఇంకా మన దేశం లో విచ్చల విడిగా  ప్రతి రోజు  స్త్రీ  లపై  అత్యాచారాలు లెక్క లేనన్ని ఎక్కడో ఒక చోట  జరుగు చున్నవి. పేపర్ల లో వచ్చినవి మాత్రమే మనకు తెలుసు. పేపర్లలో రానివి ఇంకా ఎన్నొ. పసి పాపలపై కూడా అత్యాచారాలు జరుగు చున్నందులకు మనం సిగ్గు తో తల వంచుకోవాలి .


బెంగళూరు లో ఆరేళ్ళ పాప పై అత్యాచారం . యు పి  లో బుధాన గ్రామం  లో పోలానికి వెళుతున్న మహిళ పై ముగ్గురు యువకులు అఘాయిత్యం చేశారు . ముజఫర్ నగర్ జిల్లా లో 25 ఏళ్ల మహిళ ను అపహరించి సాముహిక అత్యాచారం జరిపి తిరిగి ఆమె ఇంటి ముందు అపస్మారస్తితి లో పడవేశారు
మనిషి జీవితములో ఇంత కన్నా నీచమైన దుర్మార్గపు పని ఇంకా  ఏదైనా ఉంటుందా?


ప్రకాశం , కృష్ణ జిల్లాలలో పవిత్రమైన వృత్తి లో  ఉన్న ఉపాధ్యయుడు బాలిక పై అత్యాచారనికి పాల్పడము , మరో ఘటన లో మద్యానికి బానిసైన తండ్రి కన్న కూతురు పైనే అఘాయిత్యానికి పాల్పడడము . మిజోరాం లో ఇద్దరు కామాందులు భర్తను చెట్టుకు కట్టేసి ఆయన కళ్ళ ఎదుటే భార్య పై సాముహిక లైంగిక దాడికి ఒడిగట్టారు .  తూర్పు మిడ్నాపూర్ వెస్ట్ బెంగాల్ లో ఏడేళ్ళ బాలిక పై పొరుగింటి వ్యక్తి అత్యాచారాని కి పాల్పడి ఓ చెట్టుకు ఉరి వేసి దారుణంగా హత్య చేసాడు . అదే వెస్ట్ బెంగాల్ మిడ్నాపూర్ లో ఓ ఆసుపత్రి లో పనిచేస్తున్న నర్సు పై ఆ ఆసుపత్రి యజమాని ఎనిమిది ఏళ్ళు గా అత్యాచారానికి పాల్పడ్డట్లు ఫిర్యాదు . గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్ లిఫ్టర్ న్యూ గినియా కు చెందిన తౌ వా ఉదియా  అనే వాడు ఓ మహిళ పై లైంగిక దాడికి పాల్పడినట్లు అభియోగాలు నమోదయ్యాయట,అరెస్ట్ కూడా చేసారట .  ఇలా వ్రాస్తూ పొతే ఎన్ని పేజి లైన సరిపొవు.

 అత్యాచారాల పట్ల మన ప్రజా ప్రతినిధుల తీరు వారి స్పందన ఆందోళన కల్గిస్తున్నది. యూ పి మాజీ ముఖ్యమంత్రి సమాజ్వాది పార్టి అధినేత ములాయం సింగ్ యాదవ్ గారు " ఏదో క్షణి కావేశం లో యువకులు చేసిన చిన్న పాటి నేరాలకు ఉరి శిక్ష లను వేయడము న్యాయం కాదంటాడు . అంతటి తో ఆగకుండా యువకులు కాక మరెవరు చేస్తా దంటూ వేనుకేసుకోచ్చాడు . అదే పార్టికి చెందిన మరో నేత రామ్ గోపాల్ యాదవ్ " అమ్మాయిలు  అబ్బాయిలతో సంబంధాలు బయట పడగానే అత్యాచార ఘటనగా చెపుతున్నారని అత్యాచారాలకు మరో భాష్యం చెప్పాడు .

