దంతాల నొప్పి వస్తే - remedy for Teeth pain
Date :19-02-2017
దంతాల నొప్పి వస్తే ఏదీ తినలేం, తాగలేం. ఆ సమయంలో కేవలం దంతాలను కదిలించినా చాలు, విపరీతమైన నొప్పి కలుగుతుంది. అయితే దానికి చింతించాల్సిన పనిలేదు. ఇంట్లోనే ఉండే సహజ సిద్ధమైన పదార్థాలతోనే దంతాల నొప్పి సమస్యను ఇట్టే తగ్గించుకోవచ్చు. అందుకు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ఉల్లిపాయలు...
ఉల్లిపాయలను మనం వంటల్లో రుచి కోసం నిత్యం ఉపయోగిస్తుంటాం. అయితే దీంతో దంతాల నొప్పిని కూడా సులభంగా తగ్గించుకోవచ్చు. అందుకు ఏం చేయాలంటే, ఒక ఉల్లిగడ్డను తీసుకుని అడ్డంగా చక్రాల్లా కోయాలి. అందులో నుంచి ఒక చక్రాన్ని తీసి నొప్పి పుడుతున్న దంతం మీద కొంచెం సేపు ఉంచాలి. దీంతో ఉల్లిలోని ఔషధ గుణాలు దంతాల నొప్పిని తగ్గిస్తాయి.
లవంగ నూనె...
రెండు, మూడు చుక్కల లవంగ నూనె, 1/4 టీస్పూన్ ఆలివ్ ఆయిల్ ను కలిపి మిశ్రమంగా చేయాలి. అందులో కాటన్ బాల్స్ ముంచి వాటిని నొప్పి పుట్టే దంతాలపై రాయాలి. ఇలా చేయడం వల్ల దంతాల నొప్పి తగ్గుతుంది. ఇతర సమస్యలు కూడా పోతాయి.
కీర దోస...
పైన చెప్పిన ఉల్లిపాయల్లాగే కీరదోస ముక్కలను కూడా అడ్డంగా కోసి వాటిని దంతాలపై ఉంచాలి. దీంతో వాటి నొప్పి తగ్గుతుంది.
టీ బ్యాగ్...
వేడి వేడిగా ఉన్న ఓ టీ బ్యాగ్‌ను నొప్పి పుడుతున్న దంతాలపై ఉంచాలి. అందులో ఉండే పలు రసాయనాలు దంతాల నొప్పిని తగ్గిస్తాయి. చిగుళ్లను హాయి పరుస్తాయి.
అల్లం ముక్క...
అల్లం కొమ్మును తీసుకుని బాగా కడిగి దాన్ని చిన్న ముక్కలుగా కట్ చేయాలి. ఆ ముక్కలను నొప్పి ఉన్న దంతాలతో నమలాలి. అలా చేయడం వల్ల అల్లంలో ఉండే ఔషధ గుణాలు దంతాల నొప్పిని తగ్గిస్తాయి.
- seaflowdiary
No comments:
Post a Comment