Saturday, May 2, 2015





 Golden Telangana - బంగారు తెలంగాణా - सोनेकी तेलंगाना  
                 
  
                                                                                                      Date : 02-05-2015


మనం కలలు కన్న తెలంగాణా సాకారం కాబోతున్నది . అణగార్చ బడిన తెలంగాణా ఇప్పుడు  "బంగారు తెలంగాణా "  అవుతున్నది. దీనికంతటికి మన ప్రియతమ ముఖ్యమంత్రి KCR అకుంటిత పట్టుదల . మన మంతా మన ప్రియతమ నాయకుడి వెంట ఉండి పూర్తి సహాకారం అందించడం మనం చేయవలసినది .  


1956 నుండి మనం వలస పాలనలో  అణగ త్రోక్కబడి మొన్ననే అనగా 02-06-2014 నాడు స్వతంత్రుల మయ్యాము .  దీనికంతటికి KCR  నాయకత్వము మరియు ఆయన దీక్ష ,  విద్యార్థుల మరియు తెలంగాణా పౌరుల బలిదానాలతో , ప్రజల ఐకమత్యం తో మన పరిపాలనను మనం సాధించు కున్నాము . ఇప్పుడు మనదే రాజ్యం, మనదే పరిపాలన, కోటి రతనాల మన తెలంగాణా ను " బంగారు తెలంగాణా " గా చేయుటకు మన ప్రియతమ నాయకుడు నడుం బిగించారు మన తెలంగాణా ప్రజల అదృష్టం . 



మనం ఇన్ని రోజుల నుండి మన తెలంగాణా ను ఎవరు ఆదుకుంటారు , ఎవరు వస్తారు , ఎవరు అభివృద్ధి చేస్తారు అని ఎదురు చూశాము . ఆనాడు 1969 లో తెలంగాణా విముక్తి కొరకు విద్యార్థులు ముందుండి ఉద్యమం చేస్తే 360 మంది విద్యార్థులను తూటాలకు వలస నాయకులు బలి చేశారు . ఉద్యమాన్ని నీరుగార్చారు. 



ఆ ఉద్యమం తో నైనా కనువిప్పు కలిగి తెలంగాణా ను పాలకులు అభివృద్ధి చేయలేదు . ఇక మమ్మల్ని ఎవ్వరు ఏమిచేయలేరని మరీ విజ్రుం భించారు . మెజారిటీ వారిదే కాబట్టి మన వాళ్ళను నోరు మెదప నీయలేదు .  మన వనరులను ,నీటిని ,విద్యుత్తును  మన ఉద్యోగాలను కొల్లగొట్టారు . తెలంగాణా ప్రజలు దిక్కులేని వారయ్యారు ఇలాంటి తరుణములో మన కె సి ఆర్ గారు ఆనాడు మన జాతిపిత గాంధిజీ గారు స్వాతంత్రం గురించి బ్రిటిష్ వారితో పోరాడినట్లు మన తెలంగాణా గురించి ముందుండి ఉద్యమాన్ని నడిపారు " తెలంగాణా వచ్చుడో - కె సి ఆర్ సచ్చుడో "  అనే నినాదాన్ని యిచ్చారు . తెలంగాణా రాకుంటే తనను "రాళ్ళతో కొట్టి చంపండి " అనే నినాదం తో శాంతి యుతముగా ఉద్యమాన్ని నడిపి తెలంగాణా సాధించిన మహానీయుడు  మన " KCR "  

      ఇంత సాధించి తెలంగాణా ను అభివృద్ధి పథములో నడిపిస్తుంటే తెలంగాణా తమచేతులనుండి జారిపోయిందని అక్కసుతో బంగారు గుడ్డు పెట్టె బాతు పోయినట్లు భావించి ఇక్కడి కొందరిని తమ గుప్పిట్లో పెట్టుకొని వ్యతిరేక ప్రచారం చేస్తున్నారు . ప్రతి పక్షాలు కూడా తాము చేయలేనిది వీరు చేస్తున్నారని , ప్రజలు వీరిని ఎన్నికలలో ఓడించి ఇంటికి పంపించినా మారలేదు . 




