Saturday, July 26, 2014



 TRAIN ACCIDENT - రైలు దుర్ఘటన - అయ్యో ... బిడ్డలు -  తెగిన పేగు బంధం 
                                          रेल दुर्घटना 

 TRAIN ACCIDENT - रेल दुर्घटना 

                                                                     Date:  26-07-2014. 

                                                                     Updated: 13-02-2015. 


మొన్న  అనగా 24-07-2014 నాడు తెలంగాణా రాష్ట్రం   మెదక్ జిల్లా మాసాయిపేట, హైదరాబాద్ కి చాలా దగ్గర లో  కాపలా  లేని రైల్వే క్రాసింగ్ వద్ద  నాందేడ్ నుండి హైదరాబాద్ వస్తున్న పాసింజర్  రైలు  అప్పుడే ట్రాక్ మీదికి వచ్చిన ఒక ప్రైవేటు స్కూల్ బస్సును ధీ  కొని ఒక కిలోమీటర్ వరకు ఈడ్చుక వెళ్ళిన సంఘటన లో బస్సు నుజ్జు నుజ్జుఐ అందులో స్కూల్ కు వెళ్ళుతున్న చిన్న చిన్న విద్యార్థులు 11 సంవత్సరాలు లోబడిన వారు రైల్ తాకిడికి మాంసం ముద్ద లైనారు. సడెన్ బ్రేకులు వేసినా అంత దూరం వరకు ఈడ్చుక వెళ్ళిన దని  రైల్ డ్రైవర్ చెప్పినాడు . ఈ పిల్లలంతా  దగ్గరి దగ్గరి గ్రామాల నుండి తూప్రాన్ లోని స్కూల్ కి చదువు కోవడానికి వెళ్ళు చున్నారు.  బస్సు లోని 38 మంది విద్యార్థులలో 14 మంది చిన్నారులు ,డ్రైవర్ మరియు క్లీనేర్ అక్కడి కక్కడే ప్రాణాలు విడిచారు . 20 చిన్నారులకు తీవ్ర గాయాలు 11 చిన్నారులకు తీవ్ర  ప్రమాదం జరిగి  చావు బ్రతుకుల్లో హాస్పిటల్ లో చేర్చబడి నారు . ఆసుపత్రి కి వెళ్ళే దారిలో ఇంకా ఇద్దరు శ్వాస విడిచారు . ఘటనా స్థలములో విద్యార్థుల మృత దేహాలు వారి పుస్తకములు మరియు టిఫిన్ బాక్సులు చెల్లా చెదురుగా పడిన ద్రుష్య్యాలు  , తల్లి దండ్రుల ఆర్త నాదాలు చూసి ప్రతి ఒక్కరు కంట తడి పెట్టి నారు . 





రైల్వే గేటు వద్ద కాపలా లేకపోవడము మరియు బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల అతను సెల్ ఫోను లో మాట్లాడుతూ బస్ నడపడము వలన ఇంత ఘోరం జరిగి నట్లు తెలసింది  . అందులో రైలు కూడా నాలుగు గంటలు ఆలస్యముగా నడుచు చున్నదట .  ఈ ఘటనకు అన్ని కలసి వచ్చి నట్లున్నాయి . ఈ సంఘటన విని, టివి లలో చూసి  అందరు తీవ్ర దిగ్భ్రాంతి చెందినారు . 




ఈ సంఘటనకు అక్కడి  ప్రజలు  స్పందించ డం , ముఖ్యమంత్రి గారు అతి తొందరగా స్పందించి సహాయ కార్యక్రమములు అందించుట కై మంత్రులను ప్రమాద స్థలమునకు పంపడము జరిగినది . ముఖ్యమంత్రి గారు ఇతర కార్యక్రమాలు రద్దు చేసికొని దీని పైననే ద్రుష్టి పెట్టారు .   అతి తొందరగా ప్రభుత్వం క్షతగాత్రులను గాంధి యశోదా మరి దగ్గరిలోని హాస్పిటల్ లో చేర్పించి నాణ్య మైన వైద్యం చేయించడము జరుగుచున్నది . రాష్ట్ర ప్రభుత్వం 5 లక్షలు మరియు కేంద్ర ప్రభుత్వం 2 లక్షలు ప్రక్క రాష్ట్రం నిన్న 1 లక్ష రూపాయలను ఎక్ష్ గ్రేషియా గా  ప్రకటించడం జరిగినది .  
  
