Monday, December 29, 2014


        How many backbiting s on us ?  మన పై ఇంకెన్ని కుట్రలు ? 

                                                                     
                                                                                                               Date : 29-12-2014

                                                                                                             updated  :   13-01-2015
                                                                                                             updated  :   17-01-2015
                                                                                                             updated  :  23 -01-2015
                                                                                                              updated  :  24 -01-2015
                                                                                                              updated  :   14 -02-2015
                                                                                                              updated  :   20 -03-2015
                                                                                                              updated  :   31 -03-2015

      తెలంగాణా రాష్ట్రం ఏర్పడి ఆరు  నెలలు అయింది ,  రాష్ట్రాన్ని అభివృద్ధి పథం(development )లో పెట్టడానికి మన కె ఆర్ గారు అహర్నిశలు పాటు పాటుపడుచున్నారు. కాకతీయ రాజుల స్ఫూర్తి తో కాకతీయ మిషన్ ద్వార తెలంగాణా లోని చెరువు లన్నింటిని అభివృద్ధి చేసి గొలుసు చెరువులు గా చేసి పై చెరువు నిండిన తరువాత ఎక్కువైనా నీరు క్రింది చెరువు లోనికి  కాలువల (canals )ద్వారా  వచ్చునట్లు చేయడం, నీరు వృధా కాకుండా చేయడం పొలాలన్నీ పచ్చగా పండునట్లు చేయడం  తెలంగాణా ప్రజలకు  చాల ఆనంద దాయకం. ఎందుకంటే  తెలంగాణా లో పంటలన్నీ వర్షాధారం (depend on rains )మరియు బోరు బావుల(depend on bore well ) పై ఆధారపడి పండుతాయి. ఈ సారి వర్షాలు లేవు బోరింగులకు కరెంట్ లేదు . గ్రామాలలో 4-5 గంటలు కరెంట్ ఇస్తే ఎం సరిపోతుంది .  ఈ విద్యుత్తు కొరతకు కారణం గత ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వాలే   ఎందుకంటే ఒక్క కరెంటు జనరేషన్ స్టేషన్ తెలంగాణా లో ఏర్పాటు చేయక పొవదమె.  కావలసింత బొగ్గు మనదగ్గర ఉన్నా కరెంటు ఎందుకు ఉత్పత్తి ఎందుకు కాలేదు .  బొగ్గు ఇక్కడ - కరెంట్ ఉత్పత్తి అక్కడ. మన తెలంగాణా నాయకులు పట్టించు కుంటే కదా ! మనకు న్యాయంగా రావలసిన  విద్యుత్ వాటా కావాలని ఆంధ్ర వారు  ఇవ్వడం లేదు . 
         తెలంగాణా లో విద్యుత్తూ కొరత తెలిసి కూడా  పి  పి  ఎ (ppa ) లను ఎందుకు రద్దు చేయాలను కున్నారు .  కె టి పి సి మరియు వి టి పి సి ల నుండి రావలసిన 710 మెగా వాట్ ఎందుకు రావడం లేదు . సీలేరు నుండి 460 మెగావాట్ ఎందుకు లాక్కున్నారు . కృష్ణపట్నం నుండి రావలసిన 400 మెగా వాట్ ఎందుకు ఇవ్వడం లేదు . అర్ టి పి పి  లో బొగ్గు కొరత అని  కరెంట్ ఎందుకు ఉత్పత్తి చేయడం లేదు,  అక్కడి 1050మెగా వాట్ లో 54% తెలంగాణా కు రావాలి. కాని రావడం లేదు ,  ఇదంతా కావాలని పన్నిన పన్నాగమమె  . ఎదుటి వాడు ఏ మైనా పర్వాలేదు , మనకు దక్కనిది ఎదుటివాడికి ఎందుకు దక్కాలని .  ఈ రోజు కృష్ణ వాటర్ ట్రిబ్యునల్ కు శ్రీశైలం ప్రాజెక్ట్ లో నీటి మట్టం తగ్గినదని తెలంగాణా ప్రభుత్వం  కరెంట్ ఉత్పత్తి ని ఆపు చేయాలని ఆంధ్ర ప్రభుత్వం లెటర్ వ్రాసినది . ప్రస్తుతం 860 అడుగుల నీరు శ్రీశైలం ప్రాజెక్ట్ లో ఉన్నది . 834 అడుగుల వరకు నీరున్నా కరెంట్ ఉత్పత్తి చేయవచ్చు . ఇంతకు ముందు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి గా ఉన్నప్పుడు 770 అడుగుల నీరున్నా కరెంట్ ఉత్పత్తి చేయించారు . మరి ఇప్పుడెందుకు ఆబ్జేక్షన్ ? అంటే వాళ్లకు త్రాగడానికి నీరు సరిపోదట , ఎప్పుడో అవసరమున్న నీటికి ఇప్పుడే ముందు చూపా ? మరి ఇక్కడ తెలంగాణా లో రైతులు పంటలు కరెంట్ లేక ఎండిపోతున్న తట్టుకోలేక ప్రాణాలు పోగొట్టుకుంటే కనిపించడం లేదా? ఇక్కడ ప్రాణాలు పోయినా ఆయనకు పరవా లేదు . 

ఈ సంవత్సరం సరిగ్గా వర్షాలు(rains ) లేక విత్తనాలు(seedling)  కూడా తెలంగాణా లో వేయలేదు , వేసిన పంటలు కరెంట్ లేక బోరింగులు పనిచేయక కొద్ది వర్షాలకు వేసిన  పంటలు ఎండి పోయాయి, పంటలు ఎండి పోవడం తో . రైతులు అప్పుల బాధ తో ఏం చేయాలో తెలియక ప్రాణాలు తీసికుంటున్నారు .