పల్లెటూరు ప్రజలు ఒక పెద్ద పట్టణాన్ని చూసి మన ఊరు కూడా ఇలాగా ఉంటె బాగుండును అనుకుంటారు . పట్టణం లో నివసించేవారు నగరాన్ని చూసి మన పట్టణం కూడా నగరం లాగ ఉంటె ఎంతో బాగుంటుందని కోరుకుంటారు . అలాగే మనం కూడా మన హైదరాబాద్ నగరం ఎంతో అభివృద్ధి చెంది విదేశాలలో ఉన్న పెద్ద నగరం గా కావాలని కోరుకున్నాం కాని ఇంతవరకు పట్టించుకున్న నాథుడే లేడు కాని ప్రస్తుతం మన నాయకుడు మన హైదరాబాద్ ను ప్రపంచములో నంబర్ 1 సిటీ గా చేయుటకు వేల కోట్ల రూపాయల ప్రణాళికలు సిద్ధం చేసి పనులు మొదలు పెట్టారు . KCR  గారి లక్ష్యం మరియు స్వప్నం " బంగారు తెలంగాణా "

ఇప్పటికే మ్యానిఫెస్టో లో చెప్పినవి చెప్పనివి కూడా అమలు చేస్తున్నారు . దేశం లో ఏ ముఖ్యమంత్రి చేయనిది మన . ముఖ్యమంత్రి చెప్పినదానిని చేసి చూపెడుతున్నారు . వాటర్ గ్రిడ్ ప్రాజెక్ట్ వేల కోట్ల తో మొదలు పెడుతున్నారు దీనివలన తెలంగాణా రాష్ట్రం లోని ప్రతి గ్రామం లోని ప్రతి ఇంటికి నల్లాల  ద్వారా త్రాగు నీరు అందించాబోవుచున్నారు. నాలుగు ఏళ్లలో ప్రతి ఇంటికి నల్లా ద్వారా త్రాగు నీరు అందించకుంటే ఓట్లు అడగడానికి రానని ప్రకటించారు . KCR గారు పట్టుదలతో ఈ ప్రాజెక్ట్ పూర్తి చేయగలనని దృఢ విశ్వాసం తో ధైర్యముగా ప్రజల ముందుకు వచ్చారంటే ఎంత ఇది . ఎలాంటి పనిని చేయగలనని ఏ ముఖ్యమంత్రి చెప్పలేడు , అంత ధైర్యం ఎవరు చేయలేరు . కనీసం కేంద్రం లో ఉన్న పార్టీ ముఖ్యమంత్రి కూడా చెప్పలేడు .  ఈ ప్రాజెక్ట్ ను కేంద్ర ప్రభుత్వం మెచ్చు కుంది , ఇలాంటి కార్యక్రమాన్ని చేపట్టాలని ఇతర రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది . అంటే ఈ ప్రాజెక్ట్ విలువ ఎంతో , దీని వలన ప్రజలకు ఎంత మేలు జరుగుతుందో కనుగొన్నవారు మన KCR గారు . 


