Sunday, September 28, 2014

Shaheed Bhagat Singh - భగత్ సింగ్

భగత్ సింగ్






Freedom fighter Bhagat Singh remembered on birth
anniversary

Freedom fighter Bhagat Singh remembered on birth anniversary

Updated on : 28-09-2014 01:38 PM

Country is celebrating the 107th birth anniversary of Bhagat Singh. Prime Minister paid tributes to freedom fighter through his message from USA.


Prime Minister Narendra Modi on Sunday paid tributes to freedom fighter Bhagat Singh on his 107th birth anniversary, saying his undying patriotism continues to inspire people.

"On his birth anniversary, I bow to the proud son of India, Shaheed Bhagat Singh. His undying patriotism and courage continue to inspire," the Prime Minister said in a message.

The revolutionary freedom fighter was hanged at a Lahore jail along with Shivaram Hari Rajguru and Sukhdev Thapar on March 23, 1931.


భగత్ సింగ్
Bhagat Singh 1929 140x190.jpg
1929 లాహోరులో, పోలీసుల బారి నుండి తప్పించుకోవడానికి కేశాలు కత్తిరించుకుని పైవిధంగా కనిపించేవాడు.
జననం 28 సెప్టెంబరు 1907
ఫైసలాబాద్, పంజాబ్, బ్రిటిషు ఇండియా
మరణం మార్చి 23, 1931 (వయసు 23)
లాహోరు, పంజాబ్, బ్రిటిషు ఇండియా<
జాతీయత భారతీయుడు
సంస్థ నౌజవాన్ భారత్ సభ, కీర్తి కిసాన్ పార్టీ మరియు హిందుస్తాన్ సోషియలిస్టు రిపబ్లికన్ అసోసియేషన్
రాజకీయ ఉద్యమం భారత స్వాతంత్ర్యోద్యమం
మతం నాస్తికుడు

భగత్ సింగ్ ఉరిని తెలుపుతూ ది ట్రిబ్యూన్ మొదటి పేజి 

భగత్ సింగ్ (పంజాబీ: ਭਗਤ ਸਿੰਘ بھگت سنگھ, (సెప్టెంబరు 28, 1907[1]మార్చి 23, 1931) స్వాతంత్ర్య సమర యోధుడు, ప్రఖ్యాత ఉద్యమకారుడు.భారత స్వాతంత్ర్యోద్యమమునకు పోరాడిన అత్యంత ప్రభావశీల విప్లవకారులల్లో ఆయన ఒకరు. ఈ కారణంగానే 'షహీద్ భగత్ సింగ్ గా కొనియాడబడతాడు'. చరిత్రకారుడు కె.ఎన్. పనిక్కర్ ప్రకారం భగత్ సింగ్,భారతదేశంలో ఆరంభ మార్కిస్టు. [2] భగత్ సింగ్ హిందుస్తాన్ సోషియలిస్టు రిపబ్లికన్ పార్టీ స్థాపక సభ్యుల్లో ఒకడు. ఇప్పుడు పాకిస్తాన్‌లో ఉన్న లాయల్ జిల్లా బంగా గ్రామంలో కిషన్ సింగ్, విద్యావతి దంపతులకు భగత్ సింగ్ జన్మించాడు. భారత్‌లో బ్రిటీషు పాలనను వ్యతిరేకిస్తూ విప్లవాత్మక ఉద్యమాలను చేపట్టిన కుటుంబంలో ఆయన జన్మించాడు. యుక్త వయస్సులోనే ఐరోపా విప్లవ ఉద్యమాలను చదివిన సింగ్ అరాజకవాదం మరియు సామ్యవాదమునకు ఆకర్షితుడయ్యాడు.[3] అనేక విప్లవాత్మక సంస్థల్లో ఆయన చేరాడు. హిందూస్తాన్ గణతంత్ర సంఘం (HRA)లో ఒక్కో మెట్టెక్కుతూ అనతికాలంలోనే అందులోని నాయకుల్లో ఒకరుగా ఎదిగిన ఆయన ఆ తర్వాత దానిని హిందూస్తాన్ సామ్యవాద గణతంత్ర సంఘం (HSRA)గా మార్చాడు. భారత మరియు బ్రిటన్ రాజకీయ ఖైదీలకు సమాన హక్కులు కల్పించాలని డిమాండ్ చేస్తూ జైలులో 64 రోజుల నిరాహారదీక్షను చేపట్టడం ద్వారా సింగ్‌ విపరీతమైన మద్దతును కూడగట్టుకున్నాడు. ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు లాలా లజ్‌పత్ రాయ్ హత్య నేపథ్యంలో ఒక పోలీసు అధికారిని కాల్చినందుకు ఆయన్ను ఉరితీశారు. ఆయన ఉత్తరదాయిత్వం భారత స్వాతంత్ర్య సిద్ధికి పోరాడేలా భారత యువతను ప్రేరేపించింది. అంతేకాక భారత్‌లో సామ్యవాద వ్యాప్తి మరింత పుంజుకుంది.[4]