కర్నాటక లోజరిగిన అత్యాచారాల గురించి అడిగిన పాత్రికేయులతో కర్నాటక ముఖ్యమంత్రి సిద్ద రామయ్య గారు అత్యాచార ఘటనలు తప్ప మీకే వార్తలు కానరావా ? అంటూ రుస రుస లాడాడు . ఇక మధ్యప్రదేశ్ హోం మంత్రి బాబులాల్ గౌర్ " అత్యాచారాలు జరగ కుండా ఏ ప్రభుత్వం ఆపలేదు .  కాకుంటే జరిగిన తరువాత చర్య తీసుకోగలం అని చెప్పుకున్నారు . ఇక ఉత్తర ప్రదేశ్ గవర్నర్ అజీజ్ ఖురేషి " దేశం లో లైంగిక దాడులను దేవుడు కూడా ఆపలేడంటూ సెలవిచ్చారు . పైగా ప్రపంచం లో ఉన్న సైనికులందరిని యూ పి లో దింపినా వాటిని ఆపడం సాధ్యం కాదని ఆయన మీడియా ఎదుట అభిప్రాయ పడ్డారు . రేప్ లను రాజకీయం చేయడం తగదన్నారు . ఇటివలే ఈ యనే రేప్ ల గురించి విచిత్రంగా స్పందించారు . " బిర్యాని రుచులు ,కబాబ్ ఘుమ ఘుమ లు ... వీటి గురించి చెప్తాను! అంతేగాని గ్యాంగ్ రేప్ లు , హత్యల ప్రస్తావన ఎందుకయ్యా " అంటూ మీడియా తో అన్నారు .


ఒక  రాష్ట్రానికి ముఖ్యమంత్రి (దేశ రాజధాని లో) ఉండి కూడా తన కూతురిని ధిల్లీ లో బయటికి పంపాలంటే భయముగా ఉందని చెప్పిన విషయము మన అందరికి తెలుసు.



ఇంత పెద్ద మనుషులు దేశాన్ని పరిపాలించు చున్న  వారు , ఆదర్శవంతులు మరియు గాంధీ గారి వారసులమని చెప్పుకునే వారు  ఇలా మాట్లాడుతుంటే మనం సామాన్యులం విస్తూ పోవలసిందే .



మన జాతిపిత మహాత్మా  గాంధి గారు కన్న కల అందరికి తెలుసు  నిజ మైన స్వాతంత్ర్యం గురించి " అర్ధ రాత్రి ఒక స్త్రీ ఒంటరిగా నడి బజారులో భయము లేకుండా నడచి  వెళ్లి నప్పుడే మన దేశానికి నిజమైన స్వాతంత్ర్యము వచ్చినట్లు" అని .  మరి ఈ పెద్ద మనుషులకు ఈ సంగతి  తెలియదా?  మన దేశం లో " స్త్రీ "ని దేవత గా  పూజించిన సంస్కృతి  మన పురాణాలలో చదువలేదా?ఒక వేళ చదివినా ఈ విషయం కూడా మరచి పోయారా?

తప్పు  చేసినవాడికి   అసలు ఎలాంటి భయము లేదనిపిస్తుంది. ఒక వేళ భయం ఉంటె ఇన్ని  సంఘటనలు  జరిగేవి కావు.    అత్యాచారం జరిపి  ఆనవాళ్ళు కూడా దొరక కుండ  చేయు చున్నారు  . ఏది ఏమైనా మొత్తం మీద  ఆడవాళ్ళూ తమ  జీవితాన్ని బలి  చేయ వలసి  వస్తున్నది. వాళ్ళు ఆడవారిగా పుట్టడము తప్పా?
బాధితులకు విచారణ లో  అడిగే విపరీత ప్రశ్నల కు  జవాబు చెప్పలేని స్థితి  కూడా ఒక కారణమై ఫిర్యాదు చేయడానికి ముందుకు రాలేక పొవుచున్నారు, అంటే ఇలాంటి సంఘటనలు  ఇంకా ఎక్కువే అన్నమాట .

 ఇలాంటి తప్పు చేసినవాడికి  కఠిన మరియు సరైన శిక్షలు లేవని, నేరాలను నిరోధించడానికి , నేరస్తులను పట్టుకోడానికి  తగినంత   సిబ్బంది లేరని  అందుకే ఇలా జరుగుచున్నవని చాలా మంది అభిప్రాయం  .  ఎన్నో చట్టాలు నేరస్తులను శిక్షించడానికి  ఉన్నాయి కాని వారు   శిక్ష లు పడకుండా తప్పించుకొనుచున్నారు .

