Sunday, April 12, 2015


 Is Railway go to Private!-రైలు బండి  ప్రైవేటు మార్గం లో వెళుతుందా ! 
                                                                                                             Date : 12-04-2015
                                                                                                          updated :05-05-2015
Historical చారిత్రాత్మకమైన, అంతర్జాతీయంగా International  ప్రతిష్టాత్మకమైన భారతీయ రైల్వే Indian Railway  ను పట్టాలు తప్పించబోతున్నారా ?. 1853లో బ్రిటీష్‌ వలస పాలనలో ముంబయి నుంచి థానే Mumbai  to  Thaane మధ్య మొదటి రైలు మార్గం ఏర్పడింది. ఆ తరువాత విస్తరించింది. స్వాతంత్య్రానంతరం 1951లో అప్పటికే ప్రపంచంలో అతి పెద్ద రైల్వే వ్యవస్థగా జాతీయం చేయబడింది. 





దేశంలో 1,15,000 కిలోమీటర్ల పొడువున రైలుమార్గం ఉంది. దేశవ్యాప్తంగా రైళ్లు 963.48 లక్షల కిలోమీటర్లు తిరుగుతున్నాయి. 7,172 స్టేషన్ల ద్వారా ప్రజలకు సేవలందుతున్నాయి. ఏటా 766.50 కోట్లు, రోజుకు 2.1 కోట్ల మంది ప్రయాణికులను గమ్యం చేర్చుతోంది. ఏటా 105 లక్షల కోట్ల టన్నుల సరుకులను రవాణా చేస్తోంది. ఇంతటి బృహత్తర కర్తవ్యాన్ని నిర్వహిస్తున్న భారతీయ రైల్వేలో 2013లో రైల్వే శాఖ వెల్లడించిన గణాంకాల ప్రకారం 1990 నాటికి 16.52 లక్షల మంది ఉద్యోగులున్నారు. రెండున్నర దశాబ్దాల కాలంలో దేశంలో రైల్వే వ్యవస్థ మరింత విస్తరించింది. రైలు మార్గాలు పెరిగాయి. రైళ్ల సంఖ్య ఎక్కువైంది. లోకోమోటివ్‌, కోచ్‌ ఉత్పత్తి కేంద్రాలు, అవసరమైన శిక్షణా కేంద్రాలు ఏర్పాటయ్యాయి. అలాంటి స్థితిలో ఉద్యోగుల సంఖ్య గణనీయంగా పెరగాలి. 
1991 నుంచి అమలైన సంస్కరణల తరువాత ప్రభుత్వ రంగంగా ఉన్న రైల్వే శాఖలో ప్రైవేటీకరణకు బీజాలు పడ్డాయి. నయా ఉదారవాద విధానాల అమలుతో రైల్వే శాఖలో పలు విభాగాలు ప్రయివేటు పరమయ్యాయి. 2015-16 వార్షిక బడ్జెట్‌ను రైల్వేశాఖ మంత్రి సురేష్‌ ప్రభాకర్‌ ప్రభు ప్రవేశపెట్టిన నాటికి రైల్వే శాఖలో ఉద్యోగుల సంఖ్య 14 లక్షలకు (85 శాతం) పడిపోయింది. దీనివలన రైల్వేలో ప్రయాణికుల సేవలు తగ్గుతున్నాయి. ప్రమాదాలు పెరిగినాయి . రైలు ప్రయాణంలో ప్రజలకు భద్రత కొరవడుతోంది. అలాంటి తరుణంలో రైల్వే శాఖలో ఖాళీగా ఉన్న 2.25 లక్షల ఉద్యోగాల భర్తీకి బడ్జెట్లో ఎలాంటి చోటూ కల్పించలేదు. ఉన్న ఉద్యోగులకు శిక్షణ నైపుణ్యం అందిస్తామన్న మాట తప్ప, కొత్త నియామకాల్లేవని తేటతెల్లమైంది. దేశం లో ఎంతో మంది నిరుద్యోగులు ఉన్నారు , వారి వయసు కూడా మీరి పోతుంది . ఉన్న ఖాళీలను కూడా భర్తీ చేయకుంటే ఎలా ? నిరుద్యోగుల భవితవ్యం ఏమిటి ? ప్రభుత్వం వారికి ఉద్యోగాలు కల్పించాలి . ఎక్కువమంది కి  ఉద్యోగాలు కల్పించుటలో రైల్వే ది ప్రధాన పాత్ర వహిస్తుంది.

