Monday, July 25, 2016


రెట్టింపు కానున్న ఎంపీల జీతాలు! - Double the MP's salary
                                                                                                    Date: 25-07-2016


 ఎంపీల జీతాలు త్వ‌ర‌లోనే రెట్టింపు కానున్నాయి. ఎంపీల క‌మిటీ సిఫార‌సుల‌ను ప్ర‌ధాని మోదీ ఆమోదిస్తే.. ఈ సెష‌న్‌లోనే పార్ల‌మెంట్ కూడా ప్ర‌తిపాద‌న‌ల‌కు ప‌చ్చ‌జెండా ఊప‌డం ఖాయంగా క‌నిపిస్తోంది. అదే జ‌రిగితే ప్ర‌స్తుతం 50 వేలుగా ఉన్న ఎంపీల బేసిక్ పే.. ల‌క్ష‌కు చేర‌నుంది. అలాగే అల‌వెన్సులు కూడా రెట్టింప‌వుతాయి. పెరిగిన జీతాలు ఈ ఏడాది ఏప్రిల్ ఒక‌టి నుంచి అమ‌ల‌వుతాయి. నియోజ‌క‌వ‌ర్గ అల‌వెన్సు 90 వేలకు చేరుతుండ‌గా, ఎంపీల అధికార నివాసాలకు ఇచ్చే ఫ‌ర్నిచ‌ర్ అల‌వెన్స్ ఏడాదికి ల‌క్షా 50 వేల‌కు చేరనుంది. ఇక నెల‌కు 1700 విలువైన బ్రాడ్‌బ్యాండ్ క‌నెక్ష‌న్ కూడా ఉచితంగా అందించ‌నున్నారు. మాజీ ఎంపీల‌కు ఇచ్చే పెన్ష‌న్ 20 వేల నుంచి 35 వేల‌కు పెర‌గ‌నుంది. 

బేసిక్ పే, అల‌వెన్సుల్లో పెరుగుద‌ల‌తో ప్ర‌స్తుతం నెల‌కు ఉన్న ల‌క్షా 90 వేల మొత్తం రెండు ల‌క్ష‌ల 80 వేల‌కు చేరుతుంది. ఆరేళ్ల కింద‌ట చివ‌రిసారి ఎంపీల జీతాలు పెరిగాయి. ఈ మ‌ధ్యే కేంద్ర ప్ర‌భుత్వ ఉద్యోగుల జీతాలు భారీగా పెర‌గ‌డంతో త‌మ జీతాలు కూడా పెంచాల‌ని కొంద‌రు ఎంపీలు ప‌బ్లిగ్గానే డిమాండ్ చేశారు. అయితే కొంద‌రు తృణ‌మూలు, సీపీఎం పార్టీల ఎంపీలు మాత్రం జీతాలు పెంచాల్సిన అవ‌స‌రం లేద‌ని అంటున్నారు. ఇప్పుడున్న జీతాలే చాలా ఎక్కువ‌ని అభిప్రాయ‌ప‌డుతున్నారు.

ఎంపీల జీతాలు త్వ‌ర‌లోనే రెట్టింపు కానున్నాయి.అదే జ‌రిగితే ప్ర‌స్తుతం 50 వేలుగా ఉన్న ఎంపీల బేసిక్ పే.. ల‌క్ష‌కు చేర‌నుంది. అలాగే అల‌వెన్సులు కూడా రెట్టింప‌వుతాయి.నియోజ‌క‌వ‌ర్గ అల‌వెన్సు 90 వేలకు చేరుతుండ‌గా, ఎంపీల అధికార నివాసాలకు ఇచ్చే ఫ‌ర్నిచ‌ర్ అల‌వెన్స్ ఏడాదికి ల‌క్షా 50 వేల‌కు చేరనుంది. ఇక నెల‌కు 1700 విలువైన బ్రాడ్‌బ్యాండ్ క‌నెక్ష‌న్ కూడా ఉచితంగా అందించ‌నున్నారు. మాజీ ఎంపీల‌కు ఇచ్చే పెన్ష‌న్ 20 వేల నుంచి 35 వేల‌కు పెర‌గ‌నుంది. 
బేసిక్ పే, అల‌వెన్సుల్లో పెరుగుద‌ల‌తో ప్ర‌స్తుతం నెల‌కు ఉన్న ల‌క్షా 90 వేల మొత్తం రెండు ల‌క్ష‌ల 80 వేల‌కు చేరుతుంది. ఆరేళ్ల కింద‌ట చివ‌రిసారి ఎంపీల జీతాలు పెరిగాయి. ఈ మ‌ధ్యే కేంద్ర ప్ర‌భుత్వ ఉద్యోగుల జీతాలు భారీగా పెర‌గ‌డంతో త‌మ జీతాలు కూడా పెంచాల‌ని కొంద‌రు ఎంపీలు ప‌బ్లిగ్గానే డిమాండ్ చేశారు.
కేంద్ర ప్ర‌భుత్వ ఉద్యోగుల జీతాలు భారీగా పెరిగాయి కాబట్టి త‌మ జీతాలు కూడా పెంచాల‌ని కొంద‌రు ఎంపీలు ప‌బ్లిగ్గానే డిమాండ్ చేశారు కాబట్టి ఎంపీల జీతాలు త్వ‌ర‌లోనే రెట్టింపు కానున్నాయి అదే పద్దతిలో  కేంద్ర ప్ర‌భుత్వ ఉద్యోగుల జీతాలు కూడా రెట్టింపు అవుతాయని మనం ఆశించవచ్చు ! ఎందుకంటే  కేంద్ర ప్ర‌భుత్వ ఉద్యోగుల జీతాలు భారీగా పెరిగాయని MP లు చెబుతున్నారు కాబట్టి వాళ్ళ జీతాలు రెట్టింపు అయినప్పుడు  కేంద్ర ప్ర‌భుత్వ ఉద్యోగుల జీతాలు కూడా రెట్టింపు కావాలి అని ఉద్యోగులు కోరుకుంటారు  . 
 కేంద్ర ప్ర‌భుత్వ ఉద్యోగుల జీతాలు జీతాలు పది సంవత్సరములకు ఒకసారి పే కమీషన్ నియమించి వారి రికమెండేషన్ ప్రకారం పూర్తిగా కూడా పెంచరు, సెవెంత్ పే కమిషన్ అలాగే జరుగుతున్నది , దానికి ఉద్యోగ సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి కూడా ! కానీ ప్రజా ప్రతినిధులకు ఆరు సంవత్సరములకే పెంచాలని  ఎంపీల క‌మిటీ సిఫార‌సుల‌ అనుగుణం గా అడుగుతున్నారు.  వాళ్ళ అలవెన్సులు రెట్టింపు అవుతాయి ,నియోజ‌క‌వ‌ర్గ అల‌వెన్సు 90 వేలకు చేరుతుండ‌గా,ఎంపీల అధికార నివాసాలకు ఇచ్చే ఫ‌ర్నిచ‌ర్ అల‌వెన్స్ ఏడాదికి ల‌క్షా 50 వేల‌కు చేరనుంది. ఇక నెల‌కు 1700 విలువైన బ్రాడ్‌బ్యాండ్ క‌నెక్ష‌న్ కూడా ఉచితంగా అందించ‌నున్నారు. 
వారు దేశానికి సేవ చేస్తారు, నియోజక వర్గ ప్రజలకు అందుబాటులో ఉండి వారి బాధలను తీరుస్తారు  కాబట్టి వాళ్ళ జీతం పెంచుతున్నారు అంటే ఎవరికి అభ్యంతరం ఉండదు . 

కానీ వారి లో చాలామంది  పార్లమెంటుకు వెళ్ళరు ,  పార్లమెంటుకు వెళితే డైలీ అలవెన్స్ కూడా ప్రభుత్వం ఇస్తుంది. 
ఈ అలవెన్స్ వారికి ఒక లెక్కా ! పార్లమెంటుకు వెళ్లినా అక్కడ మాట్లాడే వారు చాలా తక్కువ . ఎలెక్షన్ లప్పుడు ఇంటింటికి వెళతారు , పనులు చేసి పెడతారు , పిల్లలను ఎత్తుకుంటారు , బట్టలు కూడా ఇస్త్రీ చేసి పెడతారు చాలా సంతోషం . ప్రజలు మాకు చాలా సహాయం చేస్తాడు , చాలా మంచివాడు మనందరినీ పేరు పేరు నా గుర్తు పడతాడు  అని ఓటు వేసి గెలిపిస్తారు . 
వీరిలో చాలా మంది  గెలిచిన తరువాత ఊరికి అసలు రానేరారు  ఎవరైనా ధైర్యం చేసి మా ఊరికి రమ్మంటే టైం లేదు ,పార్లమెంటు సమావేశాలు ఉన్నవి తరువాత పార్లమెంటు స్టాన్డింగ్ కమిటీ మెంబర్ ని దేశమంతా తిరగాలి లేదా విదేశాలకు వెళ్ళి స్టడీ చేసి రావాలి కావున మీ ఊరికి రావడానికి వీలు దొరకడం లేదంటారు . కానీ వీరిలో చాలామంది
ఉదయం తమ రాష్ట్ర రాజధానిలో  లో ఉంటారు మధ్యాహ్నం ఢిల్లీలో కన్పిస్తారు మళ్ళీ రాత్రి తమ రాష్ట్ర రాజధానిలో కన్పిస్తారు ఎందుకంటే వారికి విమానయానం ఫ్రీ కనుక  ఎన్నిసార్లయినా ఢిల్లీ వెళ్ళగలరు . 

వీరు ప్రజాప్రతినిధులు వీరికి జీతం అవసరమా ? ఉద్యోగులు అంటే వారికి జీతం లేనిదే జీవితం గడవదు., కుటుంబం అంతా అతనిపై ఆధారపడుతారు , మండుతున్ననిత్యావసర  ధరల వలన ఉద్యోగుల జీతాలు పెంచడం తప్పనిసరి.  

 తృణ‌మూలు, సీపీఎం పార్టీల ఎంపీలు మాత్రం జీతాలు పెంచాల్సిన అవ‌స‌రం లేద‌ని అంటున్నారు. ఇప్పుడున్న జీతాలే చాలా ఎక్కువ‌ని అభిప్రాయ‌ప‌డుతున్నారు.వీరు చెప్పిందే అక్షరాలా నిజం.
                                                                                                              yours,
                                                                                 www.seaflowdiary.blogspot.com 



  రోడ్ ప్రమాదాలు - Road accidents 
                                                                                                          Date 25-07-2016


ఈ మధ్యన వాహనాల ప్రమాదాలు ఎక్కువ అయ్యాయి . కార్లు , బస్సులు అవి సరియైన పద్దతిలో వెళుతున్నా ఎదురుగా వచ్చే వాహనాలు సరియైన పద్దతి లో రాకపోవడం , వీటిని నడిపించే డ్రైవర్ అప్రమత్తంగా లేనిచో ఆక్సిడెంట్లు జరుగుతాయి . నిన్న బస్సు టిప్పర్ ఢీకొన్నాయి రోజుకు ఒకటి చొప్పున ఎక్కడో ఒకచోట దేశం లో ప్రమాదం జరుగుతుంది దీనితో నిండు జీవితాలు గాలిలో కలుస్తున్నాయి . ఎవరి తప్పు అయినా ఇద్దరికీ ప్రాణ నష్టమో లేదా అవయవాల కు దెబ్బలు తగిలి జీవితాంతం వికలాంగులుగా బ్రతకవలసి వస్తుంది . వీరిపై ఆధారపడిన కుటుంబ సభ్యుల పరిస్థితి అతలా కుతలం అవుతున్నది . 
ఈ పరిస్థితిని చక్కదిద్దలేమా ! చక్కదిద్దవచ్చు . స్పీడ్ ను తగ్గించాలి , ఒకగంటముందే లేక ఒకరోజు ముందే బయలుదేరాలి, మధ్య మధ్యన విశ్రాంతి తీసుకోవాలి . రోడ్ ఎలా ఉందో వాహనం నడిపే వారికి అవగాహన ఉండాలి . రోడ్ సిగ్నల్స్ ను ఫాలో అవ్వాలి అంతేగాని ఇష్టం వచ్చినట్లు నడుపరాదు . 
ట్రాన్స్ పోర్ట్ వారు కేవలం లైసెన్స్ ,రిజిస్ట్రేషన్ పేపర్లు మరియు ఇన్సూరెన్స్ పేపర్లు చూడడం తో సరిపెట్టకుండా డ్రైవర్ పరిస్థితి ఎలావుంది , వాహనం సరైన స్థితి లో ఉందా ? బ్రేకులు సరిగ్గా ఉన్నావా ? డ్రైవర్ నిద్రావస్థలో ఉన్నాడా లేక మత్తులో ఉన్నాడా అనికూడా చూస్తే ప్రమాదాలను అరికట్టవచ్చు . వాహనం ను ఢీ కొట్టడమే కాదు రోడ్ ప్రక్కన నిల్చున్న వారిని కూడా ఢీ కొట్టిన సంఘటనలు ,రోడ్ ప్రక్కన ఇళ్ల లోనికి దూసుక వెళ్ళిన సంఘటనలు కూడా ఉన్నవి . 



ఓవర్‌టేక్ చేయబోయి... నలుగురు మృతి

మహబూబ్‌నగర్ జిల్లాలోని మానవపాడు మండలం జల్లాపూర్ స్టేజి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఓవర్‌టేక్ చేయబోయిన కారు ముందున్న లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు స్పాట్లోనే మృతి చెందారు. మృతుల్లో ఇద్దరు మహిళలు, ఒక చిన్నారి ఉన్నారు. మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన కర్నూలు జిల్లా వాసులుగా గుర్తించినట్లు సమాచారం. 



రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి

కరీంనగర్:జిల్లాలోని జమ్మికుంట సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్రవాహనాన్ని గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో ఇద్దరు మృతి చెందారు. మృతులు జమ్మికుంటకు చెందిన క్రాంతి(25), శ్రీను(24)గా గుర్తించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.


రోడ్ వెంట మద్యం దుకాణాలను లేకుండా చూడాలి , రోడ్ వెంట మద్యం దుకాణాలు లేకపోయినా ఎక్కడో కొని తెచ్చుకొని దాచుకోవచ్చుకదా అందుకే మద్యాన్ని నిషేధించాలి . రాత్రిళ్ళు లారీలు , బస్సులు మరియు కార్లు విపరీతమైన వేగంతో నడిపిస్తారు వాటి వేగాన్ని నియంత్రించాలి అవసమైతే రాత్రి 12 గంటలనుండి ఉదయం 5 గంటల వరకు మొత్తం ప్రయాణాన్ని నిషేధించాలి. అప్పుడు గాని ప్రమాదాలు జరుగవు . 


 ఉత్తరప్రదేశ్‌లోని భదోహిలో కాపలా లేని రైల్వే క్రాసింగ్ వద్ద ఘోరం జరిగింది. స్కూల్ వ్యాన్ డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల ఏడుగురు చిన్నారుల ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. రైలు వస్తున్న విషయాన్ని డ్రైవర్ గమనించలేదు. డ్రైవర్ వ్యాన్‌ను రైల్వే గేట్‌ను దాటించే క్రమంలో వేగంగా వచ్చిన రైలు పాఠశాల వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అక్కడికక్కడే ఏడుగురు విద్యార్థులు మృత్యువాత పడగా, మరో 12 మంది చిన్నారులు తీవ్రంగా గాయపడ్డారు. 

                                                                                                                  yours ,
                                                                                        www.seaflowdiary.blogspot.com 

Friday, July 15, 2016



హరితహారం 
                                                                                Date : 15-07-2016
                                                                                 updated:  16-07-2016



మన తెలంగాణ లో మన ప్రభుత్వం హరితహారం ను ప్రతిష్టాత్మకం గా చేపట్టి గ్రామాలు , పట్టణాలు , మన రాజధాని హైద్రాబాద్ లో తేదీ  11-07-2016 నాడు  ఒకేరోజు 45 లక్షల మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టి రోజు మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టింది . మన తెలంగాణ మొత్తం హరితవనం అవుతుంది . ఎక్కడచూచినా పచ్చదనం కన్పిస్తుంది . ఈ మహాకార్యక్రమం లో గవర్నర్, ప్రజాప్రతినిధులు, నాయకులు , విద్యార్థులు , ఉద్యోగులు మరియు ప్రజలందరు  పాల్గొని విజయవంతం చేస్తున్నారు.మొక్కలను నాటేందుకు మరియు  పరిరక్షించేందుకు ఆయా స్వచ్ఛంద సంస్థలు ముందుకొస్తున్నాయి. ఐటీ సంస్థలు సైతం హరితహారంలో పాల్గొని మొక్కలను నాటాలని ఉద్యోగులకు పిలుపునిస్తున్నాయి. గ్రామాలు, పట్టణాలు, నగరాలు పచ్చగా మారుతున్నాయి .పాఠశాల విద్యార్థులు హరితహారం గురించి విస్తృతంగా ప్రచారం కల్పిస్తున్నారు. గ్రామాల్లో అయితే పోటీతో మొక్కలు నాటుతున్నారు. ఇప్పటికే ప్రభుత్వ శాఖలు లక్షలాది మొక్కలు నాటినప్పటికీ మరిన్ని మొక్కలు నాటేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ప్రతి ఒక్కరికి ధన్యవాదములు . "వృక్షో రక్షతి రక్షతే"  ని అమలు చేయుచున్నారు . ఈ మొక్కలు కొన్ని రోజులకు మహా వృక్షాలై అడవులుగా మారుతాయి . దీనివలన వర్షాలు విపరీతం గా కురిసి సస్యశామలమవుతుంది . మన ప్రియతమ ముఖ్యమంత్రి కె సి ఆర్ గారు కోరుకున్నట్లు " వానలు రావాలి - కోతులు పోవాలి " నిజమవుతుంది . మన దేశం లో ఇతర రాష్ట్రాలు కూడా మొక్కలు నాటే కార్యక్రమం చేపడుతున్నాయి కానీ ఇంత భారీగా లేదు . 
మొక్కలు పెంచే వారికి ప్రభుత్వం ఆర్థిక సహాయం కూడా ప్రకటించింది . కోట్ల రూపాయలు హరితవనం గురించి ఖర్చు పెడుతున్నది . మన IT మరియు Municipal  మంత్రి కె టి ఆర్ గారు హరిత హారానికి ఒక నెల జీతాన్ని విరాళం గా ప్రకటించారు చాలా సంతోషం . 



ఇలాగే అందరూ మరియు పెద్ద పెద్ద కంపెనీ వారు కూడా కంట్రిబ్యూట్ చేస్తే ప్రభుత్వానికి కొంత వ్యయం తగ్గుతుంది . 