  రాష్ట్రాన్ని అభివృద్ధి పథం(development )లో పెట్టడానికి మన కె ఆర్ గారు అహర్నిశలు పాటు పాటుపడుచున్నారు. కాకతీయ రాజుల స్ఫూర్తి తో  మిషన్ కాకతీయ  Mission Kakateeya ద్వార తెలంగాణా లోని చెరువు లన్నింటిని వేల కోట్ల రూపాయల ఖర్చుతో పూడిక తీసి , అభివృద్ధి చేసి గొలుసు చెరువులు గా చేసి పై చెరువు నిండిన తరువాత ఎక్కువైనా నీరు క్రింది చెరువు లోనికి  కాలువల (canals )ద్వారా  వచ్చునట్లు చేయడం, నీరు వృధా కాకుండా చేయడం పొలాలన్నీ పచ్చగా పండునట్లు చేయడం  తెలంగాణా ప్రజలకు  చాల ఆనంద దాయకం. పూడిక మట్టిని తమ పొలాలలో వేసుకొనుటకు రైతులకు ఇస్తున్నారు .   తెలంగాణా లో పంటలన్నీ వర్షాధారం (depend on rains )మరియు బోరు బావుల(depend on bore well ) పై ఆధారపడి పండుతాయి. అందులో ప్రజలు పూర్తి సహాకారాన్ని అందిస్తున్నారు . ఉద్యోగులు తమ వంతుగా ఒక నెల జీతాన్ని విరాళం గా ఇస్తున్నారు . పారిశ్రామిక వేత్తలు కూడా విరాళాలు అందిస్తున్నారు . వచ్చే రోజుల్లో తెలంగాణా సస్యశామలం , పాడి - పంటలతో , సిరి సంపదలతో తులతూగుతుంది . 


         తెలంగాణా లో విద్యుత్తూ కొరత తెలిసి కూడా  పి  పి  ఎ (ppa ) లను కావాలని  ప్రక్క రాష్ట్ర ముఖ్యమంత్రి,  ఇంతకు ముందు వలస పాలన చేసిన మహాను భావుడు , రెండు కళ్ళ సిద్ధాంత కర్త గారు  రద్దు చేశారు  .  కె టి పి సి మరియు వి టి పి సి ల నుండి రావలసిన 710 మెగా వాట్ కరెంట్ ఇవ్వలేదు . . సీలేరు నుండి 460 మెగావాట్  లాక్కున్నారు . కృష్ణపట్నం నుండి రావలసిన 400 మెగా వాట్ ఇవ్వలేదు . అర్ టి పి పి  లో అక్కడి 1050మెగా వాట్ లో 54% తెలంగాణా కు రావాలి. కాని ఇవ్వ  లేదు ,  ఇదంతా కావాలని పన్నిన పన్నాగమమె  . ఎదుటి వాడు ఏ మైనా పర్వాలేదు , మనకు దక్కనిది ఎదుటివాడికి ఎందుకు దక్కాలని .  కొన్ని రోజుల క్రింద  కృష్ణ వాటర్ ట్రిబ్యునల్ కు శ్రీశైలం ప్రాజెక్ట్ లో నీటి మట్టం తగ్గినదని తెలంగాణా ప్రభుత్వం  కరెంట్ ఉత్పత్తి ని ఆపు చేయాలని ఆంధ్ర ప్రభుత్వం లెటర్ వ్రాసినది . అప్పుడు  860 అడుగుల నీరు శ్రీశైలం ప్రాజెక్ట్ లో ఉన్నది . 834 అడుగుల వరకు నీరున్నా కరెంట్ ఉత్పత్తి చేయవచ్చు . ఇంతకు ముందు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి గా ఉన్నప్పుడు 770 అడుగుల నీరున్నా కరెంట్ ఉత్పత్తి చేయించారు . మరి ఇప్పుడెందుకు ఆబ్జేక్షన్ చేశారు ?  మరి ఇక్కడ తెలంగాణా లో రైతులు  కరెంట్ లేక  పంటలు  ఎండిపోతున్న తట్టుకోలేక ప్రాణాలు పోగొట్టుకుంటే కనిపించ లేదు  

 ఐనా మన ప్రియతమ నాయకుడు భయపడలేదు మీ కరెంట్ అక్కర లేదు అనిచెప్పి ప్రక్క రాష్ట్రం నుండి తీసుకోన కుండా ప్రత్యాన్నాయం గా విద్యుత్ ను ఇతరుల నుండి ఎంత ఖర్చు అయిన తీసికొని ఈ రోజు పవర్ కట్ లేకుండా నాణ్యమైన కరెంట్ ను తెలంగాణా రాష్ట్రం మొత్తానికి సరఫరా చేయుచున్నారు . ఎప్పుడు లేనిది ఈ సారి పవర్ కట్ లేకుండా అందిస్తున్నందులకు ఇక్కడి ప్రజలు ఆశ్చర్య పోవుచున్నారు . విద్యార్థులు ఊపిరి పీల్చుకున్నారు , రైతులు సంతోషముగా ఉన్నారు . పారిశ్రామిక వేత్తలు స్వయముగా ముఖ్యమంత్రి ని కలసి ఆనందిస్తున్నారు . 