మన దేశం లో కేంద్రం లో ప్రభుత్వం ఉండే కాలం కేవలం 5 సంవత్సరాలు మాత్రమే ! తరువాత ఏ ప్రభుత్వం వస్తుందో ప్రజలే తేలుస్తారు , ఇప్పుడు ఉన్న ప్రభుత్వ తీరు సామాన్య ప్రజలకు అనుకూలం గా ఉంటే ప్రజలు మళ్ళి 5 సంవత్సరాలు పొడగిస్తారు  లేదంటే ఇంటికి పంపిస్తారు .
ఈ  5  సంవత్సరాలు ప్రజలకు మరియు దేశానికి మంచి చేయాలి కాని ప్రజలను మరచిపోయి ప్రైవేటు పాటను పాడుతున్నారు . ప్రైవేటు అంటే ఎందుకంత మోజు ? ఓట్లు వేసి గెలించి అధికారం లోకి తెచ్చేది ప్రజలు కాని కాని కార్పొరేటు వాళ్ళు కాదు, బడా బాబులు కాదు వాళ్లకు ఓటు వేయడానికి అసలు తీరిక ఉంటే కదా !

 NDA  ప్రభుత్వం రైల్వే శాఖలో Privatization  ప్రైవేటీకరణ కూత శబ్దాన్ని పెంచింది. బుల్లెట్‌ రైలు వేగాన్ని మించి రైల్వే శాఖను బహుళ జాతి సంస్థలకు అప్పగించేందుకు ప్రణాళికలను సిద్ధం చేసింది. తద్వారా భద్రతకు ముప్పు వాటిల్లుతుంది. సౌకర్యాలు తగ్గుతాయి. భారాలు పెరుగుతాయి. చివరికి కొత్త ఉద్యోగుల మాట అటుంచి ఉన్న ఉద్యోగులకు ముప్పు వాటిల్లుతుంది. ఉద్యోగులకే కాదు ప్రజలకు భారం అవుతుంది .
 ఈ అవకాశం గురించి ప్రైవేటు వాళ్ళు ఎప్పుడు  ఎప్పుడా అని ఎదురు చూస్తున్నారు.  

జనతా ప్రభుత్వం లో మధుదండావాతే గారు రైల్వే మంత్రిగా సర్ప్లేస్ surplus budget ప్రవేశ పెట్టినారు ఆ  ఘనత నిజంగా ఆయనదే . ఆయను చూచి కూడా తరువాత వచ్చిన రైల్వే మంత్రులు ఆ పని చేయలేక పోయారు . 

 సరకు రవాణా చార్జీలను కూడా పెంచు చున్నారు . యూరియా , గింజ ధాన్యాల రవాణా చార్జీలు 10% బొగ్గు  రవాణా చార్జీలు 6.3% , సిమెంట్ 2.7% ,  ఇనుప తుక్కు 3. 1% కోల్ తార్ రవాణా 3. 5% పెంచుతున్నారు .   

మనది ప్రజాస్వామ్య దేశం కాని ప్రైవేటు దేశం కాదు . ప్రజలకు నిజం గా సేవ చేయాలంటే , సౌకర్యాలు కల్పించాలంటే వారికి ప్రయాణం సుఖవంతం చేయాలి . తక్కువ రేట్లు ఉండాలి కాని ప్లాట్ ఫాం  టికెట్ 10 రూపాయలు చేస్తారా ? బడ్జెట్ లో మాత్రం రేట్లు పెంచలేదని ఇప్పుడు సరకులపై రేట్లు పెంచుతారా ? దీని వలన నిత్యావసర రేట్లు పెరగవా ?

