Health is wealth 11 - ఆరోగ్యమే మహాభాగ్యం 11
Dated : 25-07-2017
updated: 27-07-2017
ఉదయాన్నే కరివేపాకు ఆకులను తింటే !
కరివేపాకును మనం కూరల్లో ఎక్కువగా వేస్తుంటాం. దీంతో కూరలకు మంచి రుచి, వాసన వస్తాయి. అయితే కూరల్లో లేదా ఇతర ఏ ఆహార పదార్థాల్లో ఉన్న కరివేపాకును అయినా చాలా మంది తినరు. పక్కన పెట్టేస్తారు. కానీ ఇప్పుడు చెప్పబోయే లాభాలు చదివితే కరివేపాకును వదిలి పెట్టకుండా తింటారు. ఈ క్రమంలోనే రోజూ ఉదయాన్నే పరగడుపున 10 కరివేపాకు ఆకులను తింటే ఏం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.
1. నిత్యం ఉదయాన్నే కరివేపాకు ఆకులను తింటే మధుమేహం కొద్ది రోజుల్లో పూర్తిగా అదుపులోకి వస్తుంది. టైప్ 1, 2 ఎలాంటి డయాబెటిస్ అయినా తగ్గేందుకు అవకాశం ఉంటుంది. మధుమేహ వ్యాధి గ్రస్తుల రక్తంలోని గ్లూకోజ్ స్థాయిలు తగ్గుతాయి.
2. రక్తహీనత సమస్య ఉన్నవారికి కరివేపాకులు చక్కని మెడిసిన్ అని చెప్పవచ్చు. నిత్యం వీటిని తింటుంటే రక్తం బాగా పెరుగుతుంది. హిమోగ్లోబిన్ స్థాయిలు వృద్ధి అవుతాయి. రక్త సరఫరా కూడా మెరుగు పడుతుంది.
3. నాన్‌వెజ్ ఎక్కువగా తినడం, మద్యం సేవించే వారిలో సహజంగా లివర్ వ్యాధులు వస్తాయి. అయితే నిత్యం కరివేపాకు ఆకులను తింటుంటే లివర్ శుభ్రమవుతుంది. లివర్‌లో ఉండే విష పదార్థాలు బయటికి వెళ్లిపోతాయి.
4. రక్తంలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ పోతుంది. మంచి కొలెస్ట్రాల్ వృద్ధి చెందుతుంది.
5. జీర్ణ సమస్యలు పోతాయి. తిన్న ఆహారం సరిగ్గా జీర్ణమవుతుంది. గ్యాస్, అసిడిటీ, మలబద్దకం ఉండవు.
6. డయేరియా సమస్య తొలగిపోతుంది. నీళ్ల విరేచనాలు ఆగుతాయి.
7. కీమోథెరపీ చేయించుకున్నాక క్యాన్సర్ పేషెంట్లకు కలిగే సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు.
8. దగ్గు, జలుబు, జ్వరం రావు. చర్మంపై ఉండే ఇన్‌ఫెక్షన్లు తగ్గుతాయి.
9. వెంట్రుకలు చక్కగా పెరుగుతాయి. నల్లగా మారుతాయి. చుండ్రు పోతుంది.
10. నేత్ర సమస్యలు పోతాయి. దృష్టి బాగా పెరుగుతుంది. శరీర రోగ నిరోధక శక్తి పెరిగి ఇన్‌ఫెక్షన్లు రాకుండా ఉంటాయి.
11. గాయాలు, పుండ్లు అయిన వారు కరివేపాకును రెగ్యులర్‌గా తింటే అవి త్వరగా తగ్గుముఖం పడతాయి.
Gas problem (Remedy) - గ్యాస్ సమస్య నివారణ
జీర్ణకోశంలో ఉండే మ్యూకస్ పొరలు వాపునకు గురైనప్పుడు, పలు రకాల ఆహార పదార్థాలను తినడం వల్ల, ఒత్తిడి, ఆందోళనకు ఎక్కువగా లోనవడం వల్ల, దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు, మద్యం సేవించడం వంటి అనేక కారణాల వల్ల చాలా మందికి గ్యాస్, అసిడిటీ సమస్యలు వస్తుంటాయి. అయితే ఇలా వచ్చే గ్యాస్ సమస్యను పలు సింపుల్ టిప్స్ పాటించడం వల్ల సులభంగా తగ్గించుకోవచ్చు. ఆ టిప్స్ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
1. ఒక గ్లాస్ నీటిలో ఒక టీస్పూన్ బేకింగ్ సోడా, అర టీస్పూన్ నిమ్మరసం వేసి బాగా కలిపి ఆ మిశ్రమాన్ని తాగితే గ్యాస్ సమస్య ఉండదు.