  • బాల్యం, జీవితం
భగత్ సింగ్ పంజాబ్‌లోని లాయల్‌‌పూర్ జిల్లా, బంగా సమీపంలోని ఖత్కర్ కలాన్ గ్రామంలో సర్దార్ కిషన్ సింగ్ మరియు విద్యావతి దంపతులకు పుట్టిన సంధు ఝాట్[3] కుటుంబీకుడు.[5] భగత్ అనే పదానికి "భక్తుడు" అని అర్థం. సింగ్‌ యొక్క దేశభక్త సిక్కు కుటుంబంలోని కొందరు భారత స్వాతంత్ర్యోద్యమాల్లోనూ మరికొందరు మహారాజా రంజిత్ సింగ్ సైన్యంలోనూ పనిచేశారు.[6] భగత్ సింగ్ మూడేళ్ళ పిల్లాడిగా ఉన్నప్పుడు అతని తండ్రి కిషన్ సింగ్ భగత్ సింగ్‌ను చంకకెత్తుకొని, తన స్నేహితుడు నందకిశోర్ మెహతాతో పాటు కొత్తగా వేస్తున్న తోటను చూడ్డానికి పొలాల్లోకి వెళ్ళాడు. వెంటనే కిందికి దిగిన భగత్ సింగ్ ఆ మట్టిలో ఆడుకుంటూనే చిన్న చిన్న గడ్డిపరకలను నాటడం మొదలు పెట్టాడు. తండ్రి " ఏం చేస్తున్నావ్ నాన్నా" అని ప్రశ్నిస్తే, భగత్ సింగ్ ఇచ్చిన జవాబు విని వాళ్ళు అవాక్కయ్యారు. భగత్ సింగ్ అన్న మాటలివి " తుపాకులు నాటుతున్నా". భవిష్యత్తుకు బాల్యమే మొలక. మొలకలు వేసే వయస్సులో తుపాకులను మొలకెత్తించాలని చూడడం అతని వ్యక్తిత్వానికి మచ్చుతునక. విద్యార్థి దశలో స్కూల్లో కూడా ఆటపాటల్లోనే కాదు అందరితో కలివిడిగా ఉండేవాడు భగత్ సింగ్. బాబాయి సర్దార్ అజిత్ సింగ్ ఆంగ్లేయులతో పోరాడుతూ విదేశాల్లో ఉంటున్న సమయంలో, కంట నీరు పెట్టుకొనే చిన్నమ్మ హర్నామ్ కౌర్ ను చూసి నాలుగేళ్ళ భగత్ సింగ్ " పిన్నీ ఏడవొద్దు. నేను ఆంగ్లేయులపై ప్రతీకారం తీర్చుకుంటా" అని ప్రతిజ్ఞలు చేసేవాడు. స్వామి దయానంద సరస్వతి అనుచరుడైన సింగ్ తాత అర్జున్ సింగ్ హిందూ సంస్కరణ ఉద్యమం, ఆర్యసమాజ్‌[7]లో భాగం కావడం కూడా ఆయనపై విపరీతమైన ప్రభావం పడేందుకు దోహదపడింది. ఆయన పినతండ్రులు అజిత్ సింగ్, స్వరణ్ సింగ్ తండ్రులు కర్తార్ సింగ్ సారభా గ్రివాల్ మరియు హర్ దయాల్ నేతృత్వంలోని గద్దర్ పార్టీ సభ్యులే. తనపై ఉన్న అపరిష్కృత కేసుల కారణంగా అజిత్ సింగ్ పెర్సియాకు పారిపోగా, కకోరి రైలు దోపిడీ 1925లో హస్తముందంటూ స్వరణ్ సింగ్‌ను 19 డిసెంబరు 1927న ఉరితీశారు.[8] బ్రిటీషు సంస్థల యెడల పాఠశాల అధికారులకు ఉన్న విధేయత ఆయన తాతకు నచ్చకపోవడంతో భగత్ తన వయస్సు సిక్కులు వలె లాహోర్‌లోని ఖల్సా ఉన్నత పాఠశాలకు హాజరు కాలేదు.[9] బదులుగా ఆర్యసామాజిక పాఠశాల దయానంద్ ఆంగ్లో వేదిక్ ఉన్నత పాఠశాలలో భగత్‌ను ఆయన తండ్రి చేర్పించాడు.[10] 13 ఏళ్ల ప్రాయంలోనే మహాత్మా గాంధీ సహాయ నిరాకరణోద్యమానికి సింగ్ ప్రభావితుడయ్యాడు. ఆ సమయంలో బ్రిటీష్ ప్రభుత్వానికి ఎదురుతిరిగిన భగత్ ప్రభుత్వ పాఠశాల పుస్తకాలు మరియు బ్రిటీషు దిగుమతి దుస్తులను తగులబెట్టడం ద్వారా గాంధీ సిద్ధాంతాలను అనుసరించాడు. ఉత్తరప్రదేశ్‌లోని చౌరీ చౌరా గ్రామస్తులు పోలీసులను హింసాత్మకంగా హతమార్చిన నేపథ్యంలో ఉద్యమాన్ని గాంధీ ఉపసంహరించుకున్నాడు. ఆయన అహింసావాదంపై అసంతృప్తి చెందిన సింగ్ యువ విప్లవోద్యమంలో చేరి, తెల్లదొరలకు వ్యతిరేకంగా హింసాత్మక ఉద్యమాన్ని ఉధృతం చేశాడు.[11]
1923లో పంజాబ్ హిందీ సాహిత్య సమ్మేళన్ నిర్వహించిన వ్యాసరచనా పోటీలో భగత్ విజయం సాధించాడు. దాంతో పంజాబ్ హిందీ సాహిత్య సమ్మేళన్ ప్రధాన కార్యదర్శి ప్రొఫెసర్ భీమ్ సేన్ విద్యాలంకార్ సహా పలువురు సభ్యుల దృష్టిని ఆకర్షించాడు. ఆ వయసులోనే ప్రముఖ పంజాబీ సాహిత్యాన్ని ఉటంకించడమే కాక పంజాబ్ సమస్యల ను ప్రస్తావించాడు. పంజాబీ రచయితలు మరియు సియోల్‌కోట్‌కు చెందిన తనకెంతో ఇష్టమైన కవి అల్లామా ఇక్బాల్ రాసిన పలు కవితలు, సాహిత్యాన్ని ఆయన పఠించాడు.[12] యుక్త వయస్సులో ఉన్నప్పుడు భగత్ సింగ్ లాహోర్‌[13]లోని నేషనల్ కాలేజ్‌లో విధ్యనభ్యసించాడు. అప్పుడే పెళ్లి చేసుకోవడం ఇష్టంలేని ఆయన ఇల్లు విడిచి పారిపోయి నౌజవాన్ భారత్ సభ ("భారత యువ సంఘం")లో చేరాడు.[3] నౌజవాన్ భారత్ సభ ద్వారా భగత్ ఆయన సహ విప్లవకారులు యువత దృష్టిని ఆకర్షించారు. ప్రొఫెసర్ విద్యాలంకార్ విజ్ఞప్తి మేరకు అప్పట్లో రామ్‌ప్రసాద్ బిస్మిల్ మరియు అష్ఫాఖుల్లా ఖాన్ నాయకత్వం వహిస్తున్న హిందూస్తాన్ గణతంత్ర సంఘంలోనూ సింగ్ చేరాడు.[citation needed] కకోరి రైలు దోపిడీ గురించి ఆయనకు అవగాహన ఉందని భావించారు. ఆయన అమృత్‌సర్ నుంచి ప్రచురించబడిన ఉర్దూ మరియు పంజాబీ వార్తాపత్రికలలో వార్తలను వ్రాశాడు మరియు సరిదిద్దాడు.[14] సెప్టెంబరు 1928లో దేశవ్యాప్తంగా ఉన్న అనేక మంది విప్లవకారులు కీర్తి కిసాన్ పార్టీ పేరుతో ఢిల్లీలో జరిగిన సమావేశంలో పాల్గొన్నారు. దానికి భగత్ సింగ్ కార్యదర్శిగా వ్యవహరించాడు. అనంతరం సంఘం అధ్యక్షుడిగా భగత్ పలు విప్లవాత్మక కార్యక్రమాలు చేపట్టాడు. HRA ప్రధాన నాయకులను పట్టుకుని ఉరితీయబడిన కారణంగా ఆయన తన సహ విప్లవకారుడు సుఖ్‌దేవ్ థాపర్‌తో పాటు అనతికాలంలోనే ప్రత్యేక అధికారాన్ని చేజిక్కుంచుకోవడానికి కారణమైంది.
ఉరిశిక్ష ఖాయమన్న సంగతి తెలిసిన తర్వాతే కాదు అంతకు ముందు నుంచి కూడా కటకటాల వెనకాల భగత్ సింగ్ ఒక అధ్యయనశీలిగా కాలాన్ని గడిపాడు. రాజనీతి, అర్థశాస్త్రం, సామాజిక శాస్త్ర విషయాలను ప్రబోధించే అనేక గ్రంథాలను ఆయన అధ్యయనం చేశాడు. పుస్తకం చదువుతూ మధ్యలో హఠాత్తుగా లేచి అటూ ఇటూ తిరుగుతూ, విప్లవకారుడు రాంప్రసాద్ భిస్మిల్ వ్రాసిన ఈ పాటను పాడేవాడు.

మేరా రంగ్ దే బసంతీ చోలా
ఇసీ రంగ్ మే రంగ్ కే శివానే, మాకా బంధన్ ఖోలా
మేరా రంగ్ దే బసంతీ చోలా
యహీ రంగ్ హల్దీ ఘాటీ మే, ఖుల్ కర్కే థా ఖేలా
నవ్ బసంత్ మే, భారత్ కే హిత్ వీరోంకా యహ్ మేలా
మేరా రంగ్ దే బసంతీ చోలా
గంభీరమైన గొంతుతో భగత్ సింగ్ పాడుతున్న ఈ పాటను విని జైలు వార్డర్లు కూడా ముగ్ధులయ్యేవారు.

తదనంతర విప్లవాత్మక కార్యక్రమాలు

లాలా లజ్‌పత్ రాయ్ మరణం మరియు సాండర్స్ హత్య

1928లో భారత్‌లోని వర్థమాన రాజకీయ పరిస్థితిపై నివేదికను కోరుతూ సర్ జాన్ సైమన్ నేతృత్వంలో బ్రిటీష్ ప్రభుత్వం ఒక కమిషన్‌ను ఏర్పాటు చేసింది. అయితే కమిషన్ సభ్యుడిగా ఒక్క భారతీయుడిని కూడా నియమించకపోవడంతో భారత రాజకీయ పార్టీలు దానిని బహిష్కరించాయి. ఫలితంగా దేశవ్యాప్తంగా పలు నిరసన ప్రదర్శనలు వెల్లువెత్తాయి. 30 అక్టోబరు 1928న కమిషన్ లాహోర్‌‌ను సందర్శించినప్పుడు సైమన్ కమిషన్‌కు వ్యతిరేకంగా లాలా లజ్‌పత్ రాయ్ నేతృత్వంలో నిశ్శబ్ద అహింసా పద్ధతిలో ఒక నిరసన కార్యక్రమం జరిగింది. అయితే హింస తలెత్తడానికి పోలీసులు కారణమయ్యారు.[15] లాలా లజ్‌పత్ రాయ్‌ ఛాతీపై పోలీసులు లాఠీలతో కొట్టారు.[15] దాంతో ఆయన తీవ్రంగా గాయపడ్డారు.[15] ఈ సంఘటనను కళ్లారా చూసిన భగత్ సింగ్ ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకున్నాడు.[16] పోలీసు అధికారి స్కాట్‌ను హతమార్చడానికి విప్లవకారులు శివరామ్ రాజ్‌గురు, జై గోపాల్ మరియ సుఖ్‌దేవ్ థాపర్‌లతో ఆయన చేతులు కలిపాడు. స్కాట్‌ను గుర్తించిన జై పాల్ ఆయన్ను కాల్చమంటూ సింగ్‌కు సంకేతాలిచ్చాడు. అయితే పొరపాటు గుర్తింపు కారణంగా డీఎస్పీ J. P. సాండర్స్ కనిపించినప్పుడు సింగ్‌కు జై పాల్ సంకేతమిచ్చాడు. ఫలితంగా స్కాట్‌కు బదులు సాండర్స్ హతమయ్యాడు. దాంతో పోలీసుల కంట పడకుండా ఉండటానికి భగత్ లాహోర్‌ పారిపోయాడు. గుర్తు పట్టకుండా ఉండటానికి గడ్డాన్ని గీసుకోవడం, వెంట్రుకలు కత్తిరించుకోవడం ద్వారా సిక్కు మత విశ్వాసాల ఉల్లంఘనకు సింగ్ పాల్పడ్డాడు.