మన  ప్రభుత్వం రైతులకు కొంత ఋణ (loan )మాఫీ కూడా  చేసింది  .

వృద్ధులకు(old  age ) మరియు వికలాంగులకు (physically challenged )పించను (pension ) పెంచి రూ 1000 మరియు రూ 1500 చేశారు . రేషన్ బియ్యం కూడా పరిమితి లేకుండా పేద కుటుంబాలవారికి ఒక్కొక్కరికి 6 కిలోలు  1 జనవరి 2015 ఇచ్చుటకు నిర్ణ ఇంచారు .
ఉపాధి కల్పనకు ప్రణాళికలు చేయుచున్నారు .  , ఖాళీ ఉద్యోగాలు భర్తీ చేయుటకు  .TSPSC  నోటిఫికేషన్ రాబోతుందట . 10 వ  పి ఆర్ సి రాబోవుచున్నది . తెలంగాణా ఉద్యోగులందరికీ  ప్రత్యేక ఇంక్రిమెంట్ లు ఇవ్వబడినవి.

Telangana News

చంద్రబాబు ధోకా లేఖలు


Updated : 3/20/2015 3:54:38 AM
Views : 2436

-సింగరేణి బొగ్గుకూ టెండర్..
-సీలేరు విద్యుత్‌లో వాటా ఇవ్వం
-కేంద్రానికి ఏపీ సీఎం లేఖలు

హైదరాబాద్, గోదావరి ఖని, నమస్తే తెలంగాణ: చంద్రబాబు ఏపీ రాష్ర్టాన్ని అభివృద్ధిపరిచేందుకు ఏం చేస్తున్నారో తెలియదుగానీ.. తెలంగాణ ప్రయోజనాలన్నీ దెబ్బకొట్టేందుకు మాత్రం రేయింబవళ్లు కుట్రలు చేస్తూనే ఉన్నా, తాజాగా ఆయన కన్ను సింగరేణి మీదా పడింది. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నపుడు సింగరేణికి ఏపీ జిల్లాల్లో కేటాయించిన బ్లాకులను రద్దు చేయాలంటూ కేంద్రానికి చంద్రబాబు లేఖ రాశారు. సదరు బ్లాకులన్నీ ఏపీ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌కు కేటాయించాలని ఆయన సూచించారు. ఆరు దశాబ్దాలు సింగరేణి ఉద్యోగాలను అనుభవించి, బొగ్గును ఇష్టారాజ్యంగా తరలించుకుని ప్రయోజనం పొందిన ఏపీ, ఇవాళ అన్నం పెట్టిన సంస్థనే దెబ్బతీయాలని ప్రయత్నించడంపై సింగరేణివ్యాప్తంగా నిరసన వ్యక్తమవుతున్నది. వందల ఏండ్ల అనుభవం ఉన్న సింగరేణిని కాదని ఏ అనుభవం లేని ఏపీ సంస్థకు ఏపీలోని బొగ్గు క్షేత్రాలు

babu


కేటాయించాలని కోరడం సింగరేణి అభివృద్ధికి అడ్డుపడడమే తప్ప ఏపీ ప్రయోజనం కోసం మాత్రం కాదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు సీలేరు విద్యుత్ విషయంలో బాబు కుట్రలు కొనసాగుతూనే ఉన్నాయి. విద్యుత్ షెడ్యూల్ చేయడానికి ఇప్పటికీ ససేమిరా అంటూనే ఉన్నాడు. ఈ విషయంలో తెలంగాణ ప్రభుత్వం రాసిన లేఖకు కేంద్రం కూడా నిస్సహాయత వ్యక్తం చేస్తూ నిస్సిగ్గుగా మన ప్రభుత్వానికి లేఖ పంపడం తాజా పరిణామం.


ఆంధ్రా స్పందించడం లేదు..


విభజన చట్టం ప్రకారం ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకు 54 శాతం విద్యుత్ రావల్సి ఉంది. సీలేరు, కృష్ణపట్నం, హిందూజాల నుంచి తెలంగాణకు విద్యుత్ విషయంలో తెలంగాణ సర్కార్ కేంద్రానికి పలు లేఖలు రాసింది. సీలేరు నుంచి రావలసిన వాటా గురించి తెలంగాణ సర్కార్ సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అధారిటీ (సీఈఏ)కి గత ఏడాది నుంచి లేఖలు రాస్తున్నది. ఇదుగో, అదిగో అంటూ ఇంత కాలం మీనమేషాలు లెక్కించిన సీఈఏ తాజాగా తెలంగాణ ప్రభుత్వానికి ఓ లేఖ రాసింది. ఏపీ ప్రభుత్వం నుంచి ఇంత వరకు సీలేరు విషయంలో ఎలాంటి సమాచారం రాలేదని, ఏప్రిల్ 30వ తేదీన సమావేశం ఏర్పాటు చేశామని అందులో పేర్కొన్నట్లు సమాచారం. గతంలో ఫిబ్రవరి 28వ తేదీన తుది నిర్ణయం చెబుతామని జనవరిలో లేఖ రాసిన సీఈఏ, ఇప్పుడు ఆ సమావేశాన్ని ఏప్రిల్ 30వ తేదీకి వాయిదా వేసినట్లు సమాచారం ఇచ్చింది. ఫిబ్రవరి జరగాల్సిన సమావేశం ఎందుకు నిర్వహించలేదని టీ సర్కార్ రాసిన లేఖకు జవాబిచ్చింది. ఏపీ గవర్నమెంట్ ఈజ్ నాట్ షెడ్యూలింగ్ ఎబౌట్ సీలేరు అంటూ తెలియజేసింది. రెండు రాష్ర్టాలకు న్యాయం చేయాల్సిన కేంద్రమే ఈ విషయంలో మెతక వైఖరి అవలంభిస్తే, తెలంగాణ రాష్ర్టానికి న్యాయం చేసేది ఎవరు? అని తెలంగాణ నీటిపారుదల శాఖ ఇంజినీర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


