Central appreciation to Water grid Project
వాటర్ గ్రిడ్ పథకానికి కేంద్రం ప్రశంస
Date : 08-10-2015
Published: Thu,October 8, 2015 08:00 PM
న్యూఢిల్లీ: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వాటర్ గ్రిడ్ పథకానికి కేంద్ర ప్రభుత్వం నుంచి మరోసారి ప్రశంసలు అందాయి. వాటర్ గ్రిడ్ పథకాన్ని కేంద్ర డ్రింకింగ్ వాటర్ శానిటేషన్ జాయింట్ కమిషనర్ సత్యభ్రత సాహు ప్రశంసించారు. వాటర్ గ్రిడ్ ప్రాజెక్టు ఆర్థిక నమూనాను పంపాలని కోరారు. ఇంటింటికి మంచినీటిని అందించాలనేది గొప్ప ఆలోచన అని పేర్కొన్నారు.
వాటర్ గ్రిడ్ పథకం కు కేంద్ర ప్రభుత్వం నుంచి మరోసారి ప్రశంసలు అందాయంటే ఎంతో గర్వ కారణం . దాని విలువను కేంద్రం గుర్తించింది. ఇంటింటికి మంచినీటిని అందించాలనేది ఒక గొప్ప మహా యజ్ఞంలాంటిది. మనిషికి నీరు ప్రాణాధారం, సమస్త రోగాలకు మంచినీరు త్రాగకపోవడమే. దీనివలన అందరు చాలా వరకు రోగాల బారిన పడకుండా ఆరోగ్యంగా ఉంటారు . అందులో శుభ్రమైన త్రాగునీటిని ఇంటింటికి నల్లాల ద్వారా వేలకోట్ల రూపాయలు వెచ్చించి చేపడుతున్న పథకం . దేశం లో ఏ రాష్ట్రములో అమలు చేయనటువంటి ఈ మహా కార్యక్రమాన్ని చేపట్టిన మన కె సి ఆర్ గారు నిజంగా భగీరథుడే . ఇంటింటికి మంచి నీరు నల్లాల ద్వారా ఈ ఐదు సంవత్సరాల లో రాష్ట్ర మంతటికి అందించడానికి కట్టుబడి ఉన్నామని చెప్పి ఒక వేళ నీరు అందించకుంటే మళ్లీ ఓటు వేయమని అడగనని ధైర్యముగా ప్రకటించిన ఒకే ఒక మన నాయకుడు కె సి ఆర్ గారే . ఈ పథకానికి మనమందరము మనః పూర్తిగా సహాకారం అందిస్దాం.
అసలు సంగతి ఇలాఉంటే మన దగ్గర ఉన్న ఇతర నాయకులు తమ హయాములో చేయక పోయినా ఇప్పుడు అడ్డు తగులుతున్నారు . ప్రజల దగ్గరికి వెళతాం అంటున్నారు , వారి దగ్గరికి వెళితే వారు అడిగే ప్రశ్నలకు సమాధానం ఏం చెబుతారు ? ప్రజలు ఈ నాయకుల కంటే చాలా తెలివి గలవారు , ఈ ప్రజలే కదా వారిని గెలిపించి అసెంబ్లీ కి పంపింది . ఈ ప్రజలే మేం ఎన్నికల్లో ఓటు వేసి పంపించాం మరి మాకు ఏమి చేయనప్పుడు మరి మీరు ఎందుకు ? తిరిగి వారిని వెనుకకు తెప్పించే అధికారం మాకు కావాలని , ఎన్నికల చట్టం మార్చాలని కోరుకుంటున్నారు. అప్పుడు వారు తమకు ఆదుకొనే వారినే పదవిలో ఉంచుతారు లేకుంటే ఇంటికి వెళ్ళమంటారు.
ఈ మహా కార్యక్రమాన్ని కేంద్రమే సంతోషించి, వాటర్ గ్రిడ్ పథకాన్ని కేంద్ర డ్రింకింగ్ వాటర్ శానిటేషన్ జాయింట్ కమిషనర్ సత్యభ్రత సాహు ప్రశంసించి, వాటర్ గ్రిడ్ ప్రాజెక్టు ఆర్థిక నమూనాను పంపాలని కోరారు. ఇంటింటికి మంచినీటిని అందించాలనేది గొప్ప ఆలోచన అని పేర్కొన్నారు.
ఈ పథకాన్ని ఇతర రాష్ట్రాల్లో లేదా దేశం మొత్తం అమలు చేయించడానికి ఆలోచిస్తున్నట్లున్నారు . దేశ మంతటికి వర్తింపజేస్తే ఇంకా చాల బాగుంటుంది. సముద్రం లో కలిసే వృధా జలాలను సద్వినియోగం చేసుకోవచ్చు , దేశ ప్రజల ఆరోగ్యం కాపాడవచ్చు .
Yours ,
www.seaflowdiary.blogspot.com
.
No comments:
Post a Comment