Health is wealth - 8 ఆరోగ్యమే మహాభాగ్యం - -8
Date : 11-04-2017
Updated : 17-04-2017, 20-04-2017,28-04-2017
పెరుగు - CURD
ముఖ్యంగా వేసవిలో చల్లని పెరుగును అన్నంలో కలుపుకుని తింటే వచ్చే మజాయే వేరు. అయితే కేవలం అన్నంలో మాత్రమే కాకుండా పెరుగును ఇంకా మన ఇంట్లో ఉండే ఇతర పదార్థాలతో కలుపుకుని తింటే ఇంకా ఎన్నో ఆరోగ్యకర ప్రయోజనాలు కలుగుతాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
1. పెరుగులో తేనె కలిపి తీసుకుంటే కడుపులో ఉన్న అల్సర్లు మటుమాయమైపోతాయి. ఈ మిశ్రమం యాంటీ బయోటిక్‌గా పనిచేస్తుంది. దీని వల్ల శరీరంలో ఉన్న ఇన్‌ఫెక్షన్లు వెంటనే తగ్గుతాయి.
2. కొద్దిగా జీలకర్రను తీసుకుని పొడి చేసి దాన్ని ఓ కప్పు పెరుగులో కలుపుకుని తింటే త్వరగా బరువు తగ్గుతారు.
3. కొద్దిగా నల్ల ఉప్పును తీసుకుని బాగా పొడి చేయాలి. దాన్ని ఓ కప్పు పెరుగులో కలుపుకుని తాగాలి. దీంతో జీర్ణ సంబంధ సమస్యలు దూరమవుతాయి. ప్రధానంగా గ్యాస్, అసిడిటీ వంటివి తగ్గుతాయి.
4. కొద్దిగా పెరుగులో చక్కెర కలుపుకుని తినాలి. దీంతో శరీరానికి వెంటనే శక్తి అందుతుంది. మూత్రాశయ సంబంధ సమస్యలు కూడా పోతాయి.
5. పెరుగులో కొంత పసుపు, కొంత అల్లం కలిపి తినడం వల్ల ఫోలిక్ యాసిడ్ శరరీంలోకి చేరుతుంది. ఇది చిన్నపిల్లలకు, గర్భిణీ మహిళలకు ఎంతగానో మేలు చేస్తుంది.
6. కొంచెం వాము తీసుకుని ఓ కప్పు పెరుగులో కలిపి తినాలి. దీని వల్ల నోటి పూత, దంతాల నొప్పి, ఇతర దంత సంబంధ సమస్యలు పోతాయి.
7. ఓ కప్పు పెరుగులో కొంచెం నల్ల మిరియాల పొడిని కలిపి తినడం వల్ల మలబద్దకం దూరమవుతుంది. తిన్న ఆహారం సరిగ్గా జీర్ణమవుతుంది.
8. పెరుగులో వివిధ రకాల పండ్లను కలిపి తింటే పలు రకాల ఇన్‌ఫెక్షన్లు, వ్యాధులు రాకుండా చూసుకోవచ్చు. శరీర రోగ నిరోధక వ్యవస్థ పటిష్టమవుతుంది.
9. పెరుగులో కొన్ని ఓట్స్ కలిపి తినాలి. ఇలా చేయడం వల్ల మంచి ప్రోబయోటిక్స్, ప్రోటీన్లు లభిస్తాయి. ఇవి కండరాల పుష్టికి దోహదం చేస్తాయి.
10. పెరుగులో ఆరెంజ్ జ్యూస్ కలిపి తీసుకుంటే శరీరానికి తగినంత విటమిన్ సి లభిస్తుంది. ఇది కీళ్ల నొప్పులను తగ్గిస్తుంది. వృద్ధాప్య ఛాయలను దూరం చేస్తుంది.