సురేష్ ప్రభు గారి రైల్వే బడ్జెట్ " క్రొత్త రైల్ లేదు చార్జీలు పెంచలేదు " అని ఇంత వరకు అనుకున్నాము కాని  01-04-2015 నుండి  5 రూపాయల ప్లాట్ ఫాం టికెట్ ను రూ . 10 కి పెంచడమేమిటి ? ఇక వీడ్కోలు చెప్పడానికి రైల్వే భోగి వరకు వెళ్ళవలసిన పనిలేదు . ఇంటి వద్దనే వీడ్కోలు చెప్పి పంపించాలి . రైల్వే స్టేషన్ కు వెళ్ళే చార్జీలు మిగలాలని ఏమో !   ఇప్పటికే  ప్లాట్ ఫాం టికెట్ ధర రూ . 5 ఎక్కువ ఉన్నదంటే  రూ . 10 కి పెంచి నడ్డి విరిచారు . ఇంకా కొన్ని రోజు లైతే  ట్రైన్ ను దూరం నుండి చూస్తే కూడా డబ్బు వసూలు చేస్తారేమో 

భారతీయ రైల్వేల పునర్మిర్మాణం పేరిట భారీ సంస్కరణల అమలుకు బిబేక్‌ దేబ్రారు నేతృత్వంలో అత్యున్నత కమిటీ ఏర్పాటైంది. ఆ కమిటీ న్యాయస్థానాల తీర్పు మాదిరిగా తాజాగా మధ్యంతర నివేదిక ఇచ్చింది. ఆ నివేదికలో చాలా ప్రమాదకరమైన సిఫార్సులు చేసింది. ఇవి అమలైతే భారతీయ రైల్వే పట్టాలు తప్పనుంది. సరుకుల రైళ్ల (గూడ్సు)తో పాటు ప్రయాణికుల రైళ్లను భారతీయ రైల్వే సారథ్యంలో కాకుండా ప్రయివేట్‌ సంస్థలు నడిపేందుకు అవకాశం ఇవ్వాలని అతి ప్రమాదకర సిఫార్సులు చేసింది. అలాంటి సిఫార్సుల కోసమే కమిటీ ఏర్పాటైందన్న విషయాన్ని విస్మరించలేం. రైళ్లను నడపడాన్ని కార్పొరేట్‌ సంస్థలకు అప్పగించడమంటే ప్రజల సంపదను వాటి చేతుల్లో అప్పనంగా పెట్టినట్టే అవుతుంది. ఆ కమిటీ సిపార్సులు అక్కడితో ఆగలేదు. కోచ్‌, వ్యాగన్ల, ఇంజన్ల ఉత్పత్తి బాధ్యతను కూడా ప్రభుత్వం వదలేసి కార్పొరేట్‌ సంస్థలకు అప్పగించాలని సిఫార్సు చేసింది. అంతేకాదు రైల్వే మౌలిక వసతులను స్వాధీనం చేసుకోవడానికి (కార్పొరేట్‌ సంస్థలు) స్పెషల్‌ పర్పస్‌ వెహికిల్‌ను నెలకొల్పాలని కమిటీ సిఫార్సు చేసింది.  ఇవన్నీ మధ్యంతర నివేదికలోని అంశాలు. పూర్తి స్థాయిలో నివేదిక వస్తే డివిజన్ల వారీ, జోన్లవారీ ప్రయివేటుపరం చేయడానికి అవసరమైన సిపార్సులను కమిటీ చేసినా ఆశ్చర్యపోవనవసరం లేదు.