మన ముఖ్యమంత్రి గారు సామాన్య ప్రజలకు ఉపయోగ పడే ఎన్నో కార్య క్రమాలను చేపట్టారు . 
పేద వృద్ధులకు(old  age )  పించను (pension ) 200 నుంచి  రూ 1000 లకు పెంచారు అవ్వలు , తాతలు ప్రస్తుతం సంతోషముగా జీవిస్తున్నారు . మరియు వికలాంగులకు (physically challenged )నెలకు  పించను (pension ) రూ 1500 చేశారు . రేషన్ బియ్యం కూడా పరిమితి లేకుండా పేద కుటుంబాలవారికి ఒక్కొక్కరికి 6 కిలోల సన్న బియ్యం ఇస్తున్నారు . 


ఉపాధి కల్పనకు ప్రణాళికలు చేయుచున్నారు .  , ఖాళీ ఉద్యోగాలు భర్తీ చేయుటకు  .TSPSC  నోటిఫికేషన్ రాబోతుందట .  పి ఆర్ సి  43%  హైక్ తో ఇచ్చారు ఉద్యోగులంతా  చాల సంతోషముగా  ఉన్నారు  . తెలంగాణా ఉద్యోగులందరికీ  ప్రత్యేక  తెలంగాణా ఇంక్రిమెంట్ లు కూడా ఇవ్వబడినవి.

ఇప్పటికే I T  నగరం గా ఉన్న హైదరాబాద్ ను ప్రపంచ  I T (world I T ) నగరముగా మరియు ప్రపంచ అత్యుత్తమ నగరముగా చేయుటకు ప్రణాలికలు సిద్ధ మయ్యాయి. 2018 లో ప్రపంచ I T సదస్సు హైదరాబాద్ లో జరుగాబోవుచున్నది దీనికి కె సి ఆర్ చలువే . 5 లక్షల   I T ఉద్యోగాలు రాబోతున్నట్లు   I T మంత్రి  ప్రకటించారు . 

మన ప్రధాన మంత్రి గారు ఆస్ట్రేలియా వెళ్ళినప్పుడు అక్కడ బ్రిస్బేన్ లో మాట్లాడుతుఈ రెండు నగరాలు అడ్వాన్స్డ్  advanced technology లో అభివృద్ధి చెందాయని  బ్రిస్బేన్ మరియు హైదరాబాద్ సిస్టర్ సిటి లని హైదరాబాద్ ను పొగిడారు . 





వేల కోట్లు ఖర్చు చేసి తెలంగాణా గ్రామీణ ప్రాంతాల రోడ్లు (rural roads ) అభివృద్ధి చేయడం , లేని ఊర్లకు క్రొత్త రోడ్లు వేయడం, మండల కేంద్రం నుండి జిల్లా కేంద్రానికి 2 లైన్లు , జిల్లా కేంద్రం నుండి రాజధానికి 4 లైన్ల రోడ్లు వేయుచున్నారు .  అన్ని గ్రామీణ ప్రాంతాలకు బస్సు సౌకర్యం కల్పించడం జరుగుతున్నది , పెరిఫెరల్ ఔటర్ రింగ్ రోడ్ కూడా రాబోవు చున్నది .
 నల్గొండ జిల్లా  దామరచెర్ల లో దేశం లోనే అతి పెద్ద  విద్యుత్ థర్మల్ పవర్ స్టేషన్ (thermal power generation ) ను ఏర్పాటు  చేయడానికి  శంకుస్థాపన  మన KCR  గారు చేశారు .  దానివలన మనకు కావలసినంత విద్యుత్ లభించడమే కాక మిగులు రాష్ట్రం గా ఏర్పడుతుంది . 

