Wednesday, February 22, 2017




                Health is Wealth -7   ... ఆరోగ్యమే మహాభాగ్యం -7
                                                                           Date :22-02-2017
                                                                                                              updated :08-03-2017


తేనెలో నాన‌బెట్టిన ఎండు ఖ‌ర్జూరాల‌ను తింటే..?



తేనె... మ‌న శ‌రీరానికి కావ‌ల్సిన ఎన్నో పోష‌కాల‌ను అందిస్తుంది. అనేక ర‌కాల ఔష‌ధ గుణాలు ఇందులో ఉన్నాయి. యాంటీ బాక్టీరియ‌ల్‌, యాంటీ ఫంగ‌ల్‌, యాంటీ వైర‌ల్ గుణాలు తేనెలో ఉండ‌డం వ‌ల్ల తేనె మ‌న శ‌రీర రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచి బ‌లాన్ని ఇస్తుంది. అదేవిధంగా ఎండు ఖ‌ర్జూరం పండ్ల‌ను కూడా చాలా మంది ఇష్టంగా తింటారు. దాంతో కూడా మ‌న‌కు అనేక లాభాలే క‌లుగుతాయి. అయితే తేనెలో వారం రోజుల పాటు నాన‌బెట్టిన ఎండ ఖ‌ర్జూరం పండ్ల‌ను తింటే ఏమ‌వుతుందో తెలుసా..? ఆ లాభాల గురించే ఇప్పుడు తెలుసుకుందాం. 

ఒక జార్‌లో 3/4 వంతు తేనె తీసుకోవాలి. అందులో విత్త‌నాల‌ను తీసిన ఎండు ఖ‌ర్జూరం పండ్ల‌ను వేయాలి. అనంత‌రం మూత బిగించి జార్‌ను బాగా షేక్ చేయాలి. అనంత‌రం ఆ జార్‌ను వారం పాటు అలాగే ఉంచాలి. అవ‌స‌రం అనుకుంటే మ‌ధ్య మ‌ధ్య‌లో ఆ జార్‌ను షేక్ చేయ‌వ‌చ్చు. వారం త‌రువాత జార్‌ను తీసి రోజుకు ఒక‌టి రెండు చొప్పున ఆ ఖ‌ర్జూర పండ్ల‌ను తినాలి. దీంతో ఎలాంటి లాభాలు క‌లుగుతాయో చూద్దాం..!

1. పైన చెప్పిన‌ట్టుగా త‌యారు చేసిన తేనె, ఎండు ఖ‌ర్జూరం మిశ్ర‌మం వ‌ల్ల ద‌గ్గు, జ‌లుబు వంటి శ్వాస స‌మ‌స్య‌లు పోతాయి. జ్వ‌రం త‌గ్గుతుంది.

2. శ‌రీర రోగ నిరోధ‌క శ‌క్తి రెట్టింపు అవుతుంది. దీంతో ఇన్‌ఫెక్ష‌న్లు, వ్యాధులు రాకుండా ఉంటాయి.

3. నిద్ర బాగా ప‌డుతుంది. నిద్ర‌లేమితో బాధ‌ప‌డే వారు ఈ మిశ్ర‌మం తాగితే ఫ‌లితం ఉంటుంది. ఒత్తిడి, ఆందోళ‌న వంటివి కూడా త‌గ్గిపోతాయి.

4. గాయాలు త్వ‌ర‌గా మానుతాయి. యాంటీ బ‌యోటిక్ గుణాల వ‌ల్ల గాయాలు, పుండ్లు త్వ‌ర‌గా త‌గ్గుతాయి.

5. జ్ఞాప‌క‌శ‌క్తి పెరుగుతుంది. చిన్నారుల‌కు రోజూ ఈ మిశ్ర‌మం తినిపిస్తే వారు చ‌దువుల్లో బాగా రాణిస్తారు. పెద్ద‌లు కూడా ఈ మిశ్ర‌మం తింటే మ‌తిమ‌రుపు తగ్గుతుంది.

