USES OF DAILY MORNING DRINKING GINGER JUICE ....
రోజు పరగడుపునే అల్లం రసం త్రాగితే ....
Date : 11-02-2018
నిత్యం మనం అనేక వంటకాల్లో అల్లంను వేసుకుంటూ ఉంటాం. దీంతో వంటకాలకు చక్కని రుచి వస్తుంది. ముఖ్యంగా అల్లం లేకపోతే నాన్‌వెజ్ కూరలు ఏవీ పూర్తికావు. అయితే అల్లంతో కేవలం రుచి మాత్రమే కాకుండా మనకు అనేక ఆరోగ్యకర ప్రయోజనాలు కూడా కలుగుతాయి. దాంతో పలు అనారోగ్య సమస్యలను నయం చేసుకోవచ్చు. పురాతన కాలం నుంచి అల్లంను పలు ఆయుర్వేద ఔషధాల్లోనూ వాడుతున్నారు. ఈ క్రమంలో నిత్యం ఉదయాన్నే పరగడుపున కొంత అల్లం రసం తాగితే దాంతో ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
1. యాంటీ డయాబెటిక్ గుణాలు అల్లం రసంలో పుష్కలంగా ఉన్నాయి. నిత్యం అల్లం రసం తాగుతూ ఉంటే రక్తంలోని చక్కెర స్థాయిలు అదుపులోకి వస్తాయి. షుగర్ వ్యాధి నియంత్రణలో ఉంటుంది.
2. ఫినాల్స్, ఫ్లేవనాయిడ్స్ అనే రసాయనాలను న్యూరో ప్రొటెక్టర్స్ అంటారు. ఇవి మెదడుకు ఉత్తేజాన్ని కలిగిస్తాయి. అల్లం రసంలో ఈ రసాయనాలు సమృద్ధిగా ఉన్నాయి. దీంతో అల్లం రసాన్ని నిత్యం తాగితే మెదడు చురుగ్గా పనిచేస్తుంది. వయస్సు మళ్లిన వారిలో వచ్చే అల్జీమర్స్, మెంటల్ డిజార్డర్స్ తగ్గిపోతాయి.
3. పలు రకాల క్యాన్సర్లకు వ్యతిరేకంగా పోరాడే గుణాలు అల్లం రసంలో ఉన్నాయి. నిత్యం అల్లం రసం తాగే వారికి క్యాన్సర్ వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి.
4. జీర్ణ సంబంధ వ్యాధులకు అల్లం చక్కని పరిష్కారం చూపుతుంది. అల్లం రసంతో వికారం, హార్ట్ బర్న్, అసిడిటీ, గ్యాస్, అలసట, డయేరియా, అజీర్ణం, ఇన్‌ఫెక్షన్లు, దగ్గు వంటి వ్యాధులను తగ్గించుకోవచ్చు.
5. శరీరంలో ఉన్న చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించుకునేందుకు అల్లం రసం ఉపయోగపడుతుంది. నిత్యం అల్లం రసం తాగితే నొప్పులు తగ్గిపోతాయి. ప్రధానంగా కీళ్ల నొప్పులు, వాపులు తగ్గుతాయి. యాంటీ ఇన్‌ఫ్లామేటరీ గుణాలు దీంట్లో ఉన్నాయి.
-- seaflowdairy
No comments:
Post a Comment