మన అదృష్టం బాగా లేనట్లు ఉంది ఇన్ని లక్షల చెట్లు ఈ వానా కాలం లో నాటినాము కదా ! ఒక్క వర్షం కూడా మొక్కలు నాటిన తరువాత కురువలేదు . నాటిన మొక్కలు ఎండ వేడిమికి తట్టుకోలేక పోవుచున్నవి , వాడినట్లు కన్పిస్తున్నవి ఇంకా రెండు మూడు రోజులు వర్షాలు లేకుంటే ప్రయాస అంతా వృధా కావాల్సి వస్తుంది . ఇన్ని మొక్కలకు నీరు పోయాలంటే అయ్యే పని కాదు కనీసం ఇంటి ముందు నాటిన మొక్కలకు ఆ ఇంటివారు నీళ్లు చెట్లకు పోసి బ్రతికించుకోవచ్చు . కొందరు నీళ్లు పోస్తున్నారు మరికొందరు మన చెట్లు కావు కదా అని చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారు ఇది మంచిది కాదు , చెట్లు పెరిగితే వారికి నీడ తో బాటు కార్బండ ఆక్సయిడ్ తగ్గుతుంది ఆరోగ్యం బాగుంటుంది . 



ఇతర రాష్ట్రాలలో వర్షాలు విపరీతంగా కురిసి వరదలు ముంచెత్తుతున్నాయి . 
 ఏది ఏమైనా మనమందరం వర్షాలు తొందరగా కురిసి నాటిన మొక్కలు అన్ని బ్రతకాలని దేవుడిని ప్రార్థించుదాం . 


                                                                                                                  yours ,
                                                                                          www.seaflowdiary.blogspot.com     

Sunday, July 3, 2016

Health is wealth - ఆరోగ్యమే మహా భాగ్యం

                               


    Health is wealth - ఆరోగ్యమే మహా భాగ్యం 

                                                               Date :03-07-2016
                                                                                                       updated:04&05-07-2016
                                                                                      09-07-2016 ,11-07-2016

                                                                                                17-07, 23-07,27-07
                                                                                                 28-07, 04-08-2016 ,06-08,
                                                                                               09-08,&11-08 ,13-08, 18-08 , 22-08,                                                                                                         27-08-2016, 04-09-2016 , 05-09-2016,                                                                                                  09-09-2016, 18-09-2016 ,22-09-2016
                                                                                              08-10-2016, 10-19-2016 ,12-10-2016

                                                                                                 & 15-10-2016
Date: 15-10-2016.


గుండె జబ్బు ఆస్తమా ను నయం చేసే అర్జున/తెల్ల మద్ది 



మ‌న దేశంలోని ప‌లు ప్రాంతాల్లో అర్జున వృక్షం బాగా పెరుగుతుంది. దీన్ని క‌ల‌పగా ఉప‌యోగిస్తారు. ఈ వృక్షాన్ని తెల్ల‌మ‌ద్ది అని కూడా పిలుస్తారు. దీన్ని ఆయుర్వేద ఔష‌ధాల్లోనూ వాడుతున్నారు. తెలుపు, ఎరుపు రంగులో ఈ చెట్టు పెరుగుతుంది. అయితే ఈ వృక్షానికి గుండె జ‌బ్బులు, ఆస్త‌మా వంటి వ్యాధుల‌ను న‌యం చేసే శ‌క్తి ఉంది. అంతేకాదు విరిగిన ఎముక‌ల‌ను కూడా త్వ‌ర‌గా అతుక్కునేలా చేసే గుణాలు ఇందులో ఉన్నాయి. ఈ చెట్టు బెర‌డులో కాల్షియం, అల్యూమినియం, మెగ్నిషియం అధికంగా ఉంటాయి. దీంతో ఆ బెరడు మ‌న‌కు అనేక విధాలుగా ఉప‌యోగ‌ప‌డుతుంది. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. 


1. అర్జున చెట్టు బెరడుని పాలలో కాచి వచ్చిన డికాక్షన్ ను ఉదయం పూట పరగడుపున తాగుతుంటే గుండె జబ్బులు దూర‌మ‌వుతాయి. ఇది రక్తంలోని చెడు కొలెస్ట్రాల్ ను త‌గ్గిస్తుంది. గుండె కు రక్తప్రసరణ సజావుగా సాగేలా చేస్తుంది.

2. ఈ చెట్టు బెరడును బాగా మెత్తగా నూరి చూర్ణంగా చేసి పాయసంలో 10 గ్రాముల మోతాదులో క‌లిపి తింటుంటే దాంతో శ్వాస కోశ స‌మ‌స్య‌లు తొల‌గిపోతాయి. ప్ర‌ధానంగా ఆస్త‌మా ఉన్న వారికి ఇది ఎంత‌గానో మేలు చేస్తుంది. 

3. అర్జున చెట్టు బెరడు నుంచి తయారు చేసిన చూర్ణాన్ని తేనెతో తీసుకుంటే విరిగిన ఎముకలు త్వరగా అతుక్కుంటాయి. చాలా ప్ర‌ముఖ‌మైన ఆయుర్వేద మందుల్లో ఈ కాంబినేష‌న్‌ను ఎక్కువ‌గా వాడుతారు. కాల్షియం బాగా ఉండ‌డం వ‌ల్ల ఎముక‌లు త్వ‌ర‌గా అతుక్కుంటాయి. అంతేకాదు, అవి బ‌లంగా కూడా మారుతాయి. 

4. ఈ చెట్టు బెర‌డు చూర్ణాన్ని తేనెలో క‌లిపి ముఖానికి రాసుకుంటే దాంతో మొటిమ‌లు త‌గ్గుతాయి. 

5. అర్జున చెట్టు బెరడు కషాయాన్ని తాగితే కాలిన గాయాలు, పుండ్లు త‌గ్గుతాయి. 

6. అర్జున బెరడు చూర్ణాన్ని పాలతో కలిపి తీసుకుంటే వీర్యం ఎక్కువగా ఉత్ప‌త్తి అవుతుంది. 

7. అర్జున చెట్టు బెరడును నూరి గడ్డ ఉన్న చోట కడితే 12 గంటల్లో ఆ గడ్డ క్రమంగా తగ్గిపోతుంది.


Date:12-10-2016



నొప్పులను తగ్గించే ఆలివ్ ఆయిల్ !



శారీర‌క శ్ర‌మ వ‌ల్లో, లేదంటే ఏవైనా ఇత‌ర కారణాల వ‌ల్ల మ‌న‌కు అప్పుడ‌ప్పుడు ఒళ్లు నొప్పులు వ‌స్తుంటాయి. కొన్నిసంద‌ర్భాల్లో కీళ్ల నొప్పులు కూడా మ‌న‌ల్ని బాధిస్తుంటాయి. అయితే వీటి కోసం మెడిక‌ల్ షాపుకు ప‌రిగెత్తుకు వెళ్లి మందులు తీసుకుని వాటిని మింగ‌డం, ఆ త‌రువాత సైడ్ ఎఫెక్ట్స్ అనుభ‌వించ‌డం వంటి బాధ‌లు లేకుండానే ఇంట్లోనే సొంతంగా ఓ ఔష‌ధం త‌యారు చేసుకోవ‌చ్చు. దీని త‌యారీ కూడా సులువే. ఈ ఔష‌ధంతో ఎలాంటి నొప్పినైనా ఇట్టే త‌గ్గించుకోవ‌చ్చు. దాన్ని ఎలా త‌యారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. 


కొద్దిగా ఆలివ్ ఆయిల్ ను తీసుకుని దాంట్లో కొంత ఉప్పు వేసి బాగా కలపాలి. దీంతో ఇది మెత్తని పేస్ట్ లా తయారవుతుంది. ఈ పేస్టును శరీరంలో నొప్పి ఉన్న చోట రాస్తే ఫలితం బాగుంటుంది. నొప్పి తగ్గుతుంది. వెన్ను, కీళ్లు, భుజాలు, కాళ్ల నొప్పులలాంటి పలు రకాల నొప్పులను తగ్గించేందుకు ఈ పేస్ట్ ను వాడొచ్చు. ఆలివ్ ఆయిల్, ఉప్పులో ఉండే సహజ సిద్ద ఔషధ గుణాలు వివిధ రకాల నొప్పులను తగ్గించటంలో ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి. ఈ మిశ్రమాన్ని రెగ్యులర్ గా వాడితే ఎలాంటి నొప్పులు రావు.



మున‌గ ఆకు ర‌సంతో షుగ‌ర్, క్యాన్స‌ర్‌ల‌కు చెక్‌..!


మున‌గ కాయ‌లను మ‌నం త‌ర‌చూ కూర‌ల్లోనో, చారులోనో తింటూనే ఉంటాం. దీంతో మ‌న‌కు ఆరోగ్య‌ప‌రంగా ఎన్నో ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. అయితే కేవ‌లం మున‌గ కాయ‌లే కాదు, మున‌గ చెట్టు ఆకుల వ‌ల్ల కూడా మ‌నం ప‌లు ర‌కాల అనారోగ్యాల‌ను దూరం చేసుకోవ‌చ్చు. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. 

1. మున‌గ చెట్టు ఆకుల్లో విట‌మిన్ సి పుష్క‌లంగా ఉంటుంది. దీంతోపాటు విట‌మిన్ బి6, విటమిన్ ఎ, ప్రోటీన్లు, విట‌మిన్ బి2, ఐర‌న్‌, మెగ్నిషియం వంటి ముఖ్య‌మైన పోష‌క ప‌దార్థాలు మున‌గ ఆకుల్లో పుష్క‌లంగా ఉన్నాయి. నిత్యం మున‌గ ఆకును మ‌న ఆహారంలో భాగం చేసుకుంటే దాంతో ముందు చెప్పిన పోష‌కాల‌న్నీ మ‌న‌కు అందుతాయి.

2. మున‌గ చెట్టు ఆకుల‌ను నిత్యం కూర‌, లేదా ర‌సం రూపంలో ఏదో ఒక విధంగా తీసుకున్న‌ట్ట‌యితే దాంతో శ‌రీరానికి కాల్షియం, ఐర‌న్ పుష్క‌లంగా అందుతాయి. దీంతో ఎముక‌లకు బ‌లం చేకూరుతుంది. అవి దృఢంగా మారుతాయి.

3. మున‌గ ఆకుల్లో యాంటీ ఆక్సిడెంట్లు స‌మృద్ధిగా ఉన్నాయి. ఇవి శ‌రీరంలో ఏర్ప‌డే ఫ్రీ ర్యాడిక‌ల్స్‌ను నిర్మూలిస్తాయి. దీంతో క్యాన్స‌ర్‌లు దూర‌మ‌వుతాయి. క‌ణ‌జాలాల పెరుగుద‌ల‌ను అడ్డుకుంటాయి. విట‌మిన్ సి, బీటా కెరోటిన్‌లు కూడా ఉండ‌డం వ‌ల్ల క్యాన్స‌ర్ కార‌క ప‌దార్థాలు నాశ‌న‌మ‌వుతాయి.

4. మున‌గ చెట్టు వేళ్ల‌ను తీసుకుని బాగా క‌డిగి వాటిని జ్యూస్‌లా చేసుకోవాలి. ఈ మిశ్ర‌మాన్ని నిత్యం బెల్లంతోపాటు తీసుకుంటుంటే త‌ల‌నొప్పి మాయ‌మ‌వుతుంది.

5. కొన్ని మున‌గ ఆకుల‌ను తీసుకుని పేస్ట్‌లా చేసి దానికి కొంత తేనెను క‌లిపి కంటి రెప్ప‌ల‌పై పెట్టుకుంటే నేత్ర సంబంధ స‌మ‌స్య‌లు తొలగిపోతాయి. దృష్టి బాగా ఉంటుంది. కంటి వాపు కూడా త‌గ్గుతుంది. కురుపులు న‌య‌మ‌వుతాయి.

6. మున‌గ చెట్టు ఆకుల‌ను ఎండ బెట్టి పొడి చేసుకోవాలి. దీన్ని నిత్యం 7 గ్రాముల మోతాదులో ఉద‌యాన్నే ప‌ర‌గ‌డుపున తాగాలి. దీంతో మధుమేహం ఉన్న వారి ర‌క్తంలోని చ‌క్కెర స్థాయిలు నియంత్ర‌ణ‌లోకి వ‌స్తాయి. షుగ‌ర్ కంట్రోల్ అవుతుంది.

7. మున‌గ చెట్టు ఆకుల్లో స‌హ‌జ సిద్ధ‌మైన యాంటీ బ‌యోటిక్ గుణాలు ఉన్నాయి. ఈ ఆకుల‌కు చెందిన ర‌సాన్ని నిత్యం కొంత మోతాదులో తాగుతున్న‌ట్ట‌యితే ర‌క్తం శుద్ధి అవుతుంది. అందులో ఉన్న విష ప‌దార్థాలు బ‌య‌టికి వెళ్లిపోతాయి. చ‌ర్మ సంబంధ స‌మ‌స్య‌లు కూడా న‌య‌మ‌వుతాయి.

8. మున‌గాకు ర‌సాన్ని తాగితే వృద్ధాప్యం కార‌ణంగా శ‌రీరంపై వ‌చ్చే ముడ‌తలు పోతాయి. యాంటీ ఏజింగ్ గుణాలు ఈ ఆకుల్లో పుష్క‌లంగా ఉన్నాయి.


Date:10-10-2016

అనారోగ్య సమస్యలను దూరం చేసే బేకింగ్ సోడా





బేకింగ్ సోడాను వంట‌ల్లో వాడుతార‌ని అంద‌రికీ తెలిసిందే. బేక‌రీల‌లో మ‌న‌కు ల‌భ్య‌మ‌య్యే అనేక ర‌కాల ఆహార ప‌దార్థాల‌ను వండేట‌ప్పుడు బేకింగ్ సోడాను ఎక్కువగా వేస్తారు. అయితే బేకింగ్ సోడా కేవ‌లం వంట‌ల‌కే కాదు, ప‌లు అనారోగ్యాల‌ను న‌యం చేయ‌డం కోసం కూడా మ‌న‌కు ఉప‌యోగ‌ప‌డుతుంది. దీంతో ఎలాంటి అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను దూరం చేసుకోవ‌చ్చో ఇప్పుడు తెలుసుకుందాం. 



1. బేకింగ్ సోడా స‌హ‌జ సిద్ధ‌మైన అంటాసిడ్ గుణాల‌ను క‌లిగి ఉంది. ఈ క్ర‌మంలో కొద్దిగా బేకింగ్ సోడాను తీసుకుని ఒక గ్లాస్ నీటిలో క‌లిపి తాగితే అసిడిటీ స‌మ‌స్య నుంచి విముక్తి ల‌భిస్తుంది. గ్యాస్ తొల‌గిపోతుంది. తిన్న ఆహారం సరిగ్గా జీర్ణ‌మ‌వుతుంది. క‌డుపులోని ఆమ్లాల‌ను స‌మ‌తుల్యంలో ఉంచుతుంది.



2. ఒక టేబుల్ స్పూన్ బేకింగ్ సోడాను ఒక గ్లాస్ గోరు వెచ్చ‌ని నీటిలో క‌లిపి ఆ మిశ్ర‌మాన్ని బాగా పుక్కిలిస్తే గొంతు నొప్పి నుంచి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది. గొంతులో మంట కూడా త‌గ్గుతుంది.

3. కిడ్నీలో రాళ్ల‌ను క‌రిగించే శ‌క్తి బేకింగ్ సోడాకు ఉంది. ఒక గ్లాస్ నీటిలో కొద్దిగా బేకింగ్ సోడానే వేసి బాగా క‌లిపి ఆ నీటిని రోజూ తాగుతున్న‌ట్ట‌యితే కిడ్నీల్లో రాళ్లు క‌రిగిపోతాయి.

4. ఒక గ్లాస్ నీటిలో ఒక టీస్పూన్ బేకింగ్ సోడాను వేసి బాగా క‌లిపి ఆ నీటిని రోజూ తాగాలి. దీంతో గౌట్ త‌గ్గిపోతుంది. దాని వ‌ల్ల వ‌చ్చే పాదాల వాపులు, నొప్పులు త‌గ్గిపోతాయి.

5. పురుగులు కుట్టిన చోట దుర‌ద‌గా, నొప్పిగా, మంట‌గా ఉండ‌డం స‌హ‌జం. దీన్ని తొల‌గించుకోవాలంటే ఒక టేబుల్ స్పూన్ బేకింగ్ సోడాకు కొంత నీటిని క‌లిపి మెత్త‌ని పేస్ట్‌లా చేసి స‌మ‌స్య ఉన్న ప్ర‌దేశంపై రాయాలి. దీంతో ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది.

6. కొంత బేకింగ్ సోడాను తీసుకుని కొన్ని నీటిలో క‌ల‌పాలి. ఆ మిశ్ర‌మాన్ని కాట‌న్ బాల్ స‌హాయంతో శ‌రీరంపై చెమ‌ట బాగా వ‌చ్చే ప్రాంతాల్లో అప్లై చేయాలి. దీంతో ఆ మిశ్ర‌మం డియోడ‌రంట్‌గా ప‌నిచేసి చెమ‌ట దుర్వాస‌న నుంచి ఉప‌శమ‌నం క‌లిగేలా చేస్తుంది.

7. బేకింగ్ సోడా, నీరు క‌లిపిన మిశ్ర‌మంతో చేతులను క‌డుక్కుంటే స‌బ్బుతో ల‌భించే శుభ్ర‌త ల‌భిస్తుంది. దీంతో మురికిపోవ‌డ‌మే కాదు, చేతులు కూడా శుభ్రంగా మారుతాయి.


Date :08-10-2016




ఈ సీజ‌న్‌లో మ‌న‌కు ల‌భించే అనేక ర‌కాల పండ్ల‌లో సీతాఫ‌లం కూడా ఒక‌టి. అత్యంత తియ్య‌ని రుచిని క‌లిగి ఉండ‌డ‌మే కాదు, ఈ పండ్ల‌ను తిన‌డం వ‌ల్ల మ‌న‌కు ఎన్నో ర‌కాల పోష‌కాలు కూడా ల‌భిస్తాయి. సీజ‌న‌ల్ ఫ్రూట్‌గా మ‌న‌కు ల‌భించే సీతాఫ‌లంలో విట‌మిన్ ఎ, మెగ్నిషియం, పొటాషియం, ఫైబ‌ర్‌, విట‌మిన్ బి6, కాల్షియం, విట‌మిన్ సి, ఐర‌న్ వంటి అత్యంత ముఖ్య‌మైన పోష‌కాలు ఎన్నో ఉన్నాయి. వీటిని ఈ కాలంలో ఎక్కువ‌గా తిన‌డం వ‌ల్ల మ‌న‌కు అనేక ర‌కాల లాభాలు క‌లుగుతాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. 






