Tuesday, October 21, 2014


ఎందుకు ఈ కుట్ర  
                                                                     
                                                                                                               Date : 21-10-2014

      తెలంగాణా రాష్ట్రం ఏర్పడి నాల్గు నెలలు దాటింది,  ఆ నాడు తెలంగాణా రాష్ట్రాన్ని ఆదరా బాదరాగా ఏర్పాటు చేసినట్లు నేడు స్పష్టం గా కనిపిస్తున్నది.    ఎందుకంటే ఆస్తులు, వనరులు మరియు ఉద్యోగుల పంపకాలు ఇంతవరకు జరుగలేదు . ఏదో తెలంగాణా రాష్ట్రం ఏర్పడినంక చూసుకోవచ్చు ముందయితే రాష్ట్రం ఏర్పడని అని మన నాయకులు భావించారు .

      వెనుకబడిన తెలంగాణా ను  ప్రత్యేక  రాష్ట్రం చేయాలని  60 ఎండ్లనుండి ఉద్యమం చేస్తుంటే 1200 మంది విద్యార్థులు బలిదానం చేసుకున్నాక, ఉద్యమం తీవ్ర తరమైనప్పుడు , బి జె పి  అంతకు ముందే ప్రత్యేక రాష్ట్రానికి సుముకత తెలిపినందు వల్ల చేసేది ఏమి లేక చిట్టచివరగా కాంగ్రెస్ తెలంగాణా బిల్లు పెట్టి  ఎన్నో అడ్డంకుల మధ్య బి జె పి సపోర్ట్ వలన బిల్లు పాస్ చేసి ఏవో కొన్ని షరతులు పెట్టి చట్టం చేసి తెలంగాణా ఇచ్చింది . ఎన్నో త్యాగాల ఫలితమే ఈ తెలంగాణా  రాష్ట్రం . కొన్ని చట్టాలు తెలంగాణా కు వ్యతిరేకముగా ఉన్నవి . చేసిన చట్టాలను ఆంధ్రా రాష్ట్రం కాల రాయు చున్నాది . 

          ఈ షరతుల వలన తెలంగాణా రాష్ట్రం సంతోషం గా లేదు ఆంధ్రా రాష్ట్రం ఎప్పటికి ఏదో అడ్డంకులు కల్పిస్తూ తెలంగాణా  ను ప్రశాంతము గా నిద్ర పోనీయడం లేదు . ఇందుకు కేంద్రం కూడా అధికారులను తొందరగా విభాజించ కుండ కాలయాపన చేస్తున్నందులకు అభివృద్ధి జరగడం లేదు . ఒక్కొక్క  ఐఏఎస్ ఆఫీసర్ 7-8 విభాగాలను చూస్తూ న్నారట .  కొన్ని విభాగాలలో ఇంకా ఆంద్ర పెత్తనం చలాయించ బడుతున్నది . 

 మద్రాస్ నుండి ఆంధ్రా వేరు పడ్డప్పుడు ఏ షరతులు విధించారో అవే షరతులతో  తెలంగాణా  నుండి ఆంధ్రా ను కూడా విడ గోడితే నే  మనం ఒప్పు కోవలసినది, అంతా క్లియర్ అయిన తరువాత నే వేరు అయి ఉంటె ఈ గొడవలు రాక పో వేమో ! ఏదో రాష్ట్రం ఏర్పడింది చాలు అని అనుకొన్నట్లు ఉన్నాం . ఇలా జరుగు తుందని కలలో కూడా మనం ఊహించ లేదు .  

       ఈ సంవత్సరం వర్షాలు లేక విత్తనాలు కూడా తెలంగాణా లో వేయలేదు , వేసిన పంటలు కరెంట్ లేక బోరింగులు పనిచేయక కొద్ది వర్షాలు లేక పంటలు ఎండి పోయాయి, పంటలు ఎండి పోవడం తో . రైతులు అప్పుల బాధ తో ఏం చేయాలో తెలియక ప్రాణాలు తీసికుంటున్నారు . తెలంగాణా లో పంటలన్నీ వర్షాధారం మరియు బోరు బావుల పై ఆధారపడి పండుతాయి. ఈ సారి వర్షాలు లేవు బోరింగులకు కరెంట్ లేదు . గ్రామాలలో 4-5 గంటలు కరెంట్ ఇస్తే ఎం సరిపోతుంది .

         క్రొత్త ప్రభుత్వం అధికారం లో కి వచ్చి 100 రోజులు అయిందో లేదో ఎప్పు డెప్పుడు  ప్రభుత్వం మీద పడదామా అని ప్రతి పక్షాలు ఎదురు చూస్తున్నాయి. ఆ అదను విద్యుత్తూ రూపములో వెళ్ళ గక్కు తున్నాయి .   అసలు ఇలా ఎందుకు జరిగినదో  తెలుసు కొని చేస్తే ప్రజలు కూడా కలసి వచ్చే వారు . ప్రజలు కలసొచ్చిన రాక పోయిన  చేస్తున్నారంటే  వారి పై నున్న పెద్ద వారి మెప్పు కోసం అని అందరికి తెలుసు .నిజం గా ప్రజల పై ప్రేమ ఉంటె ఎప్పుడో చేసేవారు వారి పాలనలో .  వారి పై నున్న   హై కమాండ్ కు వీరు చేసేది తెలుసో ? తెలియదో ?

