Modiji 's Governament - మోడీ గారి ప్రభుత్వం
Date : 01-06-2016
updated : 03-06-2016,05-06-2016
మోడీ గారు ప్రభుత్వం చేపట్టి రెండు సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా సాధించిన విజయాలను ప్రజలకు వివరించారు . అవినీతి ని మటుమాయం చేశామని చెప్పారు . గత ప్రభుత్వం అవినీతి లో చిక్కుకపోయిన కారణం గా ప్రజలు మార్పు కోరారు , మార్చివేసారు . ప్రజలు ఎన్నో ఆశలు ఈ ప్రభుత్వం పై పెట్టుకున్నారు , పూర్తిగా మార్చాలంటే ఈ రెండు సంవత్సరాలు ఎవ్వరికి సరిపోవు .
ప్రతిపక్షం ఎప్పుడైనా , ఏ పార్టీ ప్రతిపక్షం లో ఉన్నా ప్రభుత్వాన్ని విమర్శించడం జరుగుతుంది , కాని ఏ పార్టీ అధికారం లో ఉన్నా వారు ప్రజలకు చేసే మంచి పనిని ప్రోత్సహించాలి , ప్రజా వ్యతిరేక పనిని విమర్శించాలి . కాని నేడు ఆ పద్దతి కనబడడం లేదు . ప్రజలు కూడా ఎవ్వరిని గుడ్డిగా నమ్మరు . వారు ఏం చేయాలో ఎన్నికలలో చేసి చూపెడుతారు .
అవినీతిని అంతమొందించి ప్రజల సొమ్మును కాపాడుతున్నందులకు, ప్రజలకు మేలు కలిగితే మోడీ ప్రభుత్వం తో ప్రజలు సంతోషిస్తారు .
మోడీ జీ గారు ఈ క్రింది విధముగా చెబుతున్నారు :
ఎటువంటి అవినీతి లేకుండా 2G spectrum auction తో 1. 9 లక్షల కోట్ల రూపాయల లాభం .
పారదర్శకం గా auction తో coal mine allotment ద్వారా 3. 45 లక్షల కోట్ల రూపాయల లాభం .
దేశ వ్యాప్తం గా direct benefit transfer scheme ద్వారా bogus benefiter and brokers ను తొలగించడం తో 36,500 కోట్ల రూపాయల ఆదా .
నల్ల ధనాన్ని అరికట్టేందుకు severe action is taking .
50 వేల కోట్ల రూపాయల మేర పరోక్ష పన్నుల ఎగవేత గుర్తింపు .
21 వేల కోట్ల రూపాయల వెల్లడించని ఆదాయం స్వాధీనం .
ట్రాన్స్పరెన్సి International ranking లో గతం లో పోలిస్తే భారత్ స్తితి మెరుగుపడింది .
అని చెబుతున్నారు . ఇన్ని లక్షల కోట్ల రూపాయలు మనకు వచ్చినాయి కదా , చాల సంతోషం . ముందు ముందు ఇంకా ఎక్కువ రావచ్చునేమో .
ఇంత డబ్బు వచ్చినా ప్రజల జీవితాల్లో ఏమైనా మార్పు వచ్చిందా ! వచ్చిందని వీరు ,రాలేదని ప్రతిపక్షాలు ఒకరికి ఒకరు విమర్శించు కోవడం జరుగుతుంది .
ప్రభుత్వ మార్పును ప్రజలు ఓటు ద్వారా చేశారు . కుంభ కోణాల్లో ఉన్న ప్రభుత్వాన్ని వదలి ఈ ప్రభుత్వాన్ని అధికారం లోనికి తెచ్చారు , ప్రజలకు ఈ ప్రభుత్వం ఎంతో రుణపడి ఉన్నది .
ఈ రెండు సంవత్సరాలలో ప్రజలు ఆశించిన విధముగా కొంత మాత్రం జరిగి ఉండవచ్చు కాని ఈ ప్రభుత్వం ప్రజలకు ఇంకా చాలా చేయవలసి ఉంది .
నల్ల ధనాన్ని తెచ్చి ప్రజలందరికి పంచుతామన్నారు ,దీనిని ప్రజలు గట్టిగా నమ్ముకున్నారు కాని ఇంతవరకు ఏమి జరుగలేదు ఇక ముందు జరుగుతుందని ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు .
అనామతుగా వచ్చే డబ్బు కంటే కష్టపడి పని చేసి డబ్బు సంపాదించడానికే ఎక్కువ మంది ప్రజలు ఆశిస్తున్నారు .
ఎంతోమంది చదువుకున్న నిరుద్యోగులు కష్ట కాలం గడుపుతున్నారు . వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలి . అందుకే మన ప్రధానమంత్రి మోడీ జీ గారు విదేశాలకు వెళ్ళి అక్కడి పారిశ్రామిక వేత్తలను ఒప్పించి మనదేశం లో పెట్టుబడులు పెట్టుటకు, పరిశ్రమలు స్థాపించి ఉద్యోగ అవకాశాలు కల్పించుటకు make in India పథకాన్ని ప్రవేశపెట్టి చాలా కష్ట పడుతున్నారు . ఈ పద్దతి లోనే చాలా రాష్ట్రాలు పెట్టుబడుల గురించి విదేశాలు వెళ్ళు చున్నారు .
