జల యుద్ధాలు ! - water war
Date: 12-09-2016
up dated: 13-09-2016
ప్రాణం తో ఉండాలంటే ముందు గాలి తరువాత నీరు ముఖ్యమైనవి . తరువాత ఆహారం . నీరు లేకుంటే ఏమి చేయలేము . ఆహారం కావాలంటే పంటలు పండాలి ,పంటలు పండాలంటే నీరు కావాలి . మనిషి ప్రాణాలను కాపాడు కోవడానికి నీటిగురించి ఒకరి నొకరు , ఒక ఊరి వారితో ఇంకో ఊరువారు , ఒక ప్రాంతం వారు మరొక ప్రాంతము వారితో ఒక రాష్ట్రం ఇంకొక రాష్ట్రం తో పోరాటాలు సాగిస్తున్నారు . నీటి గురించి పోట్లాటాలు జరుగుతాయని ముందే ఊహించి బ్రహ్మం గారు కాల జ్ఞానం లో చెప్పారు కూడా. ప్రస్తుతం అది నిజమనిపిస్తున్నది .
మనదేశం వర్షాలపపై ఆధార పడి సాగునీరు ,త్రాగునీరు ను పొందగలుగు చున్నాము . వరుణ దేవుడు కనికరించ కుంటే మన పరిస్థితులు ,పశు పక్షాల పరిస్థితి మరియు అరణ్య పరిస్థితి ఏమిటీ ? ఒక్కసారి ఊహించు కుంటే అర్థమవుతుంది . పడితే భారీ వర్షాలు ఒక ప్రాంతములో దాని వలన వరదలు, అపార ప్రాణ నష్టం జరుగుతుంది . వర్షాలు సకాలం లో సరిగ్గా కురవకుంటే కరువు ఏర్పడి కూడా అపార ప్రాణ నష్టం జరుగుతుంది .
నీరు దొరకనందున దేవాలయములలో తీర్థం బంద్ చేశారు . చక్ర స్నానం కూడా గంగాళం లో నీరు పోసి చేశారంటే
నీటి అవసరం ఏమిటో తెలుస్తుంది . వ్యవసాయం ఆగిపోతుంది , నిస్సహాయం అవుతుంది .
నీరు నిప్పుని ఆర్పుతుంది కానీ నేడు నిప్పుని రాజేస్తున్నది. సట్లెజ్ - యమున నదుల వివాదం హిమాచల్ ప్రదేశ్-పంజాబ్ లలో , కృష్ణా మరియు గోదావరి నదుల జలం పై వాటాగురించి కర్ణాటక , మహారాష్ట్ర , తెలంగాణా మరియు ఆంధ్రప్రదేశ్ మధ్య వివాదం జరుగు తున్నది .
కాళేశ్వరం ఎత్తిపోతల పథకంపై ప్రధానికి ఫిర్యాదు చేస్తామని, అవసరమైతే సుప్రీంకోర్టుకు వెళ్తామన్న ఏపీ క్యాబినెట్ తీర్మానంపై తెలంగాణ భగ్గుమన్నది. అరవై ఏండ్లుగా అరిగోస పడుతున్న తెలంగాణ రైతాంగానికి నీళ్లిచ్చి వ్యవసాయాన్ని బతికించేందుకు కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్ట్‌కు సీఎం కేసీఆర్ రీడిజైనింగ్ చేస్తే.. ఏపీ సీఎం చంద్రబాబు కుట్రపూరితంగా వ్యవహరించడంపై తెలంగాణవాసులు మండిపడుతున్నారు. బాబు వైఖరిని నిరసిస్తూ దిష్టిబొమ్మలు దహనం చేశారు. రాష్ట్రం విడిపోయినా బాబు దెయ్యంలా వెంటాడుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు.
నేడు కావేరి నీటి గురించి కర్ణాటక మరియు తమిళనాడు మధ్య వివాదం చెలరేగుతుంది . బంద్ లు , రాస్తారోకో ,వాహనాల దహనం జరుగుతున్నది . వీటివలన వేల కోట్ల రూపాయల నష్టం అటు ప్రభుత్వానికి మరియు ప్రైవేట్ కు నష్టం కలుగుతున్నది .
ఇలాంటివి ఆపడానికి మార్గం ఉంది . మన దేశం లో ఎన్నో జీవ నదులు ఉన్నవి , వర్షం అధిక మైనప్పుడు నీరు జలాశయాల్లో నిండి ఇంకా నీరు వృధాగా సముద్రం పాలు అవుతున్నది. ఈ నీటిని ఒడిసి కట్టి ఉపయోగిస్తే ఫలితం ఉంటుంది . నదులను అనుకూలం ఉన్నచోట ఒక దానితో మరియొకటి అనుసంధానం చేస్తే నీరు వృధాగా సముద్రం పాలు కాదు . గంగా -కావేరి నదులను అనుసంధానం చేయాలని Dr. KL రావు గారు సూచించారు ,అప్పటినుండి మెల్లగా నదులన్నింటిని అనుసంధానిస్తే ఇప్పటికి పూర్తి అయ్యేదేమో !
నదులు అనుసంధానం అయితే నీటి వివాదాలు ఉండవు . వరదలు , కరువు కాటకాలు ఉండవు . సమృద్ధిగా పంటలు పండించి ఎగుమతులు కూడా చేయవచ్చు . అందరికి చేతినిండా పని ఉంటుంది . దేశం మొత్తం నీటి లభ్యం వలన సశ్య శామలమై పచ్చగా మారి ఎండాకాలం వడదెబ్బ లేకుండా చల్లగా ఉంటుంది . చల్లగా ఉంటే అందరు ఆరోగ్యం గా ఉంటారు .- seaflowdiary
No comments:
Post a Comment