Sunday, February 14, 2016

narayankhed By -Election -నారాయణఖేడ్ ఉప ఎన్నిక


                                                   Date : 14-02-2016


నారాయణ్ ఖేడ్ మెదక్ జిల్లాలో చాల వెనుక బడిన ప్రాంతం . అది తాలూకా కేంద్రం . మహారాష్ట్ర మరియు కర్ణాటక రాష్ట్రాల సరిహద్దులు దగ్గర లోనే ఉంటాయి .

తాలుకా కేంద్రమైనా అభివృద్ధికి నోచుకోలేదు .  దివంగత ఎం ఎల్ ఎ  కిష్టారెడ్డి కంటే ముందు బస్సు డిపో ఏర్పాటు చేయబడినది ,అంతకు ముందు హైదరాబాద్ డిపో నుండే బస్సులు నడిచేవి .  కిష్టారెడ్డి గారు ఎం ఎల్ ఎ గారు పట్టు బడితే ఇంకెంతో అభివృద్ధి చెందేది . ఆయన చాల సౌమ్యుడు అందుకే అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందినట్లు చెందలేదు . అక్కడ ఒకటి రెండు సార్లు TDP   MLA లు కూడా గెలిచారు ,ఐనా అనుకున్నంత అభివృద్ధి జరగలేదు . అసలు ఏ ప్రభుత్వం కూడా పట్టించుకోలేదు . చెన్నారెడ్డి గారు ముఖ్యమంత్రి గా మొదటిసారి ఎన్నిక అయినప్పుడు  నారాయణ్ ఖేడ్ ను మొట్ట మొదటి సారి దర్శించారు .  ఐనా అభివృద్ధికి నోచుకోలేదు . 

 నారాయణ్ ఖేడ్ ను ఒక మారుమూల ప్రాంతం గా చూసేవారు . అక్కడ ఎలాంటి సౌకర్యాలు లభించవు . 
కిష్టారెడ్డి గారు దివంగతి కావడం  అందువల్ల ఉప ఎన్నిక జరగడం వలన   నారాయణ్ ఖేడ్ ఎక్కడ ఉందో  అందరికి తెలసింది .
 మన ప్రియతమ ముఖ్యమంత్రి కె సి అర్ గారు  చేయుచున్న  అభివృద్ధి మరియు  నారాయణ్ ఖేడ్ ను సిద్దిపేట లాగా చేస్తానని చెప్పడం . మన హరీష్  అన్న గారు ఎడతెరిపి లేకుండా   నారాయణ్ ఖేడ్ ను చుట్టి అభివృద్ధి చేస్తున్నందులకు ప్రజల హృదయాల్లో గట్టి నమ్మకం ఏర్పడినది . అందుకే ప్రతి వారు కె సి అర్ గారిని గెలిపించాలని ఒక నిర్ణయానికి వచ్చారు , అందుకే  అందరు పాల్గొని ఓటింగ్  శాతం పెంచారు . తప్పకుండా T R S  గెలుస్తుందని ఎన్నికలకు ముందే అందరికి తెలుసు . దానికి సర్వే అనవసరం .  

ఒక్కటి మాత్రం గుర్తించుకోవాలి ,  శ్రీ . కిష్టారెడ్డి గారు చాల సీనియర్  కాంగ్రెస్  MLA గారు ,అనుభవజ్ఞ్యులు , ఆయనకు మన ప్రియతమ ముఖ్యమంత్రి కె సి అర్ గారు  ఎంతో ప్రాముఖ్యం ఇచ్చేవారు . ఆయనకు అంచనాల కమెటి అధ్యక్షులు గా చేశారు . ఆయన దివంగతులైనప్పుడు  ఎంతో బాధ పడ్డారు . 

ఉప ఎన్నిక జరుపవలసి వచ్చినది , శ్రీ . కిష్టారెడ్డి గారి పై అభిమానం తో ఏకగ్రీవం గా MLA ను ఎన్నుకోవలసినది . ఇంతకు ముందు ఇలాగే ఎవరైనా పదవిలో ఉన్న MLA దివంగతులైనప్పుడు ఉప ఎన్నికలలో వారికి సంభందించిన ఎవరైనా వారసులు ఉంటే వారిని ఏకగ్రీవం గా ఏ పార్టిలైన అభ్యర్థులను నిలబెట్టకుండా ఎన్నుకునేవారు . కాని ఇక్కడ అలా జరుగలేదు . కిష్టారెడ్డి గారు కాంగ్రెస్ పార్టి కాబట్టి  వారు ఆయన కుమారుడిని నిలబెట్టారు . ఇక్కడ కూడా ఆయన కాంగ్రెస్ అయినా ఆయనకు పోటీ గా నిలబెట్టకుండా ఏకగ్రీవం గా ఎన్నుకొనునట్లు చేయవలసింది . 