6. మ‌హిళ‌ల‌కు కావ‌ల్సిన ఐర‌న్‌, కాల్షియం పుష్క‌లంగా ల‌భిస్తాయి. ఇవి ర‌క్త‌హీన‌త‌ను నివారించి ఎముక‌ల‌ను దృఢంగా చేస్తాయి.
dry-dates-in-honey
7. సీజ‌నల్ గా వ‌చ్చే వివిధ ర‌కాల అల‌ర్జీలు పోతాయి. ఇన్‌ఫెక్ష‌న్లు త‌గ్గుతాయి.

8. డ‌యాబెటిస్ పేషెంట్ల‌కు మంచి ఔష‌ధం. షుగ‌ర్ లెవల్స్ కంట్రోల్‌లో ఉంటాయి.

9. ప‌లు ర‌కాల క్యాన్స‌ర్‌ల‌కు విరుగుడుగా ఈ మిశ్ర‌మం ప‌నిచేస్తుంది. క్యాన్స‌ర్ క‌ణ‌తులు వృద్ధి చెంద‌వు.

10. జీర్ణ సంబంధ స‌మ‌స్య‌లు దూర‌మ‌వుతాయి. మ‌ల‌బ‌ద్ద‌కం, గ్యాస్‌, అసిడిటీ, అజీర్ణం వంటి స‌మ‌స్య‌లు ఉండ‌వు. పేగుల్లో మంచి బాక్టీరియా వృద్ధి చెందుతుంది. చెడు బాక్టీరియా నాశ‌న‌మ‌వుతుంది. క‌డుపులో క్రిములు ఉంటే చ‌నిపోతాయి.

11. ర‌క్త స‌ర‌ఫ‌రా మెరుగు ప‌డుతుంది. ర‌క్తం బాగా పెరుగుతుంది. రక్త‌హీన‌త ఉన్న‌వారికి ఇది మేలు చేస్తుంది. బీపీ త‌గ్గుతుంది. గుండె సంబంధ స‌మ‌స్య‌లు రాకుండా ఉంటాయి.

12. చెడు కొలెస్ట్రాల్ పోయి మంచి కొలెస్ట్రాల్ వృద్ధి చెందుతుంది. అధిక బ‌రువు త‌గ్గుతారు. కొవ్వు క‌రిగిపోతుంది.


వెల్లుల్లిని పాలలో ఉడుకబెట్టుకొని త్రాగితే .... 






నిత్యం మ‌నం వంటల్లో ఎక్కువ‌గా ఉప‌యోగించే వెల్లుల్లి వ‌ల్ల ఎలాంటి ఆరోగ్య‌క‌ర ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయో అంద‌రికీ తెలిసిందే. దీంట్లో యాంటీ బాక్టీరియ‌ల్, యాంటీ వైర‌ల్, యాంటీ ఫంగ‌ల్ గుణాల‌తోపాటు ఇంకా మ‌న శ‌రీరానికి ప్ర‌యోజ‌నాన్ని చేకూర్చే అనేక ఔష‌ధ గుణాలు కూడా ఉన్నాయి. అదేవిధంగా పాల‌ను కూడా మనం రోజూ తాగుతూనే ఉంటాం. పాల‌ను సంపూర్ణ పౌష్టికాహారంగా కూడా చెబుతారు. అయితే కొన్ని వెల్లుల్లి రెబ్బ‌ల‌ను తీసుకుని దంచి పాల‌లో వేసి ఉడ‌కబెట్టి తాగితే ఏమ‌వుతుందో మీకు తెలుసా..? దీని వ‌ల్ల బోలెడు ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

1. పాల‌లో వెల్లుల్లి రెక్క‌ల‌ను ఉడ‌క బెట్టి తాగ‌డం వ‌ల్ల దాంతో మ‌న శ‌రీరానికి కావ‌ల్సిన పోష‌కాల‌న్నీ ల‌భిస్తాయి. ఫ్లేవ‌నాయిడ్స్, ఎంజైమ్‌లు, యాంటీ ఆక్సిడెంట్లు, మిన‌ర‌ల్స్‌, విట‌మిన్స్ ల‌భిస్తాయి. విట‌మిన్ ఎ, బి1, బి2, బి6, సి విట‌మిన్‌, పొటాషియం, ప్రోటీన్లు, కాప‌ర్‌, మాంగ‌నీస్‌, పాస్ఫ‌ర‌స్‌, జింక్‌, సెలీనియం, కాల్షియం వంటి అనేక పోషకాలు ఈ మిశ్ర‌మం ద్వారా మ‌న‌కు చేరుతాయి.