దీనికంతటికి మీరు కారణం  అని రైల్వే వారిని, రైల్వే వారు మాది తప్పు కాదని బస్సు డ్రైవర్ దే తప్పని ఇంకా తప్పంతా  స్కూల్ యాజమాన్యానిదేనని వారు సరైన డ్రైవర్ ని పెట్టలేదని ఒకర్నొకరు నిందించు కొనడము , రైల్వే వారిని ఇక్కడ గేటు పెట్టమని ఇక్కడి ప్రజలు ఎన్నో సంవత్సరాల నుండి గేటు పెట్టి కాపలా  పెట్టమని ప్రాదేయపడి తే  చివరకు గేటు పని ప్రారంభించి ఎన్నో రోజులైనా ఇంకా పూర్తి కాక పోవడం వలన ఇంత ఘోరం జరిగినదని ఇక్కడి ప్రజలు అనుకోవడం  జరుగు చున్నది. 


ఇలా నిందిన్చుకొనడం వల్ల చని పోయిన చిన్నారుల ప్రాణాలు తిరిగి వస్తాయా? కన్న తల్లుల పగిలిన గుండెల మంట ఎవరు తీర్చగలరు? 



ఇ దొక్కటే సంఘటనే కాదు ఇంతవరకు మన దేశము లో ఎన్నో ప్రమాదములు జరిగినవి . 





     

 రైల్వే ప్రమాదాలు , రైళ్ళు పట్టాలు తప్పడం వల్ల జరిగే ప్రమాదాలు , రైళ్ళు మానవ తప్పిదం వల్ల ఒకే ట్రాక్ పై ప్రయాణించి జరిగే ఘోర ప్రమాదములను, మానవ తప్పిదం వలన సిగ్నల్స్ సరిగా పడకపోవడం వల్ల/ లేదా రైల్ డ్రైవర్ అజాగ్రత్త వల్ల  జరిగే భయంకర ప్రమాదాలను, రైల్వే ట్రాక్ సరిగా లేనప్పుడు లేదా ఫిష్ ప్లేట్ లు తొలగినప్పుడు, ట్రాక్ నీళ్ళలో మునిగి పోయి నప్పుడు ఇలా కాపలా లేని గేటు ల వద్ద జరిగే ప్రమాదాల వలన    జరిగిన నష్టం తో పోల్చినప్పుడు  అతి తక్కువ ఖర్చు తో   ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా లేదా జరగ కుండ నివారించడానికి ఖచ్చిత మైన ప్రణాళికలు  ఉన్నవి . 


ఒక సారి ఈ క్రింది విషయాలను తీవ్రంగా మరియు నశితంగా ఆలోచించి తే  ప్రతి ఒక్కరికి అర్థం అవుతుంది . 


