Tuesday, February 23, 2016

Expectation of Central Budget 2016 - కేంద్ర బడ్జెట్ 2016

Expectation of Central Budget 2016 - కేంద్ర బడ్జెట్ 2016 
                                                                                 23-02-2016

ప్రతి సంవత్సరం కేంద్ర ఆర్ధిక మంత్రి గారు దేశానికి అవసరమైన ఆదాయ వ్యయ వివరాలను ఫిబ్రవరి 28 లేదా 29 నాడు పార్లమెంట్ కు సమర్పిస్తారు . దానినే బడ్జెట్ వచ్చే  సంవత్సరానికి అవుతుంది . 

 ఈ సంవత్సరం ఎంత ఆదాయం వచ్చింది , ఎ ఎ శాఖల వలన ఎంతెంత వచ్చ్చింది , వచ్చే సంవత్సరం ఎ ఎ శాఖలకు ఎంత ఖర్చు చేయాలి , ఒకవేళ సరిపోయినంత ఆర్ధిక వనరులు లేకుంటే ఎలా సంపాదించాలి. ఎంత పన్నులు వేయాలి , దాని ద్వారా ఎంత వస్తుంది అనే వివరాలను పార్లమెంట్ లో ప్రవేశ పెడతారు . దానిని పార్లమెంట్ సభ్యులు ఆమోదించాలి , ఆమోదం పొందిన తరువాత ఆ బడ్జెట్ ను అచ్చే ఏప్రిల్ 1 నుండి క్రొత్త బడ్జెట్ అమలు లోనికి వస్తుంది.  

దీనిపై సుధీర్గ చర్చలు జరుతాయి , కేంద్ర ఆర్ధిక మంత్రి గారు ప్రవేశ పెట్టిన బడ్జెట్ ను మెజారిటీ సభ్యులు ఆమోదించాలి . దానిలో మార్పులు చేర్పులు కూడా జరుగవచ్చు. 

రూలింగ్ పార్టి సభ్యులు మాత్రం ఎటువంటి అభ్యంతరాలు పెట్టరు కాని చాల మట్టుకు  ప్రతిపక్ష సభ్యులు మాత్రం అభ్యంతరం చెబుతారు  ఏది ఏమైనా మెజారిటీ పాలక పక్షం కు ఉంటుంది కాబట్టి సులభం గా పాస్ అవుతుంది . 

ఈ బడ్జెట్ ఎలా ఉంటుంది అని దేశ ప్రజలందరు ఫిబ్రవరి 28  ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తూ ఉంటారు . వేటిమీద పన్నులు వేస్తారు వేటిమీద ఏమైనా పన్నులు తగ్గిస్తారా అని ప్రజలందరూ T V ల ముందు కూర్చొని చూస్తూ ఉంటారు , T V అందుబాటులో లేని వారు ఆకాశవాణి లో వింటూ ఉంటారు . 

బడ్జెట్ ను బట్టి ధరలు నిర్ణయింపబడుతాయి . సామాన్యులకు ఏమైనా లాభం ఉంటుందా , పారిశ్రంమిక వేత్తలు తమ ఉత్పత్తుల పై ఏమైనా ప్రభావం ఉంటుందా అని ఎదురు చూస్తూ ఉంటారు . ఉద్యోగులు ఆస్తిపన్ను స్లాబ్ ఏమైనా పెంచుతారా అని ఎదురు చూస్తారు . 
  
సామాన్య ప్రజలు ధరలు తగ్గాలని , పారిశ్రంమిక వేత్తలు తమ ఉత్పత్తుల ధరలు పెరగాలని కోరుకుంటారు . ఇప్పటి వరకు చూస్తున్న బడ్జెట్ లు మాత్రం సామాన్యులకు అంతగా ఉపయోగం లేవు , ప్రతి సంవత్సరం క్రొత్త పన్నులు వేసి సామాన్యుల నడ్డి విరవడమే కాని తగ్గించిన దాఖలాలు లేవు . పన్ను పోటు వల్ల సామాన్యులే ఇబ్బంది పడతారు కాని ధనవంతులకు ఏమంత ఇబ్బంది ఉండదు . 

