Sunday, January 18, 2015

 Filmcensoring   -  ఫిలిం సెన్సారింగ్ 
                                                                                                                              Date : 19-01-2015. 
                                                                                                                          updated: 21-01-2015.




       సమాజములో  మార్పుతేవడానికి  సినిమాలు మంచిమార్గాలు .  ఒకప్పటి  సినిమాలలో ఆశ్లీలానికి తావు లేకుండా తీసేవారు  హీరో లు  హీరోయిన్  ని  అసలు తాకకుండా , ముట్టుకోకుండా డ్యాన్సులు చేస్తూ పాటలు పాడుతూ జనాలను మెప్పించే వారు .  కుటుంబమంత ఒక చోట కూర్చుని  సినిమా ను  చూసి ఆనందించేవారు . మాటల్లో గాని పాటల్లో గాని  ద్వందార్ధాలు   గాని ఆ రోజుల్లో లేవు . ఆ నటుల నటనే వేరు, ఆ సినిమాలు, పాటలు మరియు మాటలు  చాల విలువైనవి  ఇప్పటికి చాలా మంది ఆ పాటలు పాడుకొంటారు మాటలు డైలాగులు చెప్పుకొని ఆనందిస్తారు .  ఆ నటులు వేరు , ఆ నాటి పాటల మాటల రచయితలు, దర్శకులు సమాజములో మంచి మార్పు మరియు ప్రేక్షకుల మనోరంజనకు  పాటు పడినారు.

      ముఖ్యముగా ప్రస్తుతము వస్తున్న    పిచ్చి పిచ్చి చెత్త సినిమాలు, టివి లో వచ్చే పిచ్చి చెత్త సీరియళ్ళు  , ఇంటర్ నెట్ లోని ఆస్లీల  దృశ్యాలు,నీలి చిత్రాలు  ,  సెల్ ఫోన్ లు వాటిలో మెస్సేజులు పంపుకోవడము - చాటింగులు చేసుకోవడము   అత్యాచారాలకు ఉసి గోల్పుచున్నవి .   నూటికి ఎనభై  శాతం  ఇవే  అత్యాచారం జరగడములో పాలు పంచు కొంటున్నాయి . 

    నేటి సినిమాలు డబ్బు సంపాదించడమే  ముఖ్యమైన పని గా  ఎంచుకున్నాయి. ఎవ్వడు ఏమైనా, దేశ ప్రజలు  ఏమైనా ఎటు పోయినా  , యువత పక్క దారులు పట్టినా  ఎం పర్వాలేదు.  ఈ తరం సినిమాలలో  తారలు విచిత్ర డ్రేస్సులలో మార్కెట్ లో బట్టలు కరువైనట్లు అసలు బట్టలు కొనుక్కోవడానికి డబ్బులు లేనట్లు, పిచ్చి పిచ్చి  డ్రెస్సులతో, అర్థ నగ్నంగా శరీరం లో  గుడ్డలతో దాచుకోన బడే  అవయవాలను బహిరంగంగా చూపించి ప్రేక్షకులను మత్తెక్కిస్తు బరి తెగించి నటిస్తున్నారంటే వారికి కనీసం మానవత్వం ఉందా? అవయవాలను చూపిస్తూ ముద్దులు పెట్టుకుంటూ(" లిప్ - లాక్ " )  ఇతరులకు చూపిస్తుంటే కనీసం సిగ్గు అనిపించదా , కనీస సంస్కారం కూడా లేదా? ఇంకా చెప్పాలంటే కొందరు నటీమణులు పూర్తిగా డ్రెస్ లేకుండా నటించుటలో తప్పు లేదని,  చాన్సు ఇస్తే  నటిస్తానని చెపుతుంటే ఏమనాలి?   వీ టి ని తీసే వాళ్ళకు కూడా సంస్కారం  లేదా? అసలు నిర్మాత , డైరెక్టర్  వాళ్ళ భార్య , అక్క , చెల్లెలు వారి ఆడ పిల్లలు    నటిస్తే  సినిమాలు ఇలాగే తీస్తారా?