  • సీతాఫ‌లాన్ని ఉద‌యాన్నే అల్పాహారంగా తీసుకుంటే దాంతో కండ‌రాలు, న‌రాల బ‌ల‌హీన‌త‌లు తొల‌గిపోతాయి. శ‌రీరానికి కావ‌ల్సిన శ‌క్తి ల‌భిస్తుంది. 
  • విట‌మిన్ ఎ ఎక్కువ‌గా ఉండ‌డం వ‌ల్ల కంటి రోగాలు తొల‌గిపోతాయి. దృష్టి స‌మ‌స్య‌లు దూర‌మ‌వుతాయి. 
  • సీతాఫ‌లంలో ఉండే మెగ్నిషియం గుండె జ‌బ్బులు రాకుండా చూస్తుంది. వీటిలో ఉండే పోష‌కాలు శ‌రీరంలో పేరుకుపోయిన కొవ్వును క‌రిగిస్తాయి. 
  • సీతాఫ‌లాన్ని రోజూ తింటుంటే క‌డుపులో ఉండే నులిపురుగు చ‌నిపోతాయి. అల్స‌ర్లు న‌య‌మ‌వుతాయి. గ్యాస్‌, అసిడిటీ, అజీర్ణం, మ‌ల‌బ‌ద్దకం వంటి జీర్ణ సంబంధ స‌మ‌స్య‌లు త‌గ్గుతాయి. 
  • ర‌క్తం త‌క్కువగా ఉన్న వారు సీతాఫ‌లాల‌ను తిన‌డం మంచిది. దీంతో ర‌క్తం త‌యార‌వుతుంది. 
  • శ‌రీరంలో బాగా వేడి ఉన్న వారు సీతాఫ‌లాల‌ను తింటే వెంట‌నే వేడి నుంచి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది. 
  • చిన్నారులు, బాలింత త‌ల్లుల‌కు సీతాఫ‌లం చ‌క్క‌ని పోష‌కాల‌ను అందిస్తుంది. వారికి త‌గిన శ‌క్తి ల‌భిస్తుంది. 
  • ఎదుగుతున్న పిల్లలు నిత్యం సీతాఫ‌లాన్ని తింటుంటే దాంతో కాల్షియం వంటి పోష‌కాలు ఎక్కువ‌గా ల‌భిస్తాయి. దీని వ‌ల్ల ఎముక‌లు దృఢంగా ఉంటాయి. 







  • శ‌రీరంలో ఉన్న వ్య‌ర్థ ప‌దార్థాల‌ను బ‌య‌టికి పంపించ‌డంలో సీతాఫ‌లం బాగా ఉప‌యోగ‌ప‌డుతుంది. రక్తం శుద్ధి కూడా అవుతుంది.


  • పెరుగు 





    చ‌క్క‌ని రుచి క‌లిగి ఉండే గ‌డ్డ పెరుగు అంటే చాలా మందికి ఇష్ట‌మే. కొంద‌రు భోజ‌నం చివ‌ర్లో పెరుగుతో తినంది అసలు తృప్తి చెంద‌రు. భోజనం అయిపోన‌ట్టుగానే భావిస్తారు. కానీ కొంత‌మందికి పెరుగు కాదు క‌దా, పాలు దాని సంబంధ ప‌దార్థాలు అస్స‌లు న‌చ్చ‌వు. అయితే ఇప్పుడు చెప్ప‌బోయే ఉప‌యోగాల గురించి తెలిస్తే పెరుగంటే ఇష్టం లేని వారు కూడా దాన్ని వాడేందుకు ఆస‌క్తి చూపుతారు. ఎందుకంటే దాంతో అన్ని ఆరోగ్య‌క‌ర ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి మ‌రి. ఆ ప్ర‌యోజ‌నాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. 



    1. కొద్దిగా జీల‌క‌ర్ర‌ను తీసుకుని పొడి చేసి దాన్ని ఓ కప్పు పెరుగులో క‌లుపుకుని తింటే త్వ‌ర‌గా బ‌రువు త‌గ్గుతారు.



    2. కొద్దిగా న‌ల్ల ఉప్పును తీసుకుని బాగా పొడి చేయాలి. దాన్ని ఓ క‌ప్పు పెరుగులో క‌లుపుకుని తాగాలి. దీంతో జీర్ణ సంబంధ స‌మ‌స్య‌లు దూర‌మ‌వుతాయి. ప్ర‌ధానంగా గ్యాస్‌, అసిడిటీ వంటివి త‌గ్గుతాయి.



    3. కొద్దిగా పెరుగులో చ‌క్కెర క‌లుపుకుని తినాలి. దీంతో శ‌రీరానికి వెంట‌నే శ‌క్తి అందుతుంది. మూత్రాశ‌య సంబంధ స‌మ‌స్య‌లు కూడా పోతాయి.

    4. కొంత వాము తీసుకుని ఓ క‌ప్పు పెరుగులో క‌లిపి తినాలి. దీని వ‌ల్ల నోటి పూత, దంతాల నొప్పి, ఇత‌ర దంత సంబంధ స‌మ‌స్య‌లు పోతాయి.

    5. ఓ క‌ప్పు పెరుగులో కొంత న‌ల్ల మిరియాల పొడిని క‌లిపి తినాలి. దీని వ‌ల్ల మ‌ల‌బ‌ద్ద‌కం దూర‌మ‌వుతుంది. తిన్న ఆహారం సరిగ్గా జీర్ణ‌మ‌వుతుంది.

    6. పెరుగులో కొన్ని ఓట్స్ క‌లిపి తినాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల మంచి ప్రోబ‌యోటిక్స్‌, ప్రోటీన్లు ల‌భిస్తాయి. ఇవి కండ‌రాల పుష్టికి దోహ‌దం చేస్తాయి.

    7. పెరుగులో వివిధ ర‌కాల పండ్ల‌ను క‌లిపి తింటే శ‌రీర రోగ నిరోధ‌క వ్య‌వ‌స్థ ప‌టిష్ట‌మ‌వుతుంది. ప‌లు ర‌కాల ఇన్‌ఫెక్ష‌న్లు, వ్యాధులు రాకుండా చూసుకోవ‌చ్చు.

    8. పెరుగులో కొంత ప‌సుపు, కొంత అల్లం క‌లిపి తినాలి. దీని వ‌ల్ల ఫోలిక్ యాసిడ్ శ‌ర‌రీంలోకి చేరుతుంది. ఇది చిన్నారుల‌కు, గ‌ర్భిణీ మ‌హిళ‌ల‌కు ఎంత‌గానో మేలు చేస్తుంది.

    9. పెరుగులో ఆరెంజ్ జ్యూస్ క‌లిపి తింటే శ‌రీరానికి త‌గినంత విట‌మిన్ సి ల‌భిస్తుంది. ఇది కీళ్ల నొప్పుల‌ను త‌గ్గిస్తుంది. వృద్ధాప్య ఛాయ‌ల‌ను దూరం చేస్తుంది.

    10. పెరుగులో తేనె క‌లిపి తీసుకుంటే క‌డుపులో ఉన్న అల్స‌ర్లు మటుమాయ‌మైపోతాయి. ఈ మిశ్ర‌మం యాంటీ బయోటిక్‌గా ప‌నిచేస్తుంది. దీని వ‌ల్ల శ‌రీరంలో ఉన్న ఇన్‌ఫెక్ష‌న్లు వెంట‌నే త‌గ్గుతాయి.






    వెల్లుల్లిని నిత్యం మ‌నం వంట‌ల్లో ఎక్కువ‌గా ఉప‌యోగిస్తుంటాం. అదేవిధంగా తేనెను కూడా ప‌లు ర‌కాల స‌లాడ్స్‌లో, టీ, కాఫీ, పాలు వంటి డ్రింక్స్‌లో కొంద‌రు తీసుకుంటారు. అయితే ఈ రెండింటిలోనూ మ‌న శ‌రీరానికి కావ‌ల్సిన ఎన్నో ర‌కాల పోష‌కాలు సమృద్ధిగా ఉన్నాయి, కాబ‌ట్టి ఈ రెండింటినీ క‌లిపి ఉద‌యాన్నే ప‌ర‌గ‌డుపున తీసుకుంటే దాంతో మ‌న‌కు ఎన్నో ర‌కాల ఆరోగ్య‌క‌ర ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. 


    కొన్ని వెల్లుల్లి రేకుల్ని తీసుకుని బాగా న‌లిపి 15 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. దీంతో వాటిలో ఉండే పోష‌కాలు రెట్టింపు అవుతాయి. అనంత‌రం ఆ మిశ్ర‌మాన్ని తేనెతో క‌లిపి ఉద‌యాన్నే ప‌ర‌గ‌డుపున తీసుకోవాలి. ఇలా చేస్తే ఏయే లాభాలు క‌లుగుతాయంటే... 



    1. వెల్లుల్లి, తేనెల‌ను క‌లిపి మిశ్ర‌మంగా చేసి ఉద‌యాన్నే ప‌ర‌గడుపున తీసుకుంటే శ‌రీరంలో వ్యాధి నిరోధ‌క శ్య‌క్తి పెరుగుతుంది. ఎలాంటి ఇన్‌ఫెక్ష‌న్ల‌నైనా త‌ట్టుకునే శ‌క్తి వ‌స్తుంది. దీంతోపాటు ఈ రెండింటిలో ఉండే ప‌వ‌ర్‌ఫుల్ యాంటీ ఆక్సిడెంట్లు శ‌రీరంలోని ఫ్రీ ర్యాడిక‌ల్స్ ప్ర‌భావాన్ని త‌గ్గిస్తాయి. దీంతో చ‌ర్మంపై ముడ‌త‌లు త‌గ్గుతాయి. 



    2. వెల్లుల్లి, తేనె మిశ్రమం రక్త సరఫరాను మెరుగు పరుస్తుంది. రక్త నాళాల్లో రక్తం గడ్డ కట్టకుండా చూస్తుంది. ఆయా ప్రాంతాల్లో పేరుకుపోయే కొవ్వును కూడా తొలగిస్తుంది. దీంతో వివిధ రకాల గుండె జబ్బులు రాకుండా చూసుకోవచ్చు.



    3. యాంటీ ఇన్‌ఫ్లామేటరీ గుణాలు కూడా వెల్లుల్లి, తేనె మిశ్రమంలో ఉన్నాయి. దీంతో ఇది శరీరంలో ఏర్పడే నొప్పులు, వాపులను తగ్గిస్తుంది. గొంతు నొప్పి, మంట వంటివి తగ్గిపోతాయి.



    4. జీర్ణాశయ సంబంధ సమస్యలు దూరమవుతాయి. డయేరియా, అజీర్ణం, గ్యాస్, అసిడిటీ వంటి సమస్యలను నయం చేసుకోవచ్చు. పెద్ద పేగులో ఏర్పడే ఇన్‌ఫెక్షన్లకు అడ్డుకట్ట వేయవచ్చు.



    5. జలుబు, ఫ్లూ జ్వరం, సైనస్ వంటి అనారోగ్యాలను నయం చేసుకోవచ్చు. ఫంగస్ ఇన్‌ఫెక్షన్లు తగ్గిపోతాయి.



    6. శరీరంలోని విష పదార్థాలను, క్రిములను బయటకి పంపే శక్తి ఈ మిశ్రమానికి ఉంది. ఆర్యోగానికి పూర్తి సంరక్షణను ఇస్తుంది.



    7. దెబ్బలు, కాలిన గాయాలు, పుండ్లు వంటివి వెంటనే తగ్గిపోతాయి. శ్వాస కోశ సమస్యలతో బాధ పడుతున్న వారికి ఉపశమనం లభిస్తుంది.



    8. శరీరంలోని అవయవాల పనితీరు మెరుగు పడుతుంది. సంపూర్ణ ఆరోగ్యం కలుగుతుంది.


    భోజనం చేశాక ఒక స్పూన్ సోంపు తీసికుంటే !








    ఈనాటి జంక్ ఫుడ్ యుగంలో మ‌నం మానేశాం కానీ, ఒక‌ప్పుడంటే చాలా మంది భోజ‌నం చేశాక సోంపు తినేవారు. దీంతో వారు అనేక అనారోగ్యాల నుంచి దూరంగా కూడా ఉన్నారు. అయితే ఇప్పుడీ అల‌వాటు చాలా మందికి లేదు. కానీ నిత్యం భోజ‌నం చేశాక ఒక టీస్పూన్ మోతాదులో సోంపును తింటే దాంతో మ‌న‌కు ఎన్నో లాభాలు క‌లుగుతాయి. ప‌లు అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను దూరం చేసుకోవ‌చ్చు. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. 



    జీర్ణాశ‌య స‌మ‌స్య‌ల‌కు…

    అజీర్ణం, గ్యాస్‌, అసిడిటీ, మ‌ల‌బ‌ద్ద‌కం వంటి స‌మ‌స్య‌ల‌తో నేటి త‌రుణంలో చాలా మంది ఇబ్బందులు ప‌డుతున్నారు. ఈ క్రమంలో అలాంటి స‌మ‌స్య‌లు ఉన్నవారు భోజ‌నం చేసిన వెంట‌నే 1 టీస్పూన్ సోంపు గింజ‌ల‌ను తింటే దాని వ‌ల్ల జీర్ణాశ‌య స‌మ‌స్య‌ల‌న్నీ తొల‌గిపోతాయి. తిన్న ఆహారం స‌రిగ్గా జీర్ణ‌మ‌వుతుంది.

    అధిక బ‌రువుకు…

    వాత దోషాల‌ను హ‌రించే గుణం ఉన్నందున సోంపుతో అధిక బ‌రువు స‌మ‌స్య ఇట్టే తొల‌గిపోతుంది. ఎందుకంటే భోజ‌నం చేశాక సోంపు తిన‌డం వ‌ల్ల ఒంట్లో ఉన్న నీరంతా బ‌య‌టికి పోతుంది. త‌ద్వారా బ‌రువు త‌గ్గుతారు.

    దంత సమ‌స్య‌ల‌కు…

    భోజ‌నం చేసిన వెంట‌నే సోంపును తింటే దాంతో నోరు తాజాగా మారుతుంది. నోటిలో ఉండే బాక్టీరియా, ఇత‌ర క్రిములు న‌శించ‌డ‌మే ఇందుకు కార‌ణం. ఈ క్ర‌మంలో దంతాలు, చిగుళ్లు శుభ్రంగా మారుతాయి. వాటిలో ఉన్న స‌మ‌స్య‌ల‌న్నీ తొల‌గిపోతాయి.

    రుతు స‌మ‌స్య‌ల‌కు...
    రుతుస్రావం అయ్యే స‌మ‌యంలో మ‌హిళ‌ల‌కు నొప్పి ఉండ‌డం స‌హ‌జ‌మే. అయితే అలాంటి వారు భోజ‌నం చేసిన వెంట‌నే కొన్ని సోంపు గింజ‌ల‌ను తింటే దాంతో రుతుక్ర‌మ నొప్పి త‌గ్గుతుంది. ఇత‌ర రుతు సంబంధ స‌మ‌స్య‌లు కూడా త‌గ్గిపోతాయి.

    క్యాన్స‌ర్‌…
    సోంపులో మాంగ‌నీస్, జింక్‌, కాప‌ర్‌, ఐర‌న్‌, కాల్షియం, పొటాషియం, సెలీనియం, మెగ్నిష‌యం వంటి ఖ‌నిజ ల‌వణాలు ఎన్నో ఉన్నాయి. ఇవి యాంటీ ఆక్సిడెంట్ గుణాల‌ను క‌లిగి ఉంటాయి. దీంతో ప‌లు ర‌కాల క్యాన్స‌ర్లు రాకుండా అడ్డుకోవ‌చ్చు. శ‌రీరంలో జ‌రిగే ఫ్రీ ర్యాడిక‌ల్స్ న‌ష్టాన్ని నివారించ‌వ‌చ్చు.

    ర‌క్త‌హీన‌త‌కు…
    ఐర‌న్‌, కాపర్ వంటి పోష‌కాలు ఉండ‌డం వ‌ల్ల సోంపు గింజ‌ల‌తో ర‌క్తం బాగా ప‌డుతుంది. ఇది ర‌క్త‌హీన‌త ఉన్న వారికి మేలు చేస్తుంది. ఎర్ర ర‌క్త క‌ణాల‌ను ఎక్కువ‌గా త‌యారు చేసేలా చూస్తుంది. గ‌ర్భిణీ మ‌హిళ‌ల‌కు ఇది ఎంత‌గానో మేలు చేసే అంశం.

    మ‌ధుమేహానికి…
    మ‌ధుమేహం ఉన్న వారు భోజ‌నం చేసిన వెంట‌నే సోంపును తింటే దాని వ‌ల్ల ర‌క్తంలో చ‌క్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. సోంపు గింజ‌లు ఇన్సులిన్ సెన్సిటీవిటీని పెంచుతాయి. కొలెస్ట్రాల్‌ను త‌గ్గిస్తాయి. మెట‌బాలిజం ప్ర‌క్రియ‌ను క్ర‌మ‌బ‌ద్దీక‌రిస్తాయి. ఇది బ‌రువు త‌గ్గేందుకు కూడా ఉప‌యోగ‌ప‌డుతుంది.
    బీపీ, గుండె స‌మ‌స్య‌ల‌కు…
    పొటాషియం అధికంగా ఉండ‌డం వ‌ల్ల సోంపు గింజ‌లు బీపీని నియంత్రిస్తాయి. గుండె సంబంధిత స‌మ‌స్య‌లు రాకుండా చూస్తాయి. ర‌క్త‌నాళాలు వెడ‌ల్పుగా మారేందుకు స‌హ‌క‌రిస్తాయి. దీంతో ర‌క్త‌నాళాల్లో కొవ్వు కూడా చేర‌కుండా ఉంటుంది.

    చ‌ర్మ స‌మ‌స్య‌ల‌కు…
    సోంపు గింజ‌ల్లో యాంటీ బాక్టీరియ‌ల్‌, యాంటీ ఆక్సిడెంట్ గుణాలు పుష్క‌లంగా ఉన్నాయి. ఇవి చ‌ర్మ సంబంధ స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రిస్తాయి. వ‌య‌స్సు మీద ప‌డ‌డం కార‌ణంగా వ‌చ్చే ముడ‌త‌లు త‌గ్గిపోతాయి. చ‌ర్మం మృదువుగా మారుతుంది.









    ఈ లాభాలు తెలిస్తే శ‌న‌గ‌ల‌ను అస్స‌లు వ‌ద‌ల‌రు..!






    పొట్టు తీసిన శ‌న‌గ‌పప్పును మ‌నం అనేక వంట‌కాల్లో వాడుతుంటాం. కానీ పొట్టు తీయ‌కుండానే ల‌భించే శ‌న‌గ‌ల‌ను లేదా లావుగా ఉండే మ‌రో ర‌క‌మైన కాబూలీ శ‌న‌గ‌ల‌ను తింటే మ‌న‌కు ఎన్నో ర‌కాల ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. ముఖ్యంగా ఈ శ‌న‌గ‌ల‌ను నాన‌బెట్టి లేదా ఉడ‌క‌బెట్టి లేదంటే మొల‌కల రూపంలో నిత్యం తీసుకుంటే దాంతో ఎన్నో లాభాలు క‌లుగుతాయి. ప‌లు అనారోగ్య స‌మ‌స్య‌లు కూడా దూర‌మ‌వుతాయి. ఈ క్ర‌మంలో శ‌న‌గ‌ల వ‌ల్ల మ‌న‌కు ఎలాంటి ఉప‌యోగాలు ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం. 

    1. శ‌న‌గ‌ల్లో పీచు ప‌దార్థం ఎక్కువ‌గా ఉంటుంది. ఇది శ‌రీరంలో ఉన్న కొలెస్ట్రాల్‌ను త‌గ్గించి వేస్తుంది. దీంతో గుండె సంబంధ స‌మ‌స్య‌లు రాకుండా చూసుకోవ‌చ్చు.

    2. నాన్‌వెజ్ తిన‌లేని వారికి శ‌న‌గ‌ల‌ను ఒక వ‌ర‌మ‌ని చెప్ప‌వ‌చ్చు. ఎందుకంటే మాంసంలో ఉండే ప్రోటీన్ల‌న్నీ శ‌న‌గ‌ల‌లో లభిస్తాయి.