2. పుదీనా, చామంతి, రాస్ప్‌బెర్రీ రుచులలో ఉండే టీని తాగినా గ్యాస్ సమస్య బాధించదు.
3. పసుపు ఆకులను ఎండబెట్టి పొడి చేసి ఆ పొడిని ఒక టీస్పూన్ మోతాదులో తీసుకుని ఒక గ్లాస్ పాలలో కలుపుకుని తాగాలి. దీంతో గ్యాస్ సమస్య ఇట్టే పోతుంది.
4. రోజూ ఉదయాన్నే పరగడుపున 6 నుంచి 8 గ్లాసుల నీటిని తాగినా గ్యాస్ సమస్య నుంచి బయట పడవచ్చు.
5. గ్యాస్ సమస్యకు అల్లం చాలా మెరుగ్గా పనిచేస్తుంది. భోజనానికి ముందు చిన్న అల్లం ముక్కను నమిలి మింగాలి. లేదంటే 1 టీస్పూన్ అల్లం రసం తాగినా చాలు. సమస్య నుంచి ఉపశమనం కలుగుతుంది.
6. ఆలుగడ్డలను ముక్కలుగా కోసి మిక్సీలో వేసి జ్యూస్ చేయాలి. దీన్ని రోజూ భోజనానికి ముందు తాగితే గ్యాస్ సమస్య రాదు.
7. భోజనానికి ముందు రెండు, మూడు వెల్లుల్లి రెబ్బలను నమిలి మింగాలి. లేదంటే వాటి రసం తాగినా చాలు సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది.
8. దాల్చినచెక్కను ఒక గ్లాస్ నీటిలో వేసి బాగా మరిగించి ఆ నీటిని తాగాలి. భోజనానికి ముందు ఈ నీటిని తాగితే గ్యాస్ రాదు.
9. భోజనం చేశాక 2, 3 యాలకుల్ని అలాగే నమిలి తిన్నా గ్యాస్ రాదు.
10. రోజూ ఏదో ఒక సమయంలో కొబ్బరినీళ్లను తాగుతుంటే గ్యాస్ రాకుండా ఉంటుంది.
11. ఒక గ్లాస్ వేడి నీటిలో 3 టీస్పూన్ల యాపిల్ సైడర్ వెనిగర్‌ను వేసుకుని తాగాలి. దీంతో గ్యాస్ సమస్య పోతుంది.
12. రోజూ మజ్జిగలో నల్ల ఉప్పు (బ్లాక్ సాల్ట్) కలుపుకుని తాగినా గ్యాస్ సమస్య బాధించదు.
13. కొద్దిగా కొత్తిమీర తీసుకుని దాన్నుంచి రసం తీసి ఆ రసం తాగాలి. దీంతో గ్యాస్ సమస్య పోతుంది. కొత్తిమీరను నేరుగా తిన్నా సరే ఈ సమస్య రాదు.
14. రోజూ రాత్రి పడుకునే ముందు ఒక గ్లాస్ గోరు వెచ్చని పాలలో నల్ల మిరియాల పొడి వేసుకుని కలిపి తాగుతుంటే ఫలితం ఉంటుంది.
15. ఒక గ్లాస్ వేడి నీటిలో ఒక టీస్పూన్ ఇంగువను వేసి కలిపి తాగితే గ్యాస్ బారి నుంచి బయట పడవచ్చు.
16. భోజనం చేశాక సోంపు, లవంగాలు, వాము నమిలి మింగాలి. దీని వల్ల కూడా గ్యాస్ సమస్యను అధిగమించవచ్చు.
17. రోజూ వేడి నీటిని తాగడం అలవాటు చేసుకుంటే గ్యాస్ సమస్య రాదు. తిన్న ఆహారం జీర్ణం సరిగ్గా అవుతుంది.
పాలలో చిటికెడు పసుపు కలుపుకుని తాగితే ఏమవుతుందో తెలుసా..?