2. జ్వ‌రం కార‌ణంగా ప్లేట్‌లెట్లు త‌గ్గిపోతున్న వారికి మంచి ఔష‌ధం. ప్లేట్‌లెట్లు వేగంగా పెరుగుతాయి. ఇన్‌ఫెక్ష‌న్లు వెంట‌నే త‌గ్గుముఖం ప‌డ‌తాయి.


3. చెడు కొలెస్ట్రాల్ త‌గ్గుతుంది. మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది. గుండె సంబంధ వ్యాధులు న‌యం అవుతాయి. లేని వారికి భ‌విష్య‌త్తులో రాకుండా ఉంటాయి.


4. ప‌లు ర‌కాల క్యాన్స‌ర్ల‌ను న‌యం చేసే శ‌క్తి ఈ మిశ్ర‌మానికి ఉంది. యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువ‌గా ల‌భించ‌డం వ‌ల్ల రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది. క్యాన్స‌ర్ క‌ణ‌తుల వృద్ధి త‌గ్గుతుంది.


5. వ‌య‌స్సు మీద ప‌డ‌డం కార‌ణంగా వ‌చ్చే వృద్ధాప్య ఛాయ‌లు క‌నిపించ‌వు. యాంటీ ఏజింగ్ ల‌క్ష‌ణాలు పుష్క‌లంగా ఉంటాయి క‌నుక‌, య‌వ్వ‌నంగా క‌నిపిస్తారు.


6. ర‌క్త పోటు, డ‌యాబెటిస్ అదుపులోకి వ‌స్తాయి. ర‌క్త స‌ర‌ఫ‌రా మెరుగు ప‌డుతుంది. లివ‌ర్ శుభ్ర‌ప‌డుతుంది.
garlic-milk

7. గాయాలు, పుండ్లు ఉన్న వారు ఈ మిశ్ర‌మం తాగితే అవి త్వ‌ర‌గా త‌గ్గేందుకు అవ‌కాశం ఉంటుంది. ఎందుకంటే ఈ మిశ్ర‌మంలో రెట్టింపు యాంటీ బ‌యోటిక్ ల‌క్ష‌ణాలు ఉంటాయి.



8. ర‌క్తం గ‌డ్డ క‌ట్ట‌కుండా చూస్తుంది. ర‌క్త నాళాల్లో పేరుకుపోయిన కొవ్వు తొల‌గిపోతుంది.


9. మెటాబాలిజం ప్ర‌క్రియ‌ను వేగ‌వంతం చేస్తుంది. త‌ద్వారా అధికంగా ఉన్న బ‌రువు త‌గ్గుతారు.


10. ద‌గ్గు, జ‌లుబు వంటి శ్వాస కోశ సమ‌స్య‌లు న‌యం అవుతాయి. దంత సంబంధ స‌మ‌స్య‌లు ఉంటే దూరం అవుతాయి.


11. చ‌ర్మానికి అయిన ఫంగ‌స్ ఇన్‌ఫెక్ష‌న్లు న‌యం అవుతాయి. చ‌ర్మ సౌంద‌ర్యం మెరుగు ప‌డుతుంది. మొటిమ‌లు పోతాయి.


12. ఎముకలు దృఢంగా మారుతాయి. ఎముక‌లు విరిగిన వారికి ఈ మిశ్ర‌మం తాగిస్తే త్వ‌ర‌గా అవి అతుక్కునే అవ‌కాశం ఉంటుంది.
                                                                                                          - seaflowdiary 

Monday, February 20, 2017


అజీర్ణం, గ్యాస్‌, అసిడిటీ వంటి స‌మ‌స్య‌ - Acidity PROBLEM
                                                             Date:20-02-2017




అజీర్ణం, గ్యాస్‌, అసిడిటీ వంటి స‌మ‌స్య‌ల‌తో బాధ ప‌డుతున్నారా..? అయితే ఇంగ్లిష్ మందులు అవ‌స‌రం లేదు. ఆయా స‌మ‌స్య‌ల‌కు మీ ఇంట్లోనే చక్క‌ని ప‌రిష్కారం ఉంది. ఇంట్లో లభించే సహజ సిద్ధమైన పదార్థాలను ఉపయోగించి ఆయా సమస్యలను ఎలా తగ్గించుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం. 

