Friday, October 17, 2014

  OLDEN  GLORY TO HUSSAIN SAGAR -హుస్సేన్ సాగర్ కు పూర్వ వైభవం
                                                    हुसैन सागर की पूर्व वैभव 


                                                                                                      తేది 17-10-2014
                                                                                          updated : 31 - 01 - 2015 

పూజ్యు లైన కె సి ఆర్ గారు 
 మా ముఖ్య మంత్రి గారు,


             మీరు హుస్సేన్ సాగర్ ను శుద్ధి చేయించడానికి  సన్నద్ద మవడము జంటనగరాల ప్రజల సంతోషానికి అవధులు లేవు . మీరు స్వయంగా పరిశీలించడం , పూర్వ వైభవం తేవాలని యుద్ధ ప్రాతి పదికన చర్యలు తీసికోవడానికి అధికారులకు ఆదేశించడం చాల సంతోషం. మురుగు నీటిని ఇందులో కలవకుండా డైవర్షన్ కేనాల్స్ ఏర్పాటు చేసి ఒకప్పటి మంచినీటి సరస్సు గా  చేయడం నిజంగా ఒక మహా కార్యక్రమం .  హుస్సేన్ సాగర్ లో ప్రతి సంవత్సరము ప్రపంచ బోటు పందేలు జరుగుతాయి . ఒకప్పుడు  హోలీ ఆడిన తరువాత చాల మంది ఈ  హుస్సేన్ సాగర్ లో స్నానాలు చేసే వారు ఈదు లాడేవారు హోళీ  రంగులన్ని కడుక్కొని పోగొట్టుకునే వారు ,    అప్పుడు నీళ్ళు శుభ్రం గా ఉండేవి , ఇందులో చేపలు కూడా ఉండేవి, అంటే కొన్నేళ్ళ క్రితం వరకు ఇందులోని నీరు శుభ్రం గా ఉండేవి, అనగా 1970 వరకు బాగుగా నుండి  క్రమం గా ఇందులోని నీరు పాడవడం ప్రారంభం అయినది .  మురుగు నీరు , పరిశ్రమల వేస్టేజ్ మరియు కెమికల్ వాటర్ వచ్చి కలవడం వలన పూర్తి గా కలుషిత మైనాయి . ఎవరికీ ఇష్టం వచ్చినట్లు వారు యథేచ్చగా మురుగు నీరు వదలి సాగర్ ని మురికి కూపం గా మార్చారు . అసలు వారికి భయం అనేది లేకుండా పోయింది . 

   
హుస్సేన్ సాగర్ ను హజ్రత్ హుస్సేన్ షా వాలి  1562 లో ఇబ్రహీం కులీ కుతుబ్ షా  పాలనలో నిర్మించాడు. దాని వైశాల్యం 5. 7 చ కి మీ.  పొడవు 3. 2  కి మీ.  వెడల్పు 2 . 8  కి మీ.  కోఆర్డినేట్స  17.45°N 78.5°E  లోతు 32 ఫీట్లు . 
ఇది మూసి నది కాలువకు అడ్డముగా కట్టబడినది . శు భ్ర మైన మూసి  నది నీటి తో నింపబడి హైదరాబాద్ ప్రజలు త్రాగుటకు ఉస్మాన్ సాగర్ మరియు హిమాయత్ సాగర్  త్రవ్వక ముందు ఈ నీటినే త్రాగే వారు .  


Hussain sagar hyd.jpg









 హుస్సేన్ సాగర్   


                                                             ట్యాంక్ బ్యాండ్ పై 1932 లో NSR బస్సు       








                      నేటి ట్యాంక్ బ్యాండ్ రోడ్ 



        శ్రీ . ఎన్ టి ఆర్ గారు ముఖ్య మంత్రి హయాములో ట్యాంక్ బండ్ కట్టను వెడల్పు చేసి గార్డెన్ వేయించి  అందంగా తీర్చి దిద్దారు , ఇదే కాక ఆయన ప్రతి ఆదివారం మధ్యాహాన్నం నుండి సాయంకాలం 10 గంటల వరకు ట్రాఫిక్ ను ట్యాంక్ బండ్ పై నిషేదించి చిన్న పిల్లలు ఆడు కొనుట కై వీలు కల్పించారు.  మరియు పిల్లలకు డ్రాయింగు ,ఆటలు ,పాటలు, మిమిక్రి , కంపిటిషన్ పెట్టించారు. దీనితో పిల్లలు పెద్దలతో ట్యాంక్ బండ్  ఒక బీచ్ లాగ అనిపించేది.  విచిత్ర వేష దారులు హనుమంతుని వేషములో   పిల్లలను నవ్వించేవారు  