ఒక పాసింజర్ రైల్ అంటే ప్రయాణికులతో వెళ్ళే రైల్ అని అర్థం , అది పాసెంజర్ కాని ఎక్సప్రేస్ రైల్ గాని ప్రయాణము లో అనుకోకుండా ఖర్మ కాలి గాని ప్రమాదం జరిగినది అనుకోండి, అలాంటప్పుడు కొన్ని భోగీ లు పట్టాలు తప్పి చెల్లా  చెదురుగా పడి పొతాయి. దాని వలన భోగి షేప్ మారి ప్రయాణికులు క్షతగాత్రులు అవుతారు , కొందరు ప్రాణాలు కోల్పోతారు   , భోగి లు మళ్ళి పనికి రాకుండా జరుగవచ్చు. ట్రాక్ చిన్నా భిన్నం అవుతుంది , ఒక వేళ సింగిల్ ట్రాక్ అయితే ఆ రూట్ లో మిగతా  రైళ్ళు ఆగి పొతాయి లేదా డైవర్షన్ రూట్ లో వెళ్ళ వలసి వస్తుంది కదా. ఒక వేళ  రెండు రైళ్ళు ఎదురెదురు గా డీ కొంటె లేదా ఆగి ఉన్న రైల్ ను వేరొక రైల్ వెనుక నుండి  డీ కొన్నప్పుడు  ప్రాణ నష్టం , ఆస్తి నష్టం ఎక్కువ జరుగు తుంది, ఆ బలమైన తాకిడికి ఇంజన్లు కూడా నుజ్జు నుజ్జు ఐ పనికి రాకుండా పొగలవు. 


ప్రయాణికుల ప్రాణాన్ని ఎలాగు తేలేము  వారి   ప్రాణ నష్ట మే కాకుండా వారి వద్ద నున్న విలువైన వస్తువులు , వారి ఆస్తులు పొతాయి. ప్రయాణికుల ప్రాణాలకు విలువ కట్టలేము , వారి వస్తువుల విలువ కోట్ల లో ఉండొచ్చు , ఇక రైల్వే భోగిల విలువ, ఇంజన్ల విలువ , ట్రాక్ రిపేరు ఖర్చు , ఆ లైను లో వెళ్ళ వలసిన రైళ్ళు ఆగి పోవడం వలన జరిగే నష్టం లేదా దైవర్సన్ రూట్ లో వెళ్ళడము వలన అధిక ఖర్చు మరియు సమయము వృధా కావడము , దాని విలువ మరియు  ఖర్చు కొన్ని కొట్లలో జరుగుతుంది . తిరిగి ట్రాక్ రిపేరు , ఇంజను లను , భోగీలను సమకోర్చుకొనడములలో  ఎన్ని  కోట్ల రూపాయ లను వృధా ఖర్చు చెయాలి. ఇలా ఒక్క ప్రమాదాని కి  లెక్కలు వేస్తె వృధాగా వందల కోట్ల రూపాయలను నష్ట పోవలసి వస్తున్నది లేదా ఖర్చు చేయాలి . 

ఊదా :-
ఒక రైల్ దుర్ఘటన వలన కలుగు నష్టం సుమారు : 


            =  మనుషుల ప్రాణాలు (లెక్క కట్ట లేనిది )+ప్రయాణీకుల సామాగ్రి (15 కోట్లు )+ ప్రయాణీకుల వద్ద నున్న డబ్బు(10 కోట్లు ) +     వాళ్ళ వద్ద నున్న జేవలరి ( 25 కోట్లు )+ రైలు ఇంజను ( 10 కోట్లు )+ భోగీలు (15 కోట్లు) ట్రాక్ (5 కోట్లు) + డైవర్షన్ వల్ల ఖర్చు (10 కోట్లు) + డైవర్షన్ వలన రెగ్యులర్ ట్రాఫిక్ కు నష్టం ( 5 కోట్లు) + ...... ఇతర నష్టం = సుమారు 100 కోట్లు (ఆవేరేజ్ ) 


ఒక  సంవత్సరానికి రైలు ప్రమాదాలు కనీసం  నాల్గు లేదా  ఐదు జరిగాయనుకోండి అప్పుడు లెక్క కడితే మొత్తం సంవత్సర  నష్టం:


  =   100 X 5 =   500 కోట్ల రూపాయలు 

ఇ దంతా  చెప్పేది ఎమిటంటే 500 కోట్ల రూపాయల ను మనం ప్రతి సంవత్సరము నష్ట పోవు చున్నము. ఈ నష్టం మరియు ప్రాణాలు పోకుండా మనం ఎం చేయాలి? ఎలా కాపాడాలి? 

