Health is wealth - 14 *** ఆరోగ్యమే మహాభాగ్యం - 14
Date : 17-12-2017
Orange juice * ఆరెంజ్ జ్యూస్
ఆరెంజ్ పండ్లు మనకు చలికాలంలో ఎక్కువగా లభిస్తాయి. ఈ కాలంలో వీటిని తింటే మనకు ఎన్నో ఆరోగ్యకర ప్రయోజనాలు కలుగుతాయి. ఆరెంజ్ పండ్లలో ఉండే విటమిన్ సితోపాటు ఎన్నో కీలకమైన పోషకాలు మనకు లభిస్తాయి. వీటి వల్ల ఈ కాలంలో మనకు వచ్చే సీజనల్ వ్యాధుల నుంచి రక్షణ లభిస్తుంది. అయితే నిత్యం ఒక గ్లాస్ మోతాదులో ఆరెంజ్ జ్యూస్‌ను తాగితే ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
1. ఆరెంజ్ జ్యూస్‌ను రోజూ తాగితే హార్ట్ ఎటాక్‌లు రాకుండా ఉంటాయి. రక్త నాళాల్లో రక్తం గడ్డ కట్టకుండా ఉంటుంది. దీంతో హార్ట్ స్ట్రోక్స్ రావు. గుండె ఆరోగ్యం పదిలంగా ఉంటుంది.
2. హైబీపీ తగ్గుతుంది. ఆరెంజ్ జ్యూస్‌లో పుష్కలంగా ఉండే మెగ్నిషియం హైబీపీని తగ్గిస్తుంది. బీపీని నార్మల్ రేంజ్‌కు తీసుకొస్తుంది.
3. గాయాలు, పుండ్లు త్వరగా మానిపోతాయి. ఆరెంజ్ జ్యూస్‌లో ఉండే యాంటీ ఇన్‌ఫ్లామేటరీ గుణాలు కీళ్ల నొప్పులు, వాపులు, కండరాల నొప్పులను తగ్గిస్తాయి.
4. శరీర రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. బాక్టీరియా, వైరస్ ఇన్‌ఫెక్షన్ల నుంచి రక్షణ లభిస్తుంది. దగ్గు, జలుబు, జ్వరం వంటి సమస్యల నుంచి బయట పడవచ్చు.
5. జీర్ణ సమస్యలైన గ్యాస్, అసిడిటీ, మలద్దకం, అజీర్ణం ఉండవు. అల్సర్లు తగ్గుతాయి.
6. ఆరెంజ్ జ్యూస్‌ను రోజూ తాగితే కిడ్నీ స్టోన్లు కరిగిపోతాయి. మూత్రాశయ సమస్యలు ఉండవు.
7. మౌత్, కోలన్, బ్రెస్ట్, లంగ్ క్యానర్లు రాకుండా ఉంటాయి. క్యాన్సర్ కణాలను నాశనం చేసే గుణాలు ఆరెంజ్ జ్యూస్‌లో ఉంటాయి.
8. చర్మం కాంతివంతంగా, మృదువుగా మారుతుంది.
9. రోజూ ఆరెంజ్ జ్యూస్ తాగితే అధిక బరువు తగ్గుతుంది. రక్తహీనత సమస్య నుంచి బయట పడవచ్చు. రక్త సరఫరా మెరుగు పడుతుంది.
- seaflowdiary
No comments:
Post a Comment