    3. పొటాషియం, మెగ్నిషియం, కాల్షియం వంటి ఎన్నో ర‌కాల మిన‌ర‌ల్స్ శ‌న‌గల్లో ఉంటాయి. ఇవి బీపీని కంట్రోల్ చేస్తాయి. ఎక్కువ సేపు ఉన్నా ఆక‌లి వేయ‌కుండా చేస్తాయి. దీంతో బ‌రువు త‌గ్గాల‌నుకునే వారికి శ‌న‌గ‌లు బాగా ఉప‌యోగ‌ప‌డ‌తాయ‌ని చెప్ప‌వ‌చ్చు.

    4. శ‌న‌గ‌ల‌ను త‌ర‌చూ తింటుంటే ర‌క్తంలో ఎర్ర ర‌క్త క‌ణాల సంఖ్య పెరుగుతుంది. దీంతో ర‌క్తం బాగా ప‌డుతుంది. ఇది ర‌క్త‌హీన‌త ఉన్న వారికి ఎంత‌గానో మేలు చేస్తుంది.

    5. శ‌న‌గ‌ల్లో అమైనో యాసిడ్లు, ట్రిప్టోఫాన్‌, సెరొటోనిన్ వంటి ఉప‌యోగ‌క‌ర‌మైన పోష‌కాలు స‌మృద్ధిగా ఉంటాయి. ఇవి చ‌క్క‌గా నిద్ర ప‌ట్టేలా చేస్తాయి. దీంతో నిద్ర‌లేమి దూర‌మ‌వుతుంది. అంతేకాదు ఒత్తిడి, ఆందోళ‌న వంటివి కూడా త‌గ్గిపోతాయి.

    6. శ‌న‌గ‌ల్లో ఆల్ఫా లినోలినిక్ యాసిడ్‌, ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు స‌మృద్ధిగా ఉంటాయి. ఇవి కొలెస్ట్రాల్‌ను త‌గ్గించ‌డంతోపాటు గుండె ఆరోగ్యాన్ని మెరుగు ప‌రుస్తాయి.

    7. ఐర‌న్‌, ప్రోటీన్లు, మిన‌ర‌ల్స్‌స‌మృద్ధిగా ఉండ‌డం వ‌ల్ల శ‌న‌గ‌లు శరీరానికి మంచి శ‌క్తిని ఇస్తాయి. యాంటీ ఆక్సిడెంట్లు బాగా ఉండ‌డం వ‌ల్ల రోగ నిరోధక వ్య‌వ‌స్థ ప‌టిష్ట‌మ‌వుతుంది.

    8. పాల‌లో ఉండే కాల్షియంకు దాదాపు స‌మానమైన కాల్షియం శ‌న‌గ‌ల్లో ల‌భిస్తుంది. దీంతో ఎముక‌లు దృఢంగా మారుతాయి. ఎముక‌లకు పుష్టి క‌లుగుతుంది.

    9. పాస్ఫ‌ర‌స్ ఎక్కువ‌గా ఉండ‌డం వ‌ల్ల శ‌రీరంలో ఎక్కువ‌గా ఉన్న ఉప్పును బ‌య‌టికి పంపుతుంది. కిడ్నీల ప‌నితనం మెరుగు ప‌డుతుంది. ప‌చ్చ కామెర్లు ఉన్న వారు శ‌న‌గ‌ల‌ను తింటే త్వ‌ర‌గా కోలుకుంటారు.

    10. మాంగ‌నీస్‌, పాస్ఫ‌ర‌స్ స‌మృద్ధిగా ఉండ‌డం వ‌ల్ల చ‌ర్మ సంబంధ స‌మ‌స్య‌లు తొల‌గిపోతాయి. దుర‌ద‌, గ‌జ్జి వంటి వాటి నుంచి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది.


    షుగర్ కాన్సర్ లకు విరుగుడు ఆగాకాకర 






     ఆగాక‌ర‌, ఆకాక‌ర‌, అడ‌వి కాక‌ర‌, బొంతు కాక‌ర‌, బోడ కాక‌ర‌... ఇలా ఈ కూర‌గాయ‌కు చాలా పేర్లే ఉన్నాయి. కాక‌ర‌కాయంత పొడ‌వుగా ఉండ‌దు, దానంత చేదు కూడా ఉండ‌దు. కానీ ఆగాక‌ర‌లో పోష‌కాలు మాత్రం ఎక్కువే ఉంటాయి. వీటిని మ‌న ఆహారంలో భాగం చేసుకోవ‌డం వ‌ల్ల క‌లిగే ఆరోగ్య‌క‌ర ప్ర‌యోజ‌నాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 

    1. ఆగాక‌ర కాయ‌లు మ‌ధుమేహం ఉన్న వారికి ఎంత‌గానో మేలు చేస్తాయి. ఇవి ర‌క్తంలోని చ‌క్కెర స్థాయిల‌ను త‌గ్గిస్తాయి. ఇన్సులిన్ లెవ‌ల్స్‌ను పెంచుతాయి. మ‌ధుమేహం వ‌ల్ల వ‌చ్చే ఇతర అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను కూడా దూరం చేస్తాయి. 

    2. ఆగాక‌ర కాయ‌ల్లో పైటో న్యూట్రియంట్లు స‌మృద్ధిగా ఉంటాయి. ఇవి క్యాన్స‌ర్‌ల‌ను న‌యం చేస్తాయి. క్యాన్స‌ర్ క‌ణ‌తుల‌ను పెర‌గ‌నీయ‌కుండా అడ్డుకుంటాయి. క్యాన్స‌ర్ కార‌కాల‌ను నాశ‌నం చేస్తాయి. 

    3. ఆగాక‌ర కాయ‌ల్లో ఫొలేట్ అధిక మొత్తంలో ఉంటుంది. ఇది చిన్న పిల్ల‌ల‌కు, గ‌ర్భిణీ స్త్రీలకు ఎంత‌గానో అవ‌స‌ర‌మైన ముఖ్య‌మైన పోష‌కం. దీంతో గ‌ర్భ‌స్థ శిశువు చ‌క్క‌గా ఎదుగుతుంది. 

    4. ఆగాక‌ర కాయ‌ల్లో విట‌మిన్ సి పుష్క‌లంగా ఉంటుంది. ఇది శ‌రీర రోగ నిరోధ‌క వ్య‌వ‌స్థ‌ను ప‌టిష్టం చేస్తుంది. ఇన్‌ఫెక్ష‌న్ల‌కు వ్య‌తిరేకంగా పోరాడుతుంది. ఫ్రీ ర్యాడిక‌ల్స్ వ‌ల్ల క‌లిగే న‌ష్టాన్ని నివారిస్తుంది. 

    5. ఆగాక‌ర కాయ‌ల్లో ఫ్లేవ‌నాయిడ్లు కూడా స‌మృద్ధిగానే ఉంటాయి. ఇవి యాంటీ ఏజింగ్ గుణాల‌ను క‌లిగి ఉంటాయి. ఇందు వ‌ల్ల వృద్ధాప్య ఛాయ‌లు అంత త్వ‌ర‌గా ద‌రి చేర‌వు. 

    6. ఆగాక‌ర‌లో విట‌మిన్ ఎ కూడా బాగానే ఉంటుంది. ఇది దృష్టి సంబంధ స‌మ‌స్య‌లను తొల‌గిస్తుంది. 

    7. మూత్ర‌పిండాలు, మూత్రాశ‌య సంబంధ స‌మ‌స్య‌లు ఉన్న వారు నిత్యం ఆగాక‌ర కాయ‌ల‌ను తింటుంటే ఆయా స‌మ‌స్య‌ల నుంచి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది. 

    8. జీర్ణ‌వ్య‌వ‌స్థ ప‌నితీరు మెరుగు ప‌డుతుంది. గ్యాస్‌, అసిడిటీ, అజీర్ణం, మ‌ల‌బ‌ద్ద‌కం వంటి స‌మ‌స్య‌ల‌ను తొల‌గించుకోవ‌చ్చు.                                                

    భోజనానికి ముందు ఈ పండు తింటే అనారోగ్యాలు పోతాయ్ 

    ఎండ‌బెట్టి డ్రై ఫ్రూట్స్ రూపంలోకి మార్చిన అంజీర్ పండ్లు మార్కెట్‌లో మ‌న‌కు ల‌భ్య‌మ‌వుతున్నాయి. వీటిని అంద‌రూ చూసే ఉంటారు. అయితే డ్రై ఫ్రూట్స్ రూపంలో దొరికే అంజీర్ పండ్లే కాదు, సాధార‌ణ పండు రూపంలోనూ అంజీర్‌ను తింటే దాంతో మ‌న‌కు ఎన్నో ర‌కాల ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. ముఖ్యంగా ఈ పండును రెండు పూట‌లా భోజనానికి ముందు తింటే దాంతో అనేక అనారోగ్యాల‌ను దూరం చేసుకోవ‌చ్చు. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. 


    1. అంజీర్ పండ్ల‌లో ఫైబ‌ర్ స‌మృద్ధిగా ఉంటుంది. ఇది మ‌నం తిన్న ఆహారాన్ని సులువుగా జీర్ణం చేసేందుకు ఉప‌యోగ‌ప‌డుతుంది. జీర్ణ వ్య‌వ‌స్థ బాగా ప‌నిచేస్తుంది. గ్యాస్‌, అసిడిటీ, మ‌ల‌బద్ద‌కం వంటి జీర్ణ సంబంధ స‌మ‌స్య‌ల‌న్నీ దూర‌మ‌వుతాయి.

    2. అంజీర్‌లో పొటాషియం, సోడియం బాగా ల‌భిస్తాయి. ఇవి ర‌క్త‌పోటు (బీపీ) స‌మ‌స్య నుంచి ఉప‌శ‌మనాన్ని క‌లిగిస్తాయి. బీపీని కంట్రోల్‌లో ఉంచుతాయి.

    3. ర‌క్త‌హీన‌త స‌మ‌స్య నేడు చాలా మందిని బాధిస్తోంది. అలాంటి వారు నిత్యం రెండు అంజీర్ పండ్ల‌ను భోజనానికి ముందు తిన్న‌ట్ట‌యితే వారిలో ర‌క్తం బాగా ప‌డుతుంది. హిమోగ్లోబిన్ స్థాయిలు పెరుగుతాయి. మ‌లేరియా, టైఫాయిడ్‌, డెంగీ వంటి విష జ్వ‌రాల బారిన ప‌డి ప్లేట్‌లెట్లు త‌గ్గిన వారికి ఈ పండ్ల‌ను తినిపిస్తే వెంట‌నే ప్లేట్‌లెట్లు పెరుగుతాయి.

    4. అధిక బ‌రువు స‌మ‌స్య కూడా ఇప్పుడు అధిక‌మైంది. ఈ క్ర‌మంలో అంజీర్ పండ్ల‌ను రెండు పూట‌లా భోజనానికి ముందు తింటే దాంతో పొట్ట నిండిన భావ‌న క‌లుగుతుంది. దీని వ‌ల్ల ఎక్కువ‌గా ఆహారం తీసుకోవ‌డం త‌గ్గుతుంది. ఫ‌లితంగా బ‌రువు కూడా త‌గ్గుతారు. అంతేకాదు అంజీర్‌లో ఉండే పోష‌కాలు మ‌న శ‌రీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను కూడా త‌గ్గిస్తాయి.

    5. నిత్యం అంజీర్ పండ్ల‌ను తింటుంటే గుండె సంబంధ స‌మ‌స్య‌లు కూడా దూర‌మ‌వుతాయి. అంజీర్ పండ్ల‌లో ఉండే పెక్టిన్ అనే ప‌దార్థం శ‌రీరంలోని వ్య‌ర్థ ప‌దార్థాల‌ను తొల‌గిస్తుంది. ర‌క్తాన్ని శుద్ధి చేస్తుంది.

    6. అంజీర్ పండ్ల‌లో మెగ్నిషియం, మాంగ‌నీస్‌, జింక్ స‌మృద్ధిగా ఉంటాయి. ఇవి సంతానం కావాల‌నుకునే వారికి మేలు చేస్తాయి.

    7. శ‌రీర రోగ నిరోధ‌క వ్య‌వ‌స్థ ప‌టిష్ట‌మ‌వుతుంది. క్యాన్స‌ర్‌కు కార‌ణ‌మ‌య్యే ప‌దార్థాలు నాశన‌మ‌వుతాయి.

    8. అంజీర్ పండ్లు మ‌ధుమేహం ఉన్న‌వారికి ఎంత‌గానో మేలు చేస్తాయి. భోజనానికి ముందు వీటిని తింటే అనంత‌రం ర‌క్తంలో షుగ‌ర్ స్థాయిలు అంత‌గా పెర‌గ‌వు.

    9. ఆస్త‌మా వంటి శ్వాస‌కోశ స‌మ‌స్య‌లు ఉన్న‌వారు అంజీర్ పండ్ల‌ను తింటే ఆ అనారోగ్యాల నుంచి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది.

    10. అంజీర్ పండ్ల‌లో కాల్షియం కూడా పుష్క‌లంగానే ఉంటుంది. వీటిని తిన‌డం వ‌ల్ల ఎముక‌లు దృఢ‌మ‌వుతాయి. ఎముక‌లు విరిగి ఉన్న వారికి వీటిని పెడితే ఎముక‌లు త్వ‌ర‌గా అతుక్కుంటాయి.

    11. గొంతు నొప్పి ఉన్న‌వారు అంజీర్ పండ్ల‌ను తింటే వెంట‌నే ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది. ద‌గ్గు కూడా త‌గ్గుతుంది.

    12. జ్వ‌రం, చెవి నొప్పి, క‌డుపు నొప్పి వంటి స‌మ‌స్య‌లు ఉంటే అంజీర్ పండ్ల‌ను తినాలి. దీంతో ఆయా స‌మ‌స్య‌ల నుంచి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది.


    మొల‌కెత్తిన పెస‌ల‌తో కొలెస్ట్రాల్ దూరం..!




    1. మొల‌కెత్తిన పెస‌ల‌లో డైట‌రీ ఫైబ‌ర్ అధికంగా ఉంటుంది. ఇది కొవ్వును క‌రిగించేందుకు, చెడు కొలెస్ట్రాల్‌ను త‌గ్గించేందుకు ఉప‌యోగ‌ప‌డుతుంది. 

    2. మొల‌కెత్తిన పెస‌ల‌ను తింటే త్వ‌ర‌గా ఆక‌లి వేయ‌దు. దీంతో ఎక్కువ సేపు క‌డుపు నిండిన భావ‌న క‌లుగుతుంది. త‌ద్వారా ఆహారాన్ని త‌గ్గించి బ‌రువు కూడా త‌గ్గ‌వ‌చ్చు. 

    3. డైట‌రీ ఫైబ‌ర్ అధికంగా ఉన్న కార‌ణంగా ఇవి మ‌ల‌బ‌ద్ద‌కం స‌మ‌స్య‌ను పోగొడ‌తాయి. తిన్న‌ది స‌రిగ్గా జీర్ణం అయ్యేలా చూస్తాయి. 

    4. శ‌రీరంలోని నొప్పులు, వాపుల‌ను త‌గ్గించే యాంటీ ఇన్‌ఫ్లామేట‌రీ గుణాలు ఈ మొల‌కెత్తిన పెస‌ల‌లో ఉన్నాయి. 

    5. విట‌మిన్ ఎ, బి, సి, డి, ఇ, కె, థ‌యామిన్‌, రైబోఫ్లేవిన్‌, ఫోలిక్ యాసిడ్‌, నియాసిన్‌, విట‌మిన్ బి6, ఫాంటోథెనిక్ యాసిడ్ వంటివి మొల‌కెత్తిన పెస‌లలో స‌మృద్ధిగా ల‌భిస్తాయి. కాబ‌ట్టి వీటిని ప‌రిపూర్ణ పౌష్టికాహారంగా చెప్ప‌వ‌చ్చు. 

    6. మొల‌కెత్తిన పెస‌ల‌ను తీసుకోవడం వ‌ల్ల దృష్టి సంబంధ స‌మ‌స్య‌లు పోతాయి. గుండె జ‌బ్బులు రాకుండా ఉంటాయి. ర‌క్త‌హీన‌త తొల‌గిపోతుంది. 

    7. ర‌క్తంలోని చ‌క్కెర స్థాయిలు అదుపులోకి వ‌స్తాయి. మ‌ధుమేహం ఉన్న వారికి మేలు జ‌రుగుతుంది. 

    8. శ‌రీరంలో ఏర్ప‌డే ఇన్‌ఫెక్ష‌న్ల‌ను తొల‌గించే యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఉన్నాయి. ఇవి రోగ నిరోధ‌క వ్య‌వ‌స్థ‌ను ప‌టిష్టం చేస్తాయి. 

    9. వృద్ధాప్య ఛాయ‌ల‌ను ద‌రిచేర‌నివ్వ‌వు. గ్యాస్‌, అసిడిటీ వంటి జీర్ణ సంబంధ స‌మ‌స్య‌లు దూర‌మ‌వుతాయి.



    అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను మ‌టుమాయం చేసే నువ్వుల నూనె.


    ఇప్పుడంటే అన్నీ రిఫైన్డ్ నూనెలు వచ్చాయి కానీ ఒక‌ప్పుడు మ‌న వాళ్లు గానుగ‌ల్లో ఆడించిన నూనెల‌నే ఎక్కువ‌గా వాడేవారు. అలాంటి నూనెల్లో నువ్వుల నూనె కూడా ఒక‌టి. తెల్ల‌నివి, న‌ల్ల‌నివి అని రెండు ర‌కాలుగా ఈ నువ్వులు ఉంటాయి. వీటి నుంచి తీసే నూనెలో ఎన్నో ర‌కాల పోష‌క ప‌దార్థాలు ఉంటాయి. మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మైన విట‌మిన్ ఇ, కాల్షియం, జింక్‌, ఐర‌న్‌, థ‌యామిన్, ఒమెగా 6 ఫ్యాటీ యాసిడ్లు, ప్రోటీన్లు, యాంటీ ఆక్సిడెంట్లు నువ్వుల నూనెలో మ‌న‌కు పుష్క‌లంగా ల‌భిస్తాయి. ఈ క్ర‌మంలో నువ్వుల నూనెను నిత్యం మ‌న ఆహారంలో భాగం చేసుకుంటే క‌లిగే ప్ర‌యోజ‌నాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. 

    1. నువ్వుల నూనెలో విట‌మిన్ ఇ, బిలు పుష్క‌లంగా ఉన్నాయి. ఇవి చ‌ర్మాన్ని సంర‌క్షించ‌డ‌మే కాదు, అన్ని ర‌కాల చ‌ర్మ స‌మ‌స్య‌ల‌ను దూరం చేస్తాయి. నువ్వుల నూనెను త‌ర‌చూ వాడ‌డం వ‌ల్ల ముఖం కాంతివంత‌మ‌వుతుంది. చ‌ర్మం మృదువుగా మారుతుంది. 

