Wednesday, May 13, 2015




RTC  STRIKE  -  ఆర్ టి సి  సమ్మె

                                    Date : 13-05-2015. 
                                               12.48 PM



  మన ప్రియతమ ముఖ్యమంత్రి  KCR  గారికి ప్రజల పై ఎంత ప్రేమో ఉద్యోగు లంటే కూడా అంతే ప్రేమ . ప్రజల గురించి ఎవ్వరు చేయని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు , ప్రపంచములో ఎవ్వరు చేయని పనిని ,సాధ్యం కాదని వదలి పెట్టిన పనులను కూడా సాధ్యం చేసి చూపెడుతున్న ధీరుడు . 

  పేద ప్రజలకు దేవుడిగా  ఉద్యోగుల కు అండగా నిలిచారు . వారికి కావలసినవి వారు చెప్పకుండానే స్వయముగా ఎంత మొత్తమైన వెనుకాడకుండా ముందుకు దూసు కెళ్ళుతున్నారు , ఎవరైనా అడగడమే ఆలస్యం , ఆయన దగ్గరికి వెళ్ళిన వారు సంతోషముగా తిరిగి వస్తారు , మనకు KCR  ముఖ్యమంత్రి గా ఉండడం మన అదృష్టం . 

  రాష్ట్ర ఉద్యోగులకు వాళ్ళు అడగ కుండానే  43%  ఫీట్ మెంట్ ఇచ్చారు . ఏ ముఖ్యమంత్రి కూడా ఇలాంటి పనికి  ముందుకు రాలేదు .  ఉద్యోగులు ఎంతో సంతోషిస్తున్నారు .

    ఆర్ టి సి ఉద్యోగులు  తమకు కూడా  43%  ఫిట్  మెంట్ ఇవ్వమని అడిగారు . సంస్థ నష్టాల్లో ఉన్నదని అంత ఫిట్ మెంట్ ఇవ్వమని యాజమాన్యం నిస్సహాయత ప్రకటించి నందులకు  ఆర్ టి సి  ఉద్యోగులు ఆంధ్రప్రదేశ్  మరియు తెలంగాణా వారు సమ్మె చేయుచున్నారు . 



  సంస్థ ఇంతవరకు విభజించ బడలేదు , ఈ నెల 14 నాడు విభజించ బడుచున్నది , ఇంతలోనే వారు సమ్మెకు పిలుపునిచ్చారు . నేటికి 8 రోజులవుతున్నది . ప్రజలు , విద్యార్థులు ఎంతో ఇబ్బంది పడు చున్నారు . మొన్న  A P  EMCET  కు విద్యార్థులు ఎంతో ఇబ్బంది పడ్డారు . 

ఇదే అదనుగా ప్రైవేటు వాళ్ళు అందినంత దోచు కుంటున్నారు . ఆర్ టి సి కి ఇప్పటికే ఎంతో నష్టం జరిగింది . సిబ్బందికి ఇచ్చేదానికంటే ఎక్కువ నష్టం జరిగి ఉంటుందేమో !



    ప్రత్యామ్నాయ చర్యలు తీసికొన్నా లాభం లేదు . మన KCR  గారు మంత్రులతో సబ్ కమేటి వేసి ఈ ఉద్యమం పై రిపోర్ట్ అడిగారు . ఎన్నోసార్లు ఈ  సబ్ కమేటి చర్చించింది సంస్థకు నష్టం రాకుండా , ఉద్యోగులకు మేలు జరుగునట్లు చర్చించి రిపోర్ట్ సమర్పించింది . దీనిపై  KCR  గారు ప్రత్యేక శ్రద్ధ తీసికొని మంత్రులతో చాలా సార్లు చర్చించారు . 



 


 Hon'ble High Court వారు  ఒకవేళ బుధవారంనాటికి సమ్మె విరమించని పక్షంలో ఆర్టీసీ ఉద్యోగులపై క్రమశిక్షణ చర్యలు చేపట్టాలని తెలంగాణ, ఏపీ రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు జారీచేస్తామని హెచ్చరించింది.కోర్టు ఆదేశాలను మన్నించి సమ్మె విరమిస్తే, కార్మికుల న్యాయపరమైన డిమాండ్లను వారంలోగా పరిష్కరించాలని ఇరు రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు జారీచేస్తామని కూడా ధర్మాసనం స్పష్టం చేసింది.

Telangana News

సమ్మె ఆపండి

Updated : 5/13/2015 2:02:28 AM
Views : 388
-విధుల్లో చేరండి
-మొండిగా వెళితే చర్యలకు ఆదేశిస్తాం
-ఆర్టీసీ కార్మికుల సమ్మెపై హైకోర్టు ఆగ్రహం.. నేడు డెడ్‌లైన్
-తుది ఉత్తర్వులు జారీచేయనున్న కోర్టు

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: ఆర్టీసీ కార్మికుల సమ్మె కొనసాగింపుపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది. సమ్మె విరమించి, తక్షణమే విధుల్లో చేరాలని మే 9న తాము జారీచేసిన మధ్యంతర ఉత్తర్వులను ఉల్లంఘించటంపై కార్మిక సంఘాల తీరును ధర్మాసనం తప్పుపట్టింది. కోర్టు ఉత్తర్వులను పెడచెవిన పెట్టిన కార్మికుల వాదనలను వినాల్సిన అవసరం లేదని, కానీ ప్రజాప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని సమ్మె విరమించటానికి మరోరోజు గడువు ఇస్తున్నామని జస్టిస్ కేసీ భాను, జస్టిస్ ఎంఎస్‌కే జైస్వాల్ ఆధ్వర్యంలోని హైకోర్టు వెకేషన్ బెంచ్ పేర్కొంది. ఒకవేళ బుధవారంనాటికి సమ్మె విరమించని పక్షంలో ఆర్టీసీ ఉద్యోగులపై క్రమశిక్షణ చర్యలు చేపట్టాలని తెలంగాణ, ఏపీ రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు జారీచేస్తామని హెచ్చరించింది.