విద్యా విధానములో మార్పులు , 1 వ తరగతి నుండి ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ రాబోతున్నాయి , KG  to PG  ఉచిత విద్యా వచ్చే సంవత్సరం నుండి అమలు చేయ బోతున్నారు . క్రొత్త యూనివర్సిటీ లను , ఫార్మా యూనివర్సిటీ  ని (pharma university) హైదరాబాద్ దగ్గరలో  కందకూరు మండలములో ఏర్పాటుకు ఏరియల్ సర్వే కూడా చేశారు . హైదరాబాద్ (medical hub ) మెడికల్ హబ్ గా మారబోతున్నాది .


బీద విద్యార్థులకు ఫీజులు ( fee to poor students )చెల్లించి ఉన్నత విద్య చదువు కోనునట్లు చేశారు , హాస్టల్ ( hostels ) లో విద్యార్థులకు నాణ్యమైన సన్న బియ్యం( fine rice ) తో అన్నం వడ్డిస్తున్నారు . 

ఇక  హైదరాబాద్ ను ప్రపంచ అతి సుందర నగరముగా తీర్చి దిద్దుటకు రాత్రిం బవాళ్ళు  (day and night ) శ్రమిస్తున్నారు . మెట్రో రైల్ ప్రాజెక్ట్ ను(metro rail project ) ప్రతిష్టా త్మకంగా prestige  తీసికొని హైదరాబాద్ లోఇంకా కొన్ని చోట్లకు RGI ఎయిర్ పోర్ట్  వరకు పొడగించి   ప్రజా రవాణా వ్యవస్థ ను మెరుగు పరుచుచున్నారు, ఇది దేశం లో కెల్లా ఉత్తమ మైనది .

హుస్సేన్ సాగర్ ను మంచి నీటి సరస్సుగా మార్చి దాని చుట్టూ మల్టీ కాంప్లెక్స్ లు న్నిర్మించి సింగపూర్ లాగ సుందరీకరణకు ప్లాన్ చేయబడినది . ఎక్స్ ప్రెస్ హై వే లను, స్కై వాక్ లను (express hi way and sky walk ) నిర్మించబడు చున్నవి .

 పోలీస్  వ్యవస్థ ను పటిష్ట పరిచి ప్రజలందరికి రక్షణ కల్పిస్తున్నారు , షీ పోలీస్(she -police ) ను నియమించి విద్యార్థులకు , ఉద్యోగస్తులకు  మహిళలకు  రక్షణ కల్పిస్తున్నారు.

కళ్యాణ లక్ష్మి - షాది ముబారక్ పథకాల ద్వారా బీద వారి పెళ్లిళ్లకు అమ్మాయి పేరుమీద రూ .51 ,000 అందిస్తున్నారు .

పేదలందరికీ అందమైన 2 బెడ్ రూం, హాల్  ఫ్లాట్లు కట్టిస్తున్నారు . ఈ ఫ్లాట్లు దేశం లోని ఇతర ప్రభుత్వాలకు మార్గ దర్శనం కాబోతున్నాయి .

27-04-2015 నాటి KCR గారి విజయ గర్జన విజయ వంతమైనది . అక్కడ గర్జనలో KCR మాట్లాడుతూ




ప్రతి తెలంగాణా బిడ్డ ముఖం బంగారు నాణెం లా వెలగాలని , 
ప్రతి ఇంటికి నల్లా నీరిచ్చి  ప్రజల పాదాన్ని కడుగుతం అని , 
వచ్చే విద్యా సంవత్సరంలో KG  టు PG అమలు చేస్తామని , 
రేండేళ్ళలో లక్ష ఉద్యోగాల భర్తీ , కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమ బద్ధీకరణ చేస్తామని చెప్పారు . 
తెలంగాణా రాష్ట్రం surplus  state  అని  , 
చెప్పినమంటే ... తల తెగి పడ్డా వెనక్కి పోయేది లేదని చెప్పారు . 


