Health is wealth9 - ఆరోగ్యమే మహాభాగ్యం 9
Date : 30-04-2017
updated: 08-05-2017 ,28-05-2017.
బరువు తగ్గాలంటే ..... దాల్చిని చెక్క
దాల్చిన చెక్క చక్కని సువాసనను ఇచ్చే మసాలా దినుసుల జాబితాకు చెందినది. అందుకే దీన్ని వంటల్లో మనం ఎక్కువగా ఉపయోగిస్తాం. దీని వల్ల వంటకాలకు మంచి రుచి, వాసన వస్తుంది. అయితే దాల్చిన చెక్క ఇలా కేవలం వంటకాలకే కాదు మన ఆరోగ్యం కోసం కూడా ఉపయోగపడుతుంది. అధికంగా ఉన్న శరీర బరువును తగ్గిస్తుంది. అందుకు దాల్చిన చెక్కను ఎలా తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం..!
నీటితో...
దాల్చిన చెక్కను లేదా దాని పొడిని కొంత తీసుకుని ఒక పాత్ర నీటిలో వేసి మరిగించాలి. ఆ తరువాత వచ్చే నీటిని తాగి 30 నిమిషాలు ఆగాక భోజనం చేయాలి. ఇలా రోజూ ఉదయం, సాయంత్రం చేస్తే కొద్ది రోజుల్లోనే బరువు తగ్గడాన్ని గమనించవచ్చు.
ఆహారంలో...
భోజనం చేసేటప్పుడు ఆహార పదార్థాలపై చిటికెడు దాల్చిన చెక్క పొడిని చల్లుకుని తినాలి. ఇలా రోజుకు 3 పూటలా తింటుంటే ఫలితం కనిపిస్తుంది. త్వరలోనే బరువు తగ్గుతారు.
జ్యూస్‌లో...
ఆహారంలో తినడం ఇష్టం లేకపోతే స్వచ్ఛమైన పళ్ల రసంలోనూ దాల్చిన చెక్క పొడిని కలుపుకుని రోజూ ఉదయం, సాయంత్రం తాగవచ్చు. అయితే ఆ పళ్ల రసంలో చక్కెర కలపకుండా తాగాలి.
తేనె...
రెండు కప్పుల నీటిలో కొద్దిగా దాల్చిన చెక్క వేసి ఆ నీటిని బాగా మరిగించాలి. నీరు వేడిగా ఉన్నప్పుడే అందులో ఒక టీస్పూన్ తేనెను కలిపి తాగాలి. ఇలా రోజూ ఉదయం, సాయంత్రం తాగితే అధిక బరువు తగ్గుతారు.
పాలు...
పాలను బాగా మరిగించి అందులో దాల్చిన చెక్క పొడిని కలుపుకుని రోజూ రెండు పూటలా తాగుతున్నా అధిక బరువు సమస్య నుంచి బయట పడవచ్చు.
ఓట్స్...
రోజూ రెండు పూటలా ఓట్స్‌ను ఉడకబెట్టి అందులో దాల్చిన చెక్క పొడిని కలిపి తినాలి. ఇలా చేయడం వల్ల కూడా బరువు తగ్గుతారు.
దాల్చిన చెక్కను ఎవరైనా నిరభ్యంతరంగా తీసుకోవచ్చు. కాకపోతే కామెర్లు, మూత్ర పిండాల వ్యాధులతో బాధపడే వారు డాక్టర్ల సూచన మేరకు దీన్ని వాడడం మంచిది.
ఒక కప్పు మరుగుతున్న నీటిలో ఒక టీస్పూన్ సోంపు గింజలను వేసి 10 నిమిషాల వరకు మరిగించాలి. అనంతరం ఆ టీ నుంచి సోంపు గింజలను వడపోసి ఆ నీటిని తాగాలి. ప్రతి రోజు ఉదయం, సాయంత్రం ఆహారం తిన్నాక ఈ టీని తాగితే కింద చెప్పిన ప్రయోజనాలు కలుగుతాయి.
1. సోంపు టీని రోజూ తాగితే మడమ నొప్పి తగ్గిపోతుంది. కండరాలు రిలాక్స్ అవుతాయి. కండరాల్లో ఏర్పడే నొప్పులు తగ్గుతాయి.
2. జీర్ణాశయం శుభ్రమవుతుంది. గ్యాస్, అసిడిటీ, అజీర్ణం, మలబద్దకం వంటి సమస్యలు దూరమవుతాయి.
3. స్త్రీలలో రుతు సంబంధ సమస్యలు పోతాయి. పాలిచ్చే తల్లులు తాగితే పాలు బాగా పడతాయి. పురుషుల్లో శృంగార సామర్థ్యం పెరుగుతుంది.
4. జీర్ణాశయం, పేగుల్లో ఉండే క్రిములు చనిపోతాయి. మంచి బాక్టీరియా వృద్ధి చెందుతుంది. శరీర రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.
5. శరీరంలో ఉన్న విష పదార్థాలు బయటికి పోతాయి. ఒంట్లో అధికంగా ఉన్న నీరు మూత్రం రూపంలో బయటికి పోతుంది. శరీరం అంతర్గతంగా శుభ్రమవుతుంది.