బెల్లం...
అసిడిటీ సమస్య బాధిస్తుంటే చిన్న బెల్లం ముక్కను భోజనం చేసిన ప్రతిసారీ నోట్లో వేసుకుని చప్పరిస్తే సరిపోతుంది. దీంతో తిన్న ఆహారం కూడా సరిగ్గా, త్వరగా జీర్ణమవుతుంది. గ్యాస్ సమస్య తొలగిపోతుంది.

నీరు...
నీటిని ఎక్కువగా తాగడం వల్ల కూడా అసిడిటీ సమస్య నుంచి బయట పడవచ్చు. జీర్ణాశయంలో అధికంగా ఉత్పన్నమయ్యే గ్యాస్ కూడా తగ్గిపోతుంది. దీంతోపాటు జీర్ణం కాకుండా ఉన్న పదార్థాలు కూడా సులభంగా జీర్ణమవుతాయి.

లవంగాలు...
భోజనం చేసిన తరువాత గ్యాస్ అధికంగా వస్తుంటే అందుకు లవంగాలు ఉత్తమమైన పరిష్కారం చూపుతాయి. 2, 3 లవంగాలను నోట్లో వేసుకుని చప్పరిస్తే చాలు గ్యాస్ సమస్య ఇట్టే తొలగిపోతుంది. అసిడిటీ నుంచి కూడా బయట పడవచ్చు.
gas-acidity
తులసి ఆకులు...
జీర్ణాశయంలో వచ్చే సమస్యలను తొలగించడంలో తులసి ఆకులు బాగా పనిచేస్తాయి. కొన్ని తులసి ఆకులను తీసుకుని వాటిని బాగా నలిపి, దానికి కొంత తేనెను జతచేసి ఉదయాన్నే పరగడుపున తాగితే అజీర్ణం, గ్యాస్, అసిడిటీ వంటి సమస్యలు తొలగిపోతాయి.

సోంపు...
అజీర్ణం, గ్యాస్ సమస్యలను తగ్గించడంలో సోంపు బాగా ఉపయోగపడుతుంది. 1 టీస్పూన్ సోంపును భోజనం చేసిన ప్రతిసారీ వేసుకుంటే అసిడిటీ నుంచి ఉపశమనం లభిస్తుంది. గ్యాస్ కూడా తగ్గుతుంది. ఆహారం త్వరగా, సులభంగా జీర్ణమవుతుంది.

పెరుగు...
కొద్దిగా పెరుగును తీసుకుని అందులో కీరదోస ముక్కలు, కొత్తిమీర వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని భోజనం చేసిన తరువాత సేవిస్తే అజీర్ణం సమస్య నుంచి ఉపశమనం కలుగుతుంది. గ్యాస్, అసిడిటీ కూడా తగ్గుతాయి. కడుపులో ఏర్పడే మంటను ఇది తొలగిస్తుంది.
                                                                                                 -seaflowdiary

Sunday, February 19, 2017



            దంతాల నొప్పి వ‌స్తే - remedy for Teeth pain 

                                                                  Date :19-02-2017



దంతాల నొప్పి వ‌స్తే ఏదీ తిన‌లేం, తాగ‌లేం. ఆ స‌మ‌యంలో కేవ‌లం దంతాల‌ను క‌దిలించినా చాలు, విప‌రీత‌మైన నొప్పి క‌లుగుతుంది. అయితే దానికి చింతించాల్సిన ప‌నిలేదు. ఇంట్లోనే ఉండే స‌హ‌జ సిద్ధమైన ప‌దార్థాల‌తోనే దంతాల నొప్పి స‌మ‌స్య‌ను ఇట్టే త‌గ్గించుకోవ‌చ్చు. అందుకు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