నేడు డబ్బు సంపాదించడమే వాళ్లకు  ముఖ్యమైనది . ప్రజలు ఇలాంటి సినిమా లను అసలు చూడొద్దు . నిర్మాతలు మళ్ళి సినిమా జోలికి పోకుండా చేయాలి . సినిమా actors నిజ జీవితాలను ఒకసారి పరిశీలించితే ఎంత ఇదిగా ఉంటాయో ! వారు నిజజీవితం లో చేసేది ఒకటి సినిమాల్లో చెప్పేది మరొకటి . పాత సినిమాలలో కథ నిజ జీవితానికి చాల దగ్గరగా ఉండేవి . అప్పటి వారు కథ బాగుంటేనే సినిమాలలో నటించేవారు కాని నేడు ఏది ఎలాగున్నా డబ్బులు వస్తే సరే నంటూ నటిస్తున్నారు . సినిమా Actors సినిమా లో నటించుటకు కోట్ల రూపాయలను రెన్యుమరెశన్ గా తీసికొంటున్నారు కదా ! మరి వారు income టాక్స్ కు లెక్కలు సరిగ్గా చూపిస్తున్నారా ? లేక ఏదో నామ మాత్రం గా చుపిస్తున్నారా అని అందరి అనుమానం !


      సినిమాలు ఎగ్సిబిట్ / రిలీజ్ చేయడానికి పర్మిషన్ ఇచ్చే ప్రభుత్వం సెన్సార్ బోర్డ్ కూడా కళ్ళు మూసుకుందా ? వీటి వలన దేశం లో  ఏం జరిగినా పర్వా లేదనుకుందా ? డబ్బులు వస్తే చాలు అని "ఏ " లేదా  "యు " సర్టిఫికెట్లు ఇవ్వడమేనా? ఫారెన్ పాలసీ  మనకూ  కావాలనా  ?   పోనీ ఫారెన్ వాళ్ళను అనుకరిద్దామా ?   వెస్టరన్ కంట్రీస్ వేరు మన భారత దేశం వేరు.  . అసలు మన దేశము లో సెన్సార్  బోర్డ్  ఉందా లేదా ? అనే అనుమానం ప్రతి వారికి  కలుగుతుంది .

    ఒక వేళా ఉందనుకుంటే నేటి ఇలాంటి పిచ్చి పిచ్చి సినిమాలు ఎలా ఆడుతున్నాయి ? దేశం లో ఇంత గందర గోళం ఎందుకు జరుగు చున్నది ? అమాయక ప్రజలు గురి కావలసినదా ?  మతాన్ని , భాషలను , మన ఆచారాలను సాంప్రదాయాలను కించపరుస్తూ ఈ సినిమాలు ప్రజలలో ఆజ్యం పోస్తున్నాయి . ఇక  దేవుళ్ళపై  పిచ్చి పాటలు పాడుతూ ఆడుతూ ఉంటె ఏమనాలి , అసలు భాద్యులు ఎవరు?
ఇంతకుముందు వచ్చిన సినిమాలు కుల మత చిచ్చులను రేపాయి అందరికి బాగా తెలుసు . దీనికి  ఖచ్చితముగా  సెన్సార్  బోర్డ్ భాద్యత మాత్రమే అంటే సందేహం లేదు . ఎందుకంటే అలాంటి వాటికి సర్టిఫికేట్ ఇవ్వడమే !

    మన రాజ్యాంగము లో ఫ్రీడమ్ అఫ్ స్పీచ్ ఉందికదా అని అడ్డమైన సినిమాలకు పర్మిషన్ ఎలా ఇస్తారు . 
పొగ మరియు మత్తు పానీయాలు త్రాగే సీన్ లలో క్రింద " పొగ త్రాగడం మత్తు పానీయాలు సేవించడం హానికరం"  అని వ్రాస్తే సరిపోతుందా ? ఇంకా ఏదో చూపెట్టి "ఇది చేయకూడదు" అని క్రింద వ్రాస్తే సరిపోతుందని కదా దాని అర్థం  ? అలాంటి సిమాలకు ఎలా పర్మిషన్ ఇస్తారు?   


                 పంజాబ్ లో 'ఎంఎస్ జి' సినిమాపై నిషేధం
PTI | Updated: January 17, 2015 19:04 (IST)
పంజాబ్ లో 'ఎంఎస్ జి' సినిమాపై నిషేధం
చండీగఢ్ : డేరా సచ్చా సౌధ అధినేత గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ ప్రధాన పాత్రధారిగా వచ్చిన వివాదాస్పద చిత్రం 'ఎంఎస్ జీ - ద మెసెంజెర్ ఆఫ్ గాడ్' సినిమాను పంజాబ్ ప్రభుత్వం నిషేధించింది. ఈ సినిమాను రాష్ట్రంలో ఎక్కడా ప్రదర్శించకూడదని ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఈ సినిమా ప్రదర్శిస్తే రాష్ట్రంలో ఉద్రిక్తతలు తలెత్తే ప్రమాదం ఉందని ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరించడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