సింగరేణిపై మరో కుట్ర


ఉమ్మడి రాష్ట్రం ఉనికిలో ఉన్నపుడు జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా సంస్థ వారు గోదావరి నది పరివాహక ప్రాంతాల్లో ఖనిజ నిక్షేపాలకోసం సర్వే నిర్వహించగా పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాలో 2వేల మిలియన్ టన్నుల బొగ్గు నిక్షేపాలు ఉన్నాయని వెల్లడైంది. అప్పుడు జీఎస్‌ఐ, ఎంఈసీఎల్, సీఎంపీడీఐ ప్రతినిధులతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నతాధికారుల బృందం చర్చలు జరిపి ఆ బొగ్గు వెలికితీతకు బొగ్గు ఉత్పత్తి రంగంలో వందేళ్లకు పై చరిత్ర కలిగిన సింగరేణి సంస్థను ఎంపిక చేసి అక్కడ 3 బ్లాకులను కేటాయించాలని నిర్ణయించారు. కోలిండియా పరిధిలోని వివిధ రాష్ర్టాల్లోని సంస్థలు ఇతర రాష్ర్టాల్లో కూడా బొగ్గు గనులను ఏర్పాటు చేసి నిక్షేపాలను బయటకు తీయడం ఆనవాయితీగా ఉంది. విదేశాలలో సైతం బొగ్గు గనుల ఏర్పాటుకు కూడా ముందుకు వచ్చాయి .

చంద్ర బాబు రెండు కళ్ళు సిద్ధాంతం ,కొబ్బరిచిప్పల సిద్ధాంతం ఏమైనది ? తెలంగాణా లో ఒక మాట , ఆంధ్రలో మరొక మాట  ఏమిటి చిన్నపిల్లలలాగా ! తెలంగాణా లో ఉంటాడు తెలంగాణా కే మోసం చేస్తాడు . 

కేంద్రం కూడా చంద్రబాబు పాటనే పాడుతున్నది . తెలంగాణా ప్రజల ఓపిక నశిస్తున్నది , తెలంగాణా వచ్చినా సంతోషం లేకుండా పోతున్నది . కంటి లోని నలసు లాగ , చెప్పులోని రాయి లాగ బాధను ఎన్నాళ్ళు భారించుదాము .  KCR  గారు మీరు కూడా ఇంకెంత కాలం ఉదాసీనత వహిస్తారు , మీరు ఇలాంటి వారిని ఎంతో మందిని చూశారు , మీ ముందు వీరెంత ? ఇక మీరు ఆలస్యం చేయకుండా ఉగ్ర నరసింహుని అవతారం ఎత్త వలసిన అవసరం వచ్చింది 




వాటర్ గ్రిడ్( water grid ) ను ఏర్పాటు చేసి తెలంగాణా లోని ప్రతి ఇంటికి స్వచ్చమైన త్రాగు నీరు నల్లాల ద్వారా  (through water tap ) అందించ బోవుచున్నారు

ఇప్పటికే I T  నగరం గా ఉన్న హైదరాబాద్ ను ప్రపంచ  I T (world I T ) నగరముగా మరియు ప్రపంచ అత్యుత్తమ నగరముగా చేయుటకు ప్రణాలికలు సిద్ధ మయ్యాయి. 2018 లో ప్రపంచ I T సదస్సు హైదరాబాద్ లో జరుగాబోవుచున్నది దీనికి కె సి ఆర్ చలువే . 5 లక్షల   I T ఉద్యోగాలు రాబోతున్నట్లు   I T మంత్రి నిన్న ప్రకటించారు . 

పెట్టుబడి దారులు(investors)  దేశ విదేశాల నుండి హైదరాబాద్ వచ్చి ముఖ్యమంత్రి తో సంప్రదింపులు జరిపి ఇక్కడి అనుకూల వాతావరణం మరియు ప్రభుత్వం కల్పించే సౌకర్యాలకు సంతృప్తి (satisfy ) చెంది  దేశం లోని ఏ ఇతర ప్రాంతాలలో కాకుండా ఇక్కడే  హైదరాబాద్ లోనే పెట్టుబడులు పెట్టుటకు నిర్ణ ఇంచడం మనందరికీ సంతోషం . దీని గురించి ముఖ్యమంత్రి గారు సింగాపూర్ వెళ్లి అక్కడి పారిశ్రామిక దారులతో చర్చించడం కుడా జరిగింది, చాల కంపెనీ లు ఇక్కడ తమ ప్రొడక్షన్ చేయుటకు ముందుకు వస్తున్నాయి, ఎన్నో వేల మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి .

   తెలంగాణా లో పెట్టుబడి పెట్టేవారికి ఇక్కడ కరెంట్ ప్రాబ్లం ఉందని  ,ఇక్కడ పెట్టుబడులు పెట్ట కుండ భయ భ్రాంతులు చేయడానికి మాత్రమే ఇదంతా . 