         దేశం లో ఎక్కడ లేని విధముగా  మన హుస్సేన్ సాగర్ నీటి మధ్యలో జిబ్రాల్టర్ రాక మీద 18 మీటర్ ఎత్తు , 450 టన్నుల బరువు గల ఏక శిలా బుద్ధుని విగ్రహమును పెట్టడానికి యాదగిరిగుట్ట సమీపం లోని రాయగిరి దగ్గర నున్న కొండ నుండి  అతి పెద్ద  ఏకశిలా బుద్ధుని విగ్రహం ను  200 మంది శిల్పులు 2  నెలలు చెక్కి అక్కడి నుండి ప్రభుత్వమే పెద్ద ట్రాలీ పై  హుస్సేన్ సాగర్ కు ఎంతో ప్రయాసల తో నాలుగు రోజులలో తరలించారు. ఇక్కడ ఫైనల్ టచప్ చేసి సాగర్ మధ్య లోక స్థాపించుటకు బోట్ లో  తీసుక వెళుతుండగా బ్యాలెన్సు అవుట్ అయి ఒక ఇంజనీర్ తో సహా 5 గురు బోట్ మరియు బుద్దు ని తో సహా సాగర్ లో మునిగి పోయారు . వారి ఆత్మ శాంతించాలని ఆ భగవంతుడి ని మనం మరి ఒక సారి ప్రార్థిస్దాం. 

      తరువాత చెన్నారెడ్డి ముఖ్య మంత్రి గారి హయాములో 12 ఏప్రిల్ 1992  లో బుద్దున్ని హుస్సేన్ సాగర్ లో మొదట అనుకున్న ప్రదేశం(  జిబ్రాల్టర్ రాక్ ) పై  ప్రతిష్టించడం జరిగినది .  బుద్ధుని  వలన జంట నగరాల శోభ మరింత పెరిగింది . వీరిద్దరికీ ధన్య వాదములు .




                                                                         బుద్ధ విగ్రహం  బేస్మెంట్ లో చెక్కి నది        



                                                                        బుద్ధ విగ్రహం                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                      

          ఇక తరువాత వచ్చిన ప్రభుత్వాలు ట్యాంక్ బండ్ ను పూర్తిగా మరచి పోయారు. సరియైన లైట్లు కూడా ఏర్పాటు చేయలేదు . మురుగు నీరు సాగర్ లో కి  రాకుండా ఎలాంటి  చర్యలు తీసుకొనలేదు. పరిశ్రమల వారు యథేచ్చగా వ్యర్థ లను సాగర్ కాలువలలోకి  వదలి పెట్టడం వలన, చుట్టూ ప్రక్కల వారు కూడా   సాగర్ లోకి  మురికి నీటిని వదలి పెట్టడం వలన  ఈరోజు సాగర్ జలాలు ఇలా మారి అసలు పనికి రాకుండా కనీసం చెట్లకు కూడా పోయడానికి పనికి రాకుండా పోయాయి . దీని కంతటి కి గత ప్రభుత్వాలే  భాద్యులు,  నీటిని కలుషితం చేసే వారి పై  ఎలాంటి కఠిన చర్యలు కూడా తీసికోలేదు .  ఎండా కాలం లో ట్యాంక్ బ్యాండ్ పై వెళుతుంటే  ఎండకు నీరు వేడెక్కి దుర్గంధం వెదజల్లు తుంది ఆ వాసనకు ముక్కు మూసికొన వలసి పోవలసినదే. 

                 తరువాత ప్రభుత్వం విదేశాల  నిపుణుల సలహాలను తీసికొని , ప్రక్షాళ కు విదేశీ ఆర్ధిక సహాయం తీసికొని వందల కోట్ల రూపాయలను ఖర్చు పెట్టి హుస్సేన్ సాగర్ ను శుద్ధి చేయించారు కాని ఏం లాభం జరుగలేదు, కేవలం అందులోని గుర్రపుడెక్క  ను తొలగించారు , ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉన్నట్లు ఉంది .  గత ముఖ్య మంత్రి గారు హుస్సేన్ సాగర్ లో నాలు గైదు ఫ్లోటింగ్ ఫౌంటెన్ లు పెట్టించి నీళ్ళు పైకి చిమ్మిస్తుంటే ట్యాంక్ బండ్ పై వెళ్లే వాళ్ళ ముఖాలు మురికి నీటి తో కడుగు తున్నాయి .