ప్రభుత్వ గమనం, గమ్యం అటువైపే సాగుతున్నది. చివరికి భారతీయ రైల్వే అన్న పేరును కూడా తొలగించి మరో కొత్తపేరును ప్రతిపాదిస్తూ సిఫార్సు చేసినా ఆశ్చర్యపోవనవసరం లేదు. ప్రభుత్వాలు ప్రయివేటీకరణ జపం చేసినప్పుడల్లా సంస్థలకు ఉద్యోగులే పెనుభారమవుతున్నారని చెప్పడం సర్వసాధారణమైంది. ఇప్పుడు రైల్వే మంత్రి పార్లమెంటులో అదే పాటను వల్లిస్తున్నారు. రైల్వే ఆదాయం మొత్తంలో ఉద్యోగుల జీతాలకే సగానికి (రూ.90 వేల కోట్లు) పైగా ఖర్చవుతోందని చెబుతున్నారు. ప్రయివేటుపరం చేయడం తప్పదంటున్న ప్రభుత్వం ఆ 50 శాతం చెల్లింపుల్లో ఉద్యోగుల జీతభత్యాలకు రూ.33 శాతం, పింఛన్లుకు రూ.17 శాతం ఖర్చు అవుతున్నట్టు వెల్లడించింది. వాస్తవంగా అభివృద్ధి పనుల్లో ముఖ్యంగా టెండర్లు పొందడంలో అవినీతి, అక్రమాలకు కొదవలేదు. కాగ్‌ నివేదికల్లోనూ ఆ విషయాలు గతంలో వెల్లడయ్యాయి. రైల్వే శాఖలోనూ స్వచ్ఛ భారత్‌ నినాదం మొదలైంది. అందుకోసం స్టేషన్లు, రైళ్లల్లో పరిశుభ్రత కోసం కొత్తగా ప్రత్యేక విభాగం ఏర్పాటు కానుంది. ఇదేదో ప్రభుత్వపరంగా వస్తుందని, ఉపాధి అవకాశాలు లభిస్తాయని భ్రమ పడనవసరం లేదు. ఇప్పటికే ప్రయివేటుపరమైన పలు విభాగాలకు మరింత చట్టబద్ధత కల్పించి ఆ బాధ్యతల నుంచి కేంద్ర ప్రభుత్వం తప్పుకోనుంది. అందుకవసరమైన ప్రణాళికను సిద్ధం చేస్తోంది. సేవలు ప్రయివేటుపరమైతే ప్రజలపై భారాల మోత పడుతుందని అనుభవం చెప్తోంది.



ఎప్పుడు చూసిన రైల్వే లకు నష్టం అని చెబుతారు . ఏ ఒక్క రైల్ అయినా ఖాళీగా వెళుతుందా అంటే అదీ లేదు ,రైళ్ళు ఎప్పుడు నిండుగా జనం తో క్రిక్కిరిసి గా వెళుతుంది . బస్సుల లాగా, విమానాల లాగా  ఖాళీగా వేలుతున్నాయంటే అదీ లేదు . అసలు టికెట్ దొరకడమే గగన మై పోతుంది , ఎన్నో రోజుల ముందు బుక్ చేస్తే గాని టికెట్ దొరకదు. తత్కాల్ లో దొరకదు . విమానాల ధరలు ఈ మధ్య తగ్గిస్తున్నారు , రైలు చార్జీలు విమానాలతో పోలిస్తే నాల్గవ వంతు ఉండాలి కాని విమానాల చార్జిలతో ఇంచు మించు సమానంగా ఉన్నాయి .  ప్రయాణికులు రైల్ లలో కొన్ని వందల కి . మీ ఒంటి కాలిపై నిల్చొని ప్రయాణిస్తున్నారు . క్రొత్త రైళ్ళు వేయండి , జనరల్ భోగీలు పెంచండి . తిను పదార్థములు ,చాయ్ ,కాఫీ ,టిఫిన్ ,డ్రింక్స్ మంచి భోజనం తక్కువ ధరకు అందించాలి . గూడ్స్ రైళ్ళు  మోయలేని బరువు తో వెళ్ళుతున్నాయి ఐనా ఇంకా నష్టం ఎలా వస్తుంది ? నష్టాలు చూపించి ప్రైవేటు చేయడమే మేలని చెబుతున్నారు , మరి ప్రైవేటు వాడికి నష్టం రాదా ? 

ఏదో మంచి చేస్తారని ప్రజలు మెజారిటీ తో గెలిపించి పంపిస్తే అక్కడ మంద బలం ఉంది కదా అని తమకు ఇష్టం అయిన వారితో కమేటి లు వేసి వారు చెప్పిందే ప్రజల పై బలవంతముగా రుద్దుతారా ? 

Date : 05-05-2015


రైల్వే కు నియంత్రణ మండలి అవసరమా? అంటే టెలికాం లో లాగ ప్రైవేటు వాళ్ళు వస్తారన్న మాట . పనగారియా గారిని రోడ్ మ్యాప్ ఏర్పాటు చేయమని కోరారట . "రోడ్ మ్యాప్ " కావాలంటే ప్రజలను అడగండి , అంతకంటే మంచి "రోడ్ మ్యాప్ " ఇస్తారు .  ఉండేది 5 సంవత్సరాలే కాని ప్రజలకు ఇష్టం లేనిది చేయడమేమిటి ? ఉన్నదానిని అభివృద్ధి చేయాలి గాని రైల్వే ను విభజించి ప్రైవేటు పెట్టుబడులకు అనుమతిస్తారా ? దేశం ఏమైనా ,ప్రజలు ఏమైనా సరేనా ? 