Katta Shekar Reddy Article

‘మెసెంజర్ ఆఫ్ గాడ్’ చిత్రంపై పంజాబ్ నిషేధం

Katta Shekar Reddy Article


Updated : 1/17/2015 5:44:06 PM
Views : 238

Latest News


పంజాబ్: డేరా వర్గీయులకు, సిక్కులకు మధ్య తీవ్ర వివాదానికి కారణమైన ‘మెసెంజర్ ఆఫ్ గాడ్’ చిత్రంపై పంజాబ్ ప్రభుత్వం నిషేధం విధించింది. ఎంఎస్‌జీ చిత్రంకు సెన్సార్ బోర్డు క్లీన్‌చిట్ ఇచ్చింది. సినిమాకు క్లీన్‌చిట్ ఇచ్చిన అనంతరం సెన్సార్ బోర్డ్ చీఫ్ లీలాశాంసన్ తన పదవికి రాజీనామా చేశారు. ఎంఎస్‌జీ సినిమా విడుదలను అడ్డుకోవాలని కేంద్రం పరోక్షంగా ఒత్తిడి తెచ్చిందని ఆమె ఈ సందర్భంగా ఆరోపించారు. తమకు వ్యతిరేకంగా సినిమా ఉంటుందని సిక్కులు ఎంఎస్‌జీ విడుదలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. పంజాబ్, హర్యానా, జార్ఖండ్, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్ రాష్ర్టాల్లో మూవీకి సెన్సార్ బోర్డు క్లీన్‌చిట్ ఇవ్వడంపై నిరసనలు మిన్నంటాయి. సిక్కుల ఆందోళన నేపథ్యంలో పంజాబ్ ప్రభుత్వం చిత్రం విడుదలపై నిషేధం విధించింది. సిక్కుల ఆందోళనపై చిత్ర దర్శకుడు గుర్మీత్ స్పందిస్తూ.. ఆందోలన చేస్తున్న వారంతా ఒక్కసారి తన సినిమా చూడాలి. అభ్యంతరకర దృశ్యాలుంటే అప్పుడు నిర్ణయం తీసుకోవాలి. డ్రగ్స్‌కు వ్యతిరేకంగా, వ్యభిచారిణులకు పునరావాసం కల్పించాలన్న కథాంశంతో సినిమా తీశామని ఆయన పేర్కొన్నారు.
సెన్సార్‌బోర్డును యూపీఏ రాజకీయం చేసింది: జైట్లీ


Updated : 1/17/2015 8:11:25 PM
Views : 15

Latest News


     ఢిల్లీ: యూపీఏ ప్రభుత్వం సెన్సార్ బోర్డ్‌ను రాజకీయం చేసిందని ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ ఆరోపించారు. మెసెంజర్ ఆఫ్ గాడ్ చిత్రంపై తీవ్రస్థాయిలో నిరసనలు చెలరేగుతున్న తెలిసిందే. ఈ నేపథ్యంలో అరుణ్‌జైట్లీ స్పందిస్తూ... చిత్రాల ధ్రువీకరణ విషయాల్లో ప్రభుత్వం జోక్యం ఉండదు. చిత్రాల ధ్రువీకరణ విషయాలకు ఎన్డీఏ దూరంగా ఉంటుంది. యూపీఏ ప్రభుత్వం సెన్సార్ బోర్డును రాజకీయం చేసింది. సాధారణ విషయాలను రాజకీయం చేయడం విచారకరమని ఆయన పేర్కొన్నారు.

      కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు బాగా ఆలోచించి  దేశ సమైక్యతా , దేశ భద్రతా , ప్రజల సమైక్యత , ప్రజల మనసులను కించ పరుచకుండ , అన్ని మతాలవారు కలసి మెలసి సంతోషముగా  పండుగలను జరుపుకొనే విధముగా , ప్రాంతాల మధ్య  సౌ భాత్రుత్వం పెంచే వారిని, దేశ సేవకు అంకిత మైన వారిని , మేధావులను , దేశం కోసం పోరాడిన దేశ భక్తులను  మాత్రం  సెన్సార్ బోర్డ్ సభ్యులుగా  ప్రభుత్వం నియమించాలి.  లేదా సెన్సార్ బోర్డ్ ను రద్దు చేయాలి . లేదా దాని స్తానం లో ఒక ప్రత్యేక న్యాయస్తానాన్ని ఏర్పాటు చేసి సర్టిఫికేట్ ఇయాలి . T V  సీరియల్ లకు కూడా సెన్సార్ చేయవలసిన అవసరం ఉన్నది . 

        దేశ ప్రజలు  శాంతి తో అందరు కలసి మెలసి ప్రాంతాలు మతాలకు అతీతంగా జీవనం సాగించాలని కోరుకుందాము . 
                                                                                                                        yours, 
                                                                                                       www.seaflowdiary.blogspot.com 


No comments:

Post a Comment