తెచ్చిన తెలంగాణా గుంట నక్కల పాలు కావద్దని , 
మిషన్ కాకతీయ తో సమైక్య పాపాన్ని వదల గోడుతున్నామని , 
ఊ టలు జాల్లు పెట్టడం ... జాలు పొలాలు పండడం ఖాయం అని 
వచ్చే మర్చి నుంచి రైతులకు 9 గంటలు పోద్దటి కరెంట్ ఇస్తామని 
మన సొమ్ము మనం ఖర్చు పెట్టుకున్తున్నామని 
2 - 3 ఏళ్లలో అమెరికా లోని డల్లాస్ పట్టణాన్ని తల దన్నెలా  హైదరాబాద్ ను చేస్తామని చెప్పారు . 

మరియు ప్రక్క రాష్ట్ర CM కిరికిరి నాయుడని ఛీ ... పొమ్మన్నా పోడని , ఇక్కడ పుల్లలు పెడుతున్నాడని అన్నారు .  ఆయన "రెండు కళ్ళు"  మరియు "కొబ్బరి చిప్పల"  సిద్ధాంత కర్త.  ఇక్కడ ఒకటి అక్కడ ఒకటి మాట్లాడుతారు. ఆయన ఇక్కడే హైదరాబాద్ లో ఒక పెద్ద ఇల్లు ఉన్న దానిని పడగొట్టి కట్టుకుంటున్నారు . ఆయన తన సిద్ధాంతాలను పాటించాలి . ఉండేది ఇక్కడ, పీల్చే గాలి ఇక్కడిది , తినే తిండి ఇక్కడిది కాని ఇక్కడ పుల్లలు బెట్టి తెలంగాణా అభివృద్ధి ని అడ్డుకోవడం ఎం బాగా లేదు . 

ఆయన చేసే నిర్వాకమేమిటో చూద్దాం 

Funds flow freely for Naidu’s own expenses



Funds flow freely for Naidu’s own expenses
Chief minister N Chandrababu Naidu.
HYDERABAD: Andhra Pradesh may be in the midst of a major financial crisis, but this has not stopped chief minister N Chandrababu Naidu from spending a steep Rs 100 crore of the public exchequer money on himself. This includes refurbishing various offices and hiring aircraft and helicopters for his national and international travels.

Till date, Naidu has constructed four offices for the chief minister and camp offices in Hyderabad and Vijayawada. Presently coming up at a cost of Rs 21.3 crore is the new camp office in Vijayawada. While Rs 6.3 crore has been released for converting the irrigation circle office as the camp office, Rs 15 crore is being spent for the security set-up. Separate GOs have been issued for these expenditures.

Earlier, Naidu spent Rs 45 crore of public money on refurbishing the Lake View Guest House as well as two blocks in the AP Secretariat in Hyderabad. Immediately after his victory in the 2014 general elections, he ordered renovation of South H block as his new office and the state government spent more than Rs 15 crore on sprucing up the building. However, citing bad vaastu, Naidu later opted for an office in L block. Complete renovation of the 7th and 8th floors of the building was ordered, which took three months and cost about Rs 20 crore. Apart from that, at an additional cost of Rs 5 crore, new lifts were installed, new entrances were put in place and elaborate security arrangements made.

To give a facelift to the Lake View Guest House on the Raj Bhavan Road, the state government spent about Rs 7 crore. However, the building is now used being used only once a week by Naidu. As part of the renovation, age old boulders on the guest house premises were removed and all rooms refurbished to ensure that chief minister has the finest camp office.

But the expenditure does not stop there. Naidu has moved into a new rented accommodation in Jubilee Hills and there is a proposal for another camp office there at his temporary residence for which the state wants to pay Rs two lakh a month as rent. This does not include the residential quarters as that is treated under a separate head.



Interestingly, Naidu's extravagance did not stop with changing offices, but extended to hiring chartered planes and choppers. Ever since he took over as chief minister, he has made sure that majority of his tours, domestic and foreign, are managed by private chartered companies. The Navayuga group that operates two ports across the east coast is one regular supplier of chartered planes to the AP CM. Airone is another private company that has extended its services to Naidu's frequent tours that included a chartered flight to Singapore along with some corporates.