వేల కోట్లు ఖర్చు చేసి తెలంగాణా గ్రామీణ ప్రాంతాల రోడ్లు (rural roads ) అభివృద్ధి చేయడం , లేని ఊర్లకు క్రొత్త రోడ్లు వేయడం, అన్ని గ్రామీణ ప్రాంతాలకు బస్సు సౌకర్యం కల్పించడం జరుగుతున్నది , పెరిఫెరల్ ఔటర్ రింగ్ రోడ్ కూడా రాబోవు చున్నది .
 విద్యుత్ థర్మల్ పవర్ స్టేషన్ (thermal power generation )లను నల్గొండ జిల్లలో ఏర్పాటు  చేయడానికి సర్వే చేయడం జరిగింది .

విద్యా విధానములో మార్పులు , 1 వ తరగతి నుండి ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ రాబోతున్నాయి , KG  to PG  ఉచిత విద్యా వచ్చే సంవత్సరం నుండి అమలు చేయ బోతున్నారు . క్రొత్త యూనివర్సిటీ లను , ఫార్మా యూనివర్సిటీ  ని (pharma university) హైదరాబాద్ దగ్గరలో  కందకూరు మండలములో ఏర్పాటుకు ఏరియల్ సర్వే కూడా చేశారు . హైదరాబాద్ (medical hub ) మెడికల్ హబ్ గా మారబోతున్నాది .
ఆంధ్రా ప్రభుత్వం ఇప్పుడు సెట్ ఎగ్జామ్స్ ( cet exams )లో కావాలని మన విద్యార్థులను గందరగోళం చేస్తుంది . ఇంతకూ ముందు ఇంజనీరింగ్ అడ్మిషన్ లో ఇట్లాగే చేసింది 


బీద విద్యార్థులకు ఫీజులు ( fee to poor students )చెల్లించి ఉన్నత విద్య చదువు కోనునట్లు చేశారు , హాస్టల్ ( hostels ) లో విద్యార్థులకు నాణ్యమైన సన్న బియ్యం( fine rice ) ఇవ్వడానికి నిర్ణయించారు.
ఇక  హైదరాబాద్ ను ప్రపంచ అతి సుందర నగరముగా తీర్చి దిద్దుటకు రాత్రిం బవాళ్ళు  (day and night ) శ్రమిస్తున్నారు . మెట్రో రైల్ ప్రాజెక్ట్ ను(metro rail project ) ప్రతిష్టా త్మకంగా prestige  తీసికొని హైదరాబాద్ లోఇంకా పొడగించి కోట్ల రూపాయలు వెచ్చించి   ప్రజా రవాణా వ్యవస్థ ను మెరుగు పరుచుచున్నారు, ఇది దేశం లో కెల్లా ఉత్తమ మైనది .

హుస్సేన్ సాగర్ ను మంచి నీటి సరస్సుగా మార్చి దాని చుట్టూ మల్టీ కాంప్లెక్స్ లు న్నిర్మించి సింగపూర్ లాగ సుందరీకరణకు ప్లాన్ చేయబడినది . ఎక్స్ ప్రెస్ హై వే లను, స్కై వాక్ లను (express hi way and sky walk ) నిర్మించబడు చున్నవి .

 పోలీస్  వ్యవస్థ ను పటిష్ట పరిచి ప్రజలందరికి రక్షణ కల్పిస్తున్నారు , షీ పోలీస్(she -police ) ను నియమించి విద్యార్థులకు , ఉద్యోగస్తులకు  మహిళలకు  రక్షణ కల్పిస్తున్నారు.



సిటీ(city ) బస్సులలో మహిళల రక్షణ కు పార్టిషన్ ఏర్పాటు చేశారు . బస్సుల సంఖ్యను పెంచుతున్నారు . ఆధునిక volvo బస్సులను సిటీ లో ప్రవేశ పెట్టారు .  ట్రాఫిక్ కంట్రోల్ గురించి వేగవంతముగా చర్యలు చేపడుతున్నారు కాని ఈ విషయం లో ప్రాథమిక చర్యలు ఇప్పటికే తీసుకొన వలసినది, రోడు పై వ్యాపారం చేసే వారు ట్రాఫిక్ కు అంతరాయం కల్గిస్తున్నా  నిరోధించ లేక పోవుచున్నారు .

కృష్ణ మరియు  గోదావరి పుష్కరాలు ఘనంగా జరుగ బోవు చున్నవి . కృష్ణ అంటే విజయవాడ అని  ,  గోదావరి అంటే రాజమండ్రి  అని కాదిప్పుడు. ఈ రెండు నదుల ఎక్కువ పరివాహక ప్రాంతం   తెలంగాణా మాత్రమే ఐనా ఆంధ్రా పాలకులు పట్టించుకోలేదు . అప్పటి తెలంగాణా మంత్రులు ఏమి చేయలేక పోయారు . 

ప్రస్తుతం A P సర్కార్ తీరుతో కృష్ణ జలాల్లో రబీ నీటి వ్యవహారం తేలడం లేదు . రబీ పంటకు నీళ్ళ కోసం కృష్ణా నది యాజమాన్య బోర్డుకు లేఖ వ్రాసి వివాదం చేసిన A P ప్రభుత్వం బోర్డు ఆదేశాలను మాత్రం పాటించడం లేదు . 


కె సి ఆర్ గారు యాదగిరి గుట్ట ను తిరుమల లాగ అభివృద్ధి చేయ దానికి ప్రణాళికలు సిద్ధం చేశారు 
హైదరాబాద్ సమీపములో రాచ గుట్ట ప్రాంతములో ప్రపంచ ఫిలిం సిటీ ఏర్పాటుకు చర్యలు తీసికొంటున్నారు . 