పసుపును మనం రోజూ వంటల్లో ఉపయోగిస్తాం. దీంతో వంటలకు చక్కని రంగు, రుచి, వాసన వస్తాయి. ఇక పాలు. పాలతో మనకు సంపూర్ణ పౌష్టికాహారం అందుతుంది. చాలా మంది రోజూ పాలను తాగుతారు. అయితే నిత్యం రాత్రి నిద్రించడానికి ముందు ఒక గ్లాస్ గోరు వెచ్చని పాలలో చిటికెడు పసుపు కలుపుకుని తాగితే ఏమవుతుందో తెలుసా..? అదే ఇప్పుడు తెలుసుకుందాం.
1. గోరువెచ్చని పాలలో పసుపు కలుపుకుని తాగితే దాంతో శరీర రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. యాంటీ బాక్టీరియల్, యాంటీ వైరల్ గుణాలు ఈ మిశ్రమంలో ఉండడం వల్ల రోగాల నుంచి రక్షణ లభిస్తుంది. జ్వరం, జలుబు, దగ్గు తగ్గుతాయి. ఇన్‌ఫెక్షన్లు రావు. శ్వాసకోశ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఆస్తమా ఉన్నవారికి చాలా మంచి చేస్తుంది.
2. కఫం తొలగిపోతుంది. దగ్గు, జలుబు త్వరగా తగ్గుతాయి.
3. నిద్రలేమి సమస్యతో బాధపడేవారికి ఇది మంచి ఔషధం అని చెప్పవచ్చు. దీంతో రోజూ చక్కగా నిద్రపోవచ్చు.
4. మహిళలకు రుతు సమయంలో వచ్చే కడుపునొప్పి, అధిక రక్తస్రావం సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.
5. హార్మోన్ల సమస్యలు తొలగిపోతాయి. జీవక్రియలు మెరుగవుతాయి.
6. తిన్న ఆహారం సరిగ్గా జీర్ణమవుతుంది. గ్యాస్, అసిడిటీ ఉండవు. జీర్ణాశయం, పేగుల్లో ఉండే క్రిములు నశిస్తాయి.
రోజు గుప్పెడు బాదాం తింటే .
బాదం పప్పులో ఎన్ని రకాల పోషకాలు ఉంటాయో అందరికీ తెలిసిందే. వీటిల్లో పాలీఅన్‌శాచురేటెడ్, మోనో అన్‌శాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్లు, విటమిన్ బి6, బి12, మెగ్నిషియం, పొటాషియం వంటి కీలక పోషకాలు ఉంటాయి. ఈ క్రమంలో రోజూ గుప్పెడు నానబెట్టిన బాదం పప్పును రోజూ తింటే దాంతో శరీరానికి చక్కని పోషణ అందడమే కాదు, పలు అనారోగ్య సమస్యలను కూడా దూరం చేసుకోవచ్చు. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
1. రోజూ గుప్పెడు నానబెట్టిన బాదం పప్పును పొట్టు తీసుకుని తింటే దాంతో శరీరంలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ పోతుంది. మంచి కొలెస్ట్రాల్ వృద్ధి చెందుతుంది. తద్వారా గుండె సమస్యలు రాకుండా ఉంటాయి. అధిక బరువు తగ్గుతారు.
2. బాదం పప్పులో విటమిన్ ఇ ఎక్కువగా ఉండడం వల్ల రోజూ వాటిని తింటే శిరోజాలు దృఢంగా, ఒత్తుగా పెరుగుతాయి. వెంట్రుకలు రాలడం తగ్గుతుంది. చుండ్రు పోతుంది. వెంట్రుకలు ప్రకాశవంతంగా మారుతాయి.
3. బాదంపప్పులో యాంటీ ఆక్సిడెంట్లు కూడా పుష్కలంగా ఉంటాయి. దీని వల్ల శరీర రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఇన్‌ఫెక్షన్లు దరి చేరవు. క్యాన్సర్ వంటి వ్యాధులు రాకుండా ఉంటాయి.
4. చర్మానికి కాంతిని అందించే యాంటీ ఏజింగ్ గుణాలు బాదం పప్పులో ఉంటాయి. నిత్యం వీటిని తింటే చర్మంపై ఏర్పడే ముడతలు పోయి యవ్వనంగా తయారవుతారు.
5. జీర్ణాశయం, పేగుల్లో ఉండే చెడు బాక్టీరియా పోతుంది. మంచి బాక్టీరియా వృద్ధి చెందుతుంది.
6. బాదంపప్పులో ఉండే విటమిన్ ఇ మెదడుకు కూడా బాగా ఉపయోగపడుతుంది. ఎదిగే పిల్లలకు చాలా మంచిది. జ్ఞాపకశక్తి పెరుగుతుంది.
- seaflowdiary