ముఖ్యముగా చూస్తుంటే నేడు స్త్రీని ఒక ఆటబొమ్మ గా, కీలు బొమ్మ గా  లేదా డబ్బులు సంపాదించే యంత్రం గా   మలచి కొంత మంది  పురుషులు   ఆడిస్తున్నారు .  చాలా మంది ఇది చూస్తూ కూడా  నోరెత్త లేని పరిస్థితులున్నాయి . స్త్రీ సంఘములు కూడా సరిగా స్పందించడం లేదనే భావన కూడా అందరిలో కలుగు చున్నది. అడ్వర్టైస్ మెంట్ లలో స్రీలకు సంబంధం లేని వాటిలో ఎందుకు ఉపయోగిస్తున్నట్లు ?  స్త్రీ లు ఎవరికీ వారు ఇలాంటి సంఘటనలలో ప్రతి ఘటించాలని , కారం పొడి, పెప్పర్ స్ప్రే  దగ్గర పెట్టుకోవలేనని, స్త్రీ లందరూ కరాటే నేర్చు కొనవలెనని అంటున్నారు  . ఇవి కొంతవరకు నిరోధించుటకు ఉపయోగ పడేవే  . మరి పురుషుడు  చేసే ఇలాంటి నీచ పని చేయకుండ  ఎం చేయాలో కూడా చెప్పాలి కదా! ప్రజా సంఘాలు , సోషల్  మీడియా , మరియు మాస్ మీడియా  ఉవ్వెత్తున  ప్రచారం  చేస్తూ అత్యాచారాలు జరగకుండా ఆపాలి  .

  పురుషుని  లో క్రొవ్వు ఎక్కువై, బలసి , కళ్ళు నెత్తి కెక్కి, ధన మధము ఎక్కువై  కన్నూ- మిన్నూ లెక్క చేయకుండా  పశువు లాగ మారి  అతను ఎదురుగా కనబడిన ఒంటరి  స్త్రీ ల పై  అత్యాచారం చేయుచున్నాడు  . ఇక్కడ పశువుల గురించి కూడా మనం మాట్లాడుకోవాలి, జంతువులకు నోరు లేకున్నా జ్ఞానం ఉంది , అవి ఒక పద్దతిని ఫాలో అవుతాయి, నిబద్ధతతో జీవిస్తాయి ఒక దానికి ఒకటి సహాకరించు కొంటాయి , వాటిని చూసి మనం ఎంతో బుద్ధి తెచ్చుకొనవలసి  ఉంది  .

 సమాజములో  మార్పుతేవడానికి  సినిమాలు మంచిమార్గాలు .  ఒకప్పటి  సినిమాలలో ఆశ్లీలానికి తావు లేకుండా తీసేవారు  హీరో లు  హీరోయిన్  ని  అసలు తాకకుండా , ముట్టుకోకుండా డ్యాన్సులు చేస్తూ పాటలు పాడుతూ జనాలను మెప్పించే వారు .  కుటుంబమంత ఒక చోట కూర్చుని  సినిమా ను  చూసి ఆనందించేవారు . మాటల్లో గాని పాటల్లో గాని  ద్వందార్ధాలు   గాని ఆ రోజుల్లో లేవు . ఆ నటుల నటనే వేరు, ఆ సినిమాలు, పాటలు మరియు మాటలు బంగారం లాంటివి చాల విలువైనవి  ఇప్పటికి చాలా మంది ఆ పాటలు పాడుకొంటారు మాటలు డైలాగులు చెప్పుకొని ఆనందిస్తారు .  ఆ నటులు వేరు , ఆ నాటి పాటల మాటల రచయితలు, దర్శకులు సమాజములో మంచి మార్పు మరియు ప్రేక్షకుల మనోరంజనకు  పాటు పడినారు.

ముఖ్యముగా ప్రస్తుతము వస్తున్న    పిచ్చి పిచ్చి చెత్త సినిమాలు, టివి లో వచ్చే పిచ్చి చెత్త సీరియళ్ళు  , ఇంటర్ నెట్ లోని ఆస్లీల  దృశ్యాలు,నీలి చిత్రాలు  ,  సెల్ ఫోన్ లు వాటిలో మెస్సేజులు పంపుకోవడము - చాటింగులు చేసుకోవడము   అత్యాచారాలకు ఉసి గోల్పుచున్నవి .   నూటికి ఎనభై  శాతం  ఇవే  అత్యాచారం జరగడములో పాలు పంచు కొంటున్నాయి . 

ఒక సారి ఈ క్రింది విషయాలను గమనించితే తెలుస్తుంది . 