నిత్యం వివిధ సందర్భాల్లో ఎదుర్కొనే ఒత్తిడి, ఆందోళన, మానసిక సమస్యలు, అనారోగ్యాలు... తదితర అనేక కారణాల వల్ల చాలా మందికి రోజూ నిద్ర సరిగ్గా పట్టదు. దీంతో వారు రోజూ యాక్టివ్‌గా ఉండలేరు. పనిచేయలేరు. దీనివల్ల డిప్రెషన్ బారిన పడే అవకాశం ఉంటుంది కూడా. అయితే కింద ఇచ్చిన పలు ఎఫెక్టివ్ టిప్స్ పాటిస్తే నిద్ర సరిగ్గా పడుతుంది. పడుకున్న వెంటనే నిద్రపోవచ్చు. ఆ టిప్స్ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
1. రోజూ రాత్రి కొన్ని చెర్రీ పండ్లను తింటే చాలు. నిద్ర చక్కగా పడుతుంది. చెర్రీ పండ్లను తిన్నా, జ్యూస్ తాగినా వాటిలో ఉండే మెలటోనిన్ మనకు నిద్ర వచ్చేలా చేస్తుంది.
2. ప్రతి రోజూ రాత్రి గోరు వెచ్చని పాలను తాగినా నిద్ర బాగా పడుతుంది. ఇది ఎంతో కాలం నుంచి పెద్దలు మనకు చెబుతూ వస్తున్నదే. పాలలో న్యూరో ట్రాన్స్‌మీటర్స్ ఉంటాయి. ఇవి చక్కని నిద్ర వచ్చేలా చేస్తాయి. మనస్సుకు ప్రశాంతతను ఇస్తాయి.
3. రాత్రి పూట భోజనంలో పెరుగు లేదా మజ్జిగను తీసుకున్నా దాంతో నిద్ర బాగా పడుతుంది. వాటిలో ట్రిప్టోఫాన్ ఉంటుంది. అది నిద్ర వచ్చేందుకు దోహదపడుతుంది.
4. అరటి పండ్లను రాత్రి పూట ఆహారంలో భాగంగా చేసుకోవాలి. దీంతో నిద్ర బాగా పడుతుంది. అంతేకాదు, ఒత్తిడి, ఆందోళన వంటివి తగ్గుతాయి. రక్త సరఫరా మెరువుతుంది. మైండ్ రిలాక్స్ అవుతుంది.
5. చేపల్లో విటమిన్ బి6 పుష్కలంగా ఉంటుంది. ఇది మనకు నిద్ర బాగా వచ్చేలా చేస్తుంది. వారంలో కనీసం 3 సార్లు రాత్రి భోజనంలో చేపలను తింటూ ఉంటే తద్వారా నిద్ర సమస్యలు పోతాయి.
6. బాదం పప్పులో మెగ్నిషియం పుష్కలంగా ఉంటుంది. ఇది కండరాలు, మనస్సుకు రిలాక్సేషన్ ఇస్తుంది. దీంతో చక్కని నిద్ర వస్తుంది.
7. రోజూ రాత్రి గ్రీన్ టీ తాగినా హాయిగా నిద్రపోవచ్చు. గ్రీన్ టీ తాగితే మైండ్ రిలాక్స్ అవుతుంది. ఒత్తిడి, ఆందోళన వంటివి తగ్గుతాయి. దీంతోపాటు చక్కని నిద్ర వస్తుంది.
రోజు ఉదయాన్నే పరగడుపున బొప్పాయి విత్తులు తింటే !