ఇంకా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు మన కె సి ఆర్ గారు చేబడుతుంటే ప్రక్క రాష్ట్రం ముఖ్యమంత్రి కి అసలు నిద్ర బట్టడం లేదు ఎందుకంటే ఆయన తన రాష్ట్రం లో ప్రజల గురించి ఏమి చేయలేక పోతున్నాడు కాబట్టి .కేంద్ర ప్రభుత్వం లో ఆయన పార్టి భాగస్వామి కాబట్టి కేంద్రములో  ఏదో ఒక అడ్డుపుల్ల వేసి తెలంగాణా అభివృద్ధి కాకుండా చేయడమే మరి ఈయన గారి పని. అసెంబ్లీ లో తెలంగాణా పేరు ఎత్తనివ్వని ఈయన రెండు ప్రాంతాలు సమానమని రెండు కళ్ళ  సిద్ధాంతం  అని కొబ్బరి చిప్పల సిద్ధాంత మని ఆ నాడు పలికిన పెద్ద మనిషి చిలుక పలుకులు ఏ మైనాయి ? ఉండేది ఇక్కడ ఇక్కడి ప్రజలనే  బాధించడం ఎంత వరకు సమంజసం ? తెలంగాణా ఫుడ్స్ అంటే ఆయన కు పడదట. 

జూబిలీ హిల్స్ లో తన పాత ఇంటిని పడగొట్టి క్రొత్త ఇల్లు కట్టుకొని ఇక్కడే ఈ తెలంగాణా లో ఉండడ మెందుకో ?







MMTS  రైల్ ను RGI  ఎయిర్ పోర్ట్ వరకు పొడగించి ప్రయాణికులకు అతి తక్కువ ఛార్జ్ ల కె కల్పించాలనుకుని దానిని RGI  ఎయిర్ పోర్ట్ వరకు పోదిగించాలనుకుంటే దానిని ఎయిర్ పోర్ట్ వరకు కాకుండా 3  కి మీ ముందువరకు మాత్రమే ఎయిర్ పోర్ట్ ను మెంటేన్ చేయువారు  అనుమతి ఇచ్చినట్లు   చెబుతున్నారు  .  అసలు  RGI ఎయిర్ పోర్ట్ ప్రభుత్వానిదా లేక నిర్వహించు వారి   అయ్య జాగిరా?  ప్రజలకు ఈ విషయం  తెలియాలి . ఏది ఏ మైన మన కె సి ఆర్ గారు దయ చేసి చోరువ తీసికొని  ఎయిర్ పోర్ట్ వరకు MMTS వచ్చునట్లు చేయాలి .


 ఆ నాడు తెలంగాణా రాష్ట్రాన్ని ఆదరా బాదరాగా ఏర్పాటు చేసినట్లు నేడు స్పష్టం గా కనిపిస్తున్నది.    ఎందుకంటే ఆస్తులు, వనరులు మరియు ఉద్యోగుల పంపకాలు ఇంతవరకు పూర్తిగా జరుగలేదు .  ఏదో తెలంగాణా రాష్ట్రం ఏర్పడినంక చూసుకోవచ్చు ముందయితే రాష్ట్రం ఏర్పడని అని మన నాయకులు భావించారు .


      వెనుకబడిన తెలంగాణా ను  ప్రత్యేక  రాష్ట్రం చేయాలని  60 ఎండ్లనుండి ఉద్యమం చేస్తుంటే 1200 మంది కి పైగా విద్యార్థులు బలిదానం చేసుకున్నాక, ఉద్యమం తీవ్ర తరమైనప్పుడు చేసేది ఏమి లేక చిట్టచివరగా కాంగ్రెస్ గుర్తించి తెలంగాణా ను ఇచ్చింది  , బి జె పి  అంతకు ముందే ప్రత్యేక రాష్ట్రానికి సుముఖత  తెలిపినందు వల్ల చేసేది ఏమి లేక చిట్టచివరగా కాంగ్రెస్  తెలంగాణా బిల్లు పెట్టి  ఎన్నో అడ్డంకుల మధ్య బి జె పి కొన్ని షరతులు పెట్టి సపోర్ట్ వలన బిల్లు పాస్ చేసినది . ఏవో కొన్ని మనకు పనికి రాని షరతులు పెట్టి చట్టం చేసి తెలంగాణా  ప్రజలను మభ్య పెట్టి ప్రత్యేక  రాష్ట్రం ఇచ్చింది . ఎన్నో త్యాగాల ఫలితమే ఈ తెలంగాణా  రాష్ట్రం ఏర్పడింది . కొన్ని చట్టాలు తెలంగాణా కు వ్యతిరేకముగా ఉన్నవి ఐనా మనం ఓపిక పట్టాము .  తెలంగాణా అనుకూల చట్టాలను ఆంధ్రా రాష్ట్రం కాల రాయు చున్నాది . 

          ఈ షరతుల వలన తెలంగాణా రాష్ట్రం సంతోషం గా లేదు ఆంధ్రా రాష్ట్రం ఎప్పటికి ఏదో అడ్డంకులు కల్పిస్తూ తెలంగాణా  ను ప్రశాంతము గా నిద్ర పోనీయడం లేదు . ఇందుకు కేంద్రం కూడా అధికారులను తొందరగా విభాజించ కుండ కాలయాపన చేస్తున్నందులకు అభివృద్ధి జరగడం లేదు ..ఒక్కొక్క  ఐఏఎస్ ఆఫీసర్ 7-8 విభాగాలను చూస్తూ న్నారట .  నిన్ననే కేంద్ర సర్వీస్ ఉద్యోగుల పంపకం జరిగినది ఇంకా కొన్ని విభాగాలలో ఇంకా ఆంధ్రా  పెత్తనం చలాయించ బడుతున్నది . ఆర్ టి సి  విభజన ఇంతవరకు జరుగలేదు . 
   


