Wednesday, October 26, 2016


ఆరోగ్యమే మహాభాగ్యం -2    Health is wealth - 2
                                            Date : 26-10-2016
                                                                                                      updated : Dt . -10-2016 & 07-11-2016



మొలకెత్తిన వెల్లుల్లి తో రెట్టింపు పోషకాలు 


వెల్లుల్లితో మ‌న‌కు ఎలాంటి ఆరోగ్య‌క‌ర ప్రయోజ‌నాలు క‌లుగుతాయో అంద‌రికీ తెలిసిందే. దీంట్లో గుండెను ప‌రిర‌క్షించే ఎన్నో ర‌కాల ఔష‌ధ గుణాలు ఉన్నాయి. అంతేకాదు, వెల్లుల్లి స‌హ‌జ సిద్ధ‌మైన యాంటీ బ‌యోటిక్‌గా కూడా ప‌నిచేస్తుంది. అయితే వెల్లుల్లిని సాధార‌ణ రూపంలో కాక మొల‌కెత్తించి తీసుకుంటే దాంతో ఇంకా అనేక లాభాలు ఉంటాయి. సాధార‌ణ వెల్లుల్లి క‌న్నా మొల‌కెత్తిన వెల్లుల్లిలో అంత‌కు రెట్టింపు పోష‌కాలు ల‌భిస్తాయి. ఈ క్ర‌మంలో వెల్లుల్లిని ఎలా మొల‌కెత్తించి త‌యారు చేసుకోవాలో, దాని వ‌ల్ల ఏమేం ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. 


మొల‌కెత్తిన వెల్లుల్లి త‌యారీ విధానం ఇలా...


ఒక చిన్న‌పాటి క‌ప్పు లేదా గ్లాస్‌లో దాని టాప్ వ‌ర‌కు శుభ్ర‌మైన నీటిని నింపాలి. ఇప్పుడు ఓ వెల్లుల్లి రెక్క లేదా పూర్తిగా వెల్లుల్లి మొత్తాన్ని తీసుకుని దానికి చిత్రంలో చూపిన‌ట్టుగా 3 వైపులా టూత్‌పిక్‌ల‌ను గుచ్చాలి. అనంత‌రం ఆ టూత్‌పిక్‌ల స‌హాయంతో వెల్లుల్లిపాయ‌ను క‌ప్పు పై భాగంలో ఉంచాలి. అయితే వెల్లుల్లి కింది భాగంలో ఉండే వేర్ల వ‌ర‌కు మాత్ర‌మే నీటిలో మునిగేలా వెల్లుల్లిని ఉంచాలి. అంతే, ఒక 5 రోజులు ఆగితే వెల్లుల్లి మొల‌కెత్తుతుంది. అయితే వెల్లుల్లిని ఉంచిన క‌ప్పును కిటికీల వంటి ప్ర‌దేశాల్లో, సూర్య‌ర‌శ్మి త‌గిలేలా ఉంచాలి. దీంతో మొల‌క‌లు బాగా వ‌స్తాయి.
1. మొల‌కెత్తిన వెల్లుల్లిపాయ‌ల్లో సాధార‌ణం క‌న్నా ఓ మోస్త‌రు ఎక్కువ‌గానే యాంటీ యాక్సిడెంట్లు ఉంటాయి. మొల‌కెత్తుతున్న వాటిలో మెటాబొలెట్స్ అనే యాంటీ ఆక్సిడెంట్లు పుష్క‌లంగా ఉంటాయి. ఇవి మొల‌క‌లు మొక్క‌లుగా మారేందుకు ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డ‌తాయి. ఆ క్ర‌మంలో వాటికి వ్యాపించే చీడ పీడ‌ల నుంచి మొక్క‌ల‌కు ర‌క్ష‌ణ‌నిస్తాయి. అలాంటిది ఆ మెటాబొలెట్స్ ఉన్న మొల‌కెత్తిన వెల్లుల్లిపాయ‌ల్ని తింటే మ‌న‌కు కూడా అలాంటి లాభాలే క‌లుగుతాయి. ప్ర‌ధానంగా ప‌లు ర‌కాల వ్యాధులు, ఇన్‌ఫెక్ష‌న్లు న‌యం అవుతాయి.