"The government has paid Rs 15 crore (GO No. 30) to these private flight operators up to February. Another Rs 7 crore has to be paid for the month of February and March. The bill for the month of April has not yet been received," said sources in the government.

The CM visited Singapore twice as well as Japan, China and Davos once during the last ten months and is all set to visit the USA soon. Further, in the name of equal justice to all districts, Naidu came out with an innovative concept of holding programmes in different districts including the collectors' conference in Vijayawada, Independence Day celebrations in Kurnool and investors' meet in Visakhapatnam. However, according to officials, this has increased the state expenditure as hundreds of officers are forced to travel and stay in hotels in these places to attend Naidu's meetings. "Instead of going about his work by displaying austerity, the AP CM is doing the exact opposite and bleeding the state's coffers," lamented a senior official who did not want to be named.







ప్రజారోగ్యం గురించి జిల్లా కు ఒక super specialty హాస్పిటల్ ఏర్పాటు చేయుచున్నారు . గాంధి ,ఉస్మానియాలో బెడ్ ల సంఖ్య పెంచారు .  

"స్వచ్చ్ భారత్"గురించి రో. 1000 కోట్లు ఖర్చు పెట్ట బోవు చున్నారు . 


Katta Shekar Reddy Article

ప్రజా ఉద్యమంగా పారిశుద్ధ్యం

Updated : 5/3/2015 2:10:09 AM
Views : 107

ravi


హైదరాబాద్, నమస్తే తెలంగాణ: ప్రజలకు పట్టింపు వస్తే చెత్తలేని పట్టణాలను కళ్లారా చూసుకోవచ్చని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు పేర్కొన్నారు. శిక్షణ తరగతుల్లో భాగంగా మున్సిపల్ ఘన వ్యర్థాల నిర్వహణ అనే అంశంపై అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా డైరెక్టర్ జనరల్ రవికాంత్ బోధించారు. ఈ సందర్భంగా ముఖాముఖి సెషన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడారు. రాష్ట్రంలోని నగరాలు, పట్టణాల నుంచి చెత్తను పారద్రోలేందుకే మున్సిపల్ శాఖను తన దగ్గర పెట్టుకున్నట్లు చెప్పారు. ముందుగా పారిశుద్ధ్య నిర్వహణకు సంబంధించిన ప్రజా ఉద్యమాన్ని హైదరాబాద్‌లోనే ప్రారంభిస్తామన్నారు. ఈ నెల 16న హైదరాబాద్ నగరంలో చెత్త ఎత్తే పనిని మొదలుపెట్టనున్నట్లు సీఎం చెప్పారు.
-16 నుంచి హైదరాబాద్‌లో అమలు
-నగరాన్ని 400 ముక్కలు చేసి, దత్తత తీసుకుంటం
-రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్
-చెత్త నిర్వహణ పట్ల చిత్తశుద్ధి అవసరం : రవికాంత్

ఇందులో భాగంగా నగరాన్ని 400 ముక్కలుగా విభజించి గవర్నర్, ముఖ్యమంత్రి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ, మంత్రులు ఇలా... అందరూ తలా ఒక ముక్కను దత్తత తీసుకోనున్నట్లు చెప్పారు. చెత్తను సేకరించేందుకుగాను ప్రతి ఇంటికి ప్రభుత్వమే రెండు ప్లాస్టిక్ బుట్టలను ఇస్తుందన్నారు. హైదరాబాద్ తర్వాత అన్ని మున్సిపాలిటీల్లో దీనిని కొనసాగిస్తామన్నారు. నగరాలు, పట్టణాలను పరిశుభ్రంగా ఉంచుకునేందుకు చెత్త తొలగింపు ఒక ప్రజా ఉద్యమంగా సాగాలన్నారు. కాగా అస్కి డీజీ రవికాంత్ మాట్లాడుతూ, చెత్త లేని పట్టణాల కోసం పని చేయాలనే రాజకీయ తలంపు ఇప్పటివరకు రాలేదని... తెలంగాణ రాష్ట్రంలో ఇందుకోసం నిర్ణయం తీసుకోవడం సంతోషకరమన్నారు.