      ఈ రోజు ఉత్తర ప్రగల్బాలు  పలుకు చున్నవారు వారి చేతిలో అధికారం ఉన్నప్పుడు ఎం చేశారు ? తెలంగాణా ను ఎంత అభి వృద్ధి చేశారు ? వారు తెలంగాణాకు అసలు ఎం చేయలేదు అసెంబ్లీ లో తెలంగాణాకు ఒక్క రూపాయి కూడా ఇవ్వను అని ఒక మూర్ఖుడు అంటే నోరు విప్పని వారు ఈనాడు ఏదో ప్రజలకు చేస్తాం అంటే ఎవరు నమ్ముతారు . తుపాకి చేతిలో పెట్టుకొని కూడా పులిని కాల్చలేని వారు  ఈరోజు అధికారం లేని వారు ఏదో చేస్తామంటే నమ్మడానికి తెలంగాణా ప్రజలు అమాయకులు కారు .  తెలంగాణా ప్రజలు ఛి అని తరిమి కొట్టినా ఇంకా తేరుకో లేని వారు , ముచ్చటగా మూడు సార్లు ఛీ కొట్టిన ఇంకా పదవి గురించి ప్రాకులాడ డము చూస్తె ఎవ్వ రైనా నవ్వు కుంటారు .


100 రోజులలో ఏ ప్రభుత్వమైన ఎంత చేయగలదు అని ఎవరైనా గుండె మీద చెయ్యి వేసుకొని చెప్పగలరా?

    ఈ ప్రభుత్వం ఎంతో చేసింది అతి తక్కువ కాలం లో, దీనితో బాటే ఏర్పడ్డ ప్రభుత్వాలు ఎం చేశాయో ఒక సారి తెలుసుకుంటే బాగుంటుంది .

    కావలసింత బొగ్గు మనదగ్గర ఉన్నా కరెంటు ఎందుకు ఉత్పత్తి ఎందుకు కాలేదు .  బొగ్గు ఇక్కడ - కరెంట్ ఉత్పత్తి అక్కడ. మన తెలంగాణా నాయకులు పట్టించు కుంటే కదా !

         తెలంగాణా లో విద్యుత్తూ కొరత తెలిసి కూడా  పి  పి  ఎ  లను ఎందుకు రద్దు చేయాలను కున్నారు .  కె టి పి సి మరియు వి టి పి సి ల నుండి రావలసిన 710 మెగా వాట్ ఎందుకు రావడం లేదు . సీలేరు నుండి 460 మెగావాట్ ఎందుకు లాక్కున్నారు . కృష్ణపట్నం నుండి రావలసిన 400 మెగా వాట్ ఎందుకు ఇవ్వడం లేదు . అర్ టి పి పి  లో బొగ్గు కొరత అని  కరెంట్ ఎందుకు ఉత్పత్తి చేయడం లేదు,  అక్కడి 1050మెగా వాట్ లో 54% తెలంగాణా కు రావాలి. కాని రావడం లేదు ,  ఇదంతా కావాలని పన్నిన పన్నాగమమె  . ఎదుటి వాడు ఏ మైనా పర్వాలేదు , మనకు దక్కనిది ఎదుటివాడికి ఎందుకు దక్కాలని .  ఈ రోజు కృష్ణ వాటర్ ట్రిబ్యునల్ కు శ్రీశైలం ప్రాజెక్ట్ లో నీటి మట్టం తగ్గినదని తెలంగాణా ప్రభుత్వం  కరెంట్ ఉత్పత్తి ని ఆపు చేయాలని ఆంధ్ర ప్రభుత్వం లెటర్ వ్రాసినది . ప్రస్తుతం 860 అడుగుల నీరు శ్రీశైలం ప్రాజెక్ట్ లో ఉన్నది . 834 అడుగుల వరకు నీరున్నా కరెంట్ ఉత్పత్తి చేయవచ్చు . ఇంతకు ముందు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి గా ఉన్నప్పుడు 770 అడుగుల నీరున్నా కరెంట్ ఉత్పత్తి చేయించారు . మరి ఇప్పుడెందుకు ఆబ్జేక్షన్ ? అంటే వాళ్లకు త్రాగడానికి నీరు సరిపోదట , ఎప్పుడో అవసరమున్న నీటికి ఇప్పుడే ముందు చూపా ? మరి ఇక్కడ తెలంగాణా లో రైతులు పంటలు కరెంట్ లేక ఎండిపోతున్న తట్టుకోలేక ప్రాణాలు పోగొట్టుకుంటే కనిపించడం లేదా? ఇక్కడ ప్రాణాలు పోయినా ఆయనకు పరవా లేదు . ఈ రోజు కొన్ని చోట్ల ప్రజలు తిరుగు బాటు కూడా చేశారు . ట్యాంక్ బ్యాండ్ పై ధర్నాలు కూడా చేశారు , ఇక్కడ ధర్నాలు చేయడం వలన లాభం లేదు, డిల్లీ వెళ్లి చేస్తే ఫలితం ఉంటుంది . 