2. మొల‌కెత్తిన వెల్లుల్లిపాయ‌ల్ని తింటే రక్త నాళాల్లో పేరుకుపోయిన కొవ్వు క‌రిగిపోతుంది. చెడు కొలెస్ట్రాల్ పోయి మంచి కొలెస్ట్రాల్ వృద్ధి చెందుతుంది. ర‌క్త స‌ర‌ఫ‌రా మెరుగు ప‌డి గుండె జ‌బ్బులు రాకుండా ఉంటాయి.

3. మొల‌కెత్తుతున్న వెల్లుల్లిపాయ‌ల్లో యాంటీ ఆక్సిడెంట్లు స‌మృద్ధిగా ఉంటాయ‌ని పైన చెప్పాం క‌దా. అయితే అవి రోగ నిరోధ‌క శ‌క్తిని కూడా పెంచుతాయి. క్యాన్స‌ర్ రాకుండా చూడ‌డ‌మే కాదు, క్యాన్స‌ర్ క‌ణాల‌ను వృద్ధి చెంద‌నీయ‌వు.

4. యాంటీ ఆక్సిడెంట్లు పుష్క‌లంగా ఉన్న కార‌ణంగా వ‌య‌స్సు మీద ప‌డ‌డం వ‌ల్ల వ‌చ్చే ముడ‌త‌లు పోతాయి. దీంతో చ‌ర్మం య‌వ్వ‌నంగా, కాంతివంతంగా మారుతుంది.

5. మొల‌కెత్తిన వెల్లుల్లిపాయ‌ల‌ను తింటుంటే జ్ఞాప‌క‌శ‌క్తి పెరుగుతుంది. చిన్నారుల‌కు తినిపిస్తే వారి మెద‌డు విక‌సిస్తుంది. బుద్ధి పెరుగుతుంది. నాడుల‌న్నీ ఉత్తేజం అవుతాయి.


పరగడుపునే వేడి నీళ్లు త్రాగితే 





నీరు మ‌న శ‌రీరానికి ఎంత అవ‌స‌ర‌మో అంద‌రికీ తెలిసిందే. నీటిని రోజూ త‌గినంత మోతాదులో తాగ‌డం వ‌ల్ల మ‌న‌కు అనేక ర‌కాల ఆరోగ్య‌క‌ర ప్ర‌యోజ‌నాలు కూడా క‌లుగుతాయి. అయితే నీటిని సాధార‌ణ రూపంలో కాక వేడిగా ఉన్న‌ప్పుడు తాగితే ఇంకా మంచి ఫ‌లితాలు ఉంటాయి. అదే ఆ వేడి నీటిని ప‌ర‌గ‌డుపున తాగితే దాంతో మ‌న‌కు క‌లిగే అనేక అనారోగ్యాల‌ను దూరం చేసుకోవచ్చు. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. 


1. ప‌ర‌గ‌డుపున వేడి నీటిని తాగితే శ‌రీరంలో ర‌క్త ప్ర‌స‌ర‌ణ మెరుగు ప‌డుతుంది. శ‌రీరంలో ఉన్న మ‌లినాలు, చెడు ప‌దార్థాలు, వ్య‌ర్థాలు బ‌య‌టికి వెళ్లిపోతాయి. 

2. జీర్ణ‌క్రియ మెరుగుప‌డుతుంది. జీర్ణ సంబంధ స‌మ‌స్య‌లు తొల‌గిపోతాయి. మ‌ల‌బ‌ద్ద‌కం దూర‌మ‌వుతుంది. పైల్స్ ఉన్న‌వారికి వేడి నీరు ఎంత‌గానో ఉపయోగ‌ప‌డుతుంది. 

3. ఉద‌యాన్నే రెండు గ్లాసుల వేడి నీటిని తాగితే త్వ‌ర‌గా బ‌రువు త‌గ్గుతారు. కొవ్వు వేగంగా క‌రిగిపోతుంది. 