ఉల్లిపాయ‌లు...
ఉల్లిపాయ‌ల‌ను మ‌నం వంట‌ల్లో రుచి కోసం నిత్యం ఉప‌యోగిస్తుంటాం. అయితే దీంతో దంతాల నొప్పిని కూడా సుల‌భంగా త‌గ్గించుకోవ‌చ్చు. అందుకు ఏం చేయాలంటే, ఒక ఉల్లిగ‌డ్డ‌ను తీసుకుని అడ్డంగా చ‌క్రాల్లా కోయాలి. అందులో నుంచి ఒక చ‌క్రాన్ని తీసి నొప్పి పుడుతున్న దంతం మీద కొంచెం సేపు ఉంచాలి. దీంతో ఉల్లిలోని ఔష‌ధ గుణాలు దంతాల నొప్పిని త‌గ్గిస్తాయి.

ల‌వంగ నూనె...
రెండు, మూడు చుక్క‌ల ల‌వంగ నూనె, 1/4 టీస్పూన్ ఆలివ్ ఆయిల్ ను క‌లిపి మిశ్ర‌మంగా చేయాలి. అందులో కాట‌న్ బాల్స్ ముంచి వాటిని నొప్పి పుట్టే దంతాల‌పై రాయాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల దంతాల నొప్పి త‌గ్గుతుంది. ఇత‌ర స‌మ‌స్య‌లు కూడా పోతాయి.
tips-for-tooth-ache
కీర దోస‌...
పైన చెప్పిన ఉల్లిపాయ‌ల్లాగే కీర‌దోస ముక్క‌ల‌ను కూడా అడ్డంగా కోసి వాటిని దంతాల‌పై ఉంచాలి. దీంతో వాటి నొప్పి త‌గ్గుతుంది.

టీ బ్యాగ్‌...
వేడి వేడిగా ఉన్న ఓ టీ బ్యాగ్‌ను నొప్పి పుడుతున్న దంతాల‌పై ఉంచాలి. అందులో ఉండే ప‌లు ర‌సాయ‌నాలు దంతాల నొప్పిని త‌గ్గిస్తాయి. చిగుళ్లను హాయి ప‌రుస్తాయి.

అల్లం ముక్క...
అల్లం కొమ్మును తీసుకుని బాగా క‌డిగి దాన్ని చిన్న ముక్క‌లుగా క‌ట్ చేయాలి. ఆ ముక్క‌ల‌ను నొప్పి ఉన్న దంతాల‌తో న‌మ‌లాలి. అలా చేయడం వ‌ల్ల అల్లంలో ఉండే ఔష‌ధ గుణాలు దంతాల నొప్పిని త‌గ్గిస్తాయి.

                                                                                                               - seaflowdiary 

Thursday, February 16, 2017



                     Health is wealth -6     ఆరోగ్యమే మహాభాగ్యం -6
                                                                           Date :16-02-2017



                                                               డ‌యాబెటిస్‌...





డ‌యాబెటిస్‌... నేడు ప్ర‌పంచ వ్యాప్తంగా అధిక శాతం మంది ఈ వ్యాధి బారిన ప‌డుతున్నారు. మన దేశంలోనైతే డ‌యాబెటిస్‌తో బాధ‌ప‌డుతున్న వారు కొన్ని కోట్ల మంది దాకా ఉన్నారు. డ‌యాబెటిస్ ప్ర‌ధానంగా టైప్-1, టైప్‌-2 అని రెండు రకాలుగా ఉంటుంది. అయితే ఏ త‌రహా షుగ‌ర్ వ్యాధి వ‌చ్చినా దాంతో ప్ర‌మాద‌మే. ఈ క్ర‌మంలో డయాబెటిస్ బారిన ప‌డ్డ‌వారు వైద్యుల సిఫార‌సు మేర‌కు మందుల‌ను వాడాల్సి ఉంటుంది. దీంతోపాటుగా కింద ఇచ్చిన ప‌లు స‌హ‌జ సిద్ధ‌మైన ప‌దార్థాల‌ను నిత్యం ఆహారంలో భాగం చేసుకుంటే దాంతో డ‌యాబెటిస్ అదుపులో ఉంటుంది. ఆ ప‌దార్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.