కమేటిలు వేసి ప్రజల సొమ్ము దుబారా చేయడ మేమిటి ? మన దేశం లో ఎంతో మంది నిపుణులు ,ప్రొఫెసర్లు ,ఎక్ష్ప్ పర్ట్ లు ఉన్నారు వారి సలహాలు ఉచితం గా తీసి కోవచ్చు కదా ! ఒక ప్రయాణికుడిని అడిగినా అతని బాధలు చెబుతాడు వాటిని సరి దిద్దితే అదే ఎంతో విలువైన సలాహా . ఉద్యోగుల సలాహా కూడా తీసికుంటే అది కూడా మంచి సలాహా . పోనీ అభివృద్ధి చెందిన దేశాలలో వారేం చేస్తున్నారో తెలిసికుని పాటించ వచ్చుకదా ! ఎందుకు ఈ పనికిరాని కమేటిలు?.   కమేటిలు ఇచ్చిన రిపోర్ట్ అమలు చేసి చేతులు దులుపు కోవడం కాదు ,దాని వలన ప్రజలకు ప్రయోజనం ఉందా లేదా అని కూడా ఆలోచిస్తున్నట్లు లేదు. కేవలం ప్రైవేటు చేయాలనే దాని పై ద్రిష్టి పెడుతున్నారు . 

కమేటిలు ఇచ్చిన రిపోర్ట్ లు సామాన్యం గా ధరలు పెంచండని , ప్రైవేటు చేయమని చెబుతున్నాయి . ఇప్పుడు వేసిన మూడు కమేటిలు  వివేక్ దేబరాయ్ కమేటి, ఈ శ్రీధరన్ కమేటి , డి కె మిత్తల్ కమేటి మరియు కార్మిక సంఘాలతో చర్చించాలంటూ రతన్ టాటా కు సురేష్ ప్రభు సూచించి నట్లు వార్తలు వచ్చాయి .  

 బోర్డ్ సభ్యులు జోనల్ మేనేజర్లు సహా ఉన్నత అధికారులు తమకు అనుకూలంగా ఉండే వారికే రైల్వే భారి కాంట్రాక్టు లు అప్పజేబుతున్నట్లు తెలుస్తుంది, కొందరు ఉన్నత అధికారులు 5 సంవత్సరాలుగా ఒకే చోట ఒకే విధులు చేస్తున్నట్లు ఈ కమేటి లు గుర్తించాయి . ఉన్నత అధికారులు 5 సంవత్సరాలుగా ఒకే విధులు ఎలా నిర్వహిస్తారు ? వారికి బదిలీలు ఉండవా ? రైల్వే లోనే కాదు అన్ని విభాగాల్లో కూడా ఇలాగే ఉండవచ్చునేమో ! ముందు  corruption లంచ గొండి తనం ను నిర్మూలించాలి . లంచగొండులను ఉక్కు పాదం తో అణచి వేయాలి 

భద్రతకు లక్ష కోట్లు అపరిష్కృతంగా ఉన్న 300 ప్రాజెక్ట్ లకు 1. 7 లక్షల కోట్లు అవసరమట . అందుకు రైల్వే లు 13 వేల కోట్లు మాత్రమే సమకూర్చగల  స్తితిలో ఉందట . కేంద్రం 40% రుణంగా ఇస్తుందట , 17% ఎల్ ఐ సి ,పెన్షన్ నిధుల నుండి అప్పు తెచ్చుకున్నా అప్పటికి 43% తేడా ఉందట . కావున రైల్వే లోని పలు విభాగాల్ని out sourcing ఇవ్వటమే పరిష్కారమట . ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యం ( పీ పీ పీ ) ద్వారా మార్పులు చేపడతారట కావున కార్మిక సంఘాలకు నచ్చ జెప్పాలని ,వారిని సంతృప్తి పరచాలని రతన్ టాటా కు రైల్వే మంత్రి సురేష్ ప్రభు సంకేతాలు ఇచ్చినట్లు తెలుస్తుంది . 
ఏది ఏమైనా కార్మిక సంఘాలకు నచ్చ జేబుతారు కాని ప్రజలకు నచ్చ జెప్పగలరా ?  ఈ దేశం 125 కోట్ల ప్రజలది , అన్ని విభాగాల్లో అన్ని చోట్ల ఇంతమంది భాగస్వామ్యం ఉంటుంది . ప్రభుత్వ ప్రజల  భాగస్వామ్యం ( పీ పీ పీ ) చేయండి . అంతే కాని ప్రైవేటు భాగ స్వామ్యాన్ని ప్రజలు కోరు కుంటారా ! 
మనకు ఇంత అర్జెంటు  గా  అభివృద్ధి  పబ్లిక్ -ప్రైవేటు -పార్టనర్ (PPP) ల ద్వారా అవసరం లేదు. రైల్వే లు పబ్లిక్ ద్వారా అభివృద్ధి చేయండి అంతేగాని ప్రైవేటుని ఇందులోనికి లాగవద్దు, ప్రైవేటు వారు లేకుంటే ప్రభుత్వానికి చేతకాదా ?  నిపుణులు లేరా ? కావాలంటే ఇతర దేశాల రైల్వే లను చూస్తె తెలుస్తుంది. రైల్వే అంటేనే సామాన్య ప్రజలది.  