4. శ‌రీర ఉష్ణోగ్ర‌త నియంత్ర‌ణ‌లో ఉంటుంది. జ్వ‌రం వంటి అనారోగ్యాలు రావు. ఇత‌ర అవ‌య‌వాల‌న్నీ ఆరోగ్యంగా ఉంటాయి. ప్ర‌ధానంగా కిడ్నీల‌కు చాలా మంచిది. 

5. ఉద‌యాన్నే బ్రేక్‌ఫాస్ట్ చేయ‌డానికి అర‌గంట ముందు ఒక గ్లాస్ వేడి నీటిని తాగితే క‌డుపు నొప్పి త‌గ్గుతుంది. శ‌రీర మెట‌బాలిజం వేగవంత‌మ‌వుతుంది. ఇది క్యాల‌రీల‌ను ఖ‌ర్చు చేసేందుకు ఉపయోగ‌ప‌డుతుంది. 

6. ద‌గ్గు, జ‌లుబు, గొంతు నొప్పి వంటి శ్వాస కోశ స‌మ‌స్య‌లు దూర‌మ‌వుతాయి. శ్వాస ప్ర‌క్రియ మెరుగు ప‌డుతుంది.




స్వ‌చ్ఛ‌మైన గాలి

నేడు ఏ ప్రాంతంలో చూసినా గాలి కాలుష్యం విప‌రీతంగా పెరిగిపోయింది. దీంతో మ‌న‌కు స్వ‌చ్ఛ‌మైన గాలి అస్స‌లు దొర‌క‌డం లేదు. ఈ క్ర‌మంలో కాలుష్య‌పూరిత‌మైన గాలిని పీల్చుకోవ‌డం వ‌ల్ల మ‌న‌కు ఎన్నో ర‌కాల అనారోగ్యాలు కూడా క‌లుగుతున్నాయి. అయితే అలాంటి అనారోగ్యాల బారిన ప‌డ‌కుండా ఉండాలంటే ఈ మొక్క‌లు మ‌న‌కు ఎంత‌గానో దోహ‌దం చేస్తాయి. ఎందుకంటే ఇవి మ‌న ప‌రిస‌రాల్లో ఉంటే చాలు, దాంతో అక్క‌డి గాలిలోని కాలుష్య కార‌కాలు అన్నీ ఫిల్ట‌ర్ అయిపోతాయి. దీంతో 100 శాతం స్వ‌చ్ఛ‌మైన గాలి మ‌న‌కు ల‌భిస్తుంది. ఆ మొక్క‌లు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. 




అలోవెరా (క‌ల‌బంద‌)...

గాలిలో ఉన్న కార్బ‌న్ డయాక్సైడ్‌, కార్బ‌న్ మోనాక్సైడ్‌, ఫార్మాల్డిహైడ్ వంటి ప‌లు విష‌పు వాయువుల‌ను క‌ల‌బంద మొక్క తొల‌గిస్తుంది. గాలిని ఫిల్ట‌ర్ చేస్తుంది. దీంతో స్వ‌చ్ఛ‌మైన ఆక్సిజ‌న్ మ‌న‌కు ల‌భిస్తుంది.


ఫిక‌స్ (FICUS)...

ఫిక‌స్ ఎల‌స్టికా (FICUS ELASTICA) అని పిల‌వ‌బ‌డే ఈ మొక్క‌కు సూర్య‌రశ్మి అవ‌స‌రం లేదు. వెలుతురు లేకున్నా ఈ మొక్క పెరుగుతుంది. అంతేకాదు గాలిలో ఉండే ఫార్మాల్డిహైడ్ వంటి వాయువుల‌ను ఈ మొక్క ఫిల్ట‌ర్ చేస్తుంది. అయితే ఈ మొక్క‌కు పిల్ల‌లను, పెంపుడు జంతువుల‌ను దూరంగా ఉంచ‌డం మంచిది. లేదంటే అల‌ర్జీలు వ‌స్తాయి.