ఆస్తి పన్ను స్లాబ్ పెంచుతారా అంటే అది పెంచడం  లేదు, 3 లక్షల సంవత్సర ఆదాయం దాటితే పన్ను కట్ట వలసిందే .  సంవత్సరానికి సుమారు 10 లక్షలు సంపాదించేవాడు ఖర్చులు పోను మిగిలించేది సగం కంటే తక్కువే ఉంటుంది .  ఆయన కోటీ సంపాదించాలంటే జీవితాంతం పని చేసినా సంపాదించ లేడు .  

మరి కోటీశ్వరులు వందల కోట్ల , వేల కోట్ల బిజినెస్ చేస్తుంటారు మరి వారు కట్టే ఆదాయం పన్ను ఎంత ఉంటుంది ? 
అలాంటప్పుడు కేవలం  3 లక్షల ఆదాయం ఉన్నవారు పన్ను కట్టాలా ?  మరి అలాంటి వారికి స్లాబ్ పెంచవచ్చు కదా !
ఇప్పుడు ప్రభుత్వం L P G subsidy ఇవ్వడానికే క్రింద మీద పడుతున్నది . ప్రపంచ మార్కెట్ లో పెట్రోలియం ధరలు విపరీతంగా తగ్గినా  L P G subsidy వదులుకోమంటున్నది. పెట్రోల్ డీజిల్ రేట్లు తగ్గించడం లేదు . దానివలన ప్రభుత్వానికి సుమారు 3,000 వేల కోట్ల రూపాయలు మిగిలినట్లు వార్తలు వచ్చాయి . 

ఇవే కాకుండా ప్రభుత్వానికి PSU లను disinvestment చేయడం వల్ల లేదా privatisation చేయడం వలన వేల  కోట్ల రూపాయలు వస్తున్నాయి . 

Professional Tax, Service Tax, IncomeTax     వలన ఖజానా ఎలాగు నిండిపొయినది . ఇవే కాకుండా ప్రభుత్వానికి ఎన్నో విధాల Tax లు sales tax , Royalty మొదలగునవి ఖజానాకు వస్తున్నవి . ఇన్ని వచ్చినా ప్రభుత్వానికి డబ్బు సరిపోవడం లేదు అందుకే టాక్స్ లు పెంచుతూ ఉంటారు . కనీసం సామాన్యులపై కనికరం చూపించరు . ఏ ప్రభుత్వం అయినా ఇదే పని . ఉద్యోగుల జీత భత్యాలు పెంచుతున్నామని , Pay commission అమలు చేయడానికి వేల కోట్ల రూపాయలు అవసరమంటారు 

మంత్రి వర్గం ను పెంచుతారు , జంబోజెట్ మంత్రివర్గం ఏర్పాటు చేసుకుంటారు . వారి జీత భత్యాలు 100-200% పెంచుకుంటాం అంటారు . సరే మరి ఉద్యోగులు రిటైర్ అయి ఖాళీలు ఉన్నా భర్తీ చేయరు . సామాన్యులను కనికరించారు . సామాన్యులకు మరియు  ఉద్యోగులకు  Income Tax  Slab  5 Lacks  వరకు మరియు Savings ను కూడా 5 Lacks పెంచుతే అందరు సంతోషిస్తారు . 