అసెంబ్లీలో బాంబు

విప్లవకారుల చర్యలను అణచివేసే దిశగా భారత రక్షణ చట్టమును తీసుకురావడం ద్వారా పోలీసులకు బ్రిటీష్ ప్రభుత్వం మరింత అధికారం కల్పించింది.[citation needed] భగత్ సింగ్ వంటి విప్లవకారులను అణచివేయడం ఈ చట్టం యొక్క ప్రధాన ఉద్ధేశ్యం. అయితే మండలిలో ఒక్క ఓటు తేడాతో ఈ చట్టం ఆమోదం పొందలేదు.[citation needed] ఆ తర్వాత ప్రజాహితం కోసమేనంటూ ప్రత్యేక శాసనం కింద ఈ చట్టాన్ని ఆమోదించారు. ఆయితే ఆ చట్టాన్ని వ్యతిరేకిస్తూ అది ఆమోదితం కానున్న కేంద్ర శాసనసభపై బాంబు పేలుడుకు హిందూస్తాన్ సామ్యవాద గణతంత్ర సంఘం వ్యూహరచన చేసింది. బాంబు పేలుడుకు భగత్ సింగ్ ప్రయత్నించకుండా మరో ప్రముఖ విప్లవకారుడు చంద్రశేఖర్ ఆజాద్ అడ్డుకున్నాడు. అయితే సింగ్ ఆశయాలను అంగీకరించే విధంగా మిగిలిన పార్టీ సభ్యులు ఆయనపై ఒత్తిడి తీసుకొచ్చారు. అసెంబ్లీపై భగత్ సింగ్‌తో పాటు మరో విప్లవకారుడు బటుకేశ్వర్ దత్‌ను బాంబు దాడికి ఎంచుకున్నారు.[citation needed]

8 ఏప్రిల్ 1929న అసెంబ్లీ వసారాలపై సింగ్ మరియు దత్‌లు బాంబు విసిరి, "ఇంక్విలాబ్ జిందాబాద్! " అని నినదించారు. ("విప్లవం వర్థిల్లాలి!").[17] దీని తర్వాత వినికిడి శక్తి కోల్పోయేలా గొంతెత్తి అరుస్తామని ముద్రించబడిన పలు కరపత్రాలను వెదజల్లారు.[18] బాంబు దాడి వల్ల ఏ ఒక్కరూ మరణించడం గానీ గాయపడటం గానీ జరగలేదు. తమ వ్యూహంలో భాగంగా ఉద్ధేశ్యపూర్వకంగానే జాగ్రత్తలతో దాడి చేసినట్లు సింగ్, దత్ అంగీకరించారు. బాంబు గాయపరిచేటంత శక్తివంతమైంది కాదని బ్రిటీష్ ఫోరెన్సిక్స్ విచారణాధికారులు కూడా తేల్చిచెప్పారు. వాస్తవానికి బాంబు జనాలకు దూరం గా విసరబడింది.[citation needed] బాంబు దాడి తర్వాత సింగ్, దత్ ఇద్దరూ లొంగిపోయారు.[citation needed] 12 జూన్ 1929న సింగ్ మరియు దత్‌ 'జీవితకాల దేశ బహిష్కరణ'కు గురయ్యారు.

విచారణ మరియు ఉరి

సింగ్ అరెస్టు అనంతరం అసెంబ్లీ పేలుడుపై విచారణ నేపథ్యంలో J. P. సాండర్స్ హత్య వెనుక ఆయన హస్తంపై బ్రిటీష్ ప్రభుత్వం ఆరా తీసింది. హత్యకు సంబంధించి భగత్ సింగ్, రాజ్‌గురు మరియు సుఖ్‌దేవ్‌లపై అభియోగాలు మోపారు. భారత స్వాతంత్ర్యానికి తన గళాన్ని వినిపించుకునేందుకు కోర్టునే ఒక ప్రచార వేదికగా మలుచుకోవాలని భగత్ సింగ్ నిర్ణయించుకున్నాడు.[citation needed] హత్యా నేరాన్ని అంగీకరించిన ఆయన విచారణ సమయంలో బ్రిటీష్ పాలనకు వ్యతిరేకంగా ప్రకటనలు చేశాడు.[citation needed] విచారణ సమయంలో HSRA సభ్యులు లేకుండా కేసు విచారణ కొనసాగించాలని ఆదేశించారు. తద్వారా సింగ్ తన భావాలను ఇక ఎప్పుడూ ప్రచారం చేయలేడనే ఆవేదనతో ఆయన మద్దతుదారులు తీవ్రంగా మండిపడ్డారు.

ఖైదీలు మరియు విచారణ ఖైదీల హక్కుల కోసం భగత్ సింగ్ మరియు ఇతర ఖైదీలు జైలులోనే నిరాహారదీక్ష చేపట్టారు. చట్టం ప్రకారం ఉత్తమ హక్కులు కల్పించాల్సిన భారత రాజకీయ ఖైదీల కంటే బ్రిటీష్ హంతకులు మరియు దొంగలకు ప్రాధాన్యత ఇవ్వడం దీక్షకు దారితీసింది. రాజకీయ ఖైదీలకు పౌష్టికాహారం, పుస్తకాలు, దినపత్రికల సదుపాయం, మంచి బట్టలు, టాయిలెట్ ఇతర దైనందిన సదుపాయాలు కల్పించడం వారి డిమాండ్లు. అలాగే కార్మిక లేదా హోదాకు తగని పనిచేసే విధంగా రాజకీయ ఖైదీలపై ఒత్తిడి తీసుకురాకూడదని సింగ్ డిమాండ్ చేశాడు.[19] 63 రోజుల పాటు కొనసాగిన నిరాహారదీక్ష సింగ్ డిమాండ్లకు బ్రిటీష్ ప్రభుత్వం తలొగ్గడం ద్వారా ముగిసింది. తద్వారా ఆయనకు సాధారణ భారతీయుల్లో ఆదరణ పెరిగింది. దీక్షకు ముందు ఆయన ప్రాభవం ప్రధానంగా పంజాబ్ ప్రాంతం వరకే పరిమితమైంది.[20]
కేంద్ర శాసనసభపై బాంబు దాడి జరిగినప్పుడు[21] అక్కడున్న రాజకీయ నాయకుల్లో ఒకరైన మహ్మద్ అలీ జిన్నా లాహోర్ ఖైదీలకు బహిరంగంగానే తన సానుభూతి తెలిపాడు. నిరాహారదీక్షపై మాట్లాడుతూ "నిరాహారదీక్ష చేసే వ్యక్తిలో ఆత్మ ఉంటుంది. ఆ ఆత్మతోనే తను ముందుకు సాగుతాడు. తన పోరాటానికి న్యాయం జరుగుతుందని విశ్వసిస్తాడు" అని వ్యాఖ్యానించాడు. సింగ్ చర్యలపై మాట్లాడుతూ, "ఏదేమైనప్పటికీ, వారిని ఎక్కువగా నిందించినా మరియు ఎక్కువగా చెప్పినా వారు తప్పుదోవ పడుతారు. తద్వారా ఏర్పడే పాలనా ధిక్కార వ్యవస్థను ప్రజలు చీదరిస్తారు" అని అన్నాడు.[22]
డైరీని వ్రాసే అలవాటు ఉన్న భగత్ సింగ్‌ చివరకి 404 పుటలను నింపాడు. తాను సమర్థించే పలువురు ప్రముఖుల ఉల్లేఖనాలు మరియు వారి గొప్ప వాక్యాలకు సంబంధించి సింగ్ తన డైరీలో పలు సూచనలు చేశాడు. అందులో కార్ల్ మార్క్స్ మరియు ఫ్రెడ్రిచ్ ఏంజిల్స్ ఆలోచనలను ప్రముఖంగా ప్రస్తావించాడు.[23] భగత్ సింగ్ డైరీలోని పలు వ్యాఖ్యలు ఆయన విశిష్టమైన దార్శనిక అవగాహనకు అద్దం పడుతాయి.[24] "దేవుడిపై విశ్వాసం లేని అహంకారి అనిపించుకున్న సింగ్ మరణానికి ముందు కూడా నేను ఎందుకు నాస్తికుడయ్యాను?" అనే శీర్షికతో ఒక వ్యాసాన్ని రాశాడు.[citation needed] .
23 మార్చి 1931న భగత్ సింగ్‌తో పాటు ఆయన సహచరులు రాజ్‌గురు మరియు సుఖ్‌దేవ్‌లను లాహోర్‌లో ఉరితీశారు. సింగ్ ఉరిని వ్యతిరేకిస్తూ నిరసన చేపడుతున్న ఆయన మద్దతుదారులు ఆయన్ను ఆ క్షణమే షహీద్ లేదా అమరవీరుడుగా ప్రకటించారు.[25] అప్పటి సూపరింటిండెంట్ ఆఫ్ పోలీస్ V.N. స్మిత్ ప్రకారం, సింగ్‌ను ముందుగానే ఉరితీశారు:
సాధారణంగా ఉదయం 8 గంటలకు ఉరితీశారు. అయితే ఏమి జరిగిందో ప్రజలు తెలుసుకునే లోగానే ఆయన్ను ఉరితీయాలని నిర్ణయించారు...సుమారు రాత్రి 7 గంటల ప్రాంతంలో జైలు లోపల నుంచి ఇంక్విలాబ్ జిందాబాద్ అంటూ నినాదాలు వినిపించాయి. సింగ్‌ జీవితానికి చివరగా తెర దించబోతున్నారన్న విషయానికి అది సంకేతమయింది.[26]
సట్లెజ్ నది ఒడ్డున ఉన్న హుస్సేనివాలా వద్ద సింగ్‌‌ను దహనం చేశారు. భగత్ సింగ్ స్మారకచిహ్నం నేడు భారత స్వాతంత్ర్య సమరయోధులను గుర్తుకు తెస్తుంది.[25]