 మద్రాస్ నుండి ఆంధ్రా వేరు పడ్డప్పుడు ఏ షరతులు విధించారో అవే షరతులతో  తెలంగాణా  నుండి ఆంధ్రా ను కూడా విడ గోడితే నే  మనం ఒప్పు కోవలసినది, అంతా క్లియర్ అయిన తరువాత నే వేరు అయి ఉంటె ఈ గొడవలు రాక పో వేమో ! ఏదో రాష్ట్రం ఏర్పడింది చాలు అని అనుకొన్నట్లు ఉన్నాం . ఇలా జరుగు తుందని కలలో కూడా మనం ఊహించ లేదు .  



               క్రొత్త ప్రభుత్వం అధికారం లో కి వచ్చి 180 రోజులు అయిందో లేదో ఎప్పు డెప్పుడు  ప్రభుత్వం మీద పడదామా అని ప్రతి పక్షాలు ఎదురు చూస్తున్నాయి. ఆ అదను విద్యుత్తూ రూపములో వెళ్ళ గక్కు తున్నాయి .   అసలు ఇలా ఎందుకు జరిగినదో  తెలుసు కొని చేస్తే ప్రజలు కూడా వారితో కలసి వచ్చే వారు . ప్రజలు కలసొచ్చిన రాక పోయిన  వారు చేస్తున్నారంటే  వారి పై నున్న పెద్ద వారి మెప్పు కోసం అని అందరికి చివరకు చిన్న పిల్ల వాడికి కూడా తెలుసు . నిజం గా తెలంగాణా ప్రజల పై ప్రేమ ఉంటె వారి పాలనలోఎప్పుడో చేసేవారు  .   హై కమాండ్ కు వీరు చేసేది తెలుసో ? తెలియదో ? లేక   హై కమాండ్ వీరిచే చేయించు చున్నదా ?

      ఈ రోజు ఉత్తర ప్రగల్బాలు  పలుకు చున్నవారు వారి చేతిలో అధికారం ఉన్నప్పుడు ఎం చేశారు ? తెలంగాణా ను ఎంత అభి వృద్ధి చేశారు ? వారు తెలంగాణాకు అసలు ఎం చేయలేదు,  అసెంబ్లీ కి రావడం పోవడం మాత్రమే .  అసెంబ్లీ లో తెలంగాణాకు ఒక్క రూపాయి కూడా ఇవ్వను అని ఒక మూర్ఖుడు అంటే నోరు విప్పని వారు ఈనాడు ఏదో ప్రజలకు చేస్తాం అంటే ఎవరు నమ్ముతారు . తుపాకి చేతిలో పెట్టుకొని కూడా చిన్న పిట్టను  కాల్చలేని వారు  ఈ రోజు అధికారం లేని వారు ఏదో చేస్తామంటే నమ్మడానికి తెలంగాణా ప్రజలు అమాయకులు కారు .  తెలంగాణా ప్రజలు ఛీ  అని తరిమి కొట్టినా ఇంకా తేరుకో లేని వారు , ముచ్చటగా మూడు సార్లు ఛీ కొట్టిన ఇంకా పదవి గురించి ప్రాకులాడ డము చూస్తె ఎవ్వ రైనా నవ్వు కుంటారు .


180 రోజులలో ఏ ప్రభుత్వమైన ఎంత చేయగలదు అని ఎవరైనా గుండె మీద చెయ్యి వేసుకొని చెప్పగలరా? కాని 
    ఈ ప్రభుత్వం ఎంతో చేసింది అతి తక్కువ కాలం లో, దీనితో బాటే  ఏర్పడ్డ  ప్రభుత్వం ఏం చేసిందో  ఒక సారి తెలుసుకుంటే బాగుంటుంది .పబ్లిక్ సెక్టార్ ను ప్రైవేటు వారి చేతిలో పెట్టడమే వారు చేయుచున్నది . 

      ఈ రోజు రూ 8. 50 కి యూనిట్ చొప్పున 14 మిలియన్ యూనిట్లు కొని తెలంగాణా లో ప్రభుత్వం సరఫరా చేయు చున్నది. ఇంకా ఎక్కడ లభ్యమైన ఎంత ధర కైనా కొని సప్లై చేయడానికి సిద్ధం గా  యున్నది. ఛత్తీస్ గడ్ రాష్ట్రం విద్యుత్ ఇవ్వడానికి సంసిద్ధం తెలుపడం చాల సంతోషం . ప్రక్క నున్న తెలుగు వాడికన్నా ఇంకో ప్రక్క నున్న హిందీ వాడు చాలా నయం 
    