    తెలంగాణా లో పెట్టుబడి పెట్టేవారికి కరెంట్ ప్రాబ్లం ఉందని చెప్పడానికి ,ఇక్కడ పెట్టుబడులు పెట్ట కుండ చేయడానికి మాత్రమే ఇదంతా . 

      ఈ రోజు రూ 8. 50 కి యూనిట్ చొప్పున 14 మిలియన్ యూనిట్లు కొని తెలంగాణా లో ప్రభుత్వం సరఫరా చేయు చున్నది. ఇంకా ఎక్కడ లభ్యమైన ఎంత ధర కైనా కొని సప్లై చేయడానికి సిద్ధం గా  యున్నది. ఛత్తీస్ గడ్ రాష్ట్రం విద్యుత్ ఇవ్వడానికి సంసిద్ధం తెలుపడం చాల సంతోషం . ప్రక్క నున్న తెలుగు వాడికన్నా ఇంకో ప్రక్క నున్న హిందీ వాడు చాలా నయం 

       రెండు ప్రాంతాలు సమానమని రెండు కళ్ళ  సిద్ధాంతం  అని కొబ్బరి చిప్పల సిద్ధాంత మని ఆ నాడు పలికిన పెద్ద మనిషి చిలుక పలుకులు ఏ మైనాయి ? ఉండేది ఇక్కడ ఇక్కడి ప్రజలనే  బాధించడం ఎంత వరకు సమంజసం ?

      ఇన్ని అడ్డగోలు జరుగుతున్నా మనం ఏం చేస్తున్నట్లు? మనం న్యాయం గా మనకు రావలసిన వాటాను కేంద్ర ప్రభుత్వం తో పోట్లాడి పట్టుబట్టి మరీ మనం సాధించు కుందాం . ఇంకా ఆలస్యం చేయకూడదు . కె సి ఆర్  గారు మీరు పట్టు బడితే సాధించ లేనిది ఏది లేదు . ఇక్కడ డబ్బులు ఎక్కువ పెట్టి కరెంటు కొనే  బదులు కేంద్రం నుండి ఎక్కువ వాటాను తెచ్చుకుందాం . ప్రజా లంతా మీ వెంటే ఉన్నారు . మీరు ఉగ్ర నరసింహ అవతారం ఎత్త వలసినదే . కేంద్రం కూడా ఆంధ్రా కే  నిన్న 200 MW un allocated quota southern grid నుండి ఇచ్చినది . మరి తెలంగాణా కు ఎందుకు ఇవ్వలేదు? తెలంగాణా వెనుక బడినదని ,ఇక్కడ కరెంట్ లేదని, వారికి అన్నీ తెలుసు.ఇంతకు ముందు మీరు కరెంట్ గురించి కేంద్రానికి లెటర్స్ కూడా వ్రాశారు కదా .   అక్కడి ఆంధ్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం లో భాగస్వామి కదా  మరి ! అందుకే నేమో ! అన్నీ వాళ్ళ కే . 

     ప్రస్తుతము కరెంట్ పై ఇక్కడ RESTRICTION చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది . ఇపుడు ఉన్న కరెంట్ ను చాలా పొదుపుగా వాడాలి . పట్ట పగలే వీధి దీపాలు వెలుగు తున్నాయి , వాటిని నియంత్రించాలి .  వీధి దీపాలు ALTERNATE  గా వేలుగునట్లు చేయాలి . లేటు గా వేసి ఉదయం తొందరగా ఆర్పివేయాలి . ఇండ్ల లో కూడా విచ్చల విడి గా దుబారా చేయకుండా కోటా FIX  చేయాలి . ADVERTISE  గురించి కరెంట్ ను ఇవ్వరాదు . దీని వలన చాల కరెంట్ ఆదా చేయవచ్చు . కావున ఆలోచించి అమలు చేయాలి . 

    
 తెలంగాణా ప్రజలు చాలా బీద వారు కాని నిజాయితీ పరులు , ఓపిక గలవారు  ,  మాట తప్పని వారు , ఎదుటి వారికి సహాయ పడేవారు , ధైర్య వంతులు వారు ప్రాణ హానిని ఒర్తురు గాని మాన హానిని ఓర్వలేరు . ఎంత వరకు ఓపిక ఉందో అంత వరకు మనం ఓపిక పట్టాల్సిందే మో. 

 మనకు " దేవుడు " ఉన్నాడు ఆయన మనకు  జరుగుతున్న అన్యాయాన్ని గమనిస్తున్నాడు , ఏం చేయాలో ఎప్పుడు చేయాలో తప్పకుండ చేయగలడు . 
                                                                                                       మీ 
                                                                                -  www.seaflowdiary.blogspot.com 














No comments:

Post a Comment