6. మూత్రాశయ సమస్యలు పోతాయి. కిడ్నీ స్టోన్లు కరుగుతాయి. మూత్రం ధారాళంగా వస్తుంది.
7. యాంటీ ఇన్‌ఫ్లామేటరీ గుణాలు ఉండడం వల్ల శరీరంలో నొప్పులు, వాపులు తగ్గుతాయి. కీళ్ల నొప్పులు ఉన్న వారికి మంచి ఔషధం.
8. బీపీ కంట్రోల్ అవుతుంది. రక్త సరఫరా మెరుగుపడుతుంది. గుండె సంబంధ సమస్యలు రాకుండా ఉంటాయి.
9. శరీర మెటబాలిజం రేట్ పెరుగుతుంది. తద్వారా ఒంట్లో అధికంగా ఉన్న కొవ్వు కరుగుతుంది. అధిక బరువు తగ్గుతారు.
10. నోటి దుర్వాసన పోతుంది. దంత సమస్యలు నయమవుతాయి. చిగుళ్లు దృఢంగా మారుతాయి.
గురక సమస్య పోవడానికి డ్రింక్ ... Snore problem
అధిక బరువు ఉన్నా, లేకున్నా చాలా మందిని నేడు గురక సమస్య ఇబ్బందులు పెడుతోంది. దాన్నుంచి బయట పడాలంటే అధిక శాతం మంది సతమతమవుతున్నారు. అయితే కింద ఇచ్చిన విధంగా మన ఇంట్లో ఉండే సహజ సిద్ధమైన పదార్థాలతోనే ఓ డ్రింక్ తయారు చేసి తాగితే దాంతో గురక సమస్య ఉండదు. ఆ డ్రింక్ ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
గురక తగ్గించే డ్రింక్ తయారీకి కావల్సిన పదార్థాలు...
యాపిల్ - 1
నిమ్మరసం - 1 టీస్పూన్
క్యారెట్ - 1
అల్లం రసం - 1 టీస్పూన్
తయారు చేసే విధానం...
పైన చెప్పిన పదార్థాలన్నింటినీ బాగా మిక్సీ పట్టాలి. దీంతో చిక్కని డ్రింక్ తయారవుతుంది. దాన్ని నిద్రించడానికి 30 నిమిషాల ముందు తాగాలి. అలా రోజూ తాగుతుంటే గురక సమస్య నుంచి బయట పడవచ్చు.
యాపిల్, నిమ్మరసం, క్యారెట్, అల్లం రసంలలో జీర్ణశక్తిని పెంచే ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి. ఇవి రక్త ప్రసరణను కూడా మెరుగు పరుస్తాయి. దీంతో కండరాలు రిలాక్స్ అవుతాయి. కణాలు సడలించబడతాయి. తద్వారా గురక సమస్య నుంచి బయట పడవచ్చు.
అనారోగ్యాన్ని దూరం చేయడానికి " కాకర "
అనారోగ్యాన్ని దూరం చేయడానికి " కాకర "
కాకరకాయలను అధిక శాతం మంది ఇష్టంగా తింటారు. వాటి రుచి చేదుగా ఉన్నప్పటికీ కూర లేదా ఫ్రైగా వండుకుని తింటే కాకర ఎంతో రుచిగా అనిపిస్తుంది. కానీ కొందరు మాత్రం దీన్ని తినేందుకు ఇష్టపడరు. అయితే అలా తినకపోతే ఆరోగ్యకర ప్రయోజనాలను చేజార్చుకున్నట్టే. ఎందుకంటే కాకర వల్ల మనకు అనేక లాభాలు కలుగుతాయి. వాటిలో కొన్ని ప్రధానమైన లాభాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
1. కాకరకాయల్లో హైపోగ్లైసీమిక్ పదార్థాలు ఉంటాయి. ఇవి రక్తం, మూత్రంలోని చక్కెర స్థాయిలను తగ్గిస్తాయి. దీంతో మధుమేహం అదుపులో ఉంటుంది. రోజూ కాకరకాయ రసాన్ని కొద్దిగా తీసుకుంటే డయాబెటిస్ రాకుండా ఉంటుంది.
2. లివర్ శుభ్రమవుతుంది. శరీరంలో ఉన్న వ్యర్థ, విష పదార్థాలు బయటికి వెళ్లిపోతాయి.
3. రక్తం శుద్ధి అవుతుంది. శరీరంలో రక్త సరఫరా మెరుగు పడుతుంది. బీపీ తగ్గుతుంది.
4. ప్రతిరోజు కొద్దిగా కాకరకాయ రసంలో కొంత నిమ్మరసం కలిపి తాగితే ఎలాంటి అనారోగ్యాలు దరి చేరవు.
5. కాకర ఆకుల నుంచి తీసిన రసాన్ని మజ్జిగలో కలుపుకుని రోజూ తాగుతుంటే పైల్స్ సమస్య తగ్గిపోతుంది.
6. కాకర చెట్టు వేళ్లను పేస్ట్‌లా చేసి పైల్స్‌పై రాసుకుంటే వాటి నుంచి ఉపశమనం కలుగుతుంది.
7. శరీర రోగ నిరోధక శక్తిని కాకర పెంచుతుంది. ఇన్‌ఫెక్షన్లు నయమవుతాయి.
-seaflowdiary