Sunday, February 25, 2018



                         Tamarind Seeds    -----   చింత గింజల పొడి 
                                                                         Date : 25-02-2018





చింత‌పండును తీసేట‌ప్పుడు వాటి నుంచి చింత గింజ‌లు రావ‌డం స‌హ‌జ‌మే. అయితే ఎవ‌రైనా అలా వ‌చ్చే చింత గింజ‌ల‌ను పారేస్తారు. కానీ నిజానికి ఇప్పుడు మేం చెప్ప‌బోయేది తెలిస్తే మాత్రం ఇక‌పై మీరు చింత గింజ‌ల‌ను ఇంకోసారి అస్స‌లు పారేయ‌రు. అవును, మీరు విన్న‌ది నిజ‌మే. ఎందుకంటే వాటిలో ఎన్నో ఆరోగ్య‌క‌ర ప్ర‌యోజ‌నాలు దాగి ఉన్నాయి. మ‌రి అవేమిటో ఇప్పుడు తెలుసుకుందామా..! 

కొన్ని చింత గింజ‌ల‌ను సేక‌రించి వాటిని బాగా వేయించాలి. అనంత‌రం 2 రోజుల పాటు వాటిని నీటిలో నాన‌బెట్టాలి. రోజుకు రెండు సార్లు నీటిని మార్చాలి. 2 రోజుల త‌రువాత చింత గింజ‌ల‌ను తీసి వాటి పొట్టును వేరు చేయాలి. అనంత‌రం వ‌చ్చే విత్త‌నాల‌ను చిన్న చిన్న ముక్క‌లుగా చేసి నీడ‌లో ఎండ‌బెట్టాలి. అలా ఎండిన ముక్క‌ల‌ను తీసుకుని మిక్సీలో వేసి పొడిగా ప‌ట్టాలి. ఆ పొడిని జార్‌లో నిల్వ చేసుకోవాలి. దీన్ని అర టీస్పూన్ మోతాదులో తీసుకుని రోజుకు రెండు సార్లు నీటితో లేదా పాల‌తో నెయ్యి లేదా చ‌క్కెర‌ను క‌లిపి తీసుకోవాలి.




పైన చెప్పిన విధంగా చేయ‌డం వ‌ల్ల మోకాళ్ల నొప్పుల నుంచి వెంట‌నే ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది. అంతేకాదు 3-4 వారాల్లో స‌మ‌స్య పూర్తిగా తగ్గుముఖం ప‌డుతుంది. ఎందుకంటే చింత గింజ‌ల్లో ఉండే ప‌లు ఔష‌ధ పదార్థాలు ఎముక‌ల‌కు బ‌లాన్నిస్తాయి. అదేవిధంగా కీళ్ల‌లో అరిగిపోయిన గుజ్జును మ‌ళ్లీ ఉత్పత్తి చేస్తాయి. దీంతో కీళ్ల నొప్పుల నుంచి శాశ్వ‌తంగా విముక్తి ల‌భిస్తుంది. 

అయితే పైన చెప్పిన మిశ్ర‌మం కేవ‌లం కీళ్ల నొప్పులే కాదు డ‌యేరియా, చ‌ర్మంపై దుర‌ద‌లు, దంత సంబంధ స‌మ‌స్య‌లు, అజీర్ణం, రోగ నిరోధ‌క శ‌క్తి త‌క్కువ‌గా ఉండ‌డం, ద‌గ్గు, గొంతు ఇన్‌ఫెక్ష‌న్లు, డ‌యాబెటిస్‌, గుండె సంబంధ వ్యాధులకు చ‌క్క‌ని ఔష‌ధంగా కూడా ఉప‌యోగ‌ప‌డుతుంది. అదేవిధంగా ఎముక‌లు విరిగితే ఆ ప్ర‌దేశంపై రోజూ చింత‌గింజ‌ల పొడిని పేస్ట్‌లా చేసి అప్లై చేస్తే దాంతో ఎముక‌లు త్వ‌ర‌గా అతుక్కుంటాయి.

                                                                                                           - seaflowdiary 

No comments:

Post a Comment