పట్టాలు తప్పిన ఎర్నాకులం ఎక్స్‌ప్రెస్

Updated : 2/13/2015 12:13:29 PM
Views : 1204
- 10 మంది మృతి... వందమందికి పైగా గాయాలు...

Bangalore-Ernakulam Express train accident

బెంగళూరు : కర్ణాటకలోని హోసూరు వద్ద రైలు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 10 మంది మృతి చెందినట్లు తెలుస్తోంది. దాదాపు 100 మందికి పైగా గాయపడ్డారు. వీరిలో చాలా మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

బెంగళూరు నుంచి ఎర్నాకుళం వెళ్తున్న ఇంటర్ సిటీ ఎక్స్‌ప్రెస్ తమిళనాడు సరిహద్దులోని అనేకల్ సమీపంలో ఇవాళ ఉదయం ఏడున్నర గంటల సమయంలో పట్టాలు తప్పింది. ఇంజిన్ నుంచి బోగీలు వేరయి ఒక దానికొకటి గుద్దుకొని పట్టాలు తప్పాయి. బోగీలు నుజ్జునుజ్జవడంతో ప్రయాణికులు అందులో ఇరుక్కుని చాలాసేపు నరకయాతన అనుభవించారు. మొత్తం 9 బోగీలు పట్టాలు తప్పగా ఇందులో డి-8 బోగీ పూర్తిగా దెబ్బతినింది. రైలు ఇంజిన్‌లో మంటలు రావడంతో ఇంజిన్ వెనక ఉన్న బోగీలో తొక్కిసలాట జరిగినట్లు ప్రత్యక్ష సాక్షలు తెలిపారు.

ప్రమాదం జరిగిన సమాచారం తెలుసుకున్న రైల్వే అధికారులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఎన్డీఆర్‌ఎఫ్ బలగాను సైతం సహాయక చర్యల్లో దింపారు. ఆంబులెన్స్‌లలో క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించి అత్యవసర చికిత్స అందిస్తున్నారు. పరిస్థితి విషమంగా ఉన్నవారిని మెరుగైన వైద్యం కోసం బెంగుళూరుకు తరలించినట్లు అధికారులు చెప్పారు. క్షతగాత్రుల్లో 20 మందికి పైగా కండీషన్ సీరియస్‌గా ఉన్నట్లు తెలుస్తోంది.   


     మన దేశము లో జనాభా చాలా ఎక్కువ , పని పాటా లేనివారు కూడా ఎక్కువే మరియు  నిరుద్యోగుల సంఖ్య కూడా ఎక్కువే . ప్రభుత్వ ఉద్యోగాలు పోను  , ప్రయివేటు లో  ఉద్యోగాలు మరియు స్వంత వ్యాపారాలు చేసుకున్న వారి తరువాత కూడా ఇంకా చాల మంది చదువు కున్న వారు నిరుద్యోగులుగా మిగిలి పోవు చున్నారు . మరి వీరి సంగతి ఏమిటి?   అందులో ఎస్ ఎస్ సి వరకు  చదివిన చాల మంది విద్యార్థులు  పై చదువులకు వెళ్ళ డానికి ఆర్ధిక మరియు కుటుంబ పరిస్థితులు అనుకూలించక చదువును మధ్యలోనే ఆపి వేయుచున్నారు . ఇంటర్, డిగ్రీ చదువు కున్న వారికి కూడా ఉద్యోగాలు లేవు . వారు మానసికంగా క్రుంగి పోవు చున్నారు, వారు  బ్రతక  డానికి ఏవో దొరికిన చిన్న చిన్న పనులు చేసికొని కుటుంబాన్ని నెట్టు కుంటు  జీవించు చున్నారు . ప్రభుత్వం కూడా అందరికి ఉద్యోగాలు కలిపించ లేక పోవు చున్నది . ఇలాంటి వారికి  చేయూత నిచ్చి ఆదుకొనవలసిన కనీస కర్తవ్యం పాలకుల పై ఉందన డములో సందేహము లేదు .కావున ప్రభుత్వం ఒక సారి సుధిర్గం గా ఈ క్రింది విషయాన్ని ఆలోచించి  రైల్వే లోనే కాక ఇతర శాఖ లలో కూడా  ఆచరణలో పెట్ట గలదని  ఆశించు చున్నాను, మీరందరూ కూడా ఒక సారి ఆలోచిస్తే చాలా బాగుంటుంది . 

