Health is wealth -12 * ఆరోగ్యమే మహాభాగ్యం - 12
Dated : 24-09-2017
బెండకాయ నీటిని ఉదయాన్నే పరగడుపున త్రాగితే ..?
12-10-2017
బెండకాయను మనం తరచూ కూర చేసుకుని తింటూనే ఉంటాం. దీంతో ఫ్రై, పులుసు వంటివి చేసుకోవచ్చు. అవి చాలా రుచికరంగా ఉంటాయి. అయితే కేవలం రుచికే కాదు, బెండకాయతో మనకు అనేక ఆరోగ్యకర ప్రయోజనాలు కూడా కలుగుతాయి. పలు అనారోగ్య సమస్యలను కూడా దూరం చేసుకోవచ్చు. అయితే అందుకు బెండకాయ నీటిని రోజూ ఉదయాన్నే పరగడుపున తాగాల్సి ఉంటుంది. మరి ఆ నీటిని ఎలా తయారు చేయాలో, దాంతో ఏమేం అనారోగ్యాలు నయం అవుతాయో ఇప్పుడు తెలుసుకుందామా..!
రెండు బెండకాయలను తీసుకుని బాగా కడగాలి. వాటిని మొదలు, చివర భాగాలను కట్ చేయాలి. అనంతరం ఒక్కో బెండ కాయను నిలువుగా చీరాలి. కానీ పూర్తిగా చీరకూడదు. చివరి భాగం వరకు మాత్రమే చీరి వదిలేయాలి. అలా రెండు బెండకాయలను కట్ చేశాక ఒక గ్లాస్ నీటిని తీసుకుని అందులో వాటిని వేయాలి. ఆపై మూత పెట్టాలి. రాత్రంతా ఆ నీటిని అలాగే ఉంచాక, ఉదయాన్నే ఆ గ్లాస్‌లోంచి బెండకాయలను తీసేసి ఆ నీటిని పరగడుపునే తాగేయాలి. ఇలా చేయడం వల్ల ఏమేం లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
1. పైన చెప్పిన విధంగా బెండకాయ నీటిని తాగితే పేగులు, జీర్ణాశయం శుభ్రమవుతాయి. అల్సర్లు ఉంటే తగ్గుతాయి. గ్యాస్, అసిడిటీ, మలబద్దకం నయమవుతాయి.
2. ఫైబర్, విటమిన్ ఇ, సి, కె, మెగ్నిషయం, పాస్ఫరస్ వంటి పోషకాలు సమృద్ధిగా లభిస్తాయి. దీంతో చక్కని పోషణ అందుతుంది.
3. రక్తం సరఫరా మెరుగు పడుతుంది. గుండె ఆరోగ్యం బాగుంటుంది. బీపీ తగ్గుతుంది.
4. మధుమేహం నయమవుతుంది. రక్తంలోని షుగర్ స్థాయిలు కంట్రోల్ అవుతాయి.
5. ఎముకలు దృఢంగా మారుతాయి. స్త్రీలకు రుతు సమయంలో వచ్చే సమస్యలు తగ్గుతాయి.
6. వేడి శరీరం ఉన్న వారు తాగితే శరీరం చల్లబడుతుంది.
7. ఒంట్లో అధికంగా ఉన్న కొవ్వు కరిగిపోయి అధిక బరువు ఇట్టే తగ్గుతారు.
8. చర్మం కాంతివంతంగా మారుతుంది. జుట్టు దృఢంగా, ఒత్తుగా పెరుగుతుంది.
9. శరీర రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. నేత్ర సమస్యలు పోయి దృష్టి బాగా పెరుగుతుంది.
1. మొలకెత్తిన పెసలలో డైటరీ ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది కొవ్వును కరిగించేందుకు, చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించేందుకు ఉపయోగపడుతుంది.
2. మొలకెత్తిన పెసలను తింటే త్వరగా ఆకలి వేయదు. దీంతో ఎక్కువ సేపు కడుపు నిండిన భావన కలుగుతుంది. తద్వారా ఆహారాన్ని తగ్గించి బరువు కూడా తగ్గవచ్చు.
3. డైటరీ ఫైబర్ అధికంగా ఉన్న కారణంగా ఇవి మలబద్దకం సమస్యను పోగొడతాయి. తిన్నది సరిగ్గా జీర్ణం అయ్యేలా చూస్తాయి.
4. శరీరంలోని నొప్పులు, వాపులను తగ్గించే యాంటీ ఇన్‌ఫ్లామేటరీ గుణాలు ఈ మొలకెత్తిన పెసలలో ఉన్నాయి.
5. విటమిన్ ఎ, బి, సి, డి, ఇ, కె, థయామిన్, రైబోఫ్లేవిన్, ఫోలిక్ యాసిడ్, నియాసిన్, విటమిన్ బి6, ఫాంటోథెనిక్ యాసిడ్ వంటివి మొలకెత్తిన పెసలలో సమృద్ధిగా లభిస్తాయి. కాబట్టి వీటిని పరిపూర్ణ పౌష్టికాహారంగా చెప్పవచ్చు.
6. మొలకెత్తిన పెసలను తీసుకోవడం వల్ల దృష్టి సంబంధ సమస్యలు పోతాయి. గుండె జబ్బులు రాకుండా ఉంటాయి. రక్తహీనత తొలగిపోతుంది.
7. రక్తంలోని చక్కెర స్థాయిలు అదుపులోకి వస్తాయి. మధుమేహం ఉన్న వారికి మేలు జరుగుతుంది.
8. శరీరంలో ఏర్పడే ఇన్‌ఫెక్షన్లను తొలగించే యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఉన్నాయి. ఇవి రోగ నిరోధక వ్యవస్థను పటిష్టం చేస్తాయి.
9. వృద్ధాప్య ఛాయలను దరిచేరనివ్వవు. గ్యాస్, అసిడిటీ వంటి జీర్ణ సంబంధ సమస్యలు దూరమవుతాయి.
- seaflowdiary