highcourt


కోర్టు ఆదేశాలను మన్నించి సమ్మె విరమిస్తే, కార్మికుల న్యాయపరమైన డిమాండ్లను వారంలోగా పరిష్కరించాలని ఇరు రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు జారీచేస్తామని కూడా ధర్మాసనం స్పష్టం చేసింది. బస్సుల రాకపోకలు నిలిచిపోవడంతో ప్రజలు, విద్యార్థులు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని సమ్మె విరమించుకోవాలని ఆర్టీసీ కార్మికులకు విజ్ఞప్తి చేస్తున్నట్లు పేర్కొంది. ఒకవేళ కార్మిక సంఘాలు మొండి వైఖరితో ప్రవర్తిస్తే కోర్టు చూస్తూ ఉరుకునే ప్రసక్తి లేదని స్పష్టంచేసింది. ఎస్మా చట్టం ప్రకారం చర్యలను చేపట్టేలా ఆదేశాలు జారీచేయడానికి వెనుకాడేదీ లేదని ధర్మాసనం వ్యాఖ్యానించింది. సమ్మె కొనసాగింపుపై కార్మిక సంఘాల నిర్ణయం ప్రకారం బుధవారం తుది ఉత్తర్వులు జారీచేస్తామని ప్రకటిస్తూ తదుపరి విచారణను వాయిదా వేసింది.


 .   వీరు కార్పొరేట్ ఉద్యోగులైన పని చేసేది మాత్రం ప్రజలకే . ఇది కూడా ప్రభుత్వ సంస్థ యే కదా . ప్రభుత్వ ఉద్యోగుల కంటే ఎక్కువ ఏమి అడగటం లేదు కదా ! కాని సంస్థ నష్టాల్లో ఉందని చెబుతున్నారు , పోనీ  అటో-ఇటో కొద్ది తేడా తో పరిష్కరించవచ్చు . తెలంగాణా ఆర్ టి సి కార్మికులు కూడా తెలంగాణా సాధించుటలో ముఖ్య పాత్ర పోషించారు . 
ప్రజలు తమ జీవనం కొరకు నిత్యం ఎక్కడికేక్కడకో వెళ్ళ వలసి వస్తుంది , దానికి ముఖ్య సాధనం రవాణా ! ధనవంతులకు ఎలాంటి ఇబ్బంది ఉండదు . కాని సామాన్యులకు ప్రజా రవాణా యే అతి ముఖ్యమైనది . ప్రజా రవాణా సౌకర్యం బాగుగా ఉంటె  టైం మరియు డబ్బు కలసి వస్తుంది .

ప్రియమైన మన ముఖ్యమంత్రి కె సి ఆర్ గారికి ఇవ్వాలని ఉంటుంది  కాని ఆర్ టి సి విభజన ఇంతవరకు జరగలేదు .  ఇప్పుడు విభజన కాకపోవడమే తెలంగాణా కార్మికులకు ఫిట్ మెంట్ లో జాప్యం జరుగు తున్నట్లు మనం అనుకోవాలి . APSRTC ఉద్యోగుల సమస్య అక్కడి ముఖ్యమంత్రి గారు చూసుకుంటారు .APSRTC ఉద్యోగులు కూడా మన తెలంగాణా ముఖ్యమంత్రి గారి నిర్ణయం మీద ఆధార పడిఎదురు చూస్తున్నారు  . ఇప్పటికే ప్రభుత్వం 39% ఇవ్వడానికి వార్తలు వచ్చాయి కాని ఉద్యోగులు 43%  పట్టు బడుతున్నారు . 

కార్మికులు కూడా పంతాలకు పోకుండా ప్రజలను , విద్యార్థులను దృష్టిలో పెట్టుకుని ఆలోచించ వలసినది . రేపు తెలంగాణా లో EMCET  EXAM  ను దృష్టిలో పెట్టుకొని మన పిల్లలకు కష్ట పెట్ట కూడదు . రేపు ఎలాగైనా APSRTC  , TSRTC  గా విభజన కాబోతున్నాయి కదా , ఆ సంతోషములో నైన మన ముఖ్యమంత్రి  KCR గారి తో ఈ నాటి 13-05-2015 చర్చలలో  TSRTC  ఉద్యోగులు సహకరించి The Hon'ble High Court వారి Order ని శిరసావహించి , రేపటి EMCET  EXAM వ్రాసే విద్యార్థులకు, తల్లి దండ్రులకు   (tension) మానసిక ఒత్తిడి కల్గించకుండా , ప్రజలందరికి ఇంకా కష్ట పెట్టకుండా , ఇక ముందు  TSRTC లాభాల బాట లో  నడపించడానికి ఉద్యోగులు చిత్త శుద్దితో ,దీక్ష తో పనిచేయుటకు ముందుకు వస్తారని ,  మన ప్రియతమ ముఖ్యమంత్రి  KCR గారు ఉద్యోగుల పట్ల ప్రేమతో వారిని పూర్తి  సంతృప్తి పరుస్తారని ఈ రోజు సాయంకాలం నుండియే బస్సులు నడవాలని  కోరుకుందాము.  
   19.57 ( 07.57 PM)  "Congratulations to our beloved KCR gaaru for resolving the RTC strike with bumper and never expected fitment" . Now  the responsibility of employees is to serve public better and make the organisation to profit. Be happy. 

                                                                                                                              yours,
                                                                                                           www.seaflowdiary.blogspot.com 

No comments:

Post a Comment