Is Farm loan waivers a bad idea.
Date : 07-04-2017
రైతుకు రుణ మాఫీ ఐడియా బ్యాడ్ అంటారు మన RBI గవర్నర్ గారు . ఆయన తినే ఆహారం ఎక్కడి నుండి వస్తుందో ఆయనకు తెలియదు అనుకోవాలి . డెబిట్ కార్డు లేదా క్రెడిట్ కార్డు ATM లో పెట్టగానే లేదా హోటల్ లో సర్వర్ కు ఆర్డర్ ఇవ్వగానే అన్నం వచ్చి పడుతుందని అనుకుంటూ ఉండొచ్చు . ఆయనకు రైతు అంటే తెలుసా ? రైతు సామాన్యుడు, ఆయనకు డిగ్రీలు ఉండవు , నిరక్షరాశ్యులు కూడా , అందుకే రైతు వేసుకున్న బట్టలు చూసి ఆయన ఆకారం చూసి వారికి రుణ మాఫీ గురించి ఇలా అనుకుంటూ ఉండవచ్చు.
ఇలాంటివారు వేసుకున్న డ్రెస్ కూడా రైతే ప్రత్తి పండించి అందిస్తున్నాడని ,ఆయన తినే పళ్ళు( fruits ) కూడా రైతే పండిస్తున్నాడని తెలుసుకోవాలి . అదే ఇండస్ట్రియలిస్ట్ గను గాని కోటీశ్వరుడిని గాని వారిని చూసి సులభం గా గుర్తు పట్టగలడరేమో ! వారికి అందుకే ఇలాంటి వారు కోట్లకొలది అప్పులిస్తారు , వారు సకాలం లో చెల్లించకున్నా ఎగగొట్టినా వీరికి ఎలాంటి బాధ కలుగదు .
అదే రైతు రాత్రి పగలు కుటుంబం అంతాకలిసి భూమిని ఎద్దులతో నాగలి పట్టి దున్ని వర్షాకాలం లో తడుస్తూ ,చలికాలం లో వణుకుతూ ఎండాకాలం లో వడ దెబ్బ ను భరిస్తూ కరువు కాట కాలం ను ఎదుర్కొంటు వాతావరణం ను తట్టు కుంటూ మనం తినే ఆహారాన్ని పండించి మనకు తిండి పెడితే ఆయనకు ఎంత సహాయం చేసినా చేతులెత్తి మ్రొక్కినా తక్కువే .
రైతు పంటలు పండించుటకు పెట్టిన పెట్టుబడి రాకుంటే తాను చేసిన అప్పులు తీర్చలేక అప్పు ఇచ్చినవారు బాధ పెడుతుంటే తట్టుకోలేక మాటకు కట్టుబడి ఆత్మాహుతి చేసుకుంటున్నారు . వీరి బాధలను కొంతవరకు తీర్చిడానికి మన ముఖ్యమంత్రులు ఋణ మాఫీ చేస్తుంటే ఇలాంటి వారికి మంచి అనిపించడం లేదేమో !
"రైతే రాజు" అని మనం అన్నాం . మన భారత ముద్దు బిడ్డ , స్వాతంత్ర్యయోధుడు ప్రియతమ ప్రధాన మంత్రి శ్రీ. లాల్ బహదూర్ శాస్త్రి గారు " జై జవాన్ - జై కిసాన్ " అని జవానుకు రైతుకు ఎనలేని విలువ నిచ్చారు . ప్రతి సోమవారం ఒక పూట భోజనం మానుకుంటే కొంత ఆహారం మిగులుతుంది , ఆరోగ్యం బాగుంటుందని ఆచరించి చూపారు . కొంత కాలం మన దేశ ప్రజలంతా ఆచరించారు కూడా .
ప్రభుత్వం రైతులకు మాఫీ చేస్తున్న డబ్బంతా RBI నుండి వస్తుంది కదా అని ! ఈ డబ్బంతా ఆయనదే అనుకుంటూ ఉండవచ్చు .
రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర లభించి లాభం వస్తుంటే ఎందుకు రుణ మాఫీ అడుగుతాడు ? తనవారిని వదలి పెట్టి ఎందుకు ఆత్మాహుతి చేసుకుంటాడు ? ఆ విషయం ఇలాంటి వారికి తెలియదా ? వారి జీతం మాత్రం పెంచుకోవడం, నెల జీతం 90 వేలనుండి 2.5 లక్షలకు పెంచుకొని సంతోషించగానే సరిపోదు ,దేశం లో ఎంతమంది జీతం సరిపోక ఎన్ని బాధ పడుతున్నారో కూడా తెలుసు కొని కొన్ని పన్నులు తగ్గించు కోవచ్చుకదా !
ఇలాంటి వారిని ఇతియోపియా దేశం కు పంపిస్తే అక్కడి ప్రజలు తిండి లేక ఎలా మల మల మాడి చస్తున్నారో చూసి తెలుసుకోగలరు .
Starving a boy , lake of food in Ethiyopia
దేశాన్ని కాపాడేది జవాన్ , మనను బ్రతికించేది కిసాన్ . " జై జవాన్ - జై కిసాన్ "
-seaflowdiary
No comments:
Post a Comment