    2. నిత్యం స్నానం చేసే ముందు చిన్న పిల్ల‌ల‌కు నువ్వుల నూనెతో మ‌ర్ద‌నా చేస్తే వారి శ‌రీరం బాగా ఎదుగుతుంది. మెద‌డు ప‌దునుగా మారుతుంది. చిన్నారుల్లో ఉండే కొవ్వు క‌రిగిపోతుంది. ఈ నూనెలో ఉండే పోష‌కాల‌న్నీ పిల్ల‌ల‌కు ల‌భిస్తాయి. అయితే పెద్ద‌లు కూడా స్నానానికి ముందు నువ్వుల నూనెతో మ‌ర్ద‌నా చేసుకోవ‌చ్చు. 

    3. నువ్వుల నూనెలో ఒమెగా-3,6 ఫ్యాటీ యాసిడ్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి బీపీని త‌గ్గిస్తాయి. శ‌రీరంలో పేరుకుపోయిన కొలెస్ట్రాల్ నిల్వ‌ల‌ను త‌గ్గిస్తాయి. 

    4. కాప‌ర్‌, ఇత‌ర ప‌వ‌ర్‌ఫుల్ యాంటీ ఆక్సిడెంట్లు నువ్వుల నూనెలో ఉంటాయి. దీంతో ఇవి కీళ్ల నొప్పుల‌ను త‌గ్గిస్తాయి. కొద్దిగా నువ్వుల నూనెను తీసుకుని కొంచెం వేడి చేసి మోకాళ్ల‌పై రాసుకుంటే నొప్పులు, వాపులు త‌గ్గిపోతాయి. 

    5. పైన చెప్పిన విధంగా నువ్వుల నూనెను శ‌రీరంపై కొవ్వు ఉన్న ప్రాంతాల్లో రాస్తే అధికంగా ఉన్న కొవ్వు క‌రిగిపోతుంది. 

    6. నువ్వుల నూనెలో ఉండే పోష‌కాలు ఎముక‌ల‌కు దృఢ‌త్వాన్ని ఇస్తాయి. ర‌క్త‌నాళాల‌ను శుభ్రం చేస్తాయి. శ్వాస‌కోశ స‌మ‌స్య‌ల‌ను దూరం చేస్తాయి. 

    7. మ‌ధుమేహ వ్యాధి గ్ర‌స్తులు నిత్యం 2 టేబుల్ స్పూన్ల మోతాదులో నువ్వుల నూనెను ఏవిధంగానైనా తీసుకుంటే వారి శ‌రీరంలోని ర‌క్తంలో ఉండే చ‌క్కెర స్థాయిలు త‌గ్గుముఖం ప‌డ‌తాయి. దీని వ‌ల్ల షుగ‌ర్ నియంత్ర‌ణ‌లో ఉంటుంది. 

    8. నువ్వుల నూనెతో త‌ల‌కు మ‌ర్ద‌నా చేస్తే జుట్టు బాగా పెరుగుతుంది. వెంట్రుక‌లు రాల‌డం త‌గ్గుతుంది. చుండ్రు స‌మ‌స్య పోతుంది.








    జ‌లుబు, జ్వ‌రం త‌గ్గాలంటే.. ఈ మిశ్ర‌మాన్ని తీసుకోవాలి...


     







    ఉసిరి కాయ‌ల్లో, తేనెలో ఎంత‌టి పోష‌కాలు ఉంటాయో అంద‌రికీ తెలిసిందే. యాంటీ బాక్టీరియ‌ల్‌, యాంటీ ఫంగ‌ల్ వంటి గుణాల‌తోపాటు శ‌రీర వ్యాధినిరోధ‌క వ్య‌వ‌స్థ‌ను ప‌టిష్టం చేసే ఎన్నో గుణాలు ఈ రెండింటిలోనూ ఉన్నాయి. అయితే వీటిని క‌లిపి మిశ్ర‌మంగా తీసుకుంటే మ‌న‌కు క‌లిగే ప‌లు అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను సుల‌భంగా దూరం చేసుకోవ‌చ్చు. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. 

    ఒక టేబుల్ స్పూన్ ఉసిరికాయ జ్యూస్‌లో ఒక టీస్పూన్ తేనెను క‌లిపి ప్రతి రోజూ ఉద‌యాన్నే ప‌ర‌గ‌డుపున తీసుకోవాలి. దీంతో కింద చెప్పిన ప‌లు అనారోగ్యాలు దూర‌మ‌వుతాయి. 

    1. పైన చెప్పిన ఉసిరి జ్యూస్‌, తేనె మిశ్ర‌మం వ‌ల్ల ఊపిరితిత్తుల్లో ఉండే బాక్టీరియా పోతుంది. 

    2. జ‌లుబు, ద‌గ్గు, ఫ్లూ జ్వ‌రం త్వ‌ర‌గా త‌గ్గుతుంది. వ్యాధి నిరోధ‌క శ‌క్తి బాగా పెరుగుతుంది. 

    3. జీర్ణ సంబంధ స‌మ‌స్య‌లు తొల‌గిపోతాయి. అసిడిటీ, గ్యాస్‌, అజీర్ణం వంటివి త‌గ్గిపోతాయి. మ‌లబ‌ద్ద‌కం నుంచి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది. 

    4. సైన‌స్‌, ఆస్త‌మా వంటి శ్వాస‌కోశ స‌మ‌స్య‌ల నుంచి ఉప‌శ‌మ‌నం క‌లుగుతుంది. 

    5. దృష్టి సంబంధ స‌మ‌స్య‌లు దూర‌మ‌వుతాయి. జుట్టుకు మేలు జ‌రుగుతుంది. వెంట్రుక‌లు దృఢంగా పెరుగుతాయి. 

    6. చ‌ర్మం కాంతివంతంగా మారుతుంది. చ‌ర్మానికి మృదుత్వం చేకూరుతుంది.






    సైనస్ సమస్య బాధిస్తుంటే..?


    సైనస్... వాతావ‌ర‌ణం మారిన‌ప్పుడ‌ల్లా చాలా మందిని ఇబ్బంది పెడుతుంది. ప్ర‌ధానంగా చ‌లికాలంలో, చ‌లిగా ఉన్న వాతావ‌ర‌ణంలో సైన‌స్ ఇంకా ముప్పు తిప్ప‌లు పెడుతుంది. త‌ల‌నొప్పి ఎక్కువ‌గా ఉండ‌డం, క‌ళ్ల ద‌గ్గ‌ర దుర‌ద‌గా ఉండ‌డం, ముక్కుకు ఇరువైపులా ప‌ట్టుకుంటే నొప్పి… ఇవ‌న్నీ సైన‌స్ ల‌క్ష‌ణాలు. అయితే కింద ఇచ్చిన కొన్ని టిప్స్‌ను పాటిస్తే సైన‌స్ స‌మ‌స్య నుంచి ఉప‌శ‌మ‌నం పొంద‌వ‌చ్చు. అవేమిటంటే... 

    1. నిత్యం మ‌నం తినే ఆహారంలో కారం పొడిని ఎక్కువ‌గా వాడాలి. దీని వ‌ల్ల ముక్కు నుంచి ఎక్కువ‌గా నీరు రాకుండా ఉంటుంది. సైన‌స్ నుంచి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది. 

    2. సైనస్ స‌మ‌స్య‌ను త‌గ్గించ‌డంలో వెల్లుల్లి కూడా బాగానే ఉప‌యోగ‌ప‌డుతుంది. దీంట్లో యాంటీ బాక్టీరియల్‌, యాంటీ ఫంగ‌ల్ గుణాలు ఉన్నాయి. రోజుకు 2, 3 వెల్లుల్లి రేకుల్ని తింటున్నా సైన‌స్ స‌మ‌స్య నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. 

    3. ఒక టీస్పూన్ వాము తీసుకుని నూనె లేకుండా పెనం మీద కొద్దిగా వేయించాలి. దాన్ని బాగా న‌లిపి ఒక శుభ్ర‌మైన వ‌స్త్రంలో పెట్టి బాగా వాస‌న పీల్చాలి. దీంతో ముక్కు లోపలి రంధ్రాలు బాగా తెరుచుకుంటాయి. ఈ క్ర‌మంలో త‌ల‌నొప్పి త‌గ్గిపోతుంది. సైన‌స్ నుంచి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది. 

    4. ప్రాణాయామం వంటి శ్వాస‌క్రియ వ్యాయామాల‌ను చేసిన‌ట్టియ‌తే సైన‌స్ నుంచి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది. 

    5. ఒక టీస్పూన్ జీల‌క‌ర్ర‌ను బాగా వేయించి పొడి చేయాలి. దాంట్లో రెండు టీస్పూన్ల తేనె క‌లిపి రోజుకు 2 సార్లు తీసుకుంటే సైన‌స్ నుంచి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది. 

    6. క్యారెట్ జ్యూస్ 300 ఎంఎల్‌, పాల‌కూర ర‌సం 200 ఎంఎల్ మోతాదులో తీసుకుని రోజుకు ఒక సారి తాగాలి. దీని వ‌ల్ల సైన‌స్ నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. 

    7. ఒక పాత్ర‌లో నీటిని తీసుకుని బాగా మరిగించాలి. దాంట్లో కొన్ని చుక్క‌ల యాపిల్ సైడ‌ర్ వెనిగ‌ర్ వేసి ఆ నీటి నుంచి వ‌చ్చే ఆవిరిని పీల్చాలి. దీంతో ముక్కులోని రంధ్రాలు తెరుచుకుని గాలి బాగా ఆడుతుంది. స‌మ‌స్య నుంచి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది. 

    8. విట‌మిస్ సి ఎక్కువ‌గా ఉండే నిమ్మ‌, ఉసిరి, కివీ పండ్లను త‌ర‌చూ తీసుకుంటుంటే సైన‌స్ నుంచి విముక్తి పొంద‌వచ్చు. 

    9. ట‌మాటా ర‌సంతో చేసిన టీ తాగుతున్నా సైన‌స్ త‌గ్గిపోతుంది.



    Drink lemon water if you have any of these 10 problems!



    Acne

    Lemon can be the best treatment for those suffering from Acne. Lemon contains anti-bacterial properties that fight acne-causing bacteria and water purifies and detox your body. Put the two together and you’ve got a recipe for clear skin! Applying lemon water as face wash can exfoliate your skin, remove dead cells that can clog your pores and eradicate that excess oil from your face.

    Use it as an appetiser


    If for you lemon water tastes great; replace it with the beverage that you constantly drink. It will cut down your sugar intake and regular intake of drinking lemon water will increase your metabolism. Adding few drops of lemon juice to your plain water will not only enhance your taste but will benefit your health.

    Kidney Stones



    Having kidney stones are one of the most painful things ever. If you ever had one, there is fair chances that you would never want to experience them again. The natural citrate in lemon water can help to break down kidney stones or even prevent them altogether. Citrate is often prescribed as medication for kidney stones.

    Weak Immune System


    Are easily affected by cold, dust or any other thing? Do you get sick easily? If yes, then drink some lemon water. Lemon water contains vitamin C which will make your immune system stronger. Lemon water can be especially helpful for your immune system when you’re feeling stressed.

    Cold and Flu



    Drinking lemon water when you have a cold or flu can help loosen congestion. It also keeps you from becoming dehydrated. Add a bit of honey to the mix for even more anti-bacterial properties and you’ll be feeling better in no time.
    Inflammation


    Lemon water is good for people suffering from asthma and other respiratory disease. The vitamin C in lemon water has anti-inflammatory effects. Lemon water can also fight joint inflammation by reducing the buildup of uric acid in your joints.





    250K
    58
    9 of 13



    Lemon water is good for people suffering from asthma and other respiratory disease. The vitamin C in lemon water has anti-inflammatory effects. Lemon water can also fight joint inflammation by reducing the buildup of uric acid in your joints.








    బ‌రువు త‌గ్గించే రాగి అంబ‌లితో ఎన్నో లాభాలు..!



    ధాన్య‌పు గింజ‌లైన రాగుల్లో ఎన్నో ర‌కాల పోష‌క ప‌దార్థాలు ఉంటాయి. అవి మ‌న శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. అయితే రాగుల‌తో త‌యారు చేసే అంబ‌లిని తాగ‌డం వ‌ల్ల మ‌న‌కు ఎంతో ప్ర‌యోజ‌నం క‌లుగుతుంది. ప్ర‌ధానంగా బ‌రువు త‌గ్గుతారు. ఇంకా చాలా లాభాలే ఉన్నాయి. ఈ క్ర‌మంలో రాగి అంబ‌లిని ఎలా తయారు చేయాలో, దాంతో మ‌న‌కు ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. 



    రాగుల‌ను కొంత ప‌రిమాణంలో తీసుకుని వాటిని కొన్ని గంట‌ల పాటు నీటిలో నాన‌బెట్టాలి. అనంత‌రం వాటిని శుభ్ర‌మైన వ‌స్త్రంలో క‌ట్టి మ‌ళ్లీ కొన్ని గంట‌ల పాటు ఉంచితే అవి మొల‌కెత్తుతాయి. కొన్ని సార్లు రాగులు మొల‌కెత్త‌డం ఆల‌స్యం కూడా అవ‌చ్చు. అయినా కొంత సేపు నిరీక్షించి మొల‌కెత్తిన రాగుల‌ను సేక‌రించాలి. వాటిని బాగా ఎండబెట్టి దంచి పొడి చేయాలి. ఆ పొడిని కొంత నీటిలో వేసి బాగా ఉడికించాలి. దీంతో జావ త‌యారవుతుంది. ఇందులో అవ‌సరం అయితే జీడిపప్పు, ప‌ల్లీలు, కిస్మిస్‌, తేనె వంటివి క‌లుపుకోవ‌చ్చు. లేదంటే ఉప్పు, కారం కూడా క‌ల‌ప‌వ‌చ్చు. అలా క‌లుపగా వ‌చ్చేదే రాగి అంబ‌లి. దీన్ని నిత్యం తాగితే మ‌న శరీరానికి ఎంతో మేలు జ‌రుగుతుంది. 



    1. రాగి అంబలి శరీరానికి మంచి బలాన్ని ఇస్తుంది. రోజంతా శరీరానికి కావ‌ల్సిన శ‌క్తి, పోష‌కాలు రాగి అంబ‌లి ద్వారా అందుతాయి. దీంతో ఎక్కువ సేపు ప‌నిచేయ‌వ‌చ్చు. రోజంతా ఉత్సాహంగా ఉంటుంది. 



    2. ఎదిగే పిల్లలకు దీనిని ఇవ్వడం వల్ల శక్తివంతంగా తయారవుతారు. చ‌దువుల్లో బాగా ప్ర‌తిభ‌ను క‌న‌బ‌రుస్తారు. మెద‌డు చురుగ్గా ఉంటుంది. 



    3. రాగి అంబ‌లికి చ‌లువ చేసే గుణం ఉంది. దీంతో శరీరంలో ఉండే అధిక వేడిని త‌గ్గించుకోవ‌చ్చు. 



    4. ఒక గ్లాస్ రాగి అంబ‌లి తాగినా చాలా సేపు ఆక‌లి వేయ‌దు. దీంతో క‌డుపు నిండిన భావ‌న కలుగుతుంది. ఆహారం ఎక్కువ‌గా తినాల‌నిపించ‌దు. ఇది బ‌రువు త‌గ్గాల‌నుకునే వారికి మేలు చేస్తుంది. స్థూల‌కాయం ఉన్న వారు రాగి అంబలి తాగితే వేగంగా బ‌రువు త‌గ్గ‌వ‌చ్చు. 



    5. ప్ర‌తి రోజూ ఉద‌యం చేసే సాధార‌ణ అల్పాహారానికి బ‌దులుగా రాగి అంబ‌లి తాగితే దాంతో మ‌నం రోజంతా యాక్టివ్‌గా ఉండ‌వ‌చ్చు. శారీర‌క దృఢ‌త్వం చేకూరుతుంది. 



    6. బీపీ, షుగ‌ర్ నియంత్ర‌ణ‌లోకి వ‌స్తాయి. ర‌క్త‌స్రావం జ‌రుగుతున్న వారికి రాగి అంబ‌లి తాగిస్తే స్రావం ఆగిపోతుంది. 



    7. రాగి అంబ‌లిని నిత్యం తాగుతుంటే పురుషుల్లో వీర్యం వృద్ధి చెందుతుంది.

    గొంతు నొప్పి త‌గ్గాలంటే..?

    సీజ‌న్ మారిందంటే చాలు. చాలా మందికి జ‌లుబు, ద‌గ్గు వ‌స్తుంటాయి. దీంతోపాటు అనేక మందిని గొంతు నొప్పి కూడా బాధిస్తుంది. అయితే కింద ఇచ్చిన ప‌లు టిప్స్ పాటిస్తే గొంతు నొప్పిని సుల‌భంగా త‌గ్గించుకోవ‌చ్చు. ఆ టిప్స్ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. 

    1. ఒక టేబుల్ స్పూన్ గ‌ళ్ళ ఉప్పు లేదా వంట సోడాను గ్లాస్ గోరువెచ్చని నీటిలో వేసి క‌లియ‌బెట్టాలి. ఆ నీటిని పుక్కిలించాలి. ఇలా రోజుకు నాలుగైదు సార్లు చేస్తే ఉప్పు యాంటిసెప్టిక్‌గా పనిచేసి గొంతును శుభ్రం చేసి నొప్పినుంచి ఉపశమనం కలిగిస్తుంది. బీపి ఉన్నవాళ్లు ఈ పని చేయరాదు.

    2. వేడి నీటిలో కాస్త తేనె వేసి తీసుకుంటే గొంతునొప్పి నుంచి త్వర‌గా ఉపశమనం పొందవచ్చు.

    3. ఒక గ్లాసు నీటిలో నిమ్మరసం కలిపి రోజూ తీసుకుంటే గొంతు సమస్యలు తొలగిపోతాయి.

    4. దాల్చిన చెక్క పొడి, తేనె కలిపిన మిశ్రమాన్ని తింటే దగ్గు, జలుబుతో కూడిన గొంతు నొప్పి నుంచి రిలీఫ్ లభిస్తుంది.

    5. మిరియాల పొడిని కాస్త తేనెలో కలిపి తినటం లేదా పాలల్లో మిరియాలపొడి కలిపి తాగినా గొంతు సమస్యలు తగ్గుతాయి.

    6. గొంతులో మంటగా ఉంటే వెల్లుల్లి రెబ్బను తింటే గొంతులో మంట తగ్గుతుంది.

    7. గొంతులో గరగర వంటి సమస్యలు పోవాలంటే ఉల్లిపాయ రసం సేవించడం లేదా అల్లంతో చేసిన టీని గాని అల్లాన్ని నీటిలో ఉడికించి ఆ నీటిని గాని సేవిస్తే గొంతు సమస్యలకు చెక్ పెట్టవచ్చు.