    నిరుద్యోగులకు  వారి వారి అర్హతలను బట్టి రైల్వే శాఖ లో ఉద్యోగాలనిచ్చి గాని కన్సాలిడేటెడ్ గా కాని అపాయింట్ మెంట్ ఇచ్చి  కాపలా లేని రైల్వే క్రాసింగుల వద్ద నియమించడం , రైల్వే ట్రాక్ మెయింటే నెన్స్ లో  ప్రతి 3 - 4 కిలో మీటర్లకు ఒకరిని నియమించి  ట్రాక్ కు పటిష్ట మైన భద్రతను కలించవచ్చు. లోకో సిబ్బంది లో డ్రైవర్ మరియు అసిస్టెంట్ డ్రైవర్ కాక ఇంకొక స్టాఫ్ ను పోస్ట్ చేసితే మబ్బులు కమ్మినప్పుడు కూడా సిగ్నల్ ని ఖచ్చితంగా ఫాలో/గమనించి   ఎలాంటి పోరపాటు జరగకుండా నివారించ వచ్చు. ట్రాక్ ను కూడా నిశితంగా పరిశీలించ వచ్చు . భోగి లలో ఇన్స్పెక్షన్ చేయ వచ్చు, ప్రయాణీకుల ఇబ్బందులను తొలగించ వచ్చు. ఇక గూడ్స్ గార్డ్ సంగతి అందరికి తెలుసు, రైలు ఒక కిలో మీటర్ పొడవు  ఉంటుంది గార్డ్ ఎక్కడో ఒంటరిగా చివరన ఉంటాడు . రాత్రి అయితే రైల్ ఆగినప్పుడు గార్డ్ ఎక్కడో అడవిలో బిక్కు బిక్కు మంటూ డ్రైవర్ కు కిలో మీటర్ దూరము లో ఉంటూ విసిల్ వేస్తె  వినిపించ కుండ ,టార్చ్ లైటు కూడా డ్రైవర్ గమనించక పోయే పరిస్థితులలో రైల్ ఆలస్యం అయ్యే పరిస్థితి  కూడా జరుగ వచ్చు. కావున ఆ గార్డ్ వద్ద కూడా ఒక అడిషనల్ గా  ఒకరిని పోస్ట్ చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది .   

ఇక్కడే మన టర్నింగ్ పాయింట్ . 500 కోట్ల రూపాయల నష్టం కలుగకుండా ఈ నిరుద్యోగులకు  లక్ష ల సంఖ్యలో ప్రభుత్వం  ఉపాది కల్పించి వీరి సేవలను వినియోగించు కోన వలయును . . దీని కంతటికీ కేవలం పై నష్టం లో  సగం  ఖర్చు మాత్రమె అయి ఇంకా మనకే 250 కోట్ల రూపాయలు  మిగులుతాయి. 

మనకు ఖర్చు మిగులుతుంది లక్షల   మందికి ఉపాధి కల్పించబడుతుంది . ప్రయాణికులు హాయిగా ప్రాణ భయం దొంగల లేకుండా తమ తమ గమ్య స్థానాలకు పిల్లా పాపలతో క్షేమము గా చేరుకుంటారు .  
మరి మీరేమంటారు . 

                                                                                                                yours,
                                                           www.seaflowdiary.blogspot.com 






                                                                                          
  

No comments:

Post a Comment