1. దాల్చిన చెక్క‌కు ర‌క్తంలోని చ‌క్కెర‌ను అదుపు చేసే గుణం ఉంది. ఇందులో ఇన్సులిన్ త‌ర‌హా ఔష‌ధ గుణాలు పుష్క‌లంగా ఉన్నాయి. ఇవి ర‌క్తంలోని గ్లూకోజ్ స్థాయిల‌ను త‌గ్గిస్తాయి. అయితే దాల్చిన చెక్క‌ను ఎలా వాడాలంటే... దీనికి చెందిన పొడిని 3 టేబుల్ స్పూన్ల మోతాదులో తీసుకుని ఒక లీట‌ర్ నీటిలో వేసి మ‌రిగించాలి. 20 నిమిషాల పాటు ఆ నీరు బాగా మ‌రిగాక వ‌చ్చే ద్ర‌వాన్ని వ‌డ‌క‌ట్టి రోజూ ఉద‌యం, సాయంత్రం భోజ‌నానికి అర‌గంట ముందు తాగాలి. దీంతో కేవ‌లం కొద్ది రోజుల్లోనే షుగ‌ర్ వ్యాధి అదుపులోకి వ‌స్తుంది.



2. టైప్‌-1 డ‌యాబెటిస్‌ను స‌మ‌ర్థ‌వంతంగా న‌యం చేసే గుణాలు తేనెలో ఉన్నాయి. ఇందుకు గాను 2010లో జ‌రిపిన ప‌లు అధ్య‌య‌నాలు కూడా సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి. టైప్‌-1 డ‌యాబెటిస్ ఉన్న‌వారు తేనెను నిత్యం ఏదో ఒక విధంగా తీసుకుంటే దాంతో వారి షుగ‌ర్ స్థాయిలు అదుపులోకి వ‌స్తాయి.



3. వెల్లుల్లిలో అలియం సాటివం అనే ఓ ర‌క‌మైన ర‌సాయ‌నం స‌మృద్ధిగా ఉంటుంది. ఇది టైప్‌-2 డ‌యాబెటిస్ వ్యాధిగ్ర‌స్తుల‌కు మంచిది. ఇది వారి ర‌క్తంలోని గ్లూకోజ్ స్థాయిల‌ను అదుపు చేస్తుంది. నిత్యం ఉద‌యాన్నే ప‌ర‌గ‌డుపున కొన్ని వెల్లుల్లి రేకుల్ని అలాగే ప‌చ్చిగా తింటుంటే దాంతో షుగ‌ర్ వ్యాధి నియంత్ర‌ణ‌లో ఉంటుంది.



4. ర‌క్తంలోని చ‌క్కెర స్థాయిల‌ను త‌గ్గించే గుణాలు క‌రివేపాకులోనూ ఉన్నాయి. వీటిలోని ఔష‌ధ కార‌కాలు డ‌యాబెటిస్‌ను అదుపు చేస్తాయి. నిత్యం ఉద‌యం, సాయంత్రం భోజ‌నానికి అర‌గంట ముందుగా గుప్పెడు క‌రివేపాకు ఆకుల‌ను తింటే దాంతో చ‌క్కెర వ్యాధి న‌యం అవుతుంది.


5. జామ ఆకులు కొన్నింటిని తీసుకుని నీడ‌లో ఎండ‌బెట్టి పొడి చేసుకోవాలి. దీనికి 3 గ్రాముల జీల‌కర్ర పొడి క‌ల‌పాలి. ఈ మిశ్ర‌మాన్ని ఒక గ్లాస్ నీటిలో క‌లిపి ఆ నీటిని మ‌రిగించాలి. అలా నీరు అర‌గ్లాస్ అయ్యాక స్టవ్ ఆర్పి ద్ర‌వాన్ని వ‌డ‌క‌ట్టి తాగేయాలి. ఇలా చేస్తే షుగ‌ర్ వెంట‌నే అదుపులోకి వ‌స్తుంది.