బొప్పాయి పండ్లతో మనకు ఎలాంటి ఆరోగ్యకర ప్రయోజనాలు కలుగుతాయో అందరికీ తెలిసిందే. మన శరీరానికి కావల్సిన పోషకాలు బొప్పాయి పండ్లలో ఉంటాయి. జీర్ణ వ్యవస్థకు, దంత సమస్యలకు, రక్త సరఫరాకు బొప్పాయి పండు ఎంతగానో ఉపయోగపడుతుంది. అయితే మీకు తెలుసా..? కేవలం బొప్పాయి పండు మాత్రమే కాదు, అందులో ఉండే విత్తనాలు కూడా మనకు ప్రయోజనకరమే. నిత్యం ఉదయాన్నే పరగడుపున బొప్పాయి విత్తనాలను తింటే దాంతో మనకు అనేక ఆరోగ్యకర ప్రయోజనాలు ఉంటాయి. ఆ లాభాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
1. రోజూ ఉదయాన్నే పరగడుపున బొప్పాయి విత్తనాలను తింటే దాంతో శరీరంలో ఉండే విష పదార్థాలు బయటికి వెళ్లిపోతాయి. శరీరం అంతర్గతంగా శుభ్రంగా తయారవుతుంది. పలు అవయవాల్లో ఉండే వ్యర్థాలు తొలగింపబడతాయి.
2. జీర్ణాశయంలో ఉండే క్రిములు నాశనమవుతాయి. దీని వల్ల ఇన్‌ఫెక్షన్లు రాకుండా ఉంటాయి. ప్రధానంగా కడుపులో ఉండే పలు రకాల పురుగులు నశిస్తాయి.
3. బొప్పాయి విత్తనాల్లో ఉండే ఔషధ గుణాలు శరీర బరువును తగ్గిస్తాయి. శరీర మెటబాలిజం రేటును పెంచడం వల్ల బరువు త్వరగా తగ్గుతారు.
4. కండరాలు దృఢంగా మారుతాయి. నిత్యం మన తినే ప్రోటీన్లు సక్రమంగా వినియోగమవుతాయి. అందువల్ల కండరాల సమస్యలు పోవడమే కాదు, కండరాలు చక్కగా నిర్మాణమవుతాయి.
5. నిత్యం పని ఒత్తిడి కారణంగా కలిగే అలసట తగ్గుతుంది. దీంతో రోజంతా యాక్టివ్‌గా పనిచేయవచ్చు. ఉత్సాహంగా ఉంటారు.
6. బొప్పాయి విత్తనాల్లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీర రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. దీంతో పలు రకాల ఇన్‌ఫెక్షన్లు నయమవుతాయి. ప్రధానంగా జ్వరం, జలుబు, దగ్గు వంటివి రావు.
7. బొప్పాయి విత్తనాలు పురుషుల్లో వీర్య నాణ్యతను పెంచుతాయి. శృంగార సామర్థ్యాన్ని రెట్టింపు చేస్తాయి.
బొప్పాయి విత్తనాలను సాధారణంగా ఎవరైనా పడేస్తారు. కానీ వాటిని నిర్భయంగా తినవచ్చు. ఎవరైనా వాటిని రోజుకు 2 టేబుల్ స్పూన్ల మోతాదులో తీసుకోవచ్చు. అయితే విత్తనాలను డైరెక్ట్‌గా తినలేమని అనుకునే వారు, వాటిని పొడి చేసుకుని దాన్ని మజ్జిగ, లేదా ఏదైనా సలాడ్‌లో కలుపుకుని తినవచ్చు. ఇలా తిన్నా పైన చెప్పిన విధంగా లాభాలు కలుగుతాయి.
బొప్పాయి విత్తనాలను సాధారణంగా ఎవరైనా పడేస్తారు. కానీ వాటిని నిర్భయంగా తినవచ్చు. ఎవరైనా వాటిని రోజుకు 2 టేబుల్ స్పూన్ల మోతాదులో తీసుకోవచ్చు. అయితే విత్తనాలను డైరెక్ట్‌గా తినలేమని అనుకునే వారు, వాటిని పొడి చేసుకుని దాన్ని మజ్జిగ, లేదా ఏదైనా సలాడ్‌లో కలుపుకుని తినవచ్చు. ఇలా తిన్నా పైన చెప్పిన విధంగా లాభాలు కలుగుతాయి.
- seaflowdiary
No comments:
Post a Comment