                                                                              Blood
    ప్లేట్‌లెట్స్‌... వీటి గురించి మీరు వినే ఉంటారు. ప్ర‌ధానంగా డెంగీ జ్వ‌రం వ‌చ్చిన‌ప్పుడు ఇవి ఎక్కువ‌గా క్షీణిస్తాయి. అంటే ర‌క్తంలో ఉన్న వాటి సంఖ్య ఒకేసారి ప‌డిపోతుంది. దీంతో ఆరోగ్యం మ‌రింత విషమించి ప్రాణాపాయ స్థితి వ‌స్తుంది. కొన్ని సంద‌ర్భాల్లో ప్రాణాలు కూడా కోల్ప‌వాల్సి వ‌స్తుంది. అయితే అలాంటి జ్వ‌రం వ‌చ్చిన‌ప్పుడు వైద్యులు ఇచ్చే మందుల‌తోపాటుగా కింద పేర్కొన్న ప‌లు ఆహార ప‌దార్థాల‌ను తీసుకుంటే ప్లేట్‌లెట్ల సంఖ్య‌ను బాగా పెంచుకోవ‌చ్చు. దీంతో వ్యాధి నుంచి త్వ‌ర‌గా కోలుకునేందుకు అవ‌కాశం ఉంటుంది. 

    1. బొప్పాయి పండ్ల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల డెంగీ వ‌చ్చిన వారు త్వ‌ర‌గా కోలుకుంటారు. ప్లేట్‌లెట్ల సంఖ్య కూడా పెరుగుతుంది. 

    2. దానిమ్మ పండ్ల‌ను తిన్నా ప్లేట్‌లెట్ల సంఖ్య పెరుగుతుంది. ఇది ర‌క్తం ఎక్కువ‌గా ఉత్ప‌త్తి అయ్యేందుకు కూడా ఉప‌యోగ‌ప‌డుతుంది. 

    3. ఆకుప‌చ్చ‌గా ఉండే ఆకుకూర‌లు, కూర‌గాయ‌ల‌ను ఎక్కువ‌గా తినాలి. దీంతో వాటిలో ఉండే విట‌మిన్ కె ప్లేట్‌లెట్ల సంఖ్య‌ను పెంచుతుంది. 

    4. వెల్లుల్లి రేకుల్ని ఆహారంలో భాగంగా తీసుకుంటే చాలా మంచిది. దీంతో ప్లేట్‌లెట్ల సంఖ్య వృద్ధి చెందుతుంది. 

    5. ర‌క్త‌హీన‌త‌తో బాధ‌పడేవారే కాదు, డెంగీ వ‌చ్చిన వారు కూడా బీట్ రూట్ జ్యూస్‌ను తాగ‌వ‌చ్చు. దీంతో ప్లేట్‌లెట్లు పెరుగుతాయి. 

    6. క్యారెట్‌ను త‌ర‌చూ తింటున్నా ర‌క్తం వృద్ధి చెంది తద్వారా ప్లేట్‌లెట్లు పెరుగుతాయి. 

    7. ఎండు ద్రాక్ష‌ల్లో 30 శాతం ఐర‌న్ ఉంటుంది. ఇది ప్లేట్‌లెట్ల సంఖ్య‌ను పెంచుతుంది. 

    8. ఆప్రికాట్ పండ్ల‌ను నిత్యం రెండు సార్లు తీసుకున్నా చాలు. ర‌క్తం వృద్ధి చెంది ప్లేట్‌లెట్లు పెరుగుతాయి. 

    9. ఎండు ఖ‌ర్జూరం, కివీ పండ్ల‌ను తింటున్నా ప్లేట్‌లెట్లను బాగా పెంచుకోవ‌చ్చు. దీంతో వ్యాధి త‌గ్గుముఖం కూడా ప‌డుతుంది.


    ఈ లాభాలు తెలిస్తే చింత గింజ‌ల‌ను అస‌లు పారేయ‌రు..!




    చింత‌పండును తీసేట‌ప్పుడు స‌హ‌జంగా ఎవ‌రైనా వాటి నుంచి వ‌చ్చే చింత గింజ‌ల‌ను పారేస్తారు. అయితే ఇది చ‌దివాక చింత గింజ‌ల‌ను ఇంకోసారి అలా పారేయ‌రు. ఎందుకంటే వాటిలో ఎంతో ఉప‌యోగ‌క‌ర‌మైన ఆరోగ్య‌క‌ర ప్ర‌యోజ‌నాలు దాగి ఉన్నాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. 


    కొన్ని చింత గింజ‌ల‌ను సేక‌రించి వాటిని బాగా వేయించాలి. అనంత‌రం 2 రోజుల పాటు వాటిని నీటిలో నాన‌బెట్టాలి. రోజుకు రెండు సార్లు నీటిని మార్చాలి. 2 రోజుల త‌రువాత చింత గింజ‌ల‌ను తీసి వాటి పొట్టును వేరు చేయాలి. అనంత‌రం వ‌చ్చే విత్త‌నాల‌ను చిన్న చిన్న ముక్క‌లుగా చేసి నీడ‌లో ఎండ‌బెట్టాలి. అలా ఎండిన ముక్క‌ల‌ను తీసుకుని మిక్సీలో వేసి పొడిగా ప‌ట్టాలి. ఆ పొడిని జార్‌లో నిల్వ చేసుకోవాలి. దీన్ని అర టీస్పూన్ మోతాదులో తీసుకుని రోజుకు రెండు సార్లు నీటితో లేదా పాల‌తో నెయ్యి లేదా చ‌క్కెర‌ను క‌లిపి తీసుకోవాలి.



    పైన చెప్పిన విధంగా చేయ‌డం వ‌ల్ల మోకాళ్ల నొప్పుల నుంచి వెంట‌నే ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది. అంతేకాదు 3-4 వారాల్లో స‌మ‌స్య పూర్తిగా తగ్గుముఖం ప‌డుతుంది. ఎందుకంటే చింత గింజ‌ల్లో ఉండే ప‌లు ఔష‌ధ పదార్థాలు ఎముక‌ల‌కు బ‌లాన్నిస్తాయి. అదేవిధంగా కీళ్ల‌లో అరిగిపోయిన గుజ్జును మ‌ళ్లీ ఉత్పత్తి చేస్తాయి. దీంతో కీళ్ల నొప్పుల నుంచి శాశ్వ‌తంగా విముక్తి ల‌భిస్తుంది. 



    అయితే పైన చెప్పిన మిశ్ర‌మం కేవ‌లం కీళ్ల నొప్పులే కాదు డ‌యేరియా, చ‌ర్మంపై దుర‌ద‌లు, దంత సంబంధ స‌మ‌స్య‌లు, అజీర్ణం, రోగ నిరోధ‌క శ‌క్తి త‌క్కువ‌గా ఉండ‌డం, ద‌గ్గు, గొంతు ఇన్‌ఫెక్ష‌న్లు, డ‌యాబెటిస్‌, గుండె సంబంధ వ్యాధులకు చ‌క్క‌ని ఔష‌ధంగా కూడా ఉప‌యోగ‌ప‌డుతుంది. అదేవిధంగా ఎముక‌లు విరిగితే ఆ ప్ర‌దేశంపై రోజూ చింత‌గింజ‌ల పొడిని పేస్ట్‌లా చేసి అప్లై చేస్తే దాంతో ఎముక‌లు త్వ‌ర‌గా అతుక్కుంటాయి.

    Health tips

    Accupressure points



    శ‌రీర బ‌రువును బట్టి రోజుకి ఎన్ని లీట‌ర్ల నీరు తాగాలో తెలుసా..?




    నీరు మ‌న‌కు ఎంత అవ‌స‌ర‌మో అంద‌రికీ తెలిసిందే. నిత్యం ఎన్నో ర‌కాల ప‌నుల‌కు మ‌నం నీటిని వాడుతుంటాం. అయితే ఆయా ప‌నుల‌కే కాదు, మ‌నం తాగేందుకు కూడా నీరు అవ‌స‌ర‌మే. దాంతో మ‌న శరీర జీవ‌క్రియ‌లు స‌క్ర‌మంగా జ‌రుగుతాయి. మ‌నం తిన్న ఆహారం స‌క్ర‌మంగా జీర్ణ‌మ‌వుతుంది. ఇంకా ఎన్నో ప‌నులు జ‌రుగుతాయి. అయితే ఒక మ‌నిషి నిత్యం ఎన్ని లీట‌ర్ల నీటిని తాగాలో తెలుసా..? ఏముందీ, 2 నుంచి 3, 4 అని చెబుతారు, అంతేగా, అంటారా..? అయితే అలా కాదు. ఎవ‌రైనా త‌మ శ‌రీర బ‌రువుకు త‌గిన‌ట్టుగా నీటిని తాగాల‌ట‌. దీంతో ఇంకా మంచి ఫ‌లితం ఉంటుంద‌ని వైద్యులు చెబుతున్నారు. 



    శ‌రీర బ‌రువును బ‌ట్టి ఆయా వ్య‌క్తులు రోజూ తాగాల్సిన నీటి వివ‌రాలు... 




























  • 45 కేజీల బరువున్నవారు రోజుకి 1.9 లీటర్లు
  • 50 కేజీలు ఉన్న వారు రోజుకి 2.1 లీటర్లు
  • 55 కేజీలు ఉన్న వారు రోజుకి 2.3 లీటర్లు
  • 60 కేజీలు ఉన్న వారు రోజుకి 2.5 లీటర్లు
  • 65 కేజీలు ఉన్న వారు రోజుకి 2.7 లీటర్లు
  • 70 కేజీలు ఉన్న వారు రోజుకి 2.9 లీటర్లు
  • 75 కేజీలు ఉన్న వారు రోజుకి 3.2 లీటర్లు
  • 80 కేజీలు ఉన్న వారు రోజుకి 3.5 లీటర్లు
  • 85 కేజీలు ఉన్న వారు రోజుకి 3.7 లీటర్లు
  • 90 కేజీలు ఉన్న వారు రోజుకి 3.9 లీటర్లు
  • 95 కేజీలు ఉన్న వారు రోజుకి 4.1 లీటర్లు
  • 100 కేజీలు ఆపైన బ‌రువు ఉన్న వారు రోజుకి 4.3 లీటర్లు



  • లివ‌ర్ శుభ్ర‌ప‌డాలంటే... ఇవి తినాలి..!




    మ‌న శరీరంలో ఉన్న అవ‌య‌వాల‌న్నింటిలోకెల్లా లివ‌ర్ (కాలేయం) పెద్ద‌దైన అవ‌య‌వం. ర‌క్తంలో ఉన్న విష ప‌దార్థాల‌ను తొల‌గించ‌డం, శ‌రీరానికి అవ‌స‌ర‌మైన‌ప్పుడు శ‌క్తిని అందించ‌డం వంటి ఎన్నో ప‌నుల‌ను లివర్ నిత్యం చేస్తూనే ఉంటుంది. అయితే నిత్యం మ‌నం తీసుకునే ఆహారం, కాలుష్యం, మ‌ద్య‌పానం, ధూమ‌పానం, అనారోగ్యాలు త‌దిత‌ర కార‌ణాల వ‌ల్ల లివ‌ర్ పనితీరులో మార్పు వ‌స్తుంది. దీంతో మ‌న దేహం మ‌రింత అస్వ‌స్థ‌త‌కు లోన‌వుతుంది. అయితే కింద ఇచ్చిన ప‌లు ఆహార ప‌దార్థాల‌ను నిత్యం ఆహారంలో తీసుకుంటే లివ‌ర్ ప‌నిత‌నాన్ని మెరుగుప‌ర‌వ‌చ్చు. దీంతో అనారోగ్యాలు కూడా దూర‌మ‌వుతాయి. అంతేకాదు లివ‌ర్‌లో ఉన్న విష ప‌దార్థాలు తొల‌గిపోతాయి. 

    బీట్‌రూట్‌, క్యారెట్‌...
    బీట్‌రూట్‌, క్యారెట్ల‌లో లివ‌ర్‌ను శుద్ధి చేసే ఔష‌ధ గుణాలు ఉన్నాయి. రెండింటిలోనూ ప్లాంట్ ఆధారిత ఫ్లేవ‌నాయిడ్స్‌, బీటా కెరోటీన్ స‌మృద్ధిగా ల‌భిస్తాయి. ఇవి లివ‌ర్ ప‌నిత‌నాన్ని మెరుగు ప‌రుస్తాయి. 

    ట‌మాటాలు...
    గ్లూటాథియోన్ అని పిల‌వ‌బ‌డే ప‌దార్థం టామాటాల్లో ఎక్కువ‌గా ఉంటుంది. ట‌మాటాల‌ను నిత్యం తీసుకుంటే దాంట్లోని ఔష‌ధ కార‌కాలు లివ‌ర్‌ను శుద్ధి చేస్తాయి. దీంతో లివ‌ర్ బాగా ప‌నిచేస్తుంది. 

    పాల‌కూర‌... 
    లివ‌ర్‌లోని విష ప‌దార్థాల‌ను బ‌య‌టికి పంపించ‌డంలో పాల‌కూర బాగా ప‌నిచేస్తుంది. దాంట్లోని ఔష‌ధ గుణాలు లివ‌ర్‌ను శుభ్రం చేస్తాయి. లివ‌ర్ ఆరోగ్యాన్ని మెరుగుప‌రుస్తాయి. 

    నిమ్మ‌జాతి పండ్లు...
    విట‌మిన్ సి ఎక్కువ‌గా ఉండే నిమ్మ‌తోపాటు ఆ జాతి పండ్ల‌న్నీ లివ‌ర్ ఆరోగ్యం కోసం ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డ‌తాయి. లివ‌ర్‌ను శుద్ధి చేసే గుణాలు వాటిలో ఉన్నాయి. వాటిని త‌ర‌చూ తీసుకుంటుంటే లివ‌ర్ ఆరోగ్యం మెరుగుప‌డుతుంది. 

    క్యాబేజీ...
    ఐసోథ‌యోసయ‌నేట్స్ అని పిల‌వ‌బ‌డే ఔష‌ధ కార‌కాలు లివ‌ర్‌లో పేరుకుపోయిన విష ప‌దార్థాల‌ను బ‌య‌టికి పంపుతాయి. అవి క్యాబేజీలో ఎక్కువ‌గా ఉంటాయి. క్యాబేజీని మ‌న ఆహారంలో త‌ర‌చూ తీసుకుంటుంటే లివ‌ర్ ఆరోగ్యం మెరుగుప‌డుతుంది. 

    ప‌సుపు...
    కార్సినోజెన్లు అన‌బ‌డే విష‌పూరిత ర‌సాయ‌నాలు లివ‌ర్‌లో పేరుకుపోతుంటాయి. వాటిని తొల‌గించ‌డంలో పసుపు బాగా ప‌నిచేస్తుంది. దాంతో లివ‌ర్ ఆరోగ్యం కూడా మెరుగు ప‌డుతుంది. 

    వాల్‌న‌ట్స్‌...
    వాల్‌నట్స్‌లో గ్లూటాథియోన్‌, ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు, అమైనో యాసిడ్లు ఎక్కువగా ఉంటాయి. ఇవ‌న్నీ లివ‌ర్‌ను శుభ్రం చేసి దాని ఆరోగ్యం మెరుగు ప‌డేలా చేస్తాయి. 

    అవ‌కాడోలు...
    అవ‌కాడోలు కూడా లివ‌ర్ ప‌నిత‌నాన్ని మెరుగు ప‌రుస్తాయి. లివ‌ర్‌లో పేరుకుపోయిన వ్య‌ర్థాల‌ను తొల‌గిస్తాయి. 

    యాపిల్స్‌...
    లివ‌ర్‌ను శుభ్ర ప‌రుచుకోవాలంటే నిత్యం ఒక యాపిల్‌ను తింటే చాలు. దీంతో లివ‌ర్ ప‌నిత‌నం పెరుగుతుంది. తద్వారా అనారోగ్యాలు కూడా దూర‌మ‌వుతాయి. 

    వెల్లుల్లి...
    శ‌రీరంలో పేరుకుపోయిన విష ప‌దార్థాలే కాదు, లివ‌ర్‌లోని వ్య‌ర్థాల‌ను తొల‌గించ‌డంలోనూ వెల్లుల్లి బాగానే ప‌నిచేస్తుంది. వెల్లుల్లిలో ఆలిసిన్‌, సెలీనియం వంటి ఔష‌ధ కారకాలు ఎక్కువ‌గా ఉన్నాయి. ఇవి లివ‌ర్ ఆరోగ్యాన్ని మెరుగు ప‌రుస్తాయి. 

    గ్రీన్ టీ...
    గ్రీన్ టీలో క్యాథెకిన్స్ అని పిల‌వ‌బ‌డే యాంటీ ఆక్సిడెంట్లు పుష్క‌లంగా ఉంటాయి. ఇవి లివ‌ర్‌కు చాలా మంచి చేస్తాయి. లివ‌ర్‌లోని వ్య‌ర్థాల‌ను బ‌య‌టికి పంపుతాయి. 

    ఆలివ్ ఆయిల్‌...
    లివ‌ర్‌లోని విష పదార్థాల‌ను తొల‌గించ‌డంలో ఆలివ్ ఆయిల్ కూడా బాగానే ఉప‌యోగ‌ప‌డుతుంది. దీన్ని నిత్యం మ‌న వంటల్లో భాగం చేసుకుంటే చాలు. దాని వ‌ల్ల లివ‌ర్‌కు ఎంతో ఉప‌యోగం క‌లుగుతుంది.



    బాదం ప‌ప్పు నిత్యం తింటే బ‌రువు త‌గ్గుతారా..?



    బాదం ప‌ప్పును నిత్యం తీసుకుంటే బ‌రువు త‌గ్గుతారా..? అంటే, అవును. తగ్గుతారు. ఈ విష‌యాన్ని మేం చెప్ప‌డం లేదు. సాక్షాత్తూ ప‌రిశోధ‌న‌లే చెబుతున్నాయి. నిత్యం దాదాపు 1.5 ఔన్సుల మోతాదులో బాదం ప‌ప్పును తింటే బ‌రువు త‌గ్గుతార‌ని తెలిసింది. 

    అమెరికాలోని పెన్ స్టేట్ యూనివ‌ర్సిటీకి చెందిన ప‌రిశోధ‌కులు 52 మంది ఊబ‌కాయుల‌ను త‌మ ప‌రిశోధ‌న కోసం తీసుకున్నారు. అందులో స‌గం మందికి నిత్యం 1.5 ఔన్సుల (దాదాపు 42 గ్రాములు) మోతాదులో బాదం ప‌ప్పును ఇచ్చారు. మిగ‌తా స‌గం మందికి ఇవ్వ‌లేదు. అలా వారిపై 12 వారాల పాటు ప‌రిశోధ‌న‌లు చేశారు. ఈ క్ర‌మంలో చివ‌రికి తెలిసిందేమిటంటే నిత్యం బాదం ప‌ప్పును తిన్న వారిలో చెడు కొలెస్ట్రాల్ త‌గ్గి మంచి కొలెస్ట్రాల్ పెరిగింద‌ట‌. అంతేకాదు వారి శ‌రీర బ‌రువు, పొట్ట ద‌గ్గ‌ర ఉన్న కొవ్వు కూడా త‌గ్గిపోయిందట‌. ఇక బాదం ప‌ప్పు తిన‌ని వారిలో ఎలాంటి మార్పు రాలేద‌ట‌. అంటే నిత్యం 42 గ్రా. బాదం ప‌ప్పును తింటే క‌చ్చితంగా బ‌రువు త‌గ్గించుకోవ‌చ్చ‌న్న‌మాటే!


    ఇది చ‌దివాక అర‌టి పండు తొక్క‌ను పారేయ‌రు..!





