పొట్ట దగ్గరి క్రొవ్వు తగ్గాలంటే !
Date : 24-09-2017
స్థూలకాయంతో ఉన్న వారినే కాదు, అలా లేని వారిని కూడా అధిక పొట్ట ఇబ్బందులకు గురి చేస్తోంది. చాలా మందికి శరీరం అంతా బాగానే ఉంటుంది, కానీ పొట్ట మాత్రం ఎక్కువగా ఉంటుంది. అందుకు కారణం అక్కడ పేరుకుపోయే కొవ్వే. అయితే కింద సూచించిన ఆహారాన్ని తీసుకుంటే ఎవరైనా తమ పొట్ట దగ్గర ఉన్న కొవ్వును ఇట్టే తగ్గించుకోవచ్చు. ఆ ఆహారం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
1. ఉదయం లేవగానే ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో నిమ్మకాయను పూర్తిగా పిండి తాగాలి. నిమ్మకాయలో కొవ్వును కరిగించే గుణాలున్నాయి. అవసరమైతే తేనె కలుపు కోవచ్చు.
2. మన శరీరానికి మేలు చేసే ప్రయోజనాలు అల్లంలో ఉన్నాయి. ఉదయాన్నే గోరు వెచ్చని నీటిలో అల్లం రసం కలుపుకొని తాగినా ఫలితం ఉంటుంది.
3. అధికంగా పేరుకు పోయిన కొవ్వును కరిగించే యాంటీ ఒబెసిటీ గుణాలు వెల్లుల్లిలో ఉన్నాయి. ఉదయాన్నే మూడు, నాలుగు వెల్లుల్లి రేకుల్ని తింటే పొట్టవద్ద కొవ్వు కరిగిపోతుంది.
4. పుదీనా ఆకుల రసం ఉదయాన్నే తాగినా కొవ్వు తగ్గుతుంది. ఇలా చేయటం వల్ల మెటబాలిజం పెరిగి క్యాలరీలను తగ్గించటంలో ఉపయోగపడుతుంది.
5. ఉదయం, సాయంత్రం భోజనానికి అరగంట ముందు అలోవెరా జ్యూస్ ను 30 ఎంఎల్ మోతాదులో తీసుకొని ఒక గ్లాస్ నీటిలో కలుపుకొని తాగేయాలి. మలబద్దకం పోవటంతోపాటు బరువు తగ్గుతారు.
6. భోజనానికి ముందు పుచ్చకాయ ముక్కల్ని తినాలి. దీంతో కడుపు నిండిన ఫీలింగ్ తో అన్నం తక్కువగా తింటాము. బీన్స్ ను నిత్యం తీసుకొంటే జీర్ణక్రియను మెరుగు పరుస్తాయి. బరువు తగ్గుతారు.
7. కీరదోసకాయ జ్యూస్ ఒక గ్లాస్ భోజనానికి అరగంట ముందు ఉదయం, సాయంత్రం తీసుకొంటే ఎక్కువగా ఆహారం తినాలనిపించదు. కొవ్వు కరుగుతుంది.
8. రోజూ ఉదయాన్నే పరగడుపున 1 లేదా 2 టమాటాలను తినాలి. దీంతో పొట్ట దగ్గర కొవ్వు కరుగుతుంది. టమాటాల్లో ఉండే 9 ఆక్సో ఓడిఏ అనే పదార్థం రక్తంలోని కొవ్వును తగ్గిస్తుంది.
-- seaflowdiary
No comments:
Post a Comment