6. ఉద‌యాన్నే ప‌ర‌గ‌డుపున 8 గ్లాసుల నీటిని తాగి గంట పాటు వాకింగ్ చేయాలి. ఇలా చేసినా షుగ‌ర్‌ను స‌మ‌ర్థ‌వంతంగా ఎదుర్కోవ‌చ్చు.



7. మీఠీ ప‌త్తి అని పిల‌వ‌బ‌డే ఓ మొక్క ఆకులు కూడా బ్ల‌డ్ షుగ‌ర్‌ను అదుపు చేస్తాయి. దీన్ని స‌హ‌జ సిద్ధ‌మైన తీపి ప‌దార్థంగా షుగ‌ర్ వ్యాధిగ్ర‌స్తులు వాడుకోవ‌చ్చు కూడా. దీంతో షుగ‌ర్ స్థాయిలు పెర‌గ‌వు స‌రి క‌దా, పైగా ఎక్కువ‌గా ఉన్న గ్లూకోజ్ స్థాయిలు కంట్రోల్‌లోకి వ‌స్తాయి. దీన్ని 2011లో ప‌లు అధ్య‌య‌నాలు నిరూపించాయి కూడా. ఈ మొక్క‌కు చెందిన పొడి కూడా మ‌న‌కు మార్కెట్‌లో ల‌భ్య‌మ‌వుతోంది.



8. బీట్‌రూట్ దుంప‌, మెంతి ఆకు లేదా మెంతుల పొడి, క‌ల‌బంద‌, వేప‌, తుల‌సి వంటి మొక్క‌ల ఆకుల‌ను ఉద‌యం, సాయంత్రం తింటున్నా షుగ‌ర్ వ్యాధిని అదుపులోకి తేవ‌చ్చు.



9. పొడ‌ప‌త్రి ఆకు చూర్ణం నిత్యం ఉద‌యం, సాయంత్రం భోజ‌నానికి అర గంట ముందు నీళ్ల‌లో క‌లిపి తాగాలి. దీని వ‌ల్ల కూడా షుగ‌ర్ అదుపులోకి వ‌స్తుంది.

దంతాలు తెల్లగా మెరవాలంటే !



స్వీట్లు, జంక్‌ఫుడ్‌, ఇత‌ర కొన్ని ఆహార ప‌దార్థాల కారణంగా దంతాల మ‌ధ్య కావిటీలు వ‌చ్చి దంతాలు పుచ్చిపోతాయి. దంతాల‌కు రంధ్రాలు ప‌డ‌తాయి. దీంతోపాటు చిగుళ్ల స‌మ‌స్య‌లు కూడా బాధిస్తాయి. ఈ విష‌యం అంద‌రికీ తెలిసిందే. దీంతోపాటు కొంద‌రికి ప‌లు కార‌ణాల వ‌ల్ల దంతాల‌పై గార ప‌ట్ట‌డ‌మో, పాచి ఎక్కువ‌గా పేరుకోవ‌డ‌మో జ‌రుగుతుంది. అయితే దంతాల‌కు చెందిన ఇలాంటి స‌మ‌స్య‌లు ఏవి ఉన్నా వాటిని మ‌న ఇంట్లో ఉండే స‌హ‌జ సిద్ధ‌మైన ప‌దార్థాల‌తోనే దూరం చేసుకోవ‌చ్చు. దీంతో ఆ స‌మ‌స్య‌లు పోవ‌డ‌మే కాదు, దంతాలు కూడా తెల్ల‌గా త‌ళ‌త‌ళ మెరుస్తాయి. ఈ క్ర‌మంలో దంతాల‌ను తెల్ల‌గా చేసే అలాంటి ఆహార ప‌దార్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

స్ట్రా బెర్రీలు... 
స్ట్రా బెర్రీల్లో మాలియిక్ యాసిడ్ అనే ఓ ఎంజైమ్ ఉంటుంది. ఇది స‌హ‌జ సిద్ధ‌మైన బ్లీచింగ్ ఏజెంట్‌లా ప‌నిచేస్తుంది. అంతేకాకుండా ఈ పండ్ల‌లో ఉండే విట‌మిన్ సి వ‌ల్ల కూడా దంతాలు తెల్ల‌గా మారుతాయి. దంతాల మ‌ధ్య పేరుకుపోయే వ్య‌ర్థాలు తొల‌గిపోతాయి. స్ట్రా బెర్రీల‌ను త‌ర‌చూ తింటుంటే దంత స‌మ‌స్య‌లు బాధించ‌వు.