    అరటి పండును తినడం వ‌ల్ల మ‌న‌కు ఎలాంటి ఆరోగ్య‌క‌ర ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయో అంద‌రికీ తెలిసిందే. మ‌న‌కు మేలు చేసే ఎన్నో ర‌కాల పోష‌కాలు అర‌టి పండ్ల‌లో ఉన్నాయి. అయితే కేవ‌లం అర‌టి పండే కాదు దాని తొక్క‌తో కూడా మ‌న‌కు అనేక లాభాలే ఉన్నాయి. అవేమిటో ఇప్పుడు చూద్దాం. 

    1. దంతాల సంర‌క్ష‌ణ‌కు అర‌టి పండు తొక్క బాగా ఉప‌యోగ‌ప‌డుతుంది. అర‌టి పండు తొక్క లోప‌లి భాగాన్ని దంతాల‌పై రోజూ రుద్దాలి. క‌నీసం ఇలా వారం పాటు చేస్తే దంతాలు తెల్ల‌గా మెరుస్తాయి.

    2. కాలిన గాయాలు, దెబ్బ‌ల‌కు అర‌టి పండు తొక్క ఔష‌ధంగా ప‌నిచేస్తుంది. స‌మ‌స్య ఉన్న ప్రాంతంపై అర‌టి పండు తొక్క‌ను ఉంచి క‌ట్టు క‌ట్టాలి. రాత్రంతా దాన్ని అలాగే ఉంచాలి. రోజూ రాత్రి ఇలా చేస్తే ఒక‌టి, రెండు రోజుల్లోనే దెబ్బ‌లు మానిపోతాయి.

    3. ముఖ సౌంద‌ర్యాన్ని పెంచుకునేందుకు కూడా అర‌టి పండు తొక్క ఉప‌యోగ‌ప‌డుతుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్క‌లంగా ఉన్నాయి. ఇవి చ‌ర్మాన్ని ర‌క్షిస్తాయి. అంతేకాదు యాంటీ ఏజింగ్ గుణాలు కూడా అర‌టి పండు తొక్క‌లో ఉన్నాయి. దీని వ‌ల్ల వృద్ధాప్యం కార‌ణంగా వ‌చ్చే ముడ‌త‌లు త‌గ్గిపోతాయి. చ‌ర్మం కాంతివంత‌మ‌వుతుంది. అర‌టి పండు తొక్క లోపలి భాగాన్ని ముఖంపై రుద్ది అర‌గంట సేపు ఆగాక గోరు వెచ్చ‌ని నీటితో ముఖాన్ని క‌డిగేయాలి. దీంతో పైన చెప్పిన చ‌ర్మ స‌మ‌స్య‌లు పోతాయి. చ‌ర్మం ఆరోగ్యాన్ని సంత‌రించుకుంటుంది.

    4. చ‌ర్మంపై ఏర్ప‌డే దుర‌ద‌లు, మంట‌ల‌ను త‌గ్గించ‌డంలోనూ అర‌టి పండు తొక్క ఉప‌యోగ‌ప‌డుతుంది. స‌మ‌స్య ఉన్న ప్ర‌దేశంపై అర‌టి పండు తొక్క‌ను రాసి 10 నిమిషాలు ఆగాక క‌డిగేయాలి. దీంతో దుర‌ద‌, మంట త‌గ్గిపోతుంది.

    5. శ‌రీరంలో ఏదైనా భాగం నొప్పిగా ఉంటే అక్క‌డ అర‌టి పండు తొక్క‌ను కొద్ది సేపు మ‌సాజ్ చేసిన‌ట్టు రాయాలి. ఇలా చేస్తే 15 నిమిషాల్లోనే నొప్పి మాయ‌మ‌వుతుంది.

    6. పురుగులు, కీట‌కాలు కుట్టిన చోట దుర‌ద‌గా ఉన్నా అర‌టి పండు తొక్క‌ను రాస్తే చాలు. వెంట‌నే ఉప‌శ‌మ‌నం క‌లుగుతుంది.




    అనారోగ్యాల‌ను దూరం చేసే పుదీనా...




    పుదీనాను నిత్యం మ‌నం వంటకాల్లో ఉప‌యోగిస్తుంటాం. ఇది ఘాటైన తాజా వాస‌న‌ను క‌లిగి ఉంటుంది. ఇందులో ఉండే ఔష‌ధ గుణాలు మ‌న‌కు ఎంతో మేలు క‌లిగిస్తాయి. ఈ క్ర‌మంలో పుదీనాతో ఎలాంటి అనారోగ్యాల‌ను దూరం చేసుకోవ‌చ్చో ఇప్పుడు తెలుసుకుందాం. 

    1. పుదీనా ఆకుల‌ను వేసి కాచిన టీని తాగితే జీర్ణ‌వ్య‌వ‌స్థ ప‌నితీరు మెరుగ‌వుతుంది. మ‌ల‌బ‌ద్ద‌కం, అజీర్ణం, గ్యాస్ వంటి స‌మ‌స్య‌లు పోతాయి. 

    2. పుదీనా ఆకుల‌ను మెత్త‌గా న‌లిపి మిశ్ర‌మంగా చేసి దాంతో ప‌ళ్లు తోముకుంటే మిల మిల మెరుస్తాయి. 

    3. చ‌ర్మంపై ఎక్క‌డైనా దుర‌ద‌గా, మంట‌గా ఉంటే కొన్ని పుదీనా ఆకుల‌ను న‌లిపి ఆయా ప్ర‌దేశాల‌పై ఉంచితే ఆ సమ‌స్య‌ల నుంచి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది. 

    4. పుదీనా ఆకుల ర‌సం, నిమ్మ‌ర‌సం, తేనెల‌ను ఒక టీస్పూన్ మోతాదులో తీసుకుని అన్నింటినీ బాగా క‌లిపి తీసుకుంటే అజీర్ణం, క‌డుపు ఉబ్బ‌రం, వికారం, వాంతులు త‌గ్గుతాయి. 

    5. పుదీనా ఆకుల‌ను బాగా న‌లిపి ముద్ద‌గా చేసి దాన్ని నుదుటిపై ఉంచితే త‌ల‌నొప్పి ఇట్టే త‌గ్గిపోతుంది. 

    6. పుదీనా ఆకుల‌తో కాచిన క‌షాయంలో ఉప్పు క‌లిపి పుక్కిలిస్తే గొంతు నొప్పి స‌మ‌స్య తొల‌గిపోతుంది. దంత సంబంధ వ్యాధుల‌కు కూడా ఈ మిశ్ర‌మాన్ని వాడ‌వ‌చ్చు. 

    7. పుదీనా ఆకుల్ని మెత్త‌గా పేస్ట్ చేసి అందులో కొంత పసుపు క‌లిపి ఆ మిశ్ర‌మాన్ని ముఖానికి రాసి 15 నిమిషాల త‌రువాత ముఖం క‌డిగేయాలి. ఇలా చేస్తుంటే ముఖం సౌంద‌ర్యాన్ని సంత‌రించుకుంటుంది. చ‌ర్మం మృదువుగా మారుతుంది. 

    8. కొన్ని పుదీనా ఆకుల‌ను తీసుకుని మెత్త‌ని పేస్ట్‌లా చేసుకోవాలి. దాంట్లో కోడిగుడ్డు తెల్ల సొన క‌ల‌పాలి. ఈ మిశ్ర‌మాన్ని ముఖానికి రాసుకుంటే మ‌చ్చ‌లు, మొటిమ‌లు పోతాయి. 

    9. పుదీనా ఆకుల‌తో త‌యారు చేసిన నూనె మ‌న‌కు మార్కెట్‌లో ల‌భ్య‌మ‌వుతుంది. దీన్ని రాసుకుంటే జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. వెంట్రుక‌లు దృఢంగా మారుతాయి.





    నిత్యం ఒక క‌ప్పు అల్లం ర‌సం తాగితే..?




    మ‌న వంటింట్లో అల్లం క‌చ్చితంగా ఉంటుంది. దాన్ని మ‌నం వివిధ ర‌కాల వంట‌ల్లోనూ విరివిగా ఉప‌యోగిస్తూనే ఉంటాం. దీంట్లో అనేక ర‌కాల ఔష‌ధ గుణాలు కూడా ఉన్నాయి. ఈ క్ర‌మంలో నిత్యం ఉద‌యాన్నే ఒక క‌ప్పు అల్లం ర‌సం తీసుకోవ‌డం వ‌ల్ల క‌లిగే ప్ర‌యోజనాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం. 

    అల్లం ర‌సాన్ని డైరెక్ట్‌గా ఎవ‌రూ తాగలేరు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. ఈ క్ర‌మంలో అల్లం ముక్క‌ను న‌లిపి దాన్ని పిండి త‌యారు చేసిన ఒక టీస్పూన్ ర‌సాన్ని ఒక చిన్న‌గ్లాస్ నీటిలో క‌లుపుకుని తాగితే చాలు. దాంతో ఎంతో ప్ర‌యోజ‌నం క‌లుగుతుంది. 

    1. యాంటీ డ‌యాబెటిక్ గుణాలు అల్లం ర‌సంలో పుష్క‌లంగా ఉన్నాయి. నిత్యం అల్లం ర‌సం తాగుతూ ఉంటే ర‌క్తంలోని చ‌క్కెర స్థాయిలు అదుపులోకి వ‌స్తాయి. షుగ‌ర్ వ్యాధి నియంత్ర‌ణ‌లో ఉంటుంది. 

    2. ఫినాల్స్‌, ఫ్లేవ‌నాయిడ్స్ అనే ర‌సాయ‌నాలను న్యూరో ప్రొటెక్ట‌ర్స్ అంటారు. ఇవి మెద‌డుకు ఉత్తేజాన్ని క‌లిగిస్తాయి. అల్లం ర‌సంలో ఈ ర‌సాయ‌నాలు స‌మృద్ధిగా ఉన్నాయి. దీంతో అల్లం ర‌సాన్ని నిత్యం తాగితే మెద‌డు చురుగ్గా ప‌నిచేస్తుంది. వ‌య‌స్సు మ‌ళ్లిన వారిలో వ‌చ్చే అల్జీమ‌ర్స్‌, మెంటల్ డిజార్డ‌ర్స్ త‌గ్గిపోతాయి. 

    3. ప‌లు ర‌కాల క్యాన్స‌ర్ల‌కు వ్య‌తిరేకంగా పోరాడే గుణాలు అల్లం ర‌సంలో ఉన్నాయి. నిత్యం అల్లం ర‌సం తాగే వారికి క్యాన్స‌ర్ వ‌చ్చే అవ‌కాశాలు త‌క్కువ‌గా ఉంటాయి. 

    4. జీర్ణ సంబంధ వ్యాధుల‌కు అల్లం చ‌క్క‌ని పరిష్కారం చూపుతుంది. అల్లం ర‌సంతో వికారం, హార్ట్ బ‌ర్న్‌, అసిడిటీ, గ్యాస్‌, అల‌స‌ట‌, డ‌యేరియా, అజీర్ణం, ఇన్‌ఫెక్ష‌న్లు, ద‌గ్గు వంటి వ్యాధుల‌ను త‌గ్గించుకోవ‌చ్చు. 

    5. శ‌రీరంలో ఉన్న చెడు కొలెస్ట్రాల్‌ను త‌గ్గించుకునేందుకు అల్లం ర‌సం ఉప‌యోగ‌ప‌డుతుంది. నిత్యం అల్లం రసం తాగితే నొప్పులు త‌గ్గిపోతాయి. ప్ర‌ధానంగా కీళ్ల నొప్పులు, వాపులు త‌గ్గుతాయి. యాంటీ ఇన్‌ఫ్లామేట‌రీ గుణాలు దీంట్లో ఉన్నాయి.


    నిత్యం ఒక గ్లాస్ క్యారెట్ జ్యూస్‌ తాగితే..?


    క్యారెట్‌ను త‌ర‌చూ మ‌న ఆహారంలో తీసుకుంటే దాంతో మ‌న‌కు ఎంతో ఆరోగ్య‌క‌ర ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయ‌ని అంద‌రికీ తెలిసిందే. ఎన్నో ర‌కాల విట‌మిన్లు, మిన‌ర‌ల్స్ క్యారెట్ల‌లో ఉన్నాయి. ఈ క్ర‌మంలో నిత్యం ఒక గ్లాస్ క్యారెట్ జ్యూస్‌ను అలాగే ప‌చ్చిగా తాగ‌డం వ‌ల్ల మ‌న‌కు ఎలాంటి లాభాలు క‌లుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. 

    1. మ‌హిళ‌లు నిత్యం ఒక గ్లాస్ క్యారెట్ జ్యూస్‌ను తాగితే రొమ్ము క్యాన్స‌ర్ వ‌చ్చే అవ‌కాశాలు గ‌ణ‌నీయంగా త‌గ్గుముఖం ప‌డ‌తాయి. 

    2. క్యారెట్ల‌లో ఉండే విట‌మిన్ ఎ, బీటా కెరోటీన్‌లు కంటి ఆరోగ్యాన్ని మెరుగు ప‌రుస్తాయి. కంటి చూపును మెరుగు ప‌రుస్తాయి. 

    3. వ‌యస్సు మీద ప‌డ‌డం కార‌ణంగా వ‌చ్చే ముడ‌త‌లు త‌గ్గిపోతాయి. ముఖ సౌంద‌ర్యం పెరుగుతుంది. చ‌ర్మం మృదువుగా మారుతుంది. 

    4. గుండె సంబంధిత వ్యాధులు రాకుండా ఉంటాయి. 

    5. డయాబెటిస్ వ్యాధిగ్ర‌స్తుల‌కు క్యారెట్ జ్యూస్ ఎంత‌గానో మేలు చేస్తుంది. బ్ల‌డ్ షుగ‌ర్ లెవ‌ల్స్ అదుపులో ఉంటాయి. 

    6. రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది. స్వ‌ల్ప అనారోగ్యాల‌ను కూడా త‌ట్టుకునే శ‌క్తి వ‌స్తుంది. 

    7. ఐర‌న్ పుష్క‌లంగా ఉండ‌డంతో ర‌క్త‌హీన‌త స‌మ‌స్య తొల‌గిపోతుంది. ర‌క్తం బాగా వృద్ధి చెందుతుంది.

    8. ఎముక‌లు దృఢంగా మారుతాయి. న‌రాల బ‌ల‌హీన‌త పోతుంది. జీర్ణ సంబంధ స‌మ‌స్య‌లు దూర‌మ‌వుతాయి. 

    9. మ‌ల‌బ‌ద్ద‌కం పోతుంది. శ్వాస స‌మ‌స్య‌లు దూర‌మ‌వుతాయి. అసిడిటీ రాదు.




    నొప్పుల‌ను త‌గ్గించే ఎఫెక్టివ్ టిప్‌..



    నిత్యం శారీర‌క శ్ర‌మ ఎక్కువ‌గా చేసేవారు, బాగా అల‌సిపోయే వారికి ఒళ్లు నొప్పులు రావ‌డం స‌హ‌జం. దీంతోపాటు అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్న వారిని కూడా అప్పుడ‌ప్పుడు ఒళ్లు నొప్పులు ఇబ్బంది పెడ‌తాయి. అయితే కింద ఇచ్చిన ఓ టిప్‌ను పాటిస్తే బాడీ పెయిన్స్‌ను సుల‌భంగా త‌గ్గించుకోవ‌చ్చు. ఈ టిప్‌తో కేవ‌లం బాడీ పెయిన్స్ మాత్ర‌మే కాదు, ఇత‌ర నొప్పుల‌ను కూడా ఎఫెక్టివ్‌గా త‌గ్గించుకోవ‌చ్చు. 

    కొద్దిగా ఆలివ్ ఆయిల్‌ను తీసుకుని దాంట్లో కొంత ఉప్పు వేసి బాగా క‌ల‌పాలి. దీంతో మెత్త‌ని పేస్ట్‌లా త‌యార‌వుతుంది. ఈ పేస్ట్‌ను శ‌రీరంపై నొప్పి ఉన్న చోటల్లా రాయాలి. దీంతో నొప్పులు త‌గ్గిపోతాయి. వెన్ను నొప్పి, కీళ్ల నొప్పి, భుజాల నొప్పి ఇలా వివిధ ర‌కాల నొప్పుల‌ను కూడా ఈ మిశ్రమంతో త‌గ్గించుకోవ‌చ్చు. ఆలివ్ ఆయిల్‌, ఉప్పుల‌లో ఉండే స‌హజ సిద్ధ‌మైన ఔష‌ధ గుణాలు వివిధ ర‌కాల నొప్పుల‌ను త‌గ్గించ‌డంలో ఎఫెక్టివ్‌గా ప‌నిచేస్తాయి.


    త‌ల‌నొప్పి త‌గ్గాలంటే ఈ చిట్కాలను పాటించండి..!








    త‌ల నొప్పి అనేది స‌ర్వ సాధార‌ణం. వ‌య‌స్సుతో సంబంధం లేకుండా త‌ల‌నొప్పి వ‌స్తుంటుంది. అయితే ఇలా వచ్చే త‌ల‌నొప్పిని త‌గ్గించుకునేందుకు ప్ర‌తీ సారీ మందులు మింగ‌డం మ‌న‌కు అల‌వాటై పోయింది. వాటితో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ క‌లుగుతాయో అంద‌రికీ తెలిసిందే. ఈ క్ర‌మంలో కింద ఇచ్చిన ప‌లు చిట్కాల‌ను పాటిస్తే త‌ల‌నొప్పిని ఎఫెక్టివ్‌గా త‌గ్గించుకోవ‌చ్చు. ఆ చిట్కాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం. 

    1. ఒక గ్లాసుడు గోరువెచ్చటి నీళ్లు తీసుకొని దాంట్లో కొంచెం నిమ్మరసం కలపాలి. ఈ మిశ్రమం తాగడం వల్ల నొప్పి తీవ్రత తగ్గుతుంది. ఈ చిట్కా చాలా తలనొప్పులకు పనిచేస్తుంది. ఎందుకంటే తలనొప్పులు చాలా వరకు కడుపులో గ్యాస్ చేరడం వల్ల వస్తాయి. ఈ మిశ్రమం కడుపులోని గ్యాస్‌తోపాటు, తలనొప్పిని కూడా తగ్గిస్తుంది. 

    2. తలనొప్పి తగ్గించుకోవడానికి మరో మార్గం తలకు యూకలిప్టస్ తైలంతో మర్దన చేయడం. ఎందుకంటే యూకలిప్టస్ మంచి నొప్పి నివారణి.

    3. ఆవు పాలు వెచ్చబెట్టి తాగితే తలనొప్పి తగ్గుతుంది. తరచుగా తల నొప్పి వస్తుంటే భోజనంలో నెయ్యి చేర్చుకుంటే మంచి గుణం కనిపిస్తుంది.

    4. ధనియాలు, చక్కెర, నీళ్లు కలిపి తాగినా కూడా తలనొప్పి తగ్గుతుంది. జలుబు వల్ల వచ్చిన తలనొప్పయితే ఈ వంటింటి చిట్కా చాలా మంచి ప్రభావాన్ని చూపుతుంది.