      ఇన్ని అడ్డగోలు జరుగుతున్నా మనం ఏం చేస్తున్నట్లు? మనం న్యాయం గా మనకు రావలసిన వాటాను కేంద్ర ప్రభుత్వం తో పోట్లాడి పట్టుబట్టి మరీ మనం సాధించు కుందాం . ఇంకా ఆలస్యం చేయకూడదు . కె సి ఆర్  గారు మీరు పట్టు బడితే సాధించ లేనిది ఏది లేదు . ఇక్కడ డబ్బులు ఎక్కువ పెట్టి కరెంటు కొనే  బదులు కేంద్రం నుండి ఎక్కువ వాటాను తెచ్చుకుందాం . ప్రజా లంతా మీ వెంటే ఉన్నారు . మీరు ఉగ్ర నరసింహ అవతారం ఎత్త వలసినదే . కేంద్రం కూడా ఆంధ్రా కే   200 MW un allocated quota southern grid నుండి ఇచ్చినది . మరి తెలంగాణా కు ఎందుకు ఇవ్వలేదు? తెలంగాణా వెనుక బడినదని ,ఇక్కడ కరెంట్ లేదని, వారికి అన్నీ తెలుసు.ఇంతకు ముందు మీరు కరెంట్ గురించి కేంద్రానికి లెటర్స్ కూడా వ్రాశారు కదా .   అక్కడి ఆంధ్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం లో భాగస్వామి కదా  మరి ! అందుకే నేమో ! అన్నీ వాళ్ళ కే ఇస్తుంది . 

     ప్రస్తుతము కరెంట్ పై ఇక్కడ RESTRICTION చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది . ఇపుడు ఉన్న కరెంట్ ను చాలా పొదుపుగా వాడాలి . పట్ట పగలే వీధి దీపాలు వెలుగు తున్నాయి , వాటిని నియంత్రించాలి .  వీధి దీపాలు ALTERNATE  గా వేలుగునట్లు చేయాలి . లేటు గా వేసి ఉదయం తొందరగా ఆర్పివేయాలి . ఇండ్ల లో కూడా విచ్చల విడి గా దుబారా చేయకుండా కోటా FIX  చేయాలి . ADVERTISE  గురించి కరెంట్ ను ఇవ్వరాదు . దీని వలన చాల కరెంట్ ఆదా చేయవచ్చు . కావున ఆలోచించి అమలు చేయాలి . 



 
 తెలంగాణా లో చాల మంది ప్రజలు చాలా బీద వారు ఎందుకంటే చాలామంది వ్యవసాయం పై ఆధారపడి బ్రతుకు తున్నారు .  తెలంగాణా లో నీటి కాలువలు లేవు కేవలం వర్షం మరియు బోరు బావుల పై వ్యవసాయం చేయాలి , బోరు బావులు కరెంటు పై ఆధారమే కదా ! మన వారు తమ  వద్ద ఉన్న దానిలో ఇతరులకు సహాయం చేస్తారు . నీతి - నిజాయితీ పరులు , ఎంతో ఓపిక గలవారు  ,  మాట ఇస్తే తప్పని వారు , ఎదుటి వారికి సహాయ పడు వారు , ధైర్య వంతులు, ఎప్పుడు పోరాటం లో ముందుంటారు . వారు ప్రాణ మిస్తారు గాని ప్రాణ హానిని ఎప్పుడు చేయరు. మోసం అంటే ఏమిటో వీరికి అసలు తెలియదు . 30 సంవత్సరముల క్రితం తెలంగాణా లో దౌర్జన్యం ,దోపిడీ ,హత్యలు ల్యాండ్ గ్రాబింగ్ లు అసలు ఉండేవి కావు . ఎవరు ఎన్ని అడ్డుకున్న మనకు న్యాయం  గా రావలసినవి అవంతట అవే మన తెలంగాణా కు వస్తాయి . 

Dated :22-01-2015





 తెలంగాణా ప్రజలు ఛీ  అని తరిమి కొట్టినా ఇంకా తేరుకో లేని వారు , ముచ్చటగా మూడు సార్లు ఛీ కొట్టిన ఇంకా పదవి గురించి ప్రాకులాడ డము చూస్తె ఎవ్వ రైనా నవ్వు కుంటారు .అసలు ప్ర భుత్వం ఏం  చేస్తుందో కూడా తెలుసుకో ని  మూర్ఖులా  అనిపిస్తుంది . హాయిగా ఇంట్లో కూర్చో కుండా ఎందుకు ఈ ప్రాకులాట ?  ప్రజలకు  మీరు చేసిన ఏమైనా మంచి పని ఉంటే మర్చిపోరు లెండి . 







మన గడ్డ మీద ఉండి మనకే వెన్నుపోటు పొడిస్తూ , పక్కలో బల్లెం లాగా  ఉంటే  మనం మౌనం ఎంత వరకు . 







ఇదంతా అక్కడి ముఖ్యమంత్రికి తెలియదా ! ఏదో విదేశాలతో యుద్ధం చేసినట్లు ఉంది . నిన్ననే వరంగల్ లో రెండు కళ్ళ సిద్ధాంతం చెప్పి తెల్లారే మర్చి పోవడమేమిటి ?   అక్కడి పంటలు ఎండి పోకుండా 5-6 టియంసి  నీరు విడుదల చేస్తామని  శ్రీ . హరీష్ రావు మన భారి నీటి పారుదల శాఖ మంత్రి గారు చెప్పారు కూడా . ఎంత నీరు కావాలో వ్రాసి ఇవ్వమన్నారు ,  ఐనా ఈ జులూం ఏమిటి .  ఇక్కడి ప్రజలంతా అందరు సంతోషముగా కలసి ఉండాలని కోరుకుంటుంటే  ఈయన చేసేది ఏమిటి . ఇదంతా అక్కడి ప్రజలు కూడా గమనిస్తున్నారు . వాళ్ళే వాళ్ళ ముఖ్యమంత్రికి ఏం చేయాలో చెప్పగలరని ఆశించుదాం .  