   ధరలు పెంచి బాగు చేయడం ఎవ్వరైనా చేయగలరు , చదువు రాని  వారెవ్వరైనా , చివరకు చిన్న పిల్ల లైనా చేయగలరు . దానికి ఒక కాబినెట్ మంత్రి ,సహాయ మంత్రి అవసరమా ? ఒక్క చైర్మన్ చాలు . 

సదుపాయాలకు పెద్దపీట అంటూనే ఉన్న పీటను లాగేస్తోంది. ఆన్‌లైన్లో టిక్కెట్ల విక్రయంలో దళారులే రాజ్యమేలే పరిస్థితి ఉంది. దాన్ని అరికట్టే చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం కొత్త విధానం చేపట్టింది. అయితే ఆచరణలో ప్రయివేటుకే పెద్దపీట వేసింది. కొత్తగా ప్రధాన మార్గాల్లో ప్రీమియం రైళ్లను ప్రవేశపెట్టింది. ఆ రైళ్లకు ప్రయివేటు ఇంటర్నెట్ల ద్వారా మాత్రమే టిక్కెట్టు రిజర్వేషన్లు, సాధారణ టిక్కెట్ల కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది. రైల్వే సేషన్లల్లో ప్రీమియం రైళ్లకు టిక్కెట్లు ఇవ్వకూడదన్న నిబంధనలున్నాయి. భారతీయ రైల్వే ఎటువైపు ప్రయాణిస్తున్నదో ప్రీమియం రైళ్ల వ్యవహారమే అద్దం పడుతోంది. మన బండికి మన స్టేషన్లో టిక్కెట్‌ ఇవ్వనప్పుడు అది ఎవరి బండి అవుతుంది? రద్దీగా ఉండే స్టేషన్లల్లో టిక్కెట్‌ కౌంటర్లను పెంచాల్సింది పోయి, అదే సముదాయంలో టిక్కెట్‌ జారీ చేసే యంత్రాలను పెట్టి ప్రైవేటు వ్యక్తులకు అప్పగించడం విస్తృతమవుతోంది. స్మార్ట్‌ ఫోన్ల ద్వారా టిక్కెట్టు లభ్యత మొదలు కానుంది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఆహ్వానించదగినదే అయినప్పటికీ టిక్కెట్టు విక్రయం ప్రయివేటీకరణ తరువాత ఉద్యోగ నియమకాలపై అప్రకటిత నిషేధం అమలవుతుంది.