    5. గంధపు చెక్కపై నీళ్ల చుక్క వేసి రాయి మీద రుద్ది పేస్టులాంటి గంధం తీయాలి. దీన్ని నుదుటి మీద రాసుకుంటే తలనొప్పి పూర్తిగా తగ్గుతుంది. 

    6. తలకు కొబ్బరి నూనెతో 10, 15 నిమిషాల పాటు మర్ధనా చేసుకుంటే తలనొప్పి తగ్గిపోతుంది. వేసవిలో వచ్చే తలనొప్పికి ఈ చిట్కా చాలా బాగా పనిచేస్తుంది. కొబ్బరి నూనె మాడుకు చల్లదనాన్ని ఇస్తుంది.

    7. కొన్ని వెల్లుల్లి రెబ్బలు తీసుకొని వాటి నుంచి రసం తీసి కనీసం ఒక టీస్పూన్ వెల్లుల్లి రసం తాగాలి. ఇలా చేస్తే త‌ల‌నొప్పి త‌గ్గిపోతుంది. 

    8. కుర్చీలో కూర్చొని పాదాలను వేడి నీళ్లు నింపిన బకెట్‌లో ఉంచాలి. నిద్రకు ముందు ఇలా కనీసం పావుగంట పాటు చెయ్యడం వల్ల దీర్ఘకాలికంగా ఉన్న తలనొప్పి, సైనస్ వల్ల వచ్చిన తలనొప్పి తగ్గిపోతుంది. ఇలా రెండు నుంచి మూడు వారాల పాటు చెయ్యాలి. 

    9. ఉదయం నిద్ర లేవగానే ఒక ఆపిల్ ముక్కకు ఉప్పు రాసుకొని తినాలి. తర్వాత గోరు వెచ్చని నీళ్లు లేదా పాలు తాగాలి. ఇలా క్రమం తప్పకుండా పదిరోజుల పాటు చేస్తే ఎప్పటినుంచో వేధిస్తున్న తలనొప్పి కూడా తగ్గిపోతుంది. 

    10. బాదం నూనె వెచ్చబెట్టి 15 నిమిషాల పాటు తలకు మర్థన చేస్తె తలనొప్పి తగ్గిపోతుంది.

    11. కొత్తి మీర, జీలకర్ర, అల్లం కలిపి చేసిన కషాయం తాగితే తలనొప్పి తేలికగా వేగంగా తగ్గిపోతుంది. నీళ్లల్లో కొత్తిమీర, జీలకర్ర, అల్లం వేసి మరిగించి దాన్ని వడపోసి తాగాలి. తలనొప్పి తగ్గే దాకా రోజుకు రెండు మూడు సార్లు తాగాలి. 

    12. తలనొప్పి వల్ల బాధ పడుతుంటే వెన్న, చాక్లెట్లు, మాంసాహారం వంటి పదార్థాలు అసలు తీసుకోకూడదు. విటమిన్ సి, డి, బి12, మాంసకృత్తులు, కాల్షియం ఎక్కువగా ఉండే ఆహారపదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి. క్యాబేజీ, కాలిఫ్లవర్, మెంతి కూర, ఇతర ఆకు కూరల్లాంటి పచ్చటి, ఆకు పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి. తలనొప్పి రాకూడదనుకుంటే బయటదొరికే జంక్ ఫుడ్ తీసుకోవడం మానెయ్యాలి.


    భోజ‌నం చేశాక ఏయే పండ్ల‌ను తినాలో తెలుసా..?


    ఉద‌యం అల్పాహార‌మైనా, మ‌ధ్యాహ్నం లంచ్‌ లేదా రాత్రి డిన్న‌ర్ అయినా భోజ‌నం చేశాక కొంత సేప‌టికి అధిక శాతం మందికి గ్యాస్ స‌మ‌స్య వ‌స్తుంటుంది. తిన్న‌ది స‌రిగ్గా అర‌గ‌క‌పోవ‌డమో, ఎక్కువ‌గా తిన‌డ‌మో, ఇత‌ర జీర్ణ సంబంధ స‌మ‌స్య‌ల వ‌ల్లో ఇలా జ‌రుగుతూ ఉంటుంది. అదే ఆహారం స‌రిగ్గా జీర్ణ‌మైతే అలా గ్యాస్ రాదు. ఈ క్ర‌మంలో తిన్న ఆహారం స‌రిగ్గా జీర్ణ‌మై త‌రువాత గ్యాస్ రాకుండా ఉండాలంటే ప‌లు పండ్ల‌ను తింటే చాలు. దీంతో ఇత‌ర జీర్ణ సంబంధ స‌మ‌స్య‌లు కూడా పోతాయి. 

    యాపిల్‌...
    భోజ‌నం చేశాక 15 నిమిషాల త‌రువాత ఈ పండును తిన‌వ‌చ్చు. దీంట్లో ఉండే ఔష‌ధ గుణాల వ‌ల్ల మ‌నం తిన్న ఆహారం స‌రిగ్గా జీర్ణ‌మ‌వుతుంది. గ్యాస్, అసిడిటీలు రావు. స‌న్న‌గా ముక్క‌ల్లా క‌ట్ చేసి యాపిల్‌ను తింటే ఇంకా మంచిది. 

    అర‌టిపండు... 
    భోజ‌నం చేశాక అర‌టి పండును తింటే ఎంతో మంచిది. దీని వ‌ల్ల మ‌న జీర్ణ వ్య‌వ‌స్థ స‌రిగ్గా ప‌నిచేస్తుంది. తిన్న ఆహారం సరిగ్గా జీర్ణ‌మ‌వుతుంది. గ్యాస్ రాదు. 

    బొప్పాయి...
    బొప్పాయిలో మ‌నకు ఆరోగ్యాన్ని క‌లిగించే ఔష‌ధ కార‌కాలు ఎన్నో ఉన్నాయి. వీటి వ‌ల్ల అజీర్తి స‌మ‌స్య తొల‌గిపోతుంది. భోజ‌నం చేసిన త‌రువాత బొప్పాయి పండ్ల‌ను తింటే మ‌న జీర్ణ‌వ్య‌వ‌స్థ శుభ్ర ప‌డుతుంది. ఆహారం త్వ‌ర‌గా జీర్ణ‌మ‌వుతుంది. 

    పైనాపిల్‌...
    పైనాపిల్‌లో బ్రొమెలిన్ అనే ఎంజైమ్ ఉంటుంది. ఇది జీర్ణాశ‌య ప‌నితీరును మెరుగు ప‌రుస్తుంది. గ్యాస్‌, అజీర్ణం, అసిడిటీ వంటి స‌మ‌స్య‌లు ఉన్న వారు భోజ‌నం చేశాక ఈ పండును తింటే ఫ‌లితం ఉంటుంది. 

    అంజీర్‌...
    అంజీర్ పండ్లు మ‌న‌కు డ్రై ఫ్రూట్స్ రూపంలోనూ ల‌భిస్తాయి. వీటిని తింటే జీర్ణ వ్య‌వ‌స్థ శుభ్ర ప‌డుతుంది. వ్య‌ర్థాలు బ‌య‌టికి పోతాయి. అంతే కాదు అంజీర్ పండ్ల వ‌ల్ల మ‌న‌కు త‌క్ష‌ణ‌మే శ‌క్తి ల‌భిస్తుంది.



    సుల‌భంగా పొట్ట త‌గ్గాలంటే..?



    అధికంగా ఉన్న పొట్ట‌ను త‌గ్గించుకునేందుకు ఎన్నో క‌ష్టాలు ప‌డుతున్నారా? ఏవేవో ప‌ద్ధ‌తుల‌ను పాటిస్తూ స‌మ‌యం వృథా చేసుకుంటున్నారా? అయితే కింద ఇచ్చిన టిప్స్‌ను ఓసారి పాటించి చూడండి. దీంతో మీ శ‌రీరంలో పొట్ట ద‌గ్గ‌రి కొవ్వును సుల‌భంగా త‌గ్గించుకోవ‌చ్చు. దీంతో పొట్ట కూడా త‌గ్గిపోతుంది. ఆ టిప్స్ ఏమిటో ఇప్పుడు చూద్దాం... 

    1. ఒక గ్లాసు గోరు వెచ్చ‌ని నీటిలో కొంత నిమ్మ‌ర‌సం వేసి బాగా క‌లపాలి. ఉద‌యాన్నే ప‌ర‌గడుపున ఈ మిశ్ర‌మం తాగితే అధికంగా ఉన్న పొట్ట త‌గ్గిపోతుంది. 

    2. ఒక గ్లాస్ నీటిలో 2 టేబుల్ స్పూన్ల క్రాన్ బెర్రీ జ్యూస్‌ను వేసి బాగా క‌ల‌పాలి. ఈ ద్ర‌వాన్ని భోజ‌నానికి ముందు తాగితే మంచి ఫ‌లితం ఉంటుంది. 

    3. ఒక క‌ప్పు గోరు వెచ్చ‌ని నీటిలో నువ్వుల నూనె 1 టీ స్పూన్‌, అల్లం రసం 1 టీస్పూన్ వేసి బాగా క‌ల‌పాలి. ఈ ద్ర‌వాన్ని రోజుకు రెండు సార్లు తీసుకుంటే మంచి ఫ‌లితం ఉంటుంది. 

    4. ఒక కప్పు గోరు వెచ్చ‌ని నీటిలో అవిసె గింజ‌ల పొడి 1 టీ స్పూన్‌, తేనె ఒక టీస్పూన్ వేసి బాగా క‌ల‌పాలి. ఈ మిశ్ర‌మాన్ని రాత్రి నిద్ర‌కు ఉప‌క్ర‌మించే ముందు తాగితే పొట్ట ద‌గ్గ‌రి కొవ్వు చాలా త్వ‌ర‌గా త‌గ్గిపోతుంది. 

    5. ఒక క‌ప్పు గోరు వెచ్చని నీటిలో తేనె 2 టీస్పూన్లు, 1/4 టీస్పూన్ నిమ్మ‌ర‌సం, 1 టేబుల్ స్పూన్ గ్రీన్ టీ పొడిల‌ను క‌లిపి అనంత‌రం వ‌చ్చే ద్రవాన్ని వ‌డ‌క‌ట్టి తాగితే మంచి ఫ‌లితం ఉంటుంది. పొట్ట సుల‌భంగా త‌గ్గిపోతుంది. 

    6. ఒక గ్లాస్ గోరు వెచ్చ‌ని నీటిలో 2 టేబుల్ స్పూన్ల తేనెను వేసి బాగా క‌లిపి ఆ ద్ర‌వాన్ని ఉద‌యాన్నే ప‌ర‌గ‌డుపున తాగితే పొట్ట ద‌గ్గ‌రి కొవ్వు క‌రిగిపోతుంది.


    శ‌రీరంలో అధికంగా కొవ్వు పేరుకుపోవ‌డం వ‌ల్ల వ‌చ్చేది స్థూల‌కాయం. అంతే కాదు అధికంగా కొవ్వు ఉండడం వ‌ల్ల డ‌యాబెటిస్‌, గుండె జ‌బ్బులు కూడా వ‌చ్చేందుకు అవ‌కాశం ఉంటుంది. ఈ నేప‌థ్యంలో శ‌రీరంలో ఉండే కొవ్వును క‌చ్చితంగా త‌గ్గించుకోవ‌డం అవ‌స‌రం. అయితే మ‌న ఇండ్ల‌లో ఉండే ప‌లు ప‌దార్థాల‌నే నిత్యం మ‌న ఆహారంలో త‌ర‌చూ తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరంలో అధికంగా ఉన్న కొవ్వును త‌గ్గించుకోవ‌చ్చు. ఆ ప‌దార్థాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. 

    వెల్లుల్లి...
    ఒంట్లో అధికంగా ఉన్న కొవ్వును కరిగించ‌డంలో వెల్లుల్లి బాగా ప‌నిచేస్తుంది. దీంట్లో ఆలిసిన్ అనే ర‌సాయ‌నం యాంటీ బాక్టీరియ‌ల్ ఏజెంట్‌గా ప‌నిచేస్తుంది. దీంతో పాటు దేహంలో అధికంగా ఉన్న కొవ్వును కూడా క‌రిగిస్తుంది. 

    తేనె...
    రోజూ ప‌ర‌గ‌డుపునే పెద్ద గ్లాసుడు నీటిలో తేనె, నిమ్మ‌ర‌సం క‌లుపుకుని తాగ‌డం వ‌ల్ల క‌డుపు శుభ్ర‌మ‌వుతుంది. ఈ మిశ్ర‌మంలో కొవ్వును క‌రిగించే గుణాలు మెండుగా ఉన్నాయి. 

    ట‌మాటా...
    ట‌మాటాల‌లో క్యాన్స‌ర్ కార‌కాల‌ను నిర్వీర్యం చేసే గుణం ఉంది. అలాగే కొవ్వును క‌రిగించే గుణం కూడా ఉంది. వంట‌కాలలో ట‌మాటాను విరివిగా వాడితే ఎంతో లాభం క‌లుగుతుంది. 

    గ్రీన్ టీ...
    రోజు గ్రీన్ టీ తాగ‌డం ఎంతో మంచిది. గ్రీన్ టీలో యాంటీ ఆక్సిడెంట్ల‌తోపాటు కొవ్వును క‌రిగించే ల‌క్ష‌ణం కూడా మెండుగా ఉంది. 

    క్యాబేజీ...
    శ‌రీరంలో అధికంగా పేరుకు పోయిన కొవ్వును క‌రిగించడంలో క్యాబేజీ కూడా బాగానే ఉప‌యోగ‌ప‌డుతుంది. దీంట్లో క్యాల‌రీలు బాగా త‌క్కువ‌గా ఉంటాయి. ఇది చెడు కొవ్వును క‌రిగించి మంచి కొవ్వును పెంచుతుంది. 

    ఓట్స్‌...
    ఓట్స్‌లో పీచు ప‌దార్థం అధికంగా ఉంటుంది. ఇది జీర్ణ‌క్రియ‌కు ఎంత‌గానో ఉపయోగ‌ప‌డుతుంది. అంతేకాదు కొవ్వును క‌రిగించే ఔష‌ధ గుణాలు కూడా ఓట్స్‌లో ఉన్నాయి.



    ఆరోగ్యానికి ‘జామ’



    ఇది జామకాయల సీజన్. మన ప్రాంతంలో ఇళ్లు మొదలుకొని పెరండ్ల వరకు ప్రతిచోటా అందుబాటులో ఉండడం వల్ల సహజంగానే జామకాయ అంటే మనకు చిన్నచూపు. కానీ పది ఆపిల్స్ తిన్నదీ ఒక జామకాయ తిన్నదీ ఒకటేనని పోషకాహారనిపుణులు చెబుతున్నారు. ఒకప్పుడు ఇంటికో జామ చెట్టు ఉండేది. కానీ పట్టణీకరణ, కాంక్రీట్ జంగళ్ల పుణ్యమా అని ఇప్పుడు జామకాయలు కొని తినాల్సిందే! 

    జీర్ణశక్తికి దోహదం..
    ఎన్నో పోషక విలువలున్న జామకాయలు నిజంగా దివ్యవౌషధం లాంటివే. ఆహారం తీసుకున్నాక జామకాయో, పండో తింటే తొందరగా జీర్ణమవుతుంది. గ్యాస్ట్రిక్ సమస్యలు, జలుబు దూరమవుతాయి. మధుమేహ వ్యాధి ఉన్నవారికీ మంచి ఆహారం. 

    దంత సంరక్షణలో..
    రోజూ దోర జామకాయ తింటే ప్రోస్టేట్ క్యాన్సర్‌ను అరికట్టవచ్చు. పచ్చికాయ తింటే చిగుళ్లు, దంతాలు గట్టిపడతాయి. విటమిన్-సీ అధిక మొత్తంలో ఉండడంతో చిగుళ్ల నుంచి రక్తం కారడం ఆగుతుంది. ముక్కలుగా తరిగిన పచ్చి జామ కాయ ముక్కలను కప్పెడు తీసుకొని బాగా ఎండబెట్టి, దానికి అర చెంచా మిరియాలు, అర చెంచా సైంధవలవణాన్ని వేసి, మెత్తగా పొడి చేసి సీసాలో నిల్వ చేసుకొని ప్రతిరోజు పళ్లపొడిలా వాడితే దంతాలు గట్టిపడడమే కాకుండా చిగుళ్ల సమస్యలు దూరమవుతాయి.

    మల బద్ధక నివారణ..
    బాగా పండిన జామ పండ్లకు కొద్దిగా మిరియాల పొడిని చేర్చి, నిమ్మరసం చిలకరించుకొని తింటే మలబద్ధక సమస్య దూరమవుతుంది. అతిసార, జిగట విరేచనాలు, ఇరిటబుల్ బొవెల్ సిండ్రోమ్, గర్భిణుల్లో వాంతులు ఉన్నప్పుడు దోర జామకాయను కషాయం గానీ, మజ్జిగలో కలుపుకొని గానీ తాగితే చక్కని ఫలితం కనిపిస్తుంది. 

    శారీరక బలానికి..
    బాగాపండిన జామ పండ్ల గుజ్జులోంచి గింజలు తొలగించి పాలు, తేనె కలిపి తీసుకుంటే విటమిన్-సీ, క్యాల్షియం మెండుగా లభిస్తాయి. పెరిగే పిల్లలు, గర్భిణులు దీనిని టానిక్‌లా వాడవచ్చు. క్షయ, ఉబ్బసం, బ్రాంకైటీస్, గుండె బలహీనత, కామెర్లు, హైపటైటీస్, జీర్ణాశయపు అల్సర్లు, మూత్రంలో మంటలాంటి అనేక రకాల సమస్యల్లో శక్తి చేకూర్చేందుకు ఎంతగానో ఉపయోగపడుతుంది.

    జలుబు నుంచి ఉపశమనానికి..
    విటమిన్-సీ అధిక మొత్తాల్లో ఉండడంతో వైరస్ కారణంగా ప్రాప్తించిన జలుబు నివారణకు జామ బాగా పని చేస్తుంది. కానీ జామలో ఉండే సహజమైన కవ ప్రకోవకర అంశాలతో కొంత మందికి జలుబు తగ్గాల్సింది పోయి, పెరిగే అవకాశం ఉంటుంది. ఈ సమస్యను అధిగమించేందుకు జామను కొద్దిగా నిప్పుల మీద వేడి చేసి, సైంధవలవణాన్ని, మిరియాల పొడిని కలిపి తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.

    అధిక దప్పిక తీరేందుకు..
    జామపండ్లను చిన్న సైజు ముక్కలుగా తరిగి తాగునీళ్లలో మూడు గంటల పాటు నానేసి, ఆ నీళ్లను దాహం తీరేంత వరకూ తాగితే, అధిక దప్పిక నుంచి ఉపశమనం లభిస్తుంది.

    తలనొప్పి, మైగ్రెయిన్ నివారణలో..
    దోర జామపండును సానరాయి మీద గంధం చేసి, నుదుటి మీద లేపనంలా రాస్తే, తలనొప్పి తగ్గుతుంది. మైగ్రెయిన్‌తో బాధపడేవారు దీనిని సూర్యోదయానికి ముందే ప్రయోగిస్తే చక్కని ఫలితం కనిపిస్తుంది.


                                                                                                          yours ,
                                                                                                                                                  www.seaflowdiary.blogspot.com  ,