బడ్జెట్‌ హల్వా పంపిణీ చేసిన అరుణ్‌జైట్లీ 
సహాయ మంత్రి జయంత్‌సిన్హా హాజరు 
ఇంటర్నెట్‌డెస్క్‌: దిల్లీలోని ఆర్థిక మంత్రిత్వ శాఖ భవనం నార్త్‌బ్లాక్‌లో బడ్జెట్‌-2016 ప్రతుల ముద్రణ ప్రారంభమైంది. బడ్జెట్‌ తయారీ ప్రక్రియలో పాల్గొన్న ఆర్థిక శాఖ ఉద్యోగులు ఈ సందర్భంగా హల్వా వేడుక చేయడం ఆనవాయితీ. శుక్రవారం నిర్వహించిన ఈ వేడుకకు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ, సహాయ మంత్రి జయంత్‌సిన్హా హాజరై తమ స్వహస్తాలతో హల్వా పంపిణీ చేశారు.
బడ్జెట్‌ తయారీ ప్రక్రియలో పాల్గొన్న ఉద్యోగులు నేటి నుంచి బడ్జెట్‌ ప్రవేశపెట్టే వరకు తమ ఇళ్లకు వెళ్లకుండా కార్యాలయంలోనే ఉంటారు. కుటుంబ సభ్యులతో ఫోన్‌లో కూడా మాట్లాడరు. ఈ-మెయిల్‌ ద్వారా కూడా ఎవరినీ సంప్రదించడానికి వీల్లేదు. కొందరు అత్యున్నత అధికారులకు మాత్రమే ఇళ్లకు వెళ్లేందుకు అనుమతి ఇస్తారు. ఈ ఏడాది ఫిబ్రవరి 29న బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్నారు. కార్యక్రమంలో ఆర్థిక శాఖ కార్యదర్శి రాజీవ్‌ మెహ్‌రిషి తదితరులు పాల్గొన్నారు. 
బడ్జెట్‌ తయారీ ప్రక్రియలో పాల్గొన్న ఉద్యోగులు 15 రోజుల ముందు  నుంచి బడ్జెట్‌ ప్రవేశపెట్టే వరకు తమ ఇళ్లకు వెళ్లకుండా కార్యాలయంలోనే ఉంటారు. కుటుంబ సభ్యులతో ఫోన్‌లో కూడా మాట్లాడరు. ఈ-మెయిల్‌ ద్వారా కూడా ఎవరినీ సంప్రదించడానికి వీల్లేదు. కొందరు అత్యున్నత అధికారులకు మాత్రమే ఇళ్లకు వెళ్లేందుకు అనుమతి ఇస్తారు.

అంటే బడ్జెట్ లీక్ కాకుండా జాగ్రత్తలు తీసుకుంటారు . ఒకవేళ ముందే తెలిస్తే వ్యాపారులు సరుకులు మరియు వస్తువులను దాచేస్తారేమో మరి ! అందుకే జాగ్రత్త పడతారు . 
  
ఆర్ధిక మంత్రిగారు బడ్జెట్ ను ఫిబ్రవరి 29-02-2016  న పార్లమెంట్ లో ప్రవేశ పెడతారు . ఆ రోజు ప్రజలందరూ T V  లో ప్రత్యక్షంగా చూస్తారు . ప్రపంచమంతటికి బడ్జెట్ ఆ రోజు తెలసి పోతుంది . బడ్జెట్ ప్రవేశ పెట్టగానే అమలు చేస్తారా అంటే అది లేదు.  ఏప్రిల్ 01-04-2016 నుండి అమలు లోనికి వస్తుంది ,అంటే ఒక నెల టైం ఉంటుంది , ఈ ఒక నెలలో ఏమైనా జరుగదా!   బడ్జెట్ కు ముందు చాలా జాగ్రత్త వహిస్తారు , బడ్జెట్ తరువాత ఎలాంటి జాగ్రత్తలుఉంటాయో మరి ఆర్ధిక మంత్రి గారికే తెలియాలి  . 

ఏది ఏమైనా ఈ సారి బడ్జెట్ లో Income Tax  slab మరియు Savings ను ఆర్ధిక మంత్రిగారు పెంచగలరని సామాన్యులపై పన్ను భారం వేయరని  ఆశిస్దాం !

                                                                                                                   yours ,
                                                                                         www.seaflodiary.blogspot.com 
 

No comments:

Post a Comment