              ఇప్పుడు మన ప్రియతమ కె సి ఆర్ గారు హుస్సేన్ సాగర్ ను శుద్ధి చేయించడానికి కృత నిశ్చయం తో ఉన్నందులకు మనమంతా ధన్యవాదములు తెలుపాలి . మురికి వచ్చే కాలువ వేరు గా ఉన్నా సాగర్ లో కలుస్తున్నాయి , ఆ కాలువను లీకేజీ లేకుండా పకడ్ బండి గా మరియు చుట్టూ ప్రక్కల నుండి వచ్చే మురికి నీరు కూడా అదే కాల్వ ద్వారా బయటికి పంపి  సాగర్ లో కలువ కుండ చేస్తున్నందుకు , కేవలం స్వచ్చ మైన వాన నీటి తో నిండు నట్లు చేస్తున్నందులకు చాల సంతోషం . ఇక వినాయకులను నిమజ్జనం చేయుటకు ఇందిరా పార్కు లో ఒక సరస్సు ఏర్పాటు చేయడం బాగుగానే ఉంటుంది కాని అది ఇప్పుడు mandatory కాదేమో మళ్లీ  ఒకసారి ఆలోచించాల్సిన అవసరముందేమో ?

  ఈ పనులన్నీ చేయడానికి ప్రపంచములోని అత్యుత్తమ నిపుణులతో ప్లానింగ్ చేయించాలన్నారు బాగానే యుంది  కాని మన దేశం లోనే శ్రీ . విశ్వేశ్వరయ్య నోబెల్ ప్రైజ్ పొందిన ఇంజనీర్ ,   మన వద్దనే చాల మంది నిపుణులు మరియు ఇక్కడి university  లలో professor  లు చాల మంది ఉన్నారు కదా .  మరి ఉస్మాన్ సాగర్ ,హిమాయత్ సాగర్ ప్లాన్ , హైదరాబాద్ water supply  మరియు drainage system plans  కూడా  నోబెల్ ప్రైజ్ పొందిన ఇంజనీర్ శ్రీ . విశ్వేశ్వరయ్య గారు మన వాడే కదా . అందుకే నిపుణులైన మన దేశం లోని engineer ల ప్లానింగ్ తీసుకోవడమే మేలు .

     ఏముంది సామాన్యుడు కూడా ప్లాన్ చెప్తాడు  ముందుగా సాగర్ లోని నీటిని పూర్తిగా తీసివేసి అందులోని మట్టి ( పూడిక ) ను తీసి ప్రత్యేక కాలువను నిర్మించవచ్చు,  కాని అతను  డిజైను ఎలా చేయాలని మాత్రం చెప్పలేడు . దీనికి ఖర్చు కూడా ఎంత తక్కువ అవుతుందన్నది ప్రతి ఒక్కరు చెప్పగలరు . సాగర్ ప్రక్ష్యాల  కై  శ్రమ దానానికి  హైదరాబాద్ ప్రజలందరు సంతోషముగా ముందుకు రాగలరని పూర్తి నమ్మకం ఉన్నది .

పూజ్యు లైన కె సి ఆర్ గారు

     దయ చేసి ఈ పని లో పనిగా ట్యాంక్ బ్యాండ్ కు సమాంతరము (Parallel)  గా ఇప్పుడు ఉన్న road  ( కట్ట) కు సాగర్ లోపలి వైపు( water side ) మరి ఒక రోడ్ వేయించ గలరు  ఒకటి పోవడానికి మరి ఒకటి రావడానికి వీలు కలిగి ట్రాఫిక్ కు ఎంతో మేలు కలుగు తుంది .    వీలయితే సికిందరాబాద్ సైడు నుండి ఒక వై (Y ) షేప్  రోడ్   ఒకటి  secretariat సైడ్  ఇంకొకటి ఖైరతాబాద్ సైడ్ వెళ్ళు నట్లు సాగర్ నీటి లో వేస్తె ఇక ట్రాఫిక్ కు అంతరాయం అసలే ఉండదు .   వీటి  వలన మీ పేరు హైదరాబాద్ చరిత్ర లో సువర్ణ అక్షరము లతో వ్రాయబడి  చిరస్థాయి గా నిలిచి పోతుంది . మా హృదయంలో మీరు ఎప్పటికి ఉంటారు . 

                                                                                                                  మీ ,
            
                                                                                      - www.seaflowdiary.blogspot.com





       

No comments:

Post a Comment