కాలుష్యాన్ని నివారించేందుకు అనేక విధానాలు అందుబాటులోకి వచ్చాయన్నారు. అయినా పెద్దగా ఫలితం లేదని చెప్పారు. చెత్త నిర్వహణ పట్ల చిత్తశుద్ధి అవసరం అని రవికాంత్ స్పష్టం చేశారు. పట్టణ ప్రాంతాల్లో ప్రతిరోజు ప్రతి ఒక్కరూ 400 గ్రాముల చెత్తను సృష్టిస్తున్నారని తెలిపారు. నగరాలు అభివృద్ధి చెందుతున్నకొద్దీ చెత్త పెరుగుతుందని, తద్వారా కాలుష్యం పెరిగి... ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందన్నారు. ఘన వ్యర్థాల నిర్వహణ వల్ల పరిస్థితిని చక్కదిద్దవచ్చని రవికాంత్ సూచించారు. ప్రతి ఇంటి నుంచి తడి, పొడి చెత్తను వేరు చేసి సేకరణకు సిద్ధంగా ఉంచాలన్నారు. ఆతర్వాత చెత్త సేకరించి, దానిని డిస్పోజల్ కోసం తరలించాలన్నారు. శాస్త్రీయ పద్దతుల్లో చెత్తను భూమిలో పాతి పెట్టడం చాలా ముఖ్యమన్నారు.  


తెలంగాణా లో చాల మంది ప్రజలు చాలా బీద వారు ఎందుకంటే చాలామంది వ్యవసాయం పై ఆధారపడి బ్రతుకు తున్నారు . నిజాం పాలనలో ఉన్నవారు .  తెలంగాణా లో నీటి కాలువలు లేవు కేవలం వర్షం మరియు బోరు బావుల పై వ్యవసాయం చేయాలి , బోరు బావులు కరెంటు పై ఆధారమే కదా ! మన వారు తమ  వద్ద ఉన్న దానిలో ఇతరులకు సహాయం చేసే గుణం ఉంది . నీతి - నిజాయితీ పరులు , ఎంతో ఓపిక గలవారు  ,  మాట ఇస్తే తప్పని వారు ,  ధైర్య వంతులు, ఎప్పుడు పోరాటం లో ముందుంటారు . వారు ప్రాణ మిస్తారు గాని ప్రాణ హానిని ఎప్పుడు చేయరు. మోసం అంటే ఏమిటో వీరికి అసలు తెలియదు . ఒకప్పుడు తెలంగాణా లో దౌర్జన్యం , దోపిడీ , హత్యలు  మరియు ల్యాండ్ గ్రాబింగ్ లు అసలు ఉండేవి కావు, అవి ఏమిటో ఇక్కడి ప్రజలకు తెలియదు . ఎవరు ఎన్ని అడ్డుకున్న మనకు న్యాయం  గా రావలసినవి అవంతట అవే మన తెలంగాణా కు వస్తాయి . 

జూన్ 2 నాడు తెలంగాణా లో పండుగ చేసుకుంటుంటే ప్రక్కవారికి నచ్చడం లేదు , తెలంగాణా అభివృద్ధి అవుతుంటే గిట్టక ఆ రోజు వారేం చేయ బోతున్నారో ఒక సారి చూద్దాం !



కె సి ఆర్ గారు కలలు గన్న " బంగారు తెలంగాణా " ఏర్పడుతుంది , మనకు కావలసినది అదే కదా. మనమందరము మనస్పూర్తి తో కె సి ఆర్ గారికి సహకరిస్తామని ప్రతిజ్ఞ చేస్దాం . 

                                                                                                                                 yours ,
                                                                   www.seaflowdiary.blogspot.com 






No comments:

Post a Comment