ఆదర్శాలు-అభిప్రాయాలు

భగత్ సింగ్ అరాజకవాదం మరియు సామ్యవాదమునకు ఆకర్షితుడయ్యాడు.[3] సామ్యవాదం మరియు పాశ్చాత్య అరాజకవాదాల ప్రభావం ఆయనపై ఉంది. కార్ల్ మార్క్స్, ఫ్రెడ్రిచ్ ఏంజిల్స్, వ్లాదిమిర్ లెనిన్, లియాన్ ట్రాట్‌స్కై మరియు మిఖాయిల్ బకునిన్‌ల ప్రవచనాలను ఆయన చదివాడు.[27][28] గాంధేయవాదంపై భగత్ సింగ్‌కు నమ్మకం లేదు. గాంధేయవాద రాజకీయాల వల్ల స్వార్థపరులు పుట్టుకొస్తూనే ఉంటారని ఆయన అభిప్రాయం.[29] సింగ్ ఒక నాస్తికుడు. నేను ఎందుకు నాస్తికుడయ్యాను? అనే వ్యాసం ద్వారా ఆయన నాస్తికత్వాన్ని ప్రచారం చేశాడు.
ఐర్లాండ్ విప్లవకారుడు టెరెన్స్ మాక్‌స్వినే రచనలను కూడా భగత్ సింగ్ కొనియాడేవాడు. తన కుమారుడిని క్షమించమంటూ భగత్ సింగ్ తండ్రి బ్రిటీష్ ప్రభుత్వాన్ని అభ్యర్థించినప్పుడు, టెరెన్స్ మాక్‌స్వినే మాటలను సింగ్ ఉటంకించాడు. "నా విడుదల కన్నా నా మరణం బ్రిటీష్ సామ్రాజ్యాన్ని కూలదోయగలదని నా విశ్వాసం" అని చెప్పి, పిటిషన్‌ను ఉపసంహరించుకోవాలని తన తండ్రికి సూచించాడు.
"బ్లడ్ స్ప్రింక్లెడ్ ఆన్ ది డే ఆఫ్ హోలీ బాబర్ అకాలిస్ ఆన్ ది క్రుకిఫిక్స్" వంటి ఆయన రాసిన పలు రచనలు ధరమ్ సింగ్ హయత్‌పూర్‌‌ పోరాటం చేత ప్రభావితమయ్యాయి.
అసెంబ్లీ పై బాంబు విసిరేసిన సంఘటనకి కాస్త ముందుగా తన సహచరుడు సుఖ్‌దేవ్‌కు వ్రాసిన లేఖలో భగత్ సింగ్ " నాకూ ఆశలూ, ఆంక్షలూ ఉన్నాయి. ఆనందమైన జీవనం గడపాలని ఉంది. అయితే అవసరమొచ్చినప్పుడు వీటన్నిటినీ త్యజించగలను. ఇదే అసలైన బలిదానం."

ప్రభావాలు

భగత్ సింగ్ అరాజకవాదం(అనార్కిజం), సామ్యవాదం(కమ్యునిజం) అనే భావనలకు ఆకర్షితుడయ్యాడు. బకునిన్, మార్క్స్, లెనిన్ మరియు ట్రాట్స్కి ల రచనలంటే భగత్ కి చాలా ఇష్టం. అహింస, సత్యాగ్రహాలను బోధించే గాంధేయవాదం మీద భగత్ కి నమ్మకం ఉండేదికాదు. గాంధేయవాదం దోపిడిదారుల్ని మారుస్తుందే కానీ, దోపిడీ నుంచి విముక్తి కల్పించదని భగత్ విశ్వసించేవాడు.

అరాజకవాదం(అనార్కిజం)

1928 మే-సెప్టెంబరు మధ్యకాలంలో అరాజకత్వంపై పంజాబీ వార్తాపత్రిక కీర్తి లో వరుసగా అనేక కథనాలను భగత్ సింగ్ ప్రచురించాడు.[3] అరాజకవాద తత్వాన్ని ప్రజలు సరిగా అర్థం చేసుకోకపోవడం పట్ల ఆయన ఆందోళన వ్యక్తం చేశాడు. అరాజకత్వంపై సద్భావం ఏర్పడేందుకు ఆయన ప్రయత్నించాడు. "అరాజకత్వం అనే పదానికి ప్రజలు భయపడుతున్నారు" అని ఆయన పేర్కొన్నాడు. అరాజకత్వం అనే పదం ఎక్కువగా దూషించబడుతోందని, భారత్‌లోని విప్లవకారులను సైతం అరాజకులుగా పిలుస్తూ వారిని భ్రష్ఠు పట్టిస్తున్నారని ఆవేదన చెందాడు. అరాజకత్వమంటే పాలకుడు లేకపోవడం మరియు ప్రభుత్వ రద్దు అనే అర్థమే తప్ప పరిపాలన ఉండదని కాదని సింగ్ పేర్కొంటూ, "భారత్‌లో విశ్వజనీన సహోదరత్వం అంటే సంస్కృతంలో చెప్పినట్లుగా వసుధైక కుటుంబం మొదలైనవి...ఒకే అర్థాన్ని కలిగి ఉన్నాయి" అని వివరించాడు. అరాజకత్వం వ్యాప్తి గురించి సింగ్ తెలుపుతూ, "అరాజకత్వ సిద్ధాంతం గురించి విస్తృతంగా ప్రచారం చేసిన తొలి వ్యక్తి ప్రౌధన్. అందువల్లే ఆయన్ను అరాజకత్వ వ్యవస్థాపకుడని పిలుస్తారు. ఆయన తర్వాత రష్యాకి చెందిన బకునిన్ ఆరాజకత్వ వ్యాప్తికి విపరీతంగా పాటుబడ్డాడు. తర్వాత ప్రిన్స్ క్రోపోట్‌కిన్ తదితరులు తమ వంతు కృషి చేశారు" అని వివరించాడు.[3]
అరాచకత్వములను కథనం ద్వారా సింగ్ వివరించాడు
The ultimate goal of Anarchism is complete independence, according to which no one will be obsessed with God or religion, nor will anybody be crazy for money or other worldly desires. There will be no chains on the body or control by the state. This means that they want to eliminate: the Church, God and Religion; the state; Private property.[3]

మార్క్సిజం

మార్క్సిజం వల్ల కూడా భగత్ సింగ్ ఎక్కువగా ప్రభావితుడయ్యాడు. భారత్‌లోని ప్రథమ మార్క్సిస్టుల్లో సింగ్ ఒకడని భారత చరిత్రకారుడు K. N. పనిక్కర్ అభివర్ణించాడు.[29] 1926 మొదలుకుని భారత్ మరియు విదేశాల్లోని విప్లవోద్యమ చరిత్రను భగత్ సింగ్ చదివాడు. తన జైలు పుస్తకాల్లో లెనిన్ (సామ్రాజ్యవాదం పెట్టుబడిదారీ వ్యవస్థకు పరాకాష్ట అని) మరియు విప్లవంపై ట్రోట్‌స్కై ఉల్లేఖనాలను సింగ్ ఉపయోగించాడు.[3] ఆఖరి కోరిక ఏంటని అడిగితే, లెనిన్ జీవితచరిత్రను చదువుతున్నానని, చనిపోయే లోగా దానిని పూర్తి చేయాలని ఉందని సింగ్ తన లిఖిత పత్రాల్లో పేర్కొన్నాడు. [30]మార్క్సిజం ఆదర్శాలను నమ్మినప్పటికీ భగత్ సింగ్ భారత కంమ్యూనిస్టు పార్టీ లో చేరలేదు.

నాస్తికత్వం

యుక్త వయస్సులో ఉన్నప్పుడు ఆర్యసమాజ్ పట్ల సింగ్ అత్యంత భక్తిశ్రద్ధలతో ఉండేవాడు.[citation needed] అయితే సహాయ నిరాకరణ ఉద్యమాన్ని గాంధీ ఉపసంహరించుకున్నాక హిందూ-ముస్లింల మధ్య కలహాలు తలెత్తడం కళ్లారా చూసిన తర్వాత మత సిద్ధాంతాలను విమర్శించడం మొదలుపెట్టాడు.[31] బ్రిటీష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తొలుత సంఘటితంగా పోరాడిన ఇరు వర్గాల సభ్యులు మతపరమైన విభేదాలతో ఎలా కలహించుకోగలిగారో ఆయనకు అర్థం కాలేదు. విప్లవకారుల స్వాతంత్ర్యోద్యమ పోరాటానికి మతం అడ్డుగోడగా నిలుస్తోందని గ్రహించిన సింగ్ ఆ క్షణాన మత విశ్వాసాలను విడనాడాడు. అనంతరం నాస్తిక విప్లవకారులైన బకునిన్, లెనిన్, ట్రోట్‌స్కై ఉద్యమాలను అధ్యయనం చేయడం మొదలుపెట్టాడు. "రహస్యవాద నాస్తికత్వం" గురించి తెలిపే నిరాలంబ స్వామి[32] రచించిన కామన్ సెన్స్‌ అనే పుస్తకంపై కూడా ఆయన ఆసక్తి కనబరిచాడు.[33]
1931లో జైల్లో ఉండగా, నాస్తికవాద తత్వాన్ని వివరిస్తూ నేను ఎందుకు నాస్తికుడి ని అంటూ ఒక వ్యాసం రాశాడు. జైలులో ఉండగా మతం మరియు దేవుడి పట్ల విశ్వాసం లేని వ్యక్తిగా సహచర విప్లవకారులు తనను విమర్శించిన కారణంగా ఆ వ్యాసం రాశాడు. అందులో తనను అహంకారి అనడంపై కూడా సింగ్ ప్రస్తావించాడు. సొంత విశ్వాసాలను గౌరవించే సింగ్ సర్వశక్తి సంపన్నుడి పట్ల దృఢ విశ్వాసినని చెప్పేవాడు. అయితే ఇతరుల హృదయాలకు దగ్గరగా ఉండే కల్పిత గాథలు మరియు విశ్వాసాలను నమ్మే స్థాయికి తాను దిగజారబోనని స్పష్టం చేశాడు. మతం చావును సులభతరం చేస్తుందనే వాస్తవాన్ని గుర్తించానని అయితే నిరూపితం కాని ఆ తత్వం మానవ బలహీనతకు సంకేతమని తన వ్యాసంలో సింగ్ పేర్కొన్నాడు.[34]

మరణం

బలిదానం ద్వారా అమరవీరుడుగా భగత్ సింగ్ గుర్తింపు పొందాడు. చిన్న వయస్సులో ఉన్నప్పుడు కర్తార్ సింగ్ సారభా ఆయన గురువు.[35] అమరవీరుడుగా భావించే లాలా లజ్‌పత్ రాయ్ మరణానికి ప్రతీకారం తీర్చుకోవడం ద్వారా సింగ్ తనను తాను అమరవీరుడుగా భావించేవాడు. 9 ఏప్రిల్ 1929న కేంద్ర శాసనసభపై విసిరిన కరపత్రంలో ఆయన ఈ విధంగా పేర్కొన్నాడు: వ్యక్తులను చంపడం సులభమైనప్పటికీ సిద్ధాంతాలను సమాధి చేయలేరు . గొప్ప సామ్రాజ్యాలు కూలిపోయినా సిద్ధాంతాలు మాత్రం సజీవంగానే ఉన్నాయి .[36] రష్యా విప్లవ అధ్యయనాలు మొదలుపెట్టాక, ఆయన చనిపోవాలనుకున్నాడు. తన మరణం వల్ల యువత ప్రేరేపితులై తెల్లదొరలపై సంఘటితంగా తిరగబడతారని ఆయన భావించాడు.
తమను యుద్ధ ఖైదీలుగా గుర్తించడం ద్వారా ఉరితీయకుండా కాల్పుల బృందం చేత హతమార్చాలని జైలులో ఉన్నప్పుడు భగత్ సింగ్‌ మరియు మరో ఇద్దరు వైస్రాయికి లేఖ రాశారు. క్షమాభిక్ష ముసాయిదా లేఖపై సంతంకం కోసం భగత్ సింగ్‌ మిత్రుడు ప్రన్నత్ మెహతా ఆయన్ను ఉరితీయడానికి నాలుగు రోజుల ముందు మార్చి 20న జైలులో కలిశాడు. అయితే సంతకం చేయడానికి సింగ్ నిరాకరించాడు. [37]

ఆఖరి కోరిక

తాను (భగత్ సింగ్) "తీవ్రమైన ఒత్తిడి పరిస్థితులలోనే తలవెంట్రుకలు కత్తిరించుకోవడం, గడ్డం గీసుకోవడం" జరిగింది. "దేశ సేవ కోసమే అదంతా" . తన సహచరులు "సిక్కు రూపాన్ని మార్చుకునే విధంగా ఒత్తిడి చేశారు" దానికి తోడు ఆయన "తలవంపులు తెచ్చాడని" ఆయన జైలు సహచరుడు, ఘదార్ విప్లవకారుడు, సిక్కు వర్గంలో ప్రముఖుడు రణ్‌ధీర్ సింగ్‌మూస:Discuss‌తో భగత్ సింగ్ అన్నట్లు తెలిసింది.[38] రణ్‌‌ధీర్ సింగ్ సహా పంచ్ ప్యారే నుంచి అమృత్‌ను పొందాలని మరియు పంచ్ కకార్‌ను భర్తీ చేయడం కోసం తనను ఉరితీయడానికి ముందు ఆఖరి కోరికగా సింగ్ చెప్పినట్లు తెలిసింది.[39][40] అయితే పంచ్ ప్యారే నుంచి అమృత్‌ పొందాలన్న ఆయన ఆఖరి కోరికకు బ్రిటీష్ ప్రభుత్వం అంగీకరించలేదు.[40]
ఈ సంఘటనలను రణ్‌ధీర్ సింగ్ తనకు తానుగా విస్తృతంగా చర్చించడం పలు ప్రశ్నలను లేవదీసింది. రణ్‌ధీర్‌తో సమావేశం కారణంగానే "నేను ఎందుకు నాస్తికుడనయ్యాను?" అనే ప్రముఖ వ్యాసాన్ని భగత్ సింగ్ రాశాడని కొందరు పండితులు ఆరోపించారు.

పన్నాగ సిద్ధాంతాలు

సింగ్‌కు సంబంధించి ప్రత్యేకించి ఆయన మరణం చుట్టూ నెలకొన్న సంఘటనల వెనుక అనేక పన్నాగ సిద్ధాంతాలు ఉన్నాయి.

మహాత్మా గాంధీ

సింగ్‌ను ఉరితీయకుండా ఆపే అవకాశం మహాత్మా గాంధీకి ఉండటం చాలా ముఖ్యమైన అంశాల్లో ఒకటి. అయితే ఆయన అలా చేయలేదు. భగత్ సింగ్‌ పట్ల విచిత్ర వైఖరితో వ్యవహరించిన మరియు ఆయన ఉరిని వ్యతిరేకించని వ్యక్తిగా గాంధీని చూపిన ది లెజెండ్ ఆఫ్ భగత్ సింగ్ వంటి పలు చిత్రాలు విడుదల తర్వాత ఈ ప్రత్యేక వాదం ఆధునిక ప్రజల్లో బాగా వ్యాపించింది.[41] అయితే సింగ్‌ను ఉరితీసేలా బ్రిటీష్ ప్రభుత్వంతో కలిసి గాంధీ కుట్రపన్నాడనేది మరో భిన్న వాదం. ఈ రెండు వాదాలు కూడా సందేహాస్పదంగానూ మరియు వివాదాస్పదంగానూ మారాయి. సింగ్‌ను ఉరి నుంచి తప్పించడానికి గానీ లేదా శిక్షను తగ్గించడానికి బ్రిటీషు ప్రభుత్వంతో గాంధీకి అంతగా సాన్నిహిత్యం లేదనేది ఆయన అనుచరుల వాదన. అంతేకాక స్వాతంత్ర్యోద్యమంలో సింగ్ పాత్ర ఉద్యమ నాయకుడిగా గాంధీ పాత్రకు ఎలాంటి ముప్పు లేదు. అందువల్ల సింగ్ చనిపోవాలని గాంధీ కోరుకోవడానికి కారణం లేదని ఆయన అనుచరులు స్పష్టం చేశారు.
గాంధీ తన జీవితకాలంలో సింగ్ దేశభక్తిని సదా కీర్తించే వ్యక్తిగా నిలిచాడు. సింగ్ ఉరి (అంటే దానికి సంబంధించి సాధారణంగా మరణదండన అని)ని తాను వ్యతిరేకించానని, అయితే దానిని తప్పించడానికి తనకు అధికారం లేదని ఆయన ఉద్ఘాటించాడు. సింగ్ ఉరిపై గాంధీ ఇలా అన్నాడు, "ఇలాంటి వ్యక్తులను ఉరితీయడానికి ఈ ప్రభుత్వానికి కచ్చితంగా హక్కుంది. అయితే కొన్ని హక్కులు పేరుప్రఖ్యాతులతో మాత్రమే సంతోషంగా గడిపే వ్యక్తులకు మేలు కలిగిస్తాయి."[42] మరణదండనపై గాంధీ మరోసారి కూడా ఇలా అన్నాడు "ఎవరినైనా ఉరికంబం ఎక్కించాలంటే నా మనస్సాక్షి ఒప్పుకోదు. దేవుడు ఒక్కడే ప్రాణాన్ని తీసుకోగలడు ఎందుకంటే ఆయన మాత్రమే దానిని ప్రసాదిస్తాడు."
తన సత్యాగ్రహ ఉద్యమంలో సభ్యులు కాని 90,000 మంది రాజకీయ ఖైదీలను గాంధీ-ఇర్విన్ ఒప్పందం ద్వారా "రాజకీయ ఉద్రిక్తతకు ఉపశమనం" అనే కారణంతో విడుదలయ్యేలా గాంధీ చేయగలిగాడు. ఫ్రంట్‌లైన్ అనే భారత సంచికలో ప్రచురించిన కథనం ప్రకారం, 19 మార్చి 1931న వైస్రాయిని గాంధీ వ్యక్తిగతంగా కలవడం సహా భగత్ సింగ్, రాజ్‌గురు, సుఖ్‌దేవ్‌ల మరణశిక్షను తగ్గించమంటూ ఆయన పలుమార్లు విజ్ఞప్తి చేశాడు. అప్పటికే సమయం దాటి పోయిందన్న విషయం తెలియక ఉరి రోజున కూడా శిక్షను తగ్గించమంటూ వైస్రాయ్‌ని లేఖ ద్వారా ఆయన అభ్యర్థించాడు.[37]
వైస్రాయి లార్డ్ ఇర్విన్ చెప్పిన విషయం 
శిక్షను తగ్గించమని నా ఎదుట గాంధీ చేసిన అభ్యర్థన విన్నాను. అవసరమేంటనే దానిపై తొలుత నేను పరిశీలించాను. ఒక మతానికి చెందిన భక్తుల మేలు కోసం అహింసా దూత తప్పకుండా తన అభిమతానికి భిన్నంగా మరింత అక్కరగా ప్రార్థించాల్సి ఉంటుందని గ్రహించాను. అయితే రాజకీయ కారణాల వల్ల నా తీర్పును వెలువరచడం పూర్తిగా తప్పని భావించాను. చట్టం పరిధిలోని ఒక కేసుకు సంబంధించి, జరిమానా చాలా ప్రత్యక్షంగా అర్హత కలిగి ఉంటుందని నేను ఊహించలేకపోయాను.[37]

సాండర్స్ కుటుంబం

సమ్ హిడెన్ ఫ్యాక్ట్స్ : మార్టేర్డోమ్ ఆఫ్ షాహీద్ భగత్ సింగ్-సీక్రెట్స్ ఉన్ఫూర్లెడ్ బై యాన్ ఇంటలిజెన్స్ బ్యూరో ఏజెంట్ ఆఫ్ బ్రిటీష్-ఇండియా నిఘా సంస్థ ప్రతినిధి చేత రహస్యాల బహిర్గతం [[[sic]]] అనే శీర్షికతో K.S. కూనర్ మరియు G.S. సింధ్రా రాసిన పుస్తకం 28 అక్టోబరు 2005న విడుదలయింది. సింగ్, రాజ్‌గురు మరియు సుఖ్‌దేవ్‌లు అర్థ స్పృహకు చేరుకునే విధంగా వారి ముగ్గుర్ని ఉద్ధేశ్యపూర్వకంగానే ఉరితీశారు. తర్వాత వారిని జైలు బయటకు తీసుకెళ్లి సాండర్స్ కుటుంబం చేత చంపించారని సదరు పుస్తకం స్పష్టం చేసింది. అంతేకాక ఇదంతా "ఆపరేషన్ ట్రోజన్ హార్స్" పేరుతో జైలు కార్యంగా ఆరోపించింది. అయితే పుస్తకంలోని పలు విషయాలపై మేథావులు సందేహం వ్యక్తం చేస్తున్నారు.[43]

ఉత్తరదాయిత్వం

భారత స్వాతంత్ర్యోద్యమం

భగత్ సింగ్ మరణం భారత స్వాతంత్ర్యోద్యమ కొనసాగింపుకు సాయపడేలా వేలాది మంది యువకుల్లో స్ఫూర్తిని నింపింది. ఆయన ఉరి అనంతరం ఉత్తర భారతాన పలు ప్రాంతాల్లో బ్రిటీష్ ప్రభుత్వమునకు వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు వెల్లువెత్తాయి.

వారసత్వం

భారత స్వాతంత్ర్య సంగ్రామం

భగత్ సింగ్ మరణం ఊరికే వృథా కాలేదు, ఎందరో యువకులను భారత స్వాతంత్ర్యోద్యమము వైపుకు మరల్చింది. భగత్ సింగ్ ఉరి శిక్ష అమలు తరువాత ఉత్తర భారతదేశంలో ఎందరో యువకులు బ్రిటిషు ప్రభుత్వం మరియు గాంధీ కి విరుద్ధంగా ఆందోళనలు చేపట్టారు. [44]

స్మృతులు, సంగ్రహాలయాలు

భారత పార్లమెంట్‍లో విగ్రహం
15 ఆగస్ట్ 2008న 18 అడుగుల కాంస్య విగ్రహం భారత పార్లమెంటు లో ఇందిరా గాంధీ మరియు సుభాష్ చంద్ర బోస్ విగ్రహాల ప్రక్కన ఆవిష్కృతమయింది. [45] భారత పార్లమెంటులో భగత్ సింగ్ మరియు దత్తు యొక్క చిత్రపటాలు ఉన్నాయి.[46]
జాతీయోద్యమ వీరుల స్మారకం

భగత్ సింగ్, సుఖ్‍దేవ్ మరియు రాజ్‍గురుల స్మృతిలో హుసేన్‍వాలా వద్ద నిర్మించిన జాతీయోద్యమ వీరుల స్మారకం
ఇక్కడే భగత్‍సింగ్‍ భౌతిక కాయాన్ని దహనం చేసారు. ఇది విభజన సమయంలో పాకిస్తాన్‍లో ఉన్న హుసేన్‍వాలా(సత్లుజ్ నదీ తీరంలో) ఉంది. 17 జనవరి 1961 లో 12 గ్రామాలకు బదులుగా ఇది భారతదేశానికి మార్చబడింది.[47] బీకే దత్త్ ఆఖరి కోరిక ప్రకారం 19 జులై 1965 లో అతన్ని ఇక్కడే దహనం చేసారు, అలాగే భగత్ సింగ్ అమ్మ, విద్యావతిని కూడా.[48] జాతీయోద్యమ వీరుల స్మారకం దహనసంస్కారం జరిగిన ప్రదేశంలో 1968లో నిర్మించబడింది.[49] ఇంకా ఇక్కడ భగత్‍సింగ్, రాజ్‍గురు మరియు సుఖ్‍దేవ్‍ల స్మృతులు పొందుపరచబడ్డాయి. 1971 నాటి యుద్ధంలో పాకిస్తానీ సైన్యాలు ఈ స్మారకాన్ని ధ్వంసం చేసి విగ్రహాలను పాకిస్తాన్ కు తరలించారు. అప్పటి నుండి ఇప్పటి వరకూ వాటిని పాకిస్తాన్ ప్రభుత్వం తిరిగి ఇవ్వలేదు,[47][50]కానీ, 1973లో స్మారకం అప్పటి పంజాబ్ ముఖ్య మంత్రి జైల్ సింగ్ కృషితో తిరిగి నిర్మించబడింది.[48] యేటా, 23 మార్చిన షహీదీమేలా(పంజాబీ:అమరవీరుల సంత) జాతీయోద్యమ వీరుల స్మారకం వద్ద నిర్వహించబడుతుంది. వేలాది మంది జనం ఇక్కడ నివాళులర్పిస్తారు. [51] ఈ రోజును పంజాబ్ రాష్ట్రమంతా పాటిస్తారు. [52]
భగత్ సింగ్ సంగ్రహాలయం మరియు భగత్ సింగ్ స్మారకం
భగత్ సింగ్ 50వ వర్ధంతి రోజున అతని స్వగ్రామం ఖట్కర్ కలాన్లో షహీద్-ఎ-అజమ్ సర్దార్ భగత్ సింగ్ సంగ్రహాలయం తెరవబడింది. అక్కడ అతని స్మృతులు ప్రదర్శనకు ఉంచబడ్డాయి. వీటిలో అతని సగం కాలిన చితా భస్మం, అతని రక్తంతో తడిచిన ఇసుక, ఇంకా భస్మాన్ని ఉంచిన రక్తపు మరకలు కలిగిన వార్తాపత్రిక ఉన్నాయి.[53] లాహోరు ఘటన యొక్క కాగితం కూడా ఒకటి ప్రదర్శనలో ఉంది. అందులో కర్తార్ సింగ్ సరభకు ఉరి ఇచ్చిన తీర్పు, ఇంకా భగత్ సింగ్ పై వేసిన నిందారోపణల తీర్పు వివరాలు ఉన్నాయి. భగత్ సింగ్ దస్కతు ఉన్న భగవద్గీత పుస్తకం-ఇది అతనికి లాహోర్ జైలులో ఇవ్వబడింది, ఇంకా ఇతర సామగ్రి ఉన్నాయి.[54][55] భగత్ సింగ్ స్మారకం 2009లో ఖట్కర్ కలాన్లో ‍›₹16.8 కోట్ల ఖర్చుతో నిర్మించబడింది.[56]
ఇతర
భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు ఒక సంగ్రహాలయాన్ని నెలకొల్పింది, ఇందులో భారతీయ న్యాయవ్యవస్థలోని మైలురాళ్ళను ప్రగతినీ ప్రదర్శించాలనుకున్నారు, ఇంకా ఇందులో కొన్ని చారిత్రాత్మక తీర్పులకు సంబంధించిన అంశాలను ప్రదర్శిస్తున్నారు. ఇందులో భాగంగా మొట్టమొదటి తీర్పు ప్రదర్శన అంశంగా "భగత్ సింగ్ విచారణ"ను ఎంచుకున్నారు. దీన్ని 28 సెప్టెంబర్ 2007లో భగత్ సింగ్ జయంతి వేదుకలలో భాగంగా నిర్వహించారు. సెప్టెంబర్ 2007లో పాకిస్తాన్‍లోని పంజాబ్ రాష్ట్ర గవర్నర్ ఖాలిద్ మక్బూల్ లాహోర్ సంగ్రహాలయంలో భగత్ సింగ్ స్మారకాన్ని ప్రదర్శిస్తామని ప్రకటించారు. గవర్నర్ ప్రకారం ఉపఖండంలో మొదటి అమరవీరుడుగా భగత్ సింగ్ ఎందరో యూవకులకు స్పూర్తిని అందించారు. Ali, Mahir (26 September 2007). "మొదటి అమరవీరుడికి నివాళి". Dawn. Retrieved 11 October 2011.</ref>[57] కానీ అది మాటలకే పరిమితమయింది.[58]

ఆధునిక దినం

భారత సమాజము[59]నకు సింగ్ సేవ మరియు ప్రత్యేకించి భారత్‌లో సామ్యవాద భవిష్యత్. సింగ్ మరియు ఆయన సిద్ధాంతాలను జ్ఞప్తికి తెచ్చుకునే విధంగా ఆయన శతజయంతి ఉత్సవాల కోసం మేథావుల బృందం ఒక సంస్థను ఏర్పాటు చేసింది.[60]
భగత్ సింగ్ జీవితం ఆధారంగా పలు బాలీవుడ్ చిత్రాలు రూపొందాయి.[61] సింగ్ పాత్రలో మనోజ్‌ కుమార్ నటించిన షహీద్ 1965లో విడుదలయిన తొలి చిత్రం. సింగ్ జీవితంపై రూపొందిన రెండు భారీ చిత్రాలు 2002లో విడుదల కాగా, ది లెజెండ్ ఆఫ్ భగత్ సింగ్ మరియు23rd March 1931: Shaheed రాజ్‌కుమార్ సంతోషి దర్శకత్వం వహించిన ది లెజెండ్ ఆఫ్ భగత్ సింగ్ చిత్రంలో సింగ్ పాత్రలో అజయ్ దేవగాన్ నటించగా అందులో ఒక చిన్న పాత్రను అమృతారావు పోషించింది. 23 మార్చి 1931 : షహీద్ చిత్రంలో సింగ్ పాత్రలో బాబీ డియోల్ మరియు సన్నీ డియోల్, ఐశ్వర్యారాయ్ సహాయక పాత్రధారులుగా గుడ్డు ధానోవా రూపొందించారు. సోనూ సూద్, మానవ్ విజ్, రాజిందర్ గుప్తా మరియు సాధన సింగ్ పాత్రధారులుగా షహీద్-ఇ-అజామ్ అనే మరో భారీ చిత్రాన్ని సుర్జిత్ మూవీస్ పతాకంపై ఇక్బాల్ థిల్లాన్ నిర్మాతగా సుకుమార్ నాయర్ రూపొందించారు.[62]

2006లో విడుదలయిన రంగ్ దే బసంతి చిత్రం భగత్ సింగ్ సమకాలీన విప్లవకారులు మరియు ఆధునిక భారత యువతకు మధ్య సమాంతరాలను ఆవిష్కరించింది. భారత స్వాతంత్ర్య పోరాటంలో భగత్ సింగ్ పాత్రను ఇందులో విశిష్టంగా పొందుపరిచారు. ఈ చిత్రం కొందరు కాలేజీ విద్యార్థుల చుట్టూ తిరగడంతో పాటు భగత్ సింగ్ మిత్రులుగా ఆయన కుటుంబం పాత్రలను వారు ఒక్కోక్కరు ఏ విధంగా పోషించారనేది ఆవిష్కరించబడింది.
ఉర్దూ, హిందీ దేశభక్తి గీతాలు, రామ్ ప్రసాద్ బిస్మిల్ జనరంజకంగా మార్చిన సర్‌ఫరోషి కి తమన్నా ("అంకితభావం") మరియు మేరా రంగ్ దే బసంతి చోలా ("నా లేత పసుపు వర్ణ వేషం"; బసంతి అనేది పంజాబ్‌లో పెరిగే ఆవాలు పువ్వు యొక్క లేత పసుపు వర్ణాన్ని తెలుపుతుంది. అంతేకాక సిక్కు రెహత్ మర్యాద (పవిత్ర సిక్కు సైనికుడి ప్రవర్తనా నియమావళి) ప్రకారం సిక్కు మతానికి చెందిన రెండు ప్రధాన వర్ణాల్లో ఒక దానిని సూచిస్తుంది)పద్యం భగత్ సింగ్ ప్రాణత్యాగంతో బాగా సామీప్యం కలిగి ఉన్నాయి. వాటిని భగత్ సింగ్‌‌కు సంబంధించిన పలు చిత్రాల్లో ఉపయోగించారు.[61]
లాహోర్ మ్యూజియంలో భగత్ సింగ్ స్మారకచిహ్నాన్ని ఏర్పాటు చేస్తామని పాకిస్తాన్‌ పరిధిలోని పంజాబ్ ప్రాంత గవర్నర్ ఖలీద్ మక్బూల్ సెప్టెంబరు 2007లో ప్రకటించాడు. "ఉపఖండంలో సింగ్ తొలి అమరవీరుడు. ఆయన నేటి యువతకు ఆదర్శం కావాలి" అని ఆయన పేర్కొన్నాడు.[63][64]

నేడు


హుసేన్‍వాలా సమీపంలో భారత-పాకిస్తాన్ సరిహద్దు వద్ద భగత్ సింగ్, రాజ్ గురు మరియు సుఖ్‍దేవ్ ల విగ్రహాలు
నేటికీ భారత యువత భగత్ సింగ్ నుండి ఎంతో స్పూర్తిని పొందుతున్నారు.[65][66][67] ఇండియాటుడే 2008లో నిర్వహించిన ఒక సర్వే ప్రకారం అత్యంత గొప్ప భారతీయుడిగా భగత్ సింగ్ ఎన్నుకోబడ్డాడు. పోటీలో సుభాష్ చంద్రబోస్ ఇంకా గాంధీ వెనుకంజలో ఉండిపోయారు. [68] శతజయంతి సందర్భంలో మేధావుల ఒక సమూహం భగత్ సింగ్ సంస్థాన్ అనే ఒక సంస్థను ఏర్పాటు చేసి భగత్ సింగ్ ఆలోచనలను ఇంకా ఆదర్శాలను అమలు చేయటానికి కృషి చేసింది.[69] 2001 మార్చ్ 23న పార్లమెంటులో భగత్ సింగ్ కు నివాళులర్పించారు.[70] 2005 లో కూడా ఈ సంప్రదాయాన్ని పాటించారు.[71] పాకిస్తాన్ లోని లాహోర్ లో భగత్ సింగ్ ను ఉరి తీసిన షద్మన్ చౌక్ ను భగత్ సింగ్ చౌక్ గా పేరు మార్చాలని భగత్ సింగ్ ఫౌండేషన్ ఆఫ్ పాకిస్తాన్ అభ్యర్థన చేసింది, న్యాయపరమయిన సమస్యల వల్ల ఇది ఇంకా అమలు కాలేదు.[72][73]
సినిమాలు
హిందీ సినిమాలెన్నో భగత్ సింగ్ జీవితాన్ని, అతని కాలపు సన్నివేశాలను ఆధారించి తీయబడ్డాయి.[61] ఇందులో మొదటిది 1954 నాటి "షహీద్-ఎ-ఆజాద్ భగత్ సింగ్". తరువాత 1963లో "షహీద్ భగత్ సింగ్" షమ్మీ కపూర్ భగత్ సింగ్ పాత్రధారిగా వచ్చింది.[74] రెండేళ్ళ తరువాత 1965లో మనోజ్ కుమార్ భగత్ సింగ్ గా "షహీద్" అనే సినిమా తెరకెక్కింది. 2002లో మూడు ప్రముఖ చిత్రాలు భగత్ సింగ్ స్పూర్తిగా విడుదలయ్యాయి. ఇవి : "షహీద్-ఎ-ఆజం","23 మార్చ్ 1931:షహీద్" మరియు "ది లెజెండ్ ఆఫ్ భగత్ సింగ్". 2006లో వచ్చిన "రంగ్ దే బసంతీ" నేతి యువత నేపధ్యంలో భగత్ సింగ్ కాలమ్నాటి విప్లవాలను చూపిస్తూ తెరకెక్కింది.[75][76] ఈ చిత్రంలో భారత స్వాతంత్ర్య పోరులో భగత్ సింగ్ పాత్రను ప్రస్ఫుటీకరించారు.[77] [75] 2008లో నెహ్రూ మెమోరియల్ మ్యూజియం అండ్ లైబ్రెరీ మరియు ANHAD సమ్యుక్తంగా "ఇంకలాబ్" అనే 40 నిమిషాల డాక్యుమెంటరీని నిర్మించారు.[78][79]
రంగస్థలం
భారతదేశం మరియు పాకిస్తాన్ లో ఎన్నో నాటకాలకు భగత్ సింగ్, రాజ్‍గురు, సుఖ్‍దేవ్ లు ప్రేరణనిచ్చారు. నేటికి ఆయా నాటకాలు ఎందరో ఆహూతులను ఆకర్షిస్తున్నాయి.[80][81][82]
పాటలు/గేయాలు
ఉర్దూ దేశభక్తిగీతమయిన "సర్ఫరోషీ కీ తమన్నా"(త్యాగానికై అభిలాష) ఇంకా "మేర రంగ్ దే బాంతీ చోలా"(అమ్మా, నా అంగవస్త్రానికి కాశాయ రంగు అద్దు)[83] రాం ప్రసాద్ బిస్మిల్ ద్వారా రాయబడినా, భగత్ సింగ్ తోనే అనుబంధంగా గుర్తించబడ్డాయి. ఎన్నో సినిమాలలో భగత్ సింగ్ కు అనుబంధంగా ఈ పాటలను వాడారు.
ఇతరత్రా
1968లో భగత్ సింగ్ 61వ జయంతి సందర్భంలో ఒక తపాళా బిళ్ళను ప్రచురించారు.[84] సెప్టెంబర్ 2006లో భారత ప్రభుత్వం కొన్ని నాణాలను భగత్ సింగ్ స్మృతిలో ముద్రించాలనుకుంది. కానీ జూన్ 2011 వరకు కూడా అవి విడుదల కాలేదు.[85]

విమర్శలు

భగత్ సింగ్ అతని విధానాల వలన జీవితాంతం, మృత్యువు తరువాత కూడా విమర్శించబడ్డాడు. బ్రిటిష్ వారికి విరుద్ధంగా అతని విప్లవాత్మక మరియు హింసాత్మక ఆలోచనలు, మరియు గాంధేయవాద ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కు విరుద్ధంగా అతని ఆలోచనలు ఇందుకు కారణం.[86][87]సాండర్స్ ని తుపాకీతో కాల్చడం ఇంకా ప్రాణాంతకం కాని బాంబులను విసరడం వంటివి గాంధీ అహింసా వాదానికి విరుద్ధం. బ్రిటీష్ ప్రభుత్వం పట్ల హింసాత్మక మరియు విప్లవాత్మక వైఖరిని అవలంభించాడని, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ప్రత్యేకించి మహాత్మా గాంధీ యొక్క అహింసావాద సిద్ధాంతాలను వ్యతిరేకించాడంటూ మరణానంతరం భగత్ సింగ్‌‌ను ఆయన సమకాలీకులు, ప్రజలు తీవ్రంగా విమర్శించారు.[87] ఆశయ సాధన కోసం సాండర్స్‌ను కాల్చడం మరియు ప్రాణహాని లేని బాంబుల విసిరివేత వంటి సింగ్ అనుసరించిన పద్ధతులు గాంధీ అహింసా, సహాయ నిరాకరణ ఉద్యమాలకు పూర్తిగా భిన్నమైనవి.[87]
బతకడం కన్నా తన ఉద్యమాన్ని కొనసాగించడం ద్వారా చనిపోవడానికే తొందర పడ్డాడని భగత్ సింగ్ విమర్శలెదుర్కొన్నాడు. భగత్ అనుకుని ఉంటే జైలు నుంచి బయటకు వచ్చే వాడని, అయితే చనిపోయి భారత యువతకు ఉత్తరదాయిత్వంగా మారాలని కోరుకున్నాడని కూడా ఆయన విమర్శల పాలయ్యాడు. ఆయన బతికి ఉంటే భారత్‌కు మరింత సేవ చేసి ఉండే వాడని మరికొందరు విచారం వ్యక్తం చేశారు.[4]

ఉల్లేఖనాలు

  • "జీవిత లక్ష్యమంటే....మనస్సును నియంత్రించడం ఎంతమాత్రం కాదు. దానిని సామరస్యంగా వృద్ధి చేయాలి. భవిష్యత్తులో మోక్షం పొందడం కాదు. ఇప్పుడే దానిని పూర్తి స్థాయిలో ఉపయోగించడం. వాస్తవాన్ని గ్రహించడం కాదు. సౌందర్యం మరియు మంచితనం ఆలోచనలోనే కాక దైనందిన వాస్తవ అనుభవంలోనూ ఉంటాయి. సామాజిక పురోగతి ఏ కొందరి ప్రతిష్టలపై కాక ప్రజాస్వామ్య ప్రగతిపై ఆధారపడి ఉంటుంది. సామాజిక, రాజకీయ మరియు వ్యక్తిగత జీవితంలో సమ ప్రాధాన్యత కల్పించడం ద్వారానే విశ్వజనీన సహోదరత్వం సాధ్యమవుతుంది" -భగత్ సింగ్ జైలు డైరీ p. 124 నుంచి
  • "ఇంక్విలాబ్ జిందాబాద్" (విప్లవం వర్థిల్లాలి)[88]

ప్రాచుర్యం

భగత్ సింగ్ సమకాలీన భారతదేశంలోనే కాక స్వాతంత్ర్యానంతర భారతదేశంలో కూడా విప్లవానికి చిహ్నంగా ప్రసిద్ధిచెందారు.

చిత్రమాలిక

from wikipedia
                                                                 -www.seaflowdiary.blogspot.com

No comments:

Post a Comment