ఐవీ (IVY)...
హెడెరా హీలిక్స్ (HEDERA HELIX) అని పిల‌వ‌బ‌డై ఐవీ జాతికి చెందిన మొక్క గాలిలో ఉండే విష‌పు వాయువుల ప్ర‌భావాన్ని 60 శాతం వ‌ర‌కు త‌గ్గిస్తుంది. అంత‌గా గాలిని ఫిల్ట‌ర్ చేస్తుంది ఈ మొక్క‌. ఒక 6 గంట‌ల పాటు మీ ఇంట్లో ఈ మొక్క‌ను ఉంచితే చాలు గాలి అంతా శుభ్ర‌మ‌వుతుంది. అలాంటి ఇక ఎప్ప‌టికీ ఇంట్లోనే ఈ మొక్క‌ను పెంచుకుంటే దాంతో మీ ప‌రిస‌రాల్లో ఉండే గాలి ఎంత శుభ్ర‌మ‌వుతుందో ఇట్టే తెలిసిపోతుంది.

స్పైడ‌ర్ ప్లాంట్ (SPIDER PLANT)...
ఈ మొక్క‌ను క్లోరోపైట‌మ్ కొమోస‌మ్ (CHLOROPHYTUM COMOSUM) అని కూడా పిలుస్తారు. ఎంత చీక‌టి వాతావ‌ర‌ణంలోనైనా మ‌న‌గ‌లిగే శ‌క్తి ఈ మొక్క‌కు ఉంది. గాలిలో ఉన్న కార్బ‌న్ మోనాక్సైడ్‌, ఫార్మాల్డిహైడ్, గ్యాసోలిన్ వంటి వాయువుల‌ను ఈ మొక్క ఫిల్ట‌ర్ చేస్తుంది. ఈ మొక్క దాని చుట్టూ దాదాపుగా 200 చ‌ద‌ర‌పు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ప‌రిస‌రాల్లోని గాలిని చాలా స్వ‌చ్ఛ‌మైన గాలిగా మార్చ‌గ‌ల‌దు.

స్నేక్ ప్లాంట్‌...
SANSEVIERIA TRIFASCIATA LAURENTIL అని కూడా ఈ మొక్క‌ను పిలుస్తారు. పైన చెప్పిన మొక్క‌ల్లాగే ఈ మొక్క కూడా ఎంత చీక‌టి వాతావ‌ర‌ణం ఉన్నా పెరుగుతుంది. గాలిలో ఉన్న విషపు వాయువుల‌ను నిర్మూలిస్తుంది. బెడ్‌రూంలో ఈ మొక్క‌ను గ‌నక పెట్టుకుంటే దాంతో స్వ‌చ్ఛ‌మైన ఆక్సిజ‌న్‌ను రాత్రంతా పీల్చుకోవ‌చ్చు.

పీస్ లిల్లీస్ (PEACE LILIES)...
MAUNA LOA SPATHIPHYLLUM అని కూడా ఈ మొక్క‌ను పిలుస్తారు. గాలిలో ఉన్న రసాయ‌నిక వాయువుల‌ను ఈ మొక్క తొల‌గిస్తుంది. గాలిని స్వ‌చ్ఛంగా మారుస్తుంది.



పైన చెప్పిన మొక్క‌ల‌న్నీ ప్ర‌ముఖ అంత‌రిక్ష ప‌రిశోధ‌నా సంస్థ నాసా సూచించిన‌వే. వీటిలో ఏ మొక్క‌ను పెంచుకున్నా దాంతో మ‌న చుట్టూ ఉన్న ప‌రిస‌రాల్లో గాలి చాలా శుభ్ర‌మ‌వుతుంది. స్వ‌చ్ఛ‌మైన ఆక్సిజ‌న్ ల‌భిస్తుంది. అయితే ఒక‌టి క‌న్నా ఎక్కువ మొక్క‌ల‌ను పెట్టేవారు ఒక్కో మొక్క‌కు క‌నీసం 80 అడుగుల దూరం ఉండేలా చూడ‌డం మంచిది. దీంతో మ‌రింత గాలి ఫిల్ట‌ర్ అవుతుంది.
                                                                                                 yours ,
                                                                     www.seaflowdiary.blogspot.com