సరకుల రవాణా బాధ్యత నుంచి రైల్వేశాఖ తప్పుకునే ప్రయత్నం చేస్తోంది. అందుకోసం ఒక కార్పొరేషన్‌ను ఏర్పాటు చేయనుంది. అంటే సరుకుల రవాణా ఛార్జీల నిర్ణయం ఇక రైల్వేశాఖ చేయదు. కార్పొరేషన్‌ నిర్ణయిస్తుంది. ధరల నిర్ణయంపై ప్రభుత్వానికి ఎలాంటి నియంత్రణా ఉండదు. చివరికి ఆ భారాలు ప్రజలు మోయక తప్పదు. ఈ ఆర్థిక సంవత్సరం ప్రైవేటు, ప్రభుత్వ భాగస్వామ్యంతో రూ.17.655 కోట్ల పెట్టుబడులు సమీకరించనున్నామని రైల్వే మంత్రి పార్లమెంటులో ప్రకటించారు. ఈ పెట్టుబడుల్లో బహుళజాతి సంస్థల పెట్టుబడులుంటాయని స్పష్టంగా చెప్పారు. భారతీయ రైల్వేలాంటి ప్రభుత్వ సంస్థలో ఎలాంటి చొరబాటూ లేకుండా బహుళ జాతి సంస్థలు పెట్టుబడులు పెట్టవన్నది అనుభవం. విదేశీ బహుళజాతి సంస్థలకు కూడా భారతీయ రైల్వే ద్వారాలు తెరిచింది. తక్కువ వడ్డీతో అప్పులు తెస్తామని మంత్రి వెల్లడించారు. అంతేకాదు బహుళ జాతి అభివృద్ధి బ్యాంకులు పెన్షన్‌ నిధుల కోసం ఆసక్తి చూపుతున్నాయని రైల్వే మంత్రి ఉత్సాహంగా వెల్లడిస్తున్నారు. ఉద్యోగుల పింఛను సొమ్మును షేర్‌ మార్కెట్లో పెట్టే యోచనలో ప్రభుత్వం ఉంది. రైల్వే ఉద్యోగుల పెన్షన్‌ సొమ్మును చూపి బహుళజాతి సంస్థల బ్యాంకుల నుంచి రుణం పొందాలనేది ప్రభుత్వం లక్ష్యంగా ఉందని స్పష్టమవుతోంది. 

రైల్వే భద్రతకు రూ.లక్ష కోట్లు కావాలని 2012లో కకోద్కర్‌ కమిటీ సిపార్సులు చేసినా, నేటి వరకు వచ్చిన బడ్జెట్‌ల్లో ఏ మాత్రం చోటు లభించలేదు. ఏ ప్రభుత్వమూ అటు వైపు దృష్టి సారించలేదు. రైలు పట్టాల మార్పిడి, సిగల్‌ వ్యవస్థ ఆధునికీకరణ, ప్రయాణికుల రక్షణ, తదితరమైనవన్నీ అందులో ఉన్నాయి. అలాంటి ప్రధానమైన అంశాలు కూడా పట్టడంలేదు. కేంద్ర ప్రభుత్వం భారతీయ రైల్వేను ప్రయివేటు బాటలో నడిపేందుకు సిద్ధమవుతోంది. తద్వారా జాతీయ సంపదగా ఉన్న రైల్వే వ్యవస్థను పట్టాలు తప్పించి కార్పొరేట్‌ సంస్థల మార్గంలో నడిపించేందుకు నడుంకట్టింది. ఈ ప్రమాదం తక్షణం రైల్వే ఉద్యోగులపై పడనుంది. ఆ తరువాత ప్రజలపై వివిధ రూపాల్లో భారం, అభద్రత ఉంటుంది. నాలుగు దశాబ్దాల క్రితం రైల్వే కార్మికులు చేపట్టిన చరిత్రాత్మక సమ్మెను ఇప్పటికీ మరువలేము. ఆ స్ఫూర్తి, చైతన్యం నేటితరం ఉద్యోగులు, కార్మికుల్లో కలగాలి. ఉద్యోగులు ఒక్కరే బాధ్యతను తీసికొంటే సరిపోదు ప్రజల భాగస్వామ్యం ఉండాలి . ఉద్యోగులకు ఏదో ఆర్ధిక ప్రయోజనం చూపిస్తారు. ఏదో ఒకటి చేస్తారు కాని రైల్వే లను  ఉపయోగించేది ప్రజలే , ప్రజల జీవితం వారి  భవిష్యత్తు భారతీయ రైల్వే లతో జీవితాంతం ముడి పడి ఉన్నది .అంతే కాని ప్రైవేటు భాగ స్వామ్యాన్ని ప్రజలు కోరు కుంటారా! అందుకే ప్రభుత్వ ప్రజల  భాగస్వామ్యం ( పీ పీ పీ ) చేస్తే బాగుంటుంది . 

                                                                                                               yours ,
                                                                                         www.seaflowdiary.blogspot.com 

No comments:

Post a Comment