Katta Shekar Reddy Article

నాగార్జున సాగర్ వద్ద పోలీసులు మోహరింపు


Updated : 2/14/2015 9:15:20 AM
Views : 268

police at Nagarjuna sagar

నల్లగొండ : నాగార్జున సాగర్ నీటి పంపకాల విషయంలో తెలంగాణ, ఏపీ రాష్ర్టాల మధ్య వివాదం కొనసాగుతూనే ఉంది. ఆంధ్రా అధికారులు దౌర్జన్యం చేసి కుడి కాల్వకు నీటిని తరలించుకుపోయేందుకు యత్నిస్తున్నారు. నీటిని కుడి కాల్వకు విడుదల చేసేదే లేదని తెలంగాణ అధికారులు తేల్చిచెబుతున్నారు. ఈ క్రమంలో సాగర్ వద్ద ఇరు రాష్ర్టాలకు చెందిన పోలీసులు భారీగా మోహరించారు. నిన్న రాత్రి ఆంధ్రా పోలీసులు తెలంగాణ పోలీసులను లాఠీలతో కొట్టిన విషయం తెలిసిందే. మరి కాసేపట్లో ఇరు రాష్ర్టాల సీఎంలు గవర్నర్‌తో సమావేశమై సాగర్ నీటి వివాదంపై చర్చించనున్నారు.  



Katta Shekar Reddy Article

గవర్నర్‌తో సీఎంలు కేసీఆర్, చంద్రబాబు భేటీ


Updated : 2/14/2015 10:22:49 AM
Views : 130

telangana, ap cms meets narasimhan

హైదరాబాద్ : రాజ్‌భవన్‌లో గవర్నర్ నరసింహన్‌తో తెలంగాణ, ఏపీ రాష్ర్టాల సీఎంలు కేసీఆర్, చంద్రబాబు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో నాగార్జున సాగర్ నీటి వివాదంపై చర్చిస్తున్నారు. కుడి కాల్వకు నీటిని కేటాయించాలని ఏపీ డిమాండ్ చేస్తోన్న విషయం విదితమే. ఏపీ వాడాల్సిన నీటి కంటే 43 టీఎంసీల నీటిని అదనంగా వాడుకుందని తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసింది. ఏపీకి ఇప్పుడు నీటిని కేటాయిస్తే ఖమ్మం, నల్గొండ జిల్లా రైతాంగం తీవ్రంగా నష్టపోతోందని తెలంగాణ ప్రభుత్వం చెబుతోంది. ఏపీకి నీటిని విడుదల చేసేది లేదని తెలంగాణ అధికారులు స్పష్టం చేస్తున్నారు. సీఎం కేసీఆర్ వెంట మంత్రులు హరీష్‌రావు, ఈటెల రాజేందర్, జల రంగ నిపుణుడు విద్యాసాగర్‌రావు ఉన్నారు.  


వేల  కి .మీ  కాలువలు త్రవ్వి నీటిని , అది వరద నీరు కావచ్చు ఏదైనా కావచ్చు తీసుక వెళ్లి నప్పుడు ప్రక్కనున్న మహబూబ్ నగర్ , నల్లగొండ జిల్లాలను ఎలా మరిచారు ? CM లు అక్కడివారు ఉన్నప్పుడు ఈ పని చేస్తే మరి ఇక్కడి తెలంగాణా నాయకులు MLA లు మంత్రులు ఏం చేశారు ? ఒక్క కాలువ కూడా తెచ్చుకోలేదు . తెలంగాణా ఉద్యమం 1969 లో మొదలై నప్పటినుండి  కనీసం తెలంగాణా గురించి ఆలోచించ లేదు . కనీసం KCR తెలంగాణా ఉద్యమం ప్రారంభించిన తరువాత కూడా తెలంగాణా కు అన్యాయం చేయడం జరిగింది . మనవాళ్ళ సోమరి తనం వాళ్లకు కలసి వచ్చింది .కేంద్రం కూడా కళ్ళు మూసికొంది .  ఇప్పటి కేంద్రం కూడా వాళ్ళకే వాళ్ళకే వత్తాసు పలుకుతుంది ఎందు కంటే వీళ్ళు కేంద్రం లో భాగ స్వామ్యులు కనుక ! ఏది ఏమైన  ప్రస్తుతం కేంద్రం పక్షపాతం లేకుండా వ్యవహరించాలి .
కనీసం ఇప్పుడైనా మనం పూర్తిగా మేల్కొనాలి . అన్యాయాన్ని నిలువరించాలి . కేంద్రం ద్రిష్టికి తీసికెళ్ళి తెలంగాణా కు అన్యాయం జరగకుండా చూడాలి . మనం మన ముఖ్యమంత్రి కె సి ఆర్ గారికి కి అండగా నిలుస్దాం

 విభజన చట్టాన్ని కాదని దానిని కాలరాస్తూ మనకు ఎన్ని విధాల నష్టం చేయాలో చూస్తున్నట్లు ఉన్నది . మనం న్యాయం గా వెళుతుంటే కాముగా ఉండకుండా కేంద్రం మా చేతులో ఉందికదా అని మోకాలు అడ్డుపెడుతుంది .  మన ఓపికను పరీక్షిస్తుంది ఈ ఆంధ్రా సర్కారు .

 దేవుడు  మనకు  జరుగుతున్న అన్యాయాన్ని ప్రశాంతముగా గమనిస్తున్నాడు , ఎవరికీ  ఏం చేయాలో ఎప్పుడు చేయాలో మన ప్రమేయం లేకుండానే తప్పకుండ చేయగలడు . 

                                                                                                       మీ 
                                                                                -  www.seaflowdiary.blogspot.com 





No comments:

Post a Comment