 నేటి సినిమాలు డబ్బు సంపాదించడమే  ముఖ్యమైన పని గా  ఎంచుకున్నాయి. ఎవ్వడు ఏమైనా, దేశ ప్రజలు  ఏమైనా ఎటు పోయినా  , యువత పక్క దారులు పట్టినా  ఎం పర్వాలేదు.  ఈ తరం సినిమాలలో  తారలు విచిత్ర డ్రేస్సులలో మార్కెట్ లో బట్టలు కరువైనట్లు అసలు బట్టలు కొనుక్కోవడానికి డబ్బులు లేనట్లు, పిచ్చి పిచ్చి  డ్రెస్సులతో, అర్థ నగ్నంగా శరీరం లో  గుడ్డలతో దాచుకోన బడే  అవయవాలను బహిరంగంగా చూపించి ప్రేక్షకులను మత్తెక్కిస్తు నటిస్తున్నారంటే వారికి కనీసం మానవత్వం ఉందా? అవయవాలను చూపిస్తూ ముద్దులు పెట్టుకుంటూ(" లిప్ - లాక్ " )  ఇతరులకు చూపిస్తుంటే కనీసం సిగ్గు అనిపించదా , కనీస సంస్కారం కూడా లేదా? ఇంకా చెప్పాలంటే కొందరు నటీమణులు పూర్తిగా డ్రెస్ లేకుండా నటించుటలో తప్పు లేదని,  చాన్సు ఇస్తే  నటిస్తానని చెపుతుంటే ఏమనాలి?  పూర్తిగా డ్రెస్ లేకుండా నటించాలను  వారికి తోక ఒకటి తగిలించి కీకారణ్యం లో వదలి పెడితే వారి బతుకు వారు హ్యాపి గా బ్రతుకుతారు.  వీ టి ని తీసే వాళ్ళకు కూడా సంస్కారం  లేదా? అసలు వా ళ్ళ వాళ్ళు నటిస్తే  సినిమాలు ఇలాగే తీస్తారా? 

 సినిమాలు ఎగ్సిబిట్ / రిలీజ్ చేయడానికి పర్మిషన్ ఇచ్చే ప్రభుత్వం సెన్సార్ బోర్డ్ కూడా కళ్ళు మూసుకుందా ? వీటి వలన  ఏం జరిగినా పర్వా లేదనుకుందా ? డబ్బులు వస్తే చాలు అని "ఏ " లేదా  "యు " సర్టిఫికెట్లు ఇవ్వడమేనా? ఫారెన్ లో ఇవన్ని ఉన్నాయి కదా మనకూ  కావాలనా  ?  పోనీ ఫారెన్ వాళ్ళను అనుకరిద్దామా ?   వెస్టరన్ కంట్రీస్ వేరు మన భారత దేశం వేరు , అక్కడి సాంప్రదాయాలు మనకు వర్తిస్తాయా , వాళ్ళ క్లైమేట్ వేరు మనది వేరు ఎక్కడా పొంతన ఉండదు . పోనీ వారిలో ఉన్న మంచిని మనం అనుకరించ వచ్చు . అసలు మన దేశము లో సెన్సార్  బోర్డ్  ఉందా లేదా ? అనే అనుమానం ప్రతి వారికి  కలుగుతుంది .




అసలు మనం  ఎం చేయాలి !

1. అత్యాచారం చేసిన వాడిని బహిరంగం గా ఉరి తీయాలి , హ్యంగ్ చేసే ముందు వాడి కి క్రూరమైన శిక్షలు రోజు ఒకటి విధించాలి . తప్పు చేయడానికి కలలో కూడా ఎవ్వడు ఊహించ నంత శిక్ష అమలు చేయాలి .

2.చెత్త సినిమాలను బ్యాన్ చెయ్యాలి , మళ్ళి అలాంటి సినిమా తియ్యకుండా ప్రొడ్యుసర్  , డైరెక్టర్ , నటి నటులను        శాస్వితముగా బహిష్కరించాలి .

3. టి వి సిరియల్ లలో పిచ్చివాటిని టెలికాస్ట్ చేయకుండా కట్టడి చేయాలి ఒక వేళ చేస్తే ఆ టి వి ఛానల్ ను బ్యాన్       చెయ్యాలి.

4. నీలి చిత్రాలను ఉక్కు పాదం తో అణచి వేయాలి .


5. సెల్ ఫోన్  లలో  పనికి రాని మేస్సేజులు మరియు చాటింగ్ ల పై నిఘా పెట్టి వార్నింగులు ఇవ్వాలి .

6 . ఇంటర్ నెట్ లో ఆశ్లీల సైట్ లు రాకుండా ఫిల్టర్/ జామ్ చేయాలి .
పైన చెప్పిన వాటి నన్నిటి ని సరిగ్గా ఇంప్లిమెంట్ చేయాలి  . ఒక వేళ ఎవరైనా అతిక్రమించితే అలాంటి వారిపై  ఉక్కుపాదం మోపాలి .

ఎంతటి వారినైనా వదలకుండా శిక్షలు వేస్తే అప్పుడు  స్త్రీ లు ప్రశాంతముగా బ్రతకగలరు . మన జాతిపిత మహాత్మా గాంధీ గారి కల నెరవేరుతుంది . మరి మీరేమంటారు .  

                                                                                            -   www.seaflowdiary.blogspot.com













No comments:

Post a Comment