యాపిల్స్‌...
చిగుళ్ల‌ను దృఢంగా చేసి దంతాల‌ను తెల్ల‌గా మార్చే ఔష‌ధ గుణాలు యాపిల్స్‌లో ఉన్నాయి. అంతే కాదు, యాపిల్స్ వ‌ల్ల నోట్లో ఉమ్మి కూడా బాగా త‌యార‌వుతుంది. ఇది నోట్లో ఉండే చెడు బాక్టీరియాను నాశ‌నం చేస్తుంది.

బ్ర‌కోలి... 
బ్ర‌కోలిలో ఫైబ‌ర్ ఎక్కువ‌గా ఉంటుంది. ఇది దంతాల‌ను తెల్ల‌గా మార్చేందుకు, దంతాల‌ను దృఢంగా చేసేందుకు ఎంత‌గానో ఉప‌యోగ‌పడుతుంది.

క్యారెట్స్‌... 
క్యారెట్ల‌లో దంతాల‌ను తెల్ల‌గా చేసే గుణాలు ఉన్నాయి. వీటిని త‌ర‌చూ తింటుంటే చాలు దంత స‌మ‌స్య‌లు పోతాయి. చిగుళ్లు దృఢంగా మారుతాయి.

చీజ్‌... 
చీజ్‌లో కాల్షియం ఎక్కువ‌గా ఉంటుంది. ఇది దంతాల‌ను దృఢంగా చేయ‌డ‌మే కాదు, దంతాల‌ను తెల్ల‌గా మారుస్తుంది. దంతాల పైన ఉండే ఎనామిల్ పొర పోకుండా చూస్తుంది.

న‌ట్స్‌... 
బాదం ప‌ప్పు, జీడి ప‌ప్పు, వాల్‌నట్స్‌ల‌లో దంతాల‌ను తెల్ల‌గా చేసే ఔష‌ధ గుణాలు ఉన్నాయి. పాచి ప‌ళ్లు ఉన్న‌వారు న‌ట్స్‌ను త‌ర‌చూ తింటుంటే మంచిది. దీంతో దంతాల‌ను తెల్ల‌గా మార్చుకోవ‌చ్చు.



ఉల్లిపాయ‌లు... 
ఉల్లిపాయ‌ల‌తో ఒక‌టే స‌మ‌స్య‌. అది నోటి దుర్వాస‌న‌. ఉల్లిపాయ‌ల‌ను తింటే నోరంతా వాస‌న వ‌స్తుంది. కానీ నిజానికి ఉల్లిపాయ‌ల వ‌ల్ల మ‌న దంతాల‌కు మేలే జ‌రుగుతుంది. వాటిని ప‌చ్చిగా తింటుంటే వాటిలో ఉండే స‌ల్ఫ‌ర్ నోటి స‌మ‌స్య‌ల‌ను పోగొడుతుంది. దంతాల‌ను తెల్ల‌గా మారుస్తుంది.

నారింజ‌లు...
నారింజ‌ల‌లో విట‌మిన్ సి అధికంగా ఉంటుంది. ఇది దంతాల‌ను దృఢంగా చేయ‌డ‌మే కాదు, తెల్ల‌గా మార్చేందుకు కూడా ఉప‌యోగ‌ప‌డుతుంది.

పైనాపిల్స్‌... 
బ్రొమిలీన్ అనే ర‌సాయ‌నం పైనాపిల్స్‌లో పుష్క‌లంగా ఉంటుంది. ఇది దంతాల‌కు ప‌ట్టిన పాచి, గార వంటి వాటిని తొల‌గించి దంతాల‌ను తెల్ల‌గా, దృఢంగా మారుస్తుంది. దంతాల మ‌ధ్య పేరుకుపోయిన వ్య‌ర్థాలు, బాక్టీరియాను తొలగిస్తుంది.
                                                                                             - seaflowdiary