 అలా చేస్తే కిష్టారెడ్డి పై ఉన్న అభిమానం ఇంకా పెరిగేది , ఆయన కుమారుడు ఈ రోజు కాక పోయినా రేపైనా తప్పకుండా కె సి అర్ గారి పై అభిమానం తో T R S  కు సహకరించేవారు లేదా ఇప్పుడు జరుగుతున్నట్లు T R S  లో చేరేవారు . అప్పుడు  మన ప్రియతమ కె సి అర్  గారి ప్రజాభిమానం ఇంకా ఉన్నత శిఖరాలకు చేరేది ,ఎన్నికల హడావిడి ఉండేది కాదు, ఇంత శ్రమ , ఖర్చు మిగిలేది . 





ఖేడ్ టీఆర్‌ఎస్‌దే!
PUBLISHED: SUN,FEBRUARY 14, 2016 01:38 AM
  
 -68.86% ఓట్లు గులాబీ పార్టీకే
-దిమ్మదిరిగే మెజారిటీ ఖాయం.. ఆరా సంస్థ ఎగ్జిట్ పోల్‌సర్వే

ప్రత్యేక ప్రతినిధి, నమస్తే తెలంగాణ:మెదక్ జిల్లా నారాయణఖేడ్ ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్ మరో కొత్త రికార్డు సృష్టించబోతున్నది. ఇక్కడ జరిపిన ఎగ్జిట్ పోల్ సర్వే ప్రకారం ప్రతి పదిమంది ఓటర్లలో ఆరునుంచి ఏడుగురు కారు గుర్తుకు ఓటు వేశారు. మొత్తంగా టీఆర్‌ఎస్ 68.86% ఓట్లు తన ఖాతాలో వేసుకునే అవకాశమున్నదని ఆరా అనే సంస్థ జరిపిన సర్వే వెల్లడించింది. శనివారం జరిగిన పోలింగ్‌లో ఉదయం నుంచే కారు హవా అప్రతిహతంగా కొనసాగిందని సంస్థ తన ఎగ్జిట్‌పోల్ విశ్లేషణలో స్పష్టం చేసింది. ప్రధాన ప్రత్యర్థిగా రంగంలోకి దిగిన కాంగ్రెస్, టీఆర్‌ఎస్ దూకుడును ఏ మాత్రం నిలువరించలేకపోయింది. ఆ పార్టీ అభ్యర్థికి కేవలం 18.98%ఓట్లు మాత్రమే దక్కనున్నాయని సంస్థ వెల్లడించింది. ఇక టీడీపీ అభ్యర్థి నామమాత్రపు పోటీనే ఇచ్చినట్లు తెలిపింది. కనీసం 8.36శాతం ఓట్లను కూడా సాధించడం అనుమానమేనని పేర్కొంది. ఇండిపెండెంట్ అభ్యర్థులు రెండు శాతం ఓట్లకే పరిమితం కానున్నారని తెలిపింది.

-ప్రభుత్వపాలన భేష్ ..
ఖేడ్ ఉప ఎన్నిక సందర్భంగా ఆరా సంస్థ ప్రభుత్వ పాలనపై ప్రజలేమనుకుంటున్నారనే విషయంపై ఆరా తీసింది. పాలన తీరుపై 88శాతం ప్రజలు సంతృప్తి వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పరిపాలన ఎలా ఉంది? అనే ప్రశ్నతో సర్వే సాగింది. చాలా బాగుందని 51.44శాతం ప్రజలు అభిప్రాయపడగా ఫరవాలేదని 37.50 శాతం చెప్పారు. బాగా లేదని 9.44శాతం, అధ్వాన్నంగా ఉందని 0.49శాతం చెప్పారు. ఏ అభిప్రాయం చెప్పనివారు 1.01శాతంగా ఉన్నట్లు సంస్థ వెల్లడించింది.


మరి మీరేమంటారు , మీరు కూడా ఒక్కసారి ఆలోచిస్తే తెలుస్తుంది. 

                                                                                                          yours, 
                                                                                                                       www.seaflowdiary.blogspot.com 














No comments:

Post a Comment