Sunday, September 18, 2016


     Religious harmony Telangana -మతసహనం తెలంగాణ ప్రత్యేకం 
                                                                                                                 Date : 18-09-2016. 



తెలంగాణ ప్రాంతం 1725 నుండి 1948 వరకు అనగా సుమారు 225 సంవత్సరాలు అసఫ్ జాహీ రాజులు  అంతకు ముందు కుతుబ్ షాహి రాజుల పాలనలో ఉండినది . కులాలు మతాల ప్రస్తావన లేకుండా పరిపాలన జరిగింది . ఏవో కొన్ని సంఘటనలు ఛాందస వాదుల వలన జరిగినవి కాని మొత్తం మీద తెలంగాణ లో మత భేదాలు లేకుండెను . 
ఇప్పటికి తెలంగాణా ఊర్లలో  లో పీర్ల పండుగకు హిందువులు  పేర్లను ఎత్తుకొని పండుగ జరుపు కుంటారు ,అదే విధం గా ముస్లిం లు కూడా దసరా పండుగ నాడు జమ్మికి వస్తారు . బక్రీద్ పండుగ నాడు పక్కింటిలో ఎవరు ఉన్నా ధనవంతులైన ముస్లిం సోదరులు పొట్టేలు మాంసం పంపించే ఆచారం నిర్వహిస్తారు . 
ఈ నాటికి పిల్లలకు గాని పెద్దలకు గాని జ్వరాలు వస్తే హిందువులు కూడా దర్గాలకు వెళ్లి తావీజులు కట్టించుకుంటారు . హిందువులు ఆశన్న , ఆషాగౌడ్ , ఆశిరెడ్డి అని ,ఊషన్న ,ఊశయ్య అని సయ్యద్ గౌడ్ అని  ముస్లిం పేర్లు కూడా పెట్టుకున్నారు . రాం .. రాం .. భాయ్ అంటూ ముస్లింలు , వాలేకం సలాం అంటూ హిందువులు పలకరించు కుంటారు . 



అసఫ్ జాహి రాజుల కలం లో హైదరాబాద్ లో 1800 -1900  లో ప్రాథమిక హక్కుల గురించి ,పౌర హక్కులు  మానవ హక్కులగురించి కొందరు మేధావులు ,విద్యావేత్తలు గొంతులు విప్పి రాజరికానికి వ్యతిరేకంగా ఆ మతానికి చెందిన వారు బ్రిటిష్ వారికి అనుకూలంగా ఉన్న రాజరికమైనా కూడా బ్రిటిష్ వారిపై  గొంతెత్తారు . 1857 జులై 17 నాడు హైదరాబాద్ లో తుర్రేబాజ్ ఖాన్ , మౌల్వి అల్లాఉద్దీన్ నాయకత్వం లో బ్రిటిష్ రెసిడెంట్ పై వందల మంది హిందూ ముస్లిం, అన్ని మతాలకు చెందిన  యోధులు కలసి దాడి చేశారు . 
ఏడవ నిజాం ఉస్మాన్ అలీఖాన్ గారి పాలనలో రాజా బహద్దూర్ వెంకట్రామరెడ్డి గారు హైదరాబాద్ కొత్వాల్ గా నియమింపబడి  సామాజిక ,రాజకీయ సాంస్కృతిక చైతన్యం గురించి పాటుపడ్డారు . కిషన్ ప్రసాద్ గారు ప్రధాన మంత్రి గా నిజామ్ పాలనలో పని చేశారు . 
1908 లో భయంకర వరదలు వచ్చి  హైదరాబాద్ కు ప్రమాదం ఏర్పడి నప్పుడు మహబూబ్ అలీ ఖాన్ ఆరవ నిజాం గారు వరదల ఉదృతి తగ్గడానికి పూజారులు వేదమంత్రాలు పఠిస్తుండగా మూసి నదిలో దిగి హారతి ఇచ్చారు . వరదలలో ఇల్లు వాకిలి కోల్పోయి నిరాశ్రయులైన వేలమంది తల దాచుకోవడానికి ఆరవ నిజాం మహబూబ్ అలీ ఖాన్ నగరం లోని రాజా ప్రాసాదాలన్నిటి ద్వారాలు తెరిపించాడు . కుల మత వర్గ భేదాలు లేకుండా ప్రతిభావంతులను ప్రోత్సహించారు . ఆయన సరోజినీ దేవి లండన్ వెళ్లి చదువుకోవడానికి ఫెలోషిప్ తో సహాయం అందించారు . నిజాం రాజ్యం లో దేవాలయాలు ఎక్కువ సంఖ్య లో ఉన్నాయని వాటికి ఆర్ధిక సహాయం అందుతున్నదని ఆ రోజుల్లో హైందవ ధర్మ ప్రచారకులు సంతృప్తి చెందారు . దేవాలయాలు మరియు మసీదులు హైదరాబాద్ లో చాలా వరకు ప్రక్క ప్రక్కనే ఉండి సోదర భావం తో ఎవరి ఆచారం వారు ఆచరిస్తున్నారు . చార్మినార్ లో ఒక మినార్ లో భాగ్య లక్ష్మి దేవాలయం నిర్మించినారు .   రోజు దేవి పూజలు అందుకుంటుంది . 

మతమేదైనా సరే , వివాదాలు , విభేదాలు లేవని కలిసే ఉన్నాం .... కలిసే ఉంటాం అని చాటి చెప్పు చున్నారు మన హైదరాబాదీయులు మరియు తెలంగాణీయులు . గణేష్ లడ్డులను ముస్లిం సోదరులు వేలం పాటలో కొని అందరికి ప్రసాదం పంచుతున్నారు . మృగశిర నాడు ఉబ్బసం ఉన్న  అందరు చేప ప్రసాదం తీసుకుంటున్నారు. 

 ఏనాడో మన జాతి పిత  మహాత్మాగాంధీ గారు 1927 లో హైదరాబాద్ లోని వివేకవర్ధని కళాశాలకు వచ్చిన సందర్భం గా ఇక్కడి మతసామరస్యాన్ని చూసి " ఉత్తరాది ప్రజలు మతం పేరిట తీవ్రంగా ఘర్షణ పడడం చూస్తున్నాం ,వారు హైదరాబాద్ ను చూసి నేర్చు కోవాలి , ఇక్కడ గంగా - యమునా లాగా కలసి జీవించే సంస్కృతి వర్ధిల్లు తున్నది "
హిందూ ముస్లిం లే కాదు క్రైస్తవులు ,సిక్కులు ,జైనులు ,బౌద్ధులు ,పార్సీలు అందరు కలిసి మెలిసి మన హైదరాబాద్ లో నివసిస్తున్నారు , శాంతి ... శాంతి ... శాంతి .  
                                                                                                      yours ,
                                                                             www.seaflowdiary.blogspot.com 




No comments:

Post a Comment