తెలంగాణా లో విద్యుత్ - Power in Telangana
Date : 10-08- 2014
పోయిన జన్మలో చేసిన పాపానికి ఈ జన్మలో ఖర్మ అనుభ విస్తున్నారని పెద్దలు చెప్తారు. పోయిన ప్రభుత్వాలు చేసిన పనికి ఇప్పుడు తెలంగాణా ప్రజలు కరెంట్ కష్టాలు అనుభ విస్తున్నారు. అది అక్షరాల నిజం . ఈ క్రింది హరీష్ రావు గారు వ్రాసిన ఆర్టికల్స్ చదివితే వివరముగా తెలుస్తుంది. ప్రతి తెలంగాణా పౌరుడు చదివి తెలుసుకోన వలసిన అవసరం ఉంది .
క్రొత్త ప్రభుత్వం అధికారం లో కి వచ్చి 100 రోజులు అయిందో లేదో ఎప్పు డెప్పుడు ప్రభుత్వం మీద పడదామా అని ప్రతి పక్షాలు ఎదురు చూస్తున్నాయి. ఆ అదను విద్యుత్తూ రూపములో వెళ్ళ గక్క బోతున్నాయి . అసలు ఇలా ఎందుకు జరిగినదో తెలుసు కొని చేస్తే ప్రజలు కూడా కలసి వచ్చెవారు. ప్రజలు కలసొచ్చిన రాక పోయిన పర్వాలేదు అనుకుంటే వారి - వారి ఇష్టం . ఇదంతా ఎందుకు చేస్తున్నారంటే వారి పై నున్న పెద్ద వారి మెప్పు కోసం అని అందరికి తెలుసు .
100 రోజులలో ఏ ప్రభుత్వమైన ఎంత చేయగలదు అని ఎవరైనా గుండె మీద చెయ్యి వేసుకొని చెప్పగలరా?
ఈ ప్రభుత్వం ఎంతో చేసింది అతి తక్కువ కాలం లో, దీనితో బాటే ఏర్పడ్డ ప్రభుత్వాలు ఎం చేశాయో ఒక సారి తెలుసుకుంటే బాగుంటుంది .
పది సంవత్సరాలు పాలించిన ప్రభుత్వాలు ఆ నాడు తెలంగాణా గురించి అసలు ఆలో చించాయా అని . ఈ క్రింది వ్యాసములో హరీష్ రావు గారు క్లియర్ గా వ్రాసారు, దయ చేసి చదవండి .
కావలసింత బొగ్గు మనదగ్గర ఉన్నా కరెంటు ఎందుకు ఉత్పత్తి ఎందుకు కాలేదు . బొగ్గు ఇక్కడ - కరెంట్ ఉత్పత్తి అక్కడ
తెలంగాణా లో విద్యుత్తూ కొరత తెలిసి కూడా పి పి ఎ లను ఎందుకు రద్దు చేయాలను కున్నారు . కె టి పి సి మరియు వి టి పి సి ల నుండి రావలసిన 710 మెగా వాట్ ఎందుకు రావడం లేదు . సీలేరు నుండి 460 మెగావాట్ ఎందుకు లాక్కున్నారు . కృష్ణపట్నం నుండి రావలసిన 400 మెగా వాట్ ఎందుకు ఇవ్వడం లేదు . అర్ టి పి పి లో బొగ్గు కొరత అని కరెంట్ ఎందుకు ఉత్పత్తి చేయడం లేదు, అక్కడి 1050మెగా వాట్ లో 54% తెలంగాణా కు రావాలి. కాని ఇదంతా కావాలని పన్నిన పన్నాగమమె . ఎదుటి వాడు ఏ మైనా పర్వాలేదు , మనకు దక్కనిది ఎదుటివాడికి ఎందుకు దక్కాలని .
ఈ రోజు రూ 8. 50 కి యూనిట్ చొప్పున 14 మిలియన్ యూనిట్లు కొని తెలంగాణా లో ప్రభుత్వం సరఫరా చేయు చున్నది. ఇంకా ఎక్కడ లభ్యమైన ఎంత ధర కైనా కొని సప్లై చేయడానికి సిద్ధం గా యున్నది.
రెండు ప్రాంతాలు సమానమని రెండు కళ్ళ సిద్ధాంతం అని కొబ్బరి చిప్పల సిద్ధాంత మని ఆ నాడు పలికిన పెద్ద మనిషి చిలుక పలుకులు ఏ మైనాయి ? ఉండేది ఇక్కడ ఇక్కడి ప్రజలనే బాధించడం ఎంత వరకు సమంజసం ?
1200 మంది విద్యార్థులు ఆత్మ బలిదానం చేసి తెలంగాణా సాధించి పెట్టారు . ఇంత మంది బలిదానం చేసికొన్నా ఒక్క రోజైన ఇక్కడే ఉండి కూడా మానవతా దృక్పదం తో పరామర్శించ డానికి కూడా రాలేదంటే వారికి అసలు మనసు- గుండె ఉన్నట్లా లేనట్లా ? వారిది కర్కశ గుండె కాకుంటే ఇంకేమిటి ?
ఇన్ని అడ్డగోలు జరుగుతున్నా మనం ఏం చేస్తున్నట్లు? మనం న్యాయం గా మనకు రావలసిన వాటాను కేంద్ర ప్రభుత్వం తో పోట్లాడి మనం సాధించు కుందాం . ఇంకా ఆలస్యం చేయకూడదు . కె సి ఆర్ గారు మీరు పట్టు బడితే సాధించ లేనిది ఏది లేదు . ఇక్కడ డబ్బులు ఎక్కువ పెట్టి కరెంటు కొనే బదులు కేంద్రం నుండి ఎక్కువ వాటాను తెచ్చుకుందాం . ప్రజా లంతా మీ వెంటే ఉన్నారు .
మనం మళ్లీ మొదటికి వెళదాం , ఈ రోజు ఉత్తర ప్రగల్బాలు పలుకు చున్నవారు వారి చేతిలో అధికారం ఉన్నప్పుడు ఎం చేశారు ? తెలంగాణా ను ఎంత అభి వృద్ధి చేశారు ? వారు తెలంగాణాకు అసలు ఎం చేయలేదు అసెంబ్లీ లో తెలంగాణాకు ఒక్క రూపాయి కూడా ఇవ్వను అని ఒక మూర్ఖుడు అంటే నోరు విప్పని వారు ఈనాడు ఏదో ప్రజలకు చేస్తాం అంటే ఎవరు నమ్ముతారు . తుపాకి చేతిలో పెట్టుకొని పులిని కాల్చలేని వారు ఈరోజు అధికారం లేని వారు ఏదో చేస్తామంటే నమ్మడానికి తెలంగాణా ప్రజలు అమాయకులు కారు . తెలంగాణా ప్రజలు ఛి అని తరిమి కొట్టినా ఇంకా తేరుకో లేని వారు , ముచ్చటగా మూడు సార్లు ఛీ కొట్టిన ఇంకా పదవి గురించి ప్రాకులాడ డము చూస్తె ఎవ్వ రైనా నవ్వు కుంటారు .
తెలంగాణా ప్రజలు చాలా బీద వారు కాని మాట తప్పని వారు , ఎదుటి వారికి సహాయ పడేవారు ,ధైర్య వంతులు వారు ప్రాణ హానిని ఒర్తురు గాని మాన హానిని ఓర్వలేరు .
ప్రియమైన హరీష్ రావు గారు మాకు తెలియని ఎన్నో విషయాలను చెప్పారు , మీకు ధన్యవాదములు, మీరు ఇంకా ఎన్నో తెలియని విషయాలు వ్రాయాలి . తెలంగాణా ప్రజలందరూ మీ వెన్నంటే ఉన్నారు , మన టి ఆర్ ఎస్ ప్రభుత్వం ముందుకు దూసుకు వెళ్లాలని కోరుతూ,
మీ- www.seaflowdiary.blogspot.com
No comments:
Post a Comment