విదేశాలకు వెళ్ళి అక్కడి పారిశ్రామిక వేత్తలను బ్రతిమిలాడి మనదగ్గరికి వచ్చి పరిశ్రమలు పెట్టమని అడుగుతున్నాము . మన దేశంలో ఎన్నో పరిశ్రమలను విదేశీ సహకారం తో నెలకొల్పాము కాని పారిశ్రామిక వేత్తలను ఇక్కడకు రమ్మని ఎప్పుడు అడగలేదు కాని ఇప్పుడు ఎందుకు ఆ పద్దతి అవలంబించలేదు , గత ప్రభుత్వం కూడా ఏమిచేయలేదు . మన దేశం లో ఎన్నో PSU లు విదేశీ సహాకారం తో స్టాపించాము .
కొంతకాలం నుండి మన ప్రభుత్వాలు PSU ల పట్ల శ్రద్ధ చూపలేదు , Private వాళ్ళపట్ల అత్యధిక ప్రేమ చూపారు . నిర్లక్షం వల్ల నేడు చాల పబ్లిక్ సెక్టార్ కంపెనీలు నష్టాల్లోకి నెట్టబడి మూత పడడమో లేక ప్రయివేటు పరం కావింప బడడమో జరుగు తుంది . దీనివలన వచ్చే లాభం అంతా ప్రైవేటు వాళ్ళ జేబులోకి వెళ్ళుతుంది అదే PSU ను develop చేస్తే వచ్చే ఆదాయం అంతా దేశానికి వచ్చి ఎంతో అభివృద్ధి చెందేది . కాని ప్రభుత్వాలు ప్రైవేటు పట్ల ఎందుకు మోజు చూపుతున్నారో !
మనకు లక్షల కోట్ల రూపాయల ఆదా అవుతున్నా మరి పరిస్థితి ఇలా ఎందుకు ఉన్నది . ప్రభుత్వమేమో దేశం ముందుకు పోతుంది . అచ్చేదిన్ వచ్చిందని ప్రచారం చేస్తుంది . ఈ నినాదాలు ప్రస్తుత పరిస్థితికి సరిపోతుందా ?
రెండేళ్ళ పరిపాలనకే ఇంత ప్రచారం చేసుకోవడం ఏమిటి ? ముందు యింకా మూడేళ్ళు ఉంది . ఇంతకుముందు NDA ప్రభుత్వం కూడా దేశం వెలుగుతుందని భారీ ప్రచారం చేసింది . అసలు వెలిగిందా అని ,ప్రభుత్వం స్వంతముగా ప్రచారం చేసుకోవడ మేమిటి ? ప్రజలు ప్రభుత్వం మంచిగా ఉందని పొగడాలి .
ప్రజలకు ఏ ప్రభుత్వం వచ్చినా అంతే నని తెలిసిపోయింది .
ప్రపంచ మార్కెట్ లో ముడి చమురు ధర బ్యారెల్ $50 వద్ద ఉంది . ఎప్పుడో $150 బ్యారెల్ ఉన్నప్పుడు నిర్ణయించిన ధర ను అటో - ఇటో తగ్గిస్తూ పెంచుతూ పోతుంది . రెండు రూపాయలు పెంచితే ఒక రూపాయి తగ్గిస్తుంది . పెట్రోలియం ఉత్పత్తుల ధరలను నిర్ణయించే అధికారాన్ని ఆయిల్ కంపెనీ లకు అప్పగించి చేతులు దులుపు కున్నది , అతి ముఖ్యమైన నిర్ణయాలను ప్రభుత్వమే చేయాలి .
విదేశాల్లో పెట్రోల్ ధర ఎలా ఉందో ఒకసారి గమనించాలి .
ప్రపంచంలో పెట్రోల్ ఖరీదులు
పాకిస్తాన్ రూ 26.00
బంగ్లాదేశ్ రూ 22. 00
క్యూభా రూ 19.00
ఇట్లీ రూ 14.00
నేపాల్ రూ 34.00
బర్మా రూ 30.00 ఆఫ్గనిస్తాన్ రూ 36.00
శ్రీళంక రూ 34.00
భారతదేశం రూ 70.00
ఇది ఎలా అంటే రిఫైనరీ దగ్గర ఒక లీటర్ ధర రూ .16.50
+ సెంట్రల్ టాక్స్ 11.80%
+ ఎక్సైజ్ డ్యూటీ 9.75%
+ వ్యాట్ సెస్ 4%
+ స్టేట్ టాక్స్ 8%
మొత్తం కలిపి రూ 50.05 ఒక లీటర్. + మరియు అదనంగా రూ20. ఈ అదనంగా వసూలు చేస్తున్న రూ20/- కి
భారతప్రభుత్వం దగ్గర